ఆకసం - మానసం

     

                                            


అంతు లేనిదా ఆకాశం
అంతు చిక్కనిదీ మానసం

అనంతమా ఆకసం
అణువంతదీ మానసం

ఆకసాన నక్షత్రాలు
మానసాన ఆలోచనలు

ఆ ఆకాశంలో ఉఱుముల , మెఱుపుల ఘర్షణ
ఈ మానసంలో తలపుల , వలపుల సంఘర్షణ

లెక్కలోని ధృవ తారలు  కొన్నే
ఆచరణకు ఆలోచనలూ కొన్నే

ఆకసాన రాజసం
మానసాన వికాసం

ఆకసానికి లేదు ఏ ఆధారం
మానసానికి లేదు ఏ ఆకారం

            *****

2 comments:

 1. చాలా చాలా బాగుంది...

  ఆకాశం వలే అనంతం ఈ మానసం
  మానసం వలే సుసంపన్నం ఆ ఆకాశం !!

  హ హ హ ....

  ReplyDelete
  Replies

  1. మానసాన్ని సుసంపన్నం మనమే చేసుకోవాలి.
   ఆకసాన్ని ఆ దైవమే శాశ్వతంగా చేసేసింది.

   Delete