చట్టమా ! చుట్టమా !
                                                    చట్టమా ! చుట్టమా !
ఆ పేదోళ్ళది గోడు ,
ఈ  పెద్దోళ్ళకది పోడు    

పలువురు పేదోళ్ళు న్యాయం కావాలంటూ చూపిన ఆవేశాలు,
పదుగురు పెద్దోళ్ళ రౌండ్ టేబుల్ సమావేశాలకవకాశాలు

ఎట్టకేలకు , తుట్టతుదకు ,
పేదోళ్ళ న్యాయం కొరకు చట్టం ఆవిర్భావం

చట్టానికి కళ్ళుండవు , కాళ్ళూ ఉండవు
కానీ తనవారిని గుర్తుపడ్తుంది

తనవారెంత దూరాన ఉన్నా చేరుకొంటుంది
శిక్ష పడకుండా తనవారిని కాపు కాస్తుంది 

పలువురు పేదోళ్ళ కొఱకు పదుగురు పెద్దోళ్ళచే 
జీవం పుచ్చుకున్న చట్టమాయె
పేదోళ్ళ న్యాయం ఆ చట్రంలో మట్టమాయె


ఆ చట్టంలో పేదోళ్ళకు న్యాయమే కరువాయె,
పేదోళ్ళ సమస్యలు ఈ పెద్దోళ్ళకి తెలియదాయె 

ఆ చట్టమేమో ,
పేదోళ్ళకు బుట్టలోని పామాయె 
పెద్దోళ్ళకు చంకెక్కిన చుట్టమాయె

               ******* 4 comments:

 1. ఆ చట్టమేమో ,
  పేదోళ్ళకు బుట్టలోని పామాయె
  పెద్దోళ్ళకు చంకెక్కిన చుట్టమాయె
  ఈ లైన్స్ చాలానచ్చాయి

  ReplyDelete
  Replies

  1. నిజాలు , ఖనిజాలు అందరి మన్నన పొందుతాయి కదా!
   ఇందులో నా ప్రతిభ ఏమీ లేదు పద్మార్పిత గారు.

   Delete
 2. Replies

  1. సహజంగా ముగింపుకే ఎక్కడైనా అధిక ప్రాముఖ్యత సంతరించుకొంటుంది , ఇది మనం నిత్యం
   ప్రతి సినిమాలో చూస్తుంటాం కదా!
   వాస్తవానికి ఆరంభం ఎక్కడానుంచి అయినా ప్రారంభం కాగలదు . ముగింపు మాత్ర చివరనే ,
   అదీ మంచిగుంటేనే ఈ ఆరంభానికి విలువ అప్పుడే.

   Delete