ఉగాది / సంవత్సరాది శుభాకాంక్షలు .                                  ఉగాది / సంవత్సరాది  శుభాకాంక్షలు .
ముందుగా మన బ్లాగు మిత్రులందరకు , మన శ్రేయోభిలాషులకు ,
ఈ తెలుగు నూతన విజయ నామ సంవత్సరాది శుభాకాంక్షలు.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు . ఈ ఆరింటి మిశ్రమమే ఉగాది పచ్చడి / ఉగాది ప్రసాదం అని అర్ధం.
ప్రసాదం అనగానే భగవంతుడు మన మానవులకు ప్రసాదించిన ప్రసాదమే.

ఈ ఆరు రుచులు మనకు ఈ ఉగాది రోజు ఎలా లభిస్తాయో , మన జీవితాలు వాటికనుగుణంగానే నడుస్తాయని
మనం గ్రహించుకోవాలి.

మన జీవితం నాలుకతోనే ముడిపడిందని ఈ ఆరు రుచులు తెలియచేస్తున్నాయి . నాలుక మాట్లాడగలదు కూడా .
అంతే కాదు . నాలుక సరిగా ఉంటేనే మన జీవితం బాగుంటుందని మనం గ్రహించాలి.
ఒక్కసారి ఙ్నప్తికి తెచ్చుకొందాం మన పెద్దల నానుడి . " నోరు మంచిదైతే , ఊరు మంచిదవుతుంది " అని.
నోరు అంటే ఇక్కడ నాలుక అని మనం అర్ధం చేసుకోవలి సుమా ! అంటే నాలుక మంచిదవటం అంటే , తినటం , మాట్లాడటం మంచిగుండాలని.

ఈ రుచులలో ఏది లేకున్నా , తినకున్నా మన జీవితంలో ఆ లోటు  ఏర్పడ్తుందని భావించాలి.

ఉప్పు , కారం ఆనంద , విషాదాలకు తార్కాణాలు
పులుపు , వగరు మంచి చెడులకు తార్కాణాలు
తీపి , చేదు  సుఖదుఃఖాలకు తార్కాణాలు    
ఏవి ఎక్కువైనా , తక్కువైనా వాటి ఫలితాలు అలాగే  లభించవచ్చని భావించాలి.

ఉగాది అంటే మన తెలుగు సంవత్సర ఆరంభానికి ఆది . నిజానికి  ఇది మనం అంటే మానవులు ఏర్పరుచుకొన్నది .
ఆ యుగాది మనది కాదు , అంటే బ్రహ్మ గారిచే సృష్టించబడిన యుగాలకు ఆది ఆ యుగాలలో ప్రారంభమైనది.

అలా బ్రహ్మగారిచే ప్రారంభించబడ్డ ఆ యుగాదుల్ని మానవులు మఱచేలా , మానవుడు ప్రతి సంవత్సరం చేసుకోవటం ఆరంభించాడు.

బ్రహ్మగారిలా ఈ మానవులు యుగాదులు చూడలేరు . అందువలన మానవులు చూడగలిగింది సంవత్సరాలే .
బ్రహ్మగారిచే సృష్టించబడ్డ ఆ కృత(సత్య)యుగంలోని మానవులు ,నీతి,నిజాయితీలతో జీవితాల్ని సగిస్తూ ,ఈ ప్రకృతిని ,ఈ ప్రపంచాన్ని ప్రతి సంవత్సర ఫలితాలను అధ్యయనం  చేసి ముందు తరాల వారికి సులభంగా , సుఖంగా ఉండేటందులకు కొన్ని సత్కార్యాలు చేశారు. ఆయా సంవత్సర ఫలితాలను బట్టి ఆయా సంవత్సరాల నడవడిని ( గుణాలను ) బట్టి ఆయా సంవత్సరాలకు పేర్లు పెట్టారు. అలా పెట్టబడిన పేర్లే 60 . ఆ 60 మన తెలుగు సంవత్సరాలుగా పిలువబడుతూ , మనకు సంవత్సరాదిగా , ఉగాడిగా కాలక్రమేణా చెలామణీ అవుతూ వచ్చింది.

కనుక ఈ 60 సంవత్సరాల తదుపరి మఱల అవే తిరిగి వస్తుంటాయి. కారణం ఇంక పేర్లు లేక కాదు , పేర్లు చాలా ఉన్నాయి , గుణాలు మాత్రం మఱి లేవని మన ముందు యుగాల వారు నిర్ధారించారు.

పురాతన కాలంలో మానవుని పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు కావటం వలన , ఆ 120 సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరాది గుణాలను రెండు సార్లు చూడటం వలన , వాళ్ళు ఈ సంవరాదుల గుణాలను 60 గా నిర్ణయం చేసి నామకరణం చేసేశారు.

బ్రహ్మగారి యుగాదులను చూసే అవకాశం ఈ ఆయుర్దాయం తక్కువున్న మానవుడు, ఈ సంవత్సరాదిని సంవత్సరం సంవత్సరం చేసుకొనాలని , తను ఎన్నో ఉగాదులు చూడగలనని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు అంబరాన్ని అంటేలా చేయటం ఆరంభించాడా యుగం నుంచే. అలా అరంభమైనదే ఈ ఉగాది .

వాస్తవానికి ఉగము అంటే ఆయుర్దాయం అని. ఉగాది అంటే సంవత్సరాది అని మన ముందు తరాల వాళ్ళు నిర్వచించారు .    అలా మొదలైన ఈ ఉగాదులు మనం ఇప్పుడు చేసుకొంటున్నాం .

ఈ సంవత్సరాది విజయ నామ సంవత్సరమైంది . అంటే ఆడవారి పేరుతో , అందులో విజయ రావటం వలన ఆడవారికి సంబంధించినవి విజయాలెక్కువగా ఉంటాయి.

                                                           
                                  ************** శుభం భూయాత్ **********

                                   **********సర్వేజనాస్సుఖినోభవంతు********
 

10 comments:

 1. విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు , మన బ్లాగు మిత్రులకి కూడా .

   Delete
 2. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

  ReplyDelete
  Replies

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు , మన బ్లాగు మిత్రులకి కూడా .

   Delete
 3. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

  ReplyDelete
 4. శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

  ReplyDelete
  Replies

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు , మన బ్లాగు మిత్రులకి కూడా .

   Delete
 5. విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు , మన బ్లాగు మిత్రులకి కూడా .

   Delete
 6. శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

  ReplyDelete