ధ్యానమా ! పర ధ్యానమా !..


              ధ్యానమా ! పర ధ్యానమా !             

 బాల్యంలో ,
నాకు దైవ భక్తి ఎక్కువ అన్నది మా వాళ్ళే. 

కౌమారంలో ,

ధ్యానం చేద్దామనుకుంటుంటే ,
వద్దు అన్నది ఆ మా వాళ్ళే.

ఎందుకని అడిగితే , 
మేం చెప్పినా ,
ఇపుడు నీకర్ధం కాదులే అన్నది ఆ  మా వాళ్ళే.

యౌవనంలో , 
యూనివర్సిటీ చదువులు ముగిశాక , 
ధ్యానం  కాదు , ఉద్యోగం ప్రధానం అన్నది ఆ మా వాళ్ళే .

మొదట , 
పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడివి అవు , 
ఆ తర్వాత అన్నది ఆ మా పెద్దోళ్ళే .

ఆ సంసారం మోజులో కొన్నాళ్ళు , 
సంతానం కొఱకు యింకొన్నాళ్ళు ,
ఆగమన్నది ఆ మా పెద్దోళ్ళే . 

నడివయసులో,
ఆ పిల్లల బాగోగులు  చూడాలి , 
ఇపుడొద్దు  అన్నది ఆ మా పెద్దోళ్ళే .


ఈ నడుమ చేద్దామనుకున్నా . చేయలేకపోయా ,
వయసు ఒఱవడితో , 
తనువు తహతహతో , 
మనసు అలజడితో . 

ఎన్నో అవకాశాలు వచ్చినా , 
అవసరాలకు తలొగ్గా ,
అందివచ్చిన అవకాశాలన్నింటిని జాగ్రత్తగా భద్రపఱచా , 
రిటైరైన తర్వాతైనా హాయిగా ధ్యానం చేసుకోవచ్చ్హనుకున్నా.

వార్ధక్యం వచ్చాక ,
కనులు కనబడటం లేదు ,
కాళ్ళు తడబడుతున్నాయి ,
తనువు సహకరించటం లేదు ,
మనసు నిలబడటం లేదు ,
ఏ ధ్యానమూ లేదు , పరధ్యానం తప్ప .

ఎపుడో ,ఏదో చేద్దామని వాయిదాలేయద్దు
వెనువెంటనే చేయుట శతవిధాలా ముద్దు

వాయిదాల పేరుతో చెప్పబోకు తర్వాతని
నీకే  తెలుస్తుంది 'తర్వాత ' అంటే  "  వాతేనని "

                   *******


2 comments:

  1. సముద్రం లో కెరటాలు ఆగేకా స్నానం చేద్దామన్నట్లు :)

    ReplyDelete
    Replies
    1. నిజమే కదండి.

      Delete