ఎలా ఉండే వాళ్ళం ......? యిలా ఉన్నాం.......


                                                                                                                           సేకరణ : శర్మ జి ఎస్

గతం స్వగతంగా కొన్ని సందర్భాలలో బాగుండవచ్చు .
అన్ని సందర్భాలలో బాగుండదు . గతం బయట పడితే , దానిని బట్టి భవిష్యత్తును చక్కగా రూపొందించుకొనే సదవకాశం కలుగుతుంది . 
                                                                                                                               
ఈ విషయం మనకే కాదు , మన దేశానికి కూడా చాలా అత్యవసరమని తెలియవస్తోంది .
గతాన్ని పరిశీలించినప్పుడు , అప్పుడు తెలిసో , తెలియకో జరిగిన , దొర్లిన పొరపాట్లు మఱలా భవిష్యత్తులో జరుగకుండా , తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తును బంగరు మయంగా చేసుకొనే దిశగా అడుగులు ( దేశమైతే చర్యలు చేపట్టాలి ) వేయాలి .

                                                                         


  
 ************


ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా....?

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్



అసలు దణ్ణం ఎందుకు పెట్టుకోవాలి అని ప్రశ్నించే ఈ రోజుల్లో , దేవుళ్ళకు ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో లేకపోయినా , ఆ సందేహాన్ని నిస్సందేహంగా జనాల మనసుల్లోకి అతి సులువుగా ఎక్కించేస్తుంటారు .


అసలు దేవుళ్ళ వద్దకు ఎందుకు వెళ్తారు , ఎవరు వెళ్తారు అంటే ? 

కష్టాలలో వున్నవాళ్ళు తమ తమ అభీష్టాలను ఆ దేవుళ్ళకు విన్నవించుకొని ఆ గండాల నుండి గట్టెక్కాలనే చెప్పుకోవాలి . 

ఈ జగత్తును పాలించే ఆ దేవుని దర్శించాలని వెళ్ళే వాళ్ళు ( ఎవరైనా గాని ) , ఒక ప్రక్కగా నిలబడి ఎంతో వినయంగా భక్తితో నమస్క రించాలే తప్ప ఆ పరమేశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.



దేవుళ్ళు అంటే మన కష్టాలను తొలగించి , మన యిష్టాలను ఆలకించి ఆదరించేవారని .

అందుకనే అన్ని దేవాలయాల్లో కూడా ఇందుకు తగినట్లుగానే ఏర్పాటు చేయటం మీరు గమనించవచ్చు. 
దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించ కూడదని వేదాలు కూడా చెప్తున్నాయి .

ఎందుకంటే ,


దేవుళ్ళ  విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున ఆ విగ్రహాల కళ్ళకు మైనం పెడతారు . ఆ తదుపరి విగ్రహం ప్రతిష్ట జరిగాక ఆ దేవుని విగ్రహనికి పెట్టిన మైనాన్ని తొలగింగానే స్వామి వారి దృష్టి మొదట ఆ విగ్రహనికి ఎదురుగా ఏర్పాటు చేసిన ఆవు దూడపై పడేలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారు తన రూపాన్ని తను అద్దం లో చూసుకోనేలా చేస్తారు .అటు పిమ్మట స్వామి వారికి మహా నివేదన ఏర్పాటు చేసి అయన దృష్టి ఆ నివేదన మీద పడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని అర్థం ఏమిటంటే గుడిలో ఉన్న స్వామి వారి దృష్టి సరాసరి ధ్వజస్తంభం క్రింద ఉన్న తన ప్రతిబింబం మీద పడాలి . వారిద్దరి నడుమ వేరెవ్వరూ నిలబడ కూడదు.  విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే కాదు ...ఏ రోజునైన స్వామి వారికి అయన వాహనానికి మద్యన ఎవ్వరు కూడా నిలబడకూడదనే దేవుని ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోకూడదని అంటారు.


ఒక ప్రక్కగా నిలబడి దేవునికి వినయంతో చేతులు జోడించి దణ్ణం పెట్టుకోవాలి. భక్తితో మీ మనసులోని కోరికలని విన్నవించు కోవాలి .


వాస్తవానికి ఈ ప్రపంచం పంచన వుంటున్న ఆ నవగ్రహాలను కూడా , దేవుళ్ళుగానే భావిస్తారు . ఎందుకంటే ఆ గ్రహాల ప్రభావం , ఆ ప్రపంచంలోనే జీవిస్తున్న ఈ మానవుల మీద పడటం వల్లనే , ఈ ఈతిబాధలు కలుగుతున్నాయని భావించి , ఆ గ్రహాల ఆగ్రహాలకు గురి కాకుండా , ఆ గ్రహాలను కూడా ఆ దేవుళ్ళ కోవలోనే చేర్చారు . పూజలు ప్రారంభించారు .


శనికి తప్ప మిగిలిన అన్ని దేవుళ్ళకి  ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు . 

కాని ,
శని దేవుణ్ణి మాత్రం ప్రక్కనుంచి చూడకూడదు.శనికి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి మనమే ప్రక్కకు వెళ్లిపోవాలి .
అయ్యా శనిదేవుడా , నన్ను ఓ పట్టు పట్టి నీ వద్దకు రప్పించుకోవటం వల్ల ,తప్పని సరి నీ వద్దకు  వస్తే నీవు నన్ను వదలిపెడ్తానంటే వచ్చాం . ఇంకా నీ ఎదురుగా ఎందుకు నిలబడ్తామయ్యా బాబూ అని మనసులోనే అనుకొంటూ వెంటనే వెళ్ళిపోవాలట అక్కడ నుంచి .  

                                                                              ********************

కోల్పోతున్నాం..............

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్



ప్రతి మనిషికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ , కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. 
అందరూ బాగుంటేనే, మనమూ బాగుంటామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. 
మహర్షులు ఎన్నో సందర్భాలలో  ' పరోపకారార్థమిదం శరీరమ్ ' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించటంలో  వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు . 
అందుకే ఆ మహర్షుల నాలుక మీద సరస్వతీ దేవి నాట్యమాడేది . ఆ విషయం వాళ్ళ వాచకంలో తేట తెల్లమయ్యేది . దానినే వాక్శుధ్ధి అంటారు .
మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు.  సదా తమ సదాశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించ వలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే  అంటే లోక కళ్యాణం కోసమే ఉద్దేశించి వుండేవి అన్న మాట !

మహర్షులు అంటేనే పదిమంది హర్షించదగిన పనులు మాత్రమే చేసేవారని అర్ధం .

ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. 

హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది..

కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో  గల ముఖ్యోద్దేశం .


హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.

తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది .

అసలు గ్రహాలు అంటే శక్తికి ప్రతీకలు . ఈ విషయాన్ని మన ముందు యుగాల వారు క్షుణ్ణంగా పరిశీలించి , వాళ్ళ జీవితాలకు , తోటి వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని , ఆ పై శాస్త్రంగా వ్రాసేశారు . అలా ఏర్పడినవే ఈ శాస్త్రాలు , నియమాలున్ను .

ఈ శాస్త్రాలని చాలా మంది మూఢ నమ్మకాలుగా భావించుకొంటున్నారు .


వాస్తవానికి యివి మూఢ నమ్మకాలు కానే కాదు , నిగూఢ రహస్యాలు మాత్రమే .  దీనిని  
బయటకు వెల్లడి చెయ్యకుండా వుండేసరికి , మఱి కొంతమంది దైవం పేరుతో వాళ్ళను బలహీనుల్ని చేసి క్యాష్ చేసుకొంటున్నారు . 

ఇలాంటి పనికిమాలిన వాళ్ళ వల్ల శాస్త్రం కూడా విలువను కోల్పోతున్నది . 



                                                                          *                     *                   *