గులాబీ
సుఖదుఃఖాలు తులాభారాలు ,
కలిమిలేములు కావడికుండలు ,
మంచి చెడులు మానవ మనుగడలు

అంటు వేసి , నీరు పోసి పెంచుతాం ,
పెరిగి పెద్దదై అందాలొలకబోస్తుంది ,
అందరికీ ఆనందాలను అందిస్తుంది .

ఆ ముళ్ళు చెడుకి తార్కాణాలు ,
ఆ గులాబీలు మంచికి ప్రామాణికాలు ,
ముళ్ళు గుచ్చుకోకుండా పూలు కోసుకో ,
ముళ్ళనచ్చటే వదిలేసెయ్ ,
చెడు అంటుకోకుండా మంచిని తీసుకో ,
చెడునచ్చటే వదిలేసెయ్ .

ఆ గులాబీలు పూజకుపయోగపడి ,
దైవాన్ని చేరుకొంటాయి .

ఆ గులాబీలు ఆడవారి శిఖపై చేరి , 
శిఖర దర్శనమిస్తుంటాయి .

ఫూజ వేళ , ఆడవాళ్ళ చెంత శిఖరాన్నే అలరిస్తాయి ,
మంచిని నెత్తిన పెట్టుపెట్టుకొని పూజిస్తాం .

మంచి ఎప్పుడైనా , ఎక్కడైనా ఉన్నతమే . 

                 ***********

8 comments:

 1. శర్మగారు బాగుంది, చిన్న సవరణ, మగవారిది శిఖ ఆడవారిది కొప్పు, అహ మీకు తెలియదని కాదు. మగవారికీ పెద్ద జుట్టు ఉండేది, దానిని ముడిస్తే అది శిఖ.

  ReplyDelete
  Replies

  1. మీ సవరణ అందులోని వివరణకు కృతఙ్నతలు.
   మీలాంటి పెద్దలు ( అవసరమైనప్పుడు ) వెన్నంటి
   ఉన్నారని సంతోషంగా ఉంది. కృతఙ్నతలు.

   Delete
 2. బావుంది శిఖ ,కొప్పు , భేధం తెలుసుకున్నాము ధన్యవాదములు

  ReplyDelete
  Replies
  1. సంతోషం సుమండి.

   Delete
 3. మంచి ఎప్పుడైనా , ఎక్కడైనా ఉన్నతమే . Yes you are right.

  ReplyDelete
 4. అందమైన గులాబీ మీద కవిత..బాగుంది :)

  ReplyDelete