ఒకరి కొకరు     ఒకరి కొకరు 


ఓ సనాతన మధుపర్కాల్లారా!
అధునాతన వధూవరుల్లారా!
మీ కళ్యాణ శుభసమయంలో 
మీకివే నా అభినందనలు.

ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ మీ
ఇరువురు ఎవరికి ఎవరో ?
ఇపుడే అయినారు ఒకరికొకరు
అయినారు అత్యంతాప్తులు.

మీ ఇరువురి జంట  
చూడ కన్నుల పంట  
ఒకరినొకరు తెలుసుకొమ్మంట
సంసార రహస్యమిదేనంట.

సంసారం అరవిందం
సంగీతం మకరందం
వసివాడని పసిపాపలకు
మిసిమికాంతుల శుభోదయం.

సంసారం సాగరం
            కాదు
ఓ సంగీత సరోవరం
              అవును

సంగీతంలో సరిగమలు
సంసారంలో మధురిమలు    
ఆ సరిగమలలో ఎన్నో రాగాలు
ఈ మధురిమలలో ఎన్నెన్నో అనురాగాలు.

రాగాలలో రసం ఉట్టిపడ్తుంది
అనురాగాలలో సరసం ఉద్భవిస్తుంది
సంగీతం రాగాల సంగీత పల్లవి
సంసారం అనురాగాల సంసారవల్లరి.

ఓ సనాతన మధుపర్కాల్లారా!
అధునాతన వధూవరుల్లారా! 
పచ్చని తోరణాల పందిట్లో 
మీకివే నా కవితా కుసుమాలు.


       * సమాప్తం *

3 comments:


 1. రాగాలలో రసం ఉట్టిపడ్తుంది
  అనురాగాలలో సరసం ఉద్భవిస్తుంది
  సంగీతం రాగాల సంగీత పల్లవి
  సంసారం అనురాగాల సంసారవల్లరి.

  ఈ లైన్స్ చాలా చాలా బాగున్నా యీ

  ReplyDelete
  Replies
  1. అవును , ఈ లైన్స్ చాలా చాలా బాగున్నా యీ... ;-)

   Delete
 2. చాలా బాగుంది సింపుల్ గా ...

  వసివాడని పసిపాపలకు
  మిసిమికాంతుల శుభోదయం

  ReplyDelete