కాకిపిల్ల - సబ్బుబిళ్ళ


                                             

గాలిలోన కాకి
గోడ మీద వాలింది
గట్టు మీద సబ్బుపై
చూపు మరల్చింది
లోలోన తపనాయె
సబ్బు మీద మనసాయె

 (  స్వగతంలో )
 
ఇదేమి శాపమో నాకు
నాది కఱ్ఱి బొగ్గు రూపమాయె
ఈ సబ్బుబిళ్ళ ఎత్తుకొందు
నే జలకాలాడుకొందు
నే రూపరాశినౌదు నటంచు
ఈ శాప విమోచన కావించుకొందు
అటు ఇటు దొంగచూపు చూసింది
సబ్బు బిళ్ళని మటుమాయం చేసింది

                   *****

5 comments:

  1. బ్లాగ్ లోకానికి స్వాగతం....బాగుంది

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete