వింత మగ మృగాలు


 నాడు ,
ఆడజాతి అల్పం ,
మగ మహరాజులు అధికం ,
వంటింట్లోనే ఉంచేశారు , 
వంటికే పరిమితం చేశారు ,
కళ్ళు కనపడని కబోదులుకూడా ,
కన్నెలే కావాలని తపించారు ,
కన్యాశుల్కాలు ప్రవేశపెట్టారు ,
కన్నెచెఱ చెఱపట్టారు ,  
నిండు నూరేళ్ళ ఐదవతనాన్ని,
ఐదో , పదేళ్ళకే చెల్లు చేశారు ,
కాటికే సరాసరి చేరిపోయారు 
పెనిమిటి లేని వాడి పెళ్ళాముగా,
సమాజంలో ముద్దర వేశారు ,
ఆ ఆనందాలను అందనంత దూరం చేశారు ,
పునర్వివాహ  ప్రసక్తే లేదని తేల్చేశారు ,
ఆ అబలల వైవాహిక జీవితాలు 
గెలవలేక గేలి చేశాయి ,
ఆ నాడు ఆడజాతి స్థానం అధమం .

ఈ నాడు ,
ఆడజాతి అధికం ,
మగతెగ అల్పం ,
పసివాడికీ పడుచు కావాలిట ,
దబ్బు పడేస్తే వస్తది ఆడది అంటాడు , 
వయసులో ఉన్నోడికి కావాలి ఈ ఆడది ,
తన సరదాల దురద తీర్చుకోవటానికట ,
వయసుడిగిన అయ్యకు కూడా ,
పడుచు కావాలంటాడు ,
పట్నపు పిల్లైనా సర్దుకు పోతానంటాడు ,
కట్నపు మూట పట్టుకు రావాలిట ,
సరదాలను పరదాలతో మూయమంటాడు ,
తనకు , తనవారికి చాకిరీ చేయాలంటాడు ,
లేకుంటే , 
మాంచి ఉద్యోగమైనా చేసి సంపాదించాలంటాడు ,
అభం శుభం తెలియని అబలల ,
కమ్మని జీవితాలు  కన్నీటి లోయలాయె ,
ఆడజాతి స్థానం ప్రధమమే .

అధమ స్థానమన్న భీతితో ఆనాడు ,
ప్రధమ స్థానమన్న ప్రేమతో ఈనాడు ,
తరతరాలుగ ఆడజాతి జీవితాలు ,
ఇంగితమే ఎఱుగని ,
ఈ "  వింతమగ మృగాల "  కంకితమాయె .

                   *****************

            


4 comments:

 1. మనలో మాట ఇంకా అనేందుకు ఏం మిగిల్చారుగనక.

  ReplyDelete
  Replies

  1. శర్మ గారు ,

   నమస్తే.

   ఈ రోజు మీ టపా కొరకు చూశాను . కనపడలేదు .ఎదురుచూస్తున్నా. కృతఙ్నతలు.

   Delete
 2. కాలం ఏదైతేనేం !? దౌష్ట్యాలకి కునారిల్లుతుంది అతివ అంతరంగం.

  చాలా బాగా చెప్పారు . ధన్యవాదములు

  ReplyDelete
 3. బాగా తిట్టారు ... బాగుంది ....

  ReplyDelete