తనను తాను                      తనను తాను 

ఈ చరాచర సృష్టికి మూలం ఆ దైవం ,
అందులో మానవుడిని తెలివిగా సృష్టించాడు


దేవుడిని చూడని ఈ మనిషి ,
ఆ దేవుడికే ఆకారం యిచ్చాడు . 

సమాజ శ్రేయస్సుకై డబ్బుని సృష్టించాడు  
అవసరాలకు వాడుకొనాలనుకున్నాడు

ఆ డబ్బే ఈ మనిషిని ఆడుకుంటున్నది
వెంటాడుతున్నది  , వేటాడుతున్నది .

అన్నింటికి విలువ కట్టటమారంభించాడు  
ఆ ఒఱవడిలో , తనను తాను మఱిచాడు 

అన్నింటి ధరలను ఈ ధర నుంచి నింగికి మళ్ళించాడు  
జీవం లేని వాటికి ( అలా అలా ధర ) పెంచి జీవం పోశాడు

జీవం ఉన్న తనకు మాత్రం , తనకు తానే
విలువను తగ్గించుకుంటూ పోతున్నాడిలా .......


                 **********

6 comments:

 1. Replies
  1. థాంక్యూ . వెల్ కం .

   Delete
 2. దేవుడిని చూడని ఈ మనిషి ,
  ఆ దేవుడికే ఆకారం యిచ్చాడు

  జీవం ఉన్న తనకు మాత్రం , తనకు తానే
  విలువను తగ్గించుకుంటూ పోతున్నాడిలా .......

  మీరు మటుకు విలువ పెంచుకుంటూ పోతున్నరుగా ఇలా !! హ హ !!

  బాగుంది !!

  ReplyDelete
  Replies

  1. కళ్ళెదురుగా కనపడ్తున్న వాటికి స్పందించక , కనపడనిదానికి స్పందిస్తుంటారు అమితంగా.
   అంటే అనవసరమైన వాటికే అధిక ప్రాధాన్యత నిస్తుంటారు .

   Delete
 3. మీ కవిత చాలా బాగుందండి

  ReplyDelete
  Replies

  1. కృతఙ్నతలండి.

   Delete