స్వార్ధంఏయ్
ఏమోయ్
నిన్నేనోయ్

మానవా ! ఓ మానవా !
అలా అర్ధం పర్ధం లేని
ఆలొచనలతో సతమతమవకోయ్
త్వరగా తలుపులు తెఱవవోయ్

నేను లేని
నీ జీవితం
వాసనలేని  పువ్వేనోయ్
నేనెవరినంటావా !

నేనెవరినో కాదొయ్
స్వార్ధాన్నోయ్

వేరెవరినైన చూసుకోమంటావా ?
మరే ప్రాణితోను నాకు రాణింపు రాదోయ్
అదేనోయ్ నా అసలు సిసలు స్వార్ధం

ఏయ్
ఏమోయ్
నిన్నేనోయ్
త్వరగా తలుపులు తెఱవవోయ్

నేను నీలో కల్సిపోతా
ఎవ్వఱికీ బయట కగుపించనులే

ఈ నా నీ కలయికతో
నీ జీవితం సుఖమాలిక
సమాజంలో ఓ గొప్ప గుర్తింపు

ఏయ్
ఏమోయ్
నిన్నేనోయ్
త్వరగా తలుపులు తెఱవవోయ్

అర్ధం చేసుకున్నావు గనుకనే
అందరికంటే ముందే అందలమెక్కుతున్నావ్
అందరి చేత మోయిస్తున్నావ్

ఇదంతా  నీ కృషి అనుకుంటారందరూ
అసలు నిజం ,
నీకూ, నాకూ తెలుసు గదా !
అలా అందరు నిన్ను పొగడినా ,
 నేనేమి ఫీలవనోయ్,
   
ఎందుకంటే నన్నాహ్వానించావు కనుక
       
ఇదీ నా స్వార్ధమేనోయ్

         ********

 No comments:

Post a Comment