కామెంట్ ప్లీజ్


( ఈ కవిత వ్రాయటానికి   స్ఫూర్తి  "   వేడి వేడి సమోసాలు "   బ్లాగ్ ఆథర్ సాగర్ . ) 

ఓ నాడు ,
ఉట్టి పుణ్యానికే నాపై ,
నా వాళ్ళు ,
నా సహవాసులు ,
కమెంట్ల రాళ్ళు విసురుతుంటే , 
కలుక్కుమన్న నా మనసు ,
పలుమార్లు కసురుకొన్నది ,
కమెంట్లే చేయవద్దని హెచ్చరించింది .

నేడు ,
నేను రచనలు చేయటం ప్రారంభించా ,
అంతే కాదు ,
బ్లాగూ ఓపెన్ చేశా ,
అందరూ చదివేందుకు అనుమతించా ,
నా రచనలపై మీ అభిప్రాయాలను ,
వ్రాయమని ఆహ్వానించా .

ఆ నాడు , 
ఉట్టిపుణ్యానికే కమెంట్లు 
వదలిన వాళ్ళెవ్వరూ ,
ఈ నా రచనలు చదవ (లే)రు , 
కమెంట్లు వ్రాయ(లే)రు ,

మనుషులు పైన , మనసుల పైన ,
కమెంట్లు వదలటం బహు తేలిక వాళ్ళకు .

నేడు ,
నాతో ముఖాముఖీ పరిచయం లేని వారెందరో , 
నా రచనలు చదివి కమెంట్లు యిస్తుంటే ,
ఆ కమెంట్లు నే చదివిన ప్రతిసారీ ,
పలుమార్లు ఆనదం వేస్తుంటుంది .

ఒక్కోమారు ,
అనుమానం కూడా నా చెంత చేరుతుంది , 

"  ఈ కమెంట్లన్నీ నిజాలేనా ? 
లేక విమర్శిస్తే తట్టుకోలేమని ,
ఇలా పొగిడేస్తున్నారా ? "   అని  .

మరోమారు ,
నా మనసే నాకు సర్దిచెప్ప ప్రయత్నం చేస్తోందిలా , 

"   ఈ కమెంట్లలో పురోగమనం ,
ఆ కమెంట్లలో తిరోగమనం , 
ఆ కమెంట్ల కంటే ఈ కమెంట్లు నయమేగా అని  ".

ఎదుటివారికి బాధ కలిగించటం కంటే ,  
సంతృప్తి నివ్వటమే సదా శ్రేయస్కరమే కదా !

               **********

4 comments:

 1. కొందరు అలా...
  మరికొందరిలా...

  ReplyDelete
 2. కొందరికి వారే 'కొందరు' ఆ వారే మరికొందరికి 'మరికొందరు' ... ఇదే నిజం అందరికీ

  కామెంట్ మీదే కామెంట్ హ హ హ హా ..... super...

  ReplyDelete
 3. అమ్మయ్య! ఒకళ్ళకయినా దురదస్య దురదః అని మా జిలేబీగారన్నట్లు, దురదగుండాకు అంటుకుందోచ్!

  ReplyDelete
  Replies
  1. :) బాగుందండి:)

   Delete