గమ్యమా ! అగమ్యమా ?


     గమ్యమా ! అగమ్యమా ?      


ఆత్మకు లేదు ఏ ఆకారం
కావాలి  దేహ సహకారం
మనసుకి లేదు  ఏ  ఆకారం
కావాలి తనువు సహకారం

ఆత్మ జనన మరణాల కతీతం
దేహం పుటక ,గిటకల గాలం
నిత్యమైన ఆత్మ ,అనిత్యమైన దేహాన్నే ఆశ్రయించటం
కుక్క తోక పట్టుకుని గోదారి యీదటం లాంటిదే

ఆ కుక్క గమ్యం తెలియ(బడ)క అగమ్యమగునో ? 
పరుగులతో పక్క దారిన పడకుండా,    
ఎన్నటికి మనలని గమ్యం చేర్చునో ? 

ఈ దేహాన్ని ఆశ్రయించిన ఆత్మ 
ఏ ఆకర్షణలకి లొంగకుండా, 
ఎప్పటికి ఆ  గమ్యాన్ని ( దైవాన్ని) చేరుకొనునో ?

                  *******

3 comments:

 1. ఆత్మకు లేదు ఏ ఆకారం
  కావాలి దేహ సహకారం

  good one ;-)

  ReplyDelete
 2. కుక్క తోక పట్టుకుని గోదారి యీదటం లాంటిదే
  తప్పదుమరి

  ReplyDelete
 3. ఈ దేహాన్ని ఆశ్రయించిన ఆత్మ
  ఏ ఆకర్షణలకి లొంగకుండా,
  ఎప్పటికి ఆ గమ్యాన్ని ( దైవాన్ని) చేరుకొనునో ?..........

  ప్రతి ఒక్కరికీ తప్పనిసరి గమ్యం అదే కదండీ... దైవాన్ని చేరుకుంటామో, నరకాన్ని చేరుకుంటామో... మనం చేసే పనులే నిర్ణయించేస్తాయి...

  మంచి పోస్టు... చాలా బాగుంది.. అభినందనలు శర్మగారు...

  ReplyDelete