భిన్నత్వంలో ఏకత్వం

నింగిలోని చుక్కలని ,
సంచిలోకి నింపాలని ,
వెలుగు నిచ్చే వెన్నెలని ,
నెలనాళ్ళూ చూడాలని ,
పలు ప్రయాసలు  పడ్తోంది , 
పసిడి వన్నెల పసితనపు ప్రధమాకం . 

మూన్నాళ్ళ సొగసులకు మూలమిచ్చటేనని ,
ఊహల ఊయల ఊసులిచ్చటేనని , 
మోహాల పల్లకి మొహరించేదిచ్చటేనని ,
ఆశల ఆరాటాలకి నాందిచ్చటేనని ,
శ్వాసల పోరాటానికీ పునాదిచ్చటేనని ,
మంచీ చెడుల నెంచలేని నెలవిదేనని ,
గ్రహించలేని కలల కౌమారమే ద్వితీయాంకం  .

దోరవయసు చెఱ పాలౌతుందని ,
ఆ చెఱ తొలగింపు తనదేనని ,
అందినదానితో తృప్తి చెందాలని ,
చిరంజీవులు ఈ జీవుల వారసత్వమని ,
అనుభవసారమే ఈ (సం)సార బంధమని ,
తెలుసుకోలేని తడి కల యౌవనమే తృతీయాంకం .

సుఖాల సారమే రువు బాధ్యతలని ,
సంతోషాలకు సదా దూరమౌతున్నామని ,
ఆద్యంతాలు దైవాశ్రయం కోరాలని ,
మోక్ష గవాక్షాలు  తెరిపించుకోవాలని ,
జీవన్ముక్తికి మార్గాన్వేషణ వెతకాలని ,
చాటి చెప్పే వార్ ధక్యమే ( వార్ధక్యమే ) చతుర్ధాంకం ,
అదే  జీవన చరమాంకం  .  
           
                    **********  

3 comments:

 1. this should be the start for what I expected from you sir ji.....

  అద్బుతః .... good one.

  ReplyDelete
 2. చాలా చాలా బాగా చెప్పారు.. సార్... మనిషి జీవితం గురించి.. నెను చదివిన మీ రెండు మూడు కవితల నుండి నాకు అనిపిస్తుంది.. కవితలు రాయడంలో.. మీకు మీకె సాటి అని..-:)

  ReplyDelete
 3. వావ్.....బ్యూటిఫుల్!

  ReplyDelete