మహా మనీషి

అంతరంగంలోని ఆర్తిని

అర్ధం చేసుకొని
మసులుకొనువారే
నిజమైన ఆత్మబంధువౌనురా

ఆపదలో ఉన్నవారిని

ఆదుకున్నవారు
ఏ జాతివారైన నేమి
అసలైన ఆప్తులౌనురా

అంత్యదశలో

అలమటించే ప్రాణికి
కంఠంలో నీరు పోయువారే
సిసలైన ప్రాణబంధువౌనురా

కారుచీకటిలో

గోరంతదీపాన్ని
వెలిగించిన వారే
మహా మనీషి ఔనురా

    ********

4 comments:

 1. అసలు సిసలు నిజం చెప్పేశారు

  ReplyDelete
  Replies

  1. మీ అభిమానానికి కృతఙ్నతలు.

   Delete
 2. కష్టం లో ఉన్నప్పుడు ఒక చిన్న hope ఇవ్వగలగటం మహా మనిషి లక్షణం అని మహా బాగుగా చెప్పారు..

  ReplyDelete
  Replies

  1. నేను కొత్తగా చెప్పింది ఏమీ లేదు . అనాదిగా ఉన్నదే ఈ నిజం . కాకుంటే మధ్య మధ్యలో ఇలా మననం చేసుకొమ్టే , మళ్ళీ మన మనుగడలో కొనసాగుటుంది. అంతే.

   Delete