బలి


అమ్మోరి విగ్రహంలో ,
అగుపించును ఆగ్రహం ,

అయ్యోరి విగ్రహంలో ,
కానరాదు నిగ్రహం ,

పల్లెల్లోన భీభత్సమే ,
అమ్మోరికి ఆనందం ,

అమ్మోరి కోరచూపులు ,
నోట మాట లేని జీవాలపైనే ,

అయ్యోరి ఓరచూపులు ,
పెండ్లి కాని కన్నెలపైనే ,

అమ్మోరి ఆగ్రహానికి ,
నోరు లేని జీవాలే బలి ,

అయ్యోరి ఆనందాలకి ,
అన్నెం , పున్నెం ఎఱుగని అబలలే ఖాళి .

         *********

2 comments:

 1. బావులేదు.. పోలిక..
  "అమ్మోరు" అని అమ్మవారిని సంబోధిస్తున్నప్పుడు ఇక్కడ "అయ్యోరు" శివుడు అవుతాడు కాని అకృత్యాలు చేస్తున్న మృగాళ్ళతో ఎలా ముడి పెట్టారు ?

  ReplyDelete
  Replies

  1. వోలేటి గారు ,

   సుస్వాగతం . అమ్మోరు అంటే అమ్మవారు అనే సందేహమే లేదు .
   అయ్యోరు అంటే మాత్రం శివుడు కాదని . ఎందుకంటే అమ్మోరి చిత్రం
   మాత్రమే ఈ కవితకి పెట్టటం జరిగింది . అయ్యోరు శివుడు
   అనుకున్నట్లయితే ఇలా వ్రాసేవాడిని కాదు .
   ఇచ్చట అయ్యోరు అంటే మేక వన్నె పులి లాంటి మగ మృగాల గురించే .

   Delete