కొలను


               కొలను
                                                          కవితా రచన : శర్మ జీ ఎస్

అదో చిన్న ప్రపంచం ,
క్రిమికీటకాదుల కాహారం ,
చూపులకో అందమైన హారం .

కలువలు , తామరలు ,
గడ్డిపఱకల , దర్భ మొక్కలు ,
చుట్టూ రాళ్ళూ , రప్పలూ .

ప్రపంచానికే వెలుగు నీడల నిచ్చు
సూర్యచంద్రులను ,
తనలోనే దాచుకొంటుంది ,

జీవితమంటే వెలుగు నీడలేనని ,
ఆ వెలుగునీడలు అందరికి ,
అవసరమని చాటుతోంది .

తనను చూడ వచ్చినవారికి ,
వారి ప్రతిబింబాల్ని ,
తనలోనే చూచుకోమంటుంది .

కదిలించనంతవఱకు ,
ప్రతిబింబాన్ని చూపుతూ ,
అద్దంలా మెరిసిపోతుంటుంది .

చిన్న కల్లు విసిరినా ,
కలత చెందిన మనసులా ,
కలవరపడ్తుంటుంది .

లోన ఎంత పాచిని పేర్చుకున్నా ,
పైకి అందాల్ని చిందిస్తుంది ,
ఆనందాల్ని అందిస్తుంది .

అదే ఆ కొలను ప్రత్యేకత
అదే అదే ప్రశాంతత ,
పదే పదే గుర్తు చేస్తుంటుంది .

              *******

ఆరో ప్రాణం


              ఆరో ప్రాణం

                                                  కవితా రచన : శర్మ జీ ఎస్

నేను ( స్వార్ధం ) లేక నువ్వు లేవు ,
నువ్వు లేక నేనూ లేను ,
నువ్వూ , నేనూ లేకుంటే గమనమే లేదు .

నీ చెంతన ఆకారం ఉంది ,
నా పంచన ఆధారం ఉంది అందుకే ,
నీ సహకారం నాక్కావాలి .

ఈ కలియుగం  గ్జరీల  నిలయమంట ,
నన్ను చేర్చుకొంటే  ఫోర్జరీల  పంటంట , 
అనంతమైన సిరులు అందుకోవచ్చంట . 

చేయీ చేయీ కలిపితే చప్పట్లు ,
నువ్వూ , నేనూ కలిస్తే ,
తొలగిపోవు నీ యిక్కట్లు .

నేను లేని నీకు అత్తెసరు మార్కులే ,
నాతో చేతులు కలిపావంటే ,
నూటికి నూరు మార్కులు నీకే . పిలువకు , అలా వెంటబడి పిలువకు ,
రాకు నా దరిదాపులకు రాకు , 
నువ్వంటే , నాకెంతో చిరాకు , 
లేనిపోని అనుమానాలని , అపార్ధాలని ,
చెంత చేరనీయను ,
నా మానాన నన్ను బ్రతకనీ ,
పో , వెళ్ళిపో , 
మళ్ళీ రాకుండా ,
శాశ్వతంగా దూరంగా వెళ్ళిపో  ,
ఈ పంచప్రాణాలతోనే సతమతమవుతున్నా, 
ఇక నీ ఆరో ప్రాణం చేరితే నే ఖతమైపోతా .


      *****


  

సంతోషాన్ని కొనగలమా ?


                                                                                                                         
ఆ మధ్య  ఏ  శుభకార్యానికి వెళ్ళినా , ఆ  పెద్దవాళ్ళు  చిన్నపిల్లల్ని వాళ్ళ బంధువులలో పెద్దవాళ్ళ వద్దకు తీసుకువెళ్ళి వంగి కాళ్ళకు దండం పెట్టించే వారు . వాళ్ళు  చెప్పినట్లే  పెట్టేవాళ్ళు 
వెంటనే ఆ దండం పెట్టించుకొంటున్న ఆ పెద్దవాళ్ళు   "   కలకాలం పిల్లా  పాపలతో ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో , సుఖ శాంతులతో హాయిగా జీవించండి "   అని ఆశీర్వదించేవాళ్ళు  . ఈ దీవెన వినగానే మనసు ఎంతో  ఆనందాను
భూతికి లోనయ్యేది . ఆ దీవెన / ఆశీర్వాదంలో అంత ఆనందం ఇమిడి ఉండేది .

మరి ఈ రోజుల్లో   ఆ ఆశీర్వాదాలు ఎక్కడా వినపడటం లేదు . నమస్కారం పెట్టమనేవారు లేరు పెట్టే వారు లేరు,  పెట్టించుకునేవారూ కనపడటం లేదు  . అలా వంగి కాళ్ళకు నమస్కారం చేయటం ఎంతో తప్పుగా భావిస్తున్న రోజులివి . అలా నమస్కరించటం వలన తనని చిన్నచూపు చూస్తున్నారన్న భావన అధికమై, అలా వంగి నమస్కారాలు చెయ్యటమే మానేసేశారు ఈ కాలపు వాళ్ళు , వాళ్ళను కన్నతల్లితండ్రులు కూడా . వాస్తవానికి వాళ్ళను కన్న తల్లితండ్రులు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ పెద్దల మాట విన్నవాళ్ళే  . వంగి నమస్కారాలు చేసినవాళ్ళే . మరి వాళ్ళ చిన్నపిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ????????

అంటే..... వీళ్ళలో కూడా ఎక్కడో ఏదో మూల అలా వంగి నమస్కారం చేయటం తప్పేమో అన్న ఓ చిన్న సందేహం బీజంగా  బలంగా నాటుకుండటం వలన , పిల్లమీద పడుతున్న మీడియా ప్రభావం , వీళ్ళమీద పడటం వలననూ ,ఇప్పుడు వాళ్ళ చిన్నపిల్లలకు  చెప్పలేక పోతున్నారు . వాళ్ళ చేత ఆలా వంగి నమస్కారం చేయించలేక పోతున్నా రు . అలాగని  పిల్లలమీద ప్రేమాభిమానాలు ఏ మాత్రం  తగ్గుతున్నాయనుకోవటానికి వీలు లేదు . అలా అని వాళ్ళు వాళ్ళ చిన్నపిల్లల కొరకు  రూపాయి ఖర్చు చేయవలసిన స్ధానంలో వంద  రూపాయలైనా ఖర్చు చేయటానికి వెనుకాడటం లేదు .

ఉదాహరణకు :  ఆ నాటి నుంచి మొన్న మొన్నటిదాకా చిన్నపిల్లలను కంటున్నవారేగా అందరు . ఎవరైనా పొత్తిబట్టలు వాడేవారు , అంతే గాని   బేబీ ప్యాడ్స్ , హగ్గీస్ , మఱియు డైపర్స్  వాడేవాళ్ళా ? వాళ్ళు చిన్నపిల్లలకీ , వాళ్ళకు భేదం చూపించేవారు కాదు . వాళ్ళ స్వవిషయాల్లో కూడా అంతే .

ఉదాహరణకు : ఈ నాడు భర్త పుట్టిన రోజునొ / పెళ్ళి రోజునో  భార్యకు అడిగిన గిఫ్ట్ కొని పంపించి  కూడా, చూసి ఆనందించ టానికి వీలుపడదు , ఆఫీసు పనులతోనో , లేక వ్యాపార పనులలొనొ బిజీగా వుండి . బాధపడి ప్రయోజనంలేక అలాగే అలవాటు పడిపోతున్నారు . అదే వాళ్ళ పిల్లల జీవితాలకు అమలు జరుపుతున్నారు . 

ఇటువంటి వారికి తన కన్న చిన్నవారిని దీవించాలన్న ఆలోచన క్రమేపీ అడుగున పడిపోతుండటంతో , అలా పెద్దవాళ్ళకు వంగి నమస్కారం చేయించాలన్న ఆలోచన వారి మనసులలో చొరబడటం లేదు .ఆ దీవెనలోని అంతరార్ధం : "   సుఖ శాంతులతో హాయిగా కలకాలం హాయిగా ఉండండి "   అంటే    

సుఖ       = సుఖం  
శాంతులు    = శాంతితో
కలకాలం    = ఎల్లప్పుడు 
హాయిగా    = ఆనందంగా  
ఉండండి     = ఉండమని.   

చాలామంది తమ పెద్దవాళ్ళను సుఖసంతోషాలతో చూసుకొంటున్నామనుకొంటున్నారు  . సంతోషపెడ్తున్నామని అనుకొంటున్నారు . వాళ్ళకి వాళ్ళు స్వయంగా చూసుకొనే అవకాశం లేక , పలు రకాలుగా వృధ్ధాశ్రమాలలో , 
అనాధాశ్రమాలలొ స్వయంగా విచారించి , వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు  డబ్బు  మాసం మాసం వ్యయం చేస్తూ చాలా 
చాలా  శ్రధ్ధ తీసుకొంటున్నామని అనుకుని మును ముందుకు అలా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఆనందంగా  . నిజానికి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని సంతోషంగా  చూసుకోలేకపోతున్నారని ఘంటాపధంగా చెప్పవచ్చు . 

ఎందుకంటే సుఖం దేహానికి  సంబంధించింది .ఆ దేహన్ని  ఏర్ కండిషండ్ గదిలో ఉంచితే  చల్లబడుతుంది , సుఖాన్ని పొందకలుగుతుంది . ఇలాంటి  సుఖాన్ని కొనుక్కోగలం , కానీ సంతోషం అలా కొనుక్కునేది కాదు .
మనసుకి  సంబంధించినది . ఆ మనసు ఎక్కడుందో  ఎంత మందికి తెలుసు ?   పైగా సంతోషం ఒకరు ఒనకూర్చగలిగినదే , అదీ ఎదుటివారి మనసుల్ని తెలుసుకున్నపుడు మాత్రమే .

అలా ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోలేనపుడు ఎవరికి వారు ఒనకూర్చుకోవలసినదే గాని కొని అందించ గలిగేది 
కాదు . ఈ నగ్న సత్యం  తెలుసుకుంటే సుఖ సంతోషాలకు కొదవే లేదు . కనుక కొంచెం ఆలోచించి నడతను తదను
గుణంగా  మార్చుకుంటే అందరికి ఆనందం .

చాలామంది ,ఇంత శ్రమ తీసుకోవటం దేనికి ? రేపు మనమూ వృధ్ధుల మవుతామని తెలుస్తూనే ఉన్నది గదా , ముందు జాగ్రత్త చర్యగా డబ్బులు బ్యాంక్ లో జమ చేసి ఆదా చేసుకొంటే మనమేమీ ఇబ్బందులు పడవల్సిన 
అవసరం లేదు అనుకుంటుంటారు . అది పేద్ద తప్పుడు ఆలోచన మాత్రమే . 

డబ్బు మనిషి అవసరాలలో ఉపయోగపడటం విశేషమే , ఆనందించాల్సిన విషయమే . అయితే అందరి జీవితాలకు
అన్వయించబడదు . నూటికి ఏ ఒక్కరికో మాత్రమే అలా ఉపయోగపడ్తుంది . డబ్బు డబ్బుని సంపాదించేటట్లయితే , 
ఈ నాడు ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు దినమూ పెడుతూనే ఉన్నారు . అతి తక్కువ కాలంలో ఆ వ్యాపారాలని 
మూసివేస్తూనే ఉన్నారు . మనమూ నిత్యం చూస్తూనే ఉన్నాము . కనుక డబ్బు మనలని బాగుచేస్తుందనుకోవటం , మనకెంతోఉపయోగపడుతుందను కోవటం నూటికి నూరు శాతం నిజం కాదు . డబ్బు మనిషిచే సృష్టించబడ్డది . పై పై అవసరాలకనుగుణంగా ఉపయోగపడుతుందే తప్ప అంతర్గత విలువలముందు అది బలాదూర్ . 

కనుక మనల్నెవరో సంతోషపెడ్తారనుకోవటం నిజం కాదు , సంతోషం మనసుకి సంబంధించినది కావటం వలన ఎవరికి వారు ప్రయత్నించుకోవటం చాలా చాలా మంచిది . అపుడు ఎవరినీ మనం దూషించవలసిన అవసరం మన దరి చేరదు . 
పైగా యిలా ప్రయత్నించటం వలన మన మనసు ఏ స్థాయిలో వున్నదో మనకు అవగతమవుతుంటుంది . పెడత్రోవ పట్టకుండా మన మనసుని సన్మార్గంలో నడిపించే అవకాశాన్ని మన అదుపులో వుంచుకున్న వాళ్ళమవుతాం .  


సంతోషాన్ని కొనుక్కోలేము , మనంతట మనమే తెచ్చుకోవాలి .


                                                                    **********
  గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ - ఓల్డ్ గ్రేట్ బ్రిడ్జ్

South San Francisco
S F O Down Town
Golden Gate Bridge
తేది : 20/05/2013

ఈ రోజు ఉదయం ఆదివారం అందరు ఆలస్యంగా లేచారు . నేనూ 6.16 కి లేచాను , నా కాలకృత్యాలు ముగించుకుని 
ల్యాప్ టాప్ ఓపెన్ చేసి కధను కరెక్ట్ చేసుకొంటున్నాను . నా శ్రీమతి కాఫీ యిచ్చింది .  నా పెద్ద మనుమడికి మొన్న 
మిష్టరీ స్పాట్ ,ఎస్ ఎఫ్ ఓ బీచ్‌కి వెళ్ళి వచ్చిన ప్రభావం , ఆ పై వద్దన్నా వినకుండా అర్ధగంట సమయం చేసిన బబుల్ 
బాత్ ప్రభావం , వెరసి జలుబుతో కూడిన జ్వరం సరసన చేరాయి . 

ఇటువంటప్పుడే మనం మన మంచితనాన్ని , విచక్షణాఙ్నానాన్ని కోల్పోవటము జరుగుతుంటుంది ,ఆలోచించ
నీయకుండా కోపం కప్పేస్తుంది .  కోపం మనను ప్రవేశించగనే , మనుషులమైన మనం పశువులుగా మారి , పసి
వాళ్ళను యిబ్బందుల పాల్జేయటం జరుగుతుంటుంది .

అందుకనే తమాయించుకొని ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళు చేసినదాంట్లో తప్పు లేదన్నది మనకు అవగతమవు
తున్నది . అదే కదా బాల్యం . ఆ బాల్యమే కదా మనం పోగొట్టుకున్నామని ఎన్నోమారులు ఎంతమంది దగ్గరో బయటపడిన వాళ్ళమే కదా ! మనం పోగొట్టుకున్నది మన పిల్లలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నది మనం గ్రహించుకుంటే , వాళ్ళని మనం కోపగించవలసిన అవసరమే రాకుండా పోతుంది ఈ విషయంలో . 

దానితో కొంచెం ఆలస్యంగా లేచి , భోజన కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఎస్ ఎఫ్ ఓ గోల్డెన్ గేట్ బ్రిడ్జి కి వెళ్దామ నుకున్నాము .

అలాగే 2.30 కి బయలుదేరాం కారులో . ఆ అందమైన  రహదారుల  చుట్టూరా అందమైన కొండలు ఎవరో పేర్చినట్లు
న్నాయి . ఆ కొండలలో అచ్చటచ్చట అందమైన ఆకృతులతో భవనాలు , ఆ భవనాల ముందు కళాకృతులతో చక్కటి సారీ చిక్కటి చెట్లు మొక్కల్లా కనపడుతూ మన కళ్ళను ఆకర్షిస్తాయి  . 

ఇంత ట్రాఫిక్ కి అసలు మూల కారణం వేరే ఉంది . అదేమిటంటే ఈ అమెరికాలో వీకెండ్ రాగానే వీకెన్ అయిపోయిన వీళ్ళందరూ , యిళ్ళను వదలి హాయిగా ఎంజాయ్ చేయాలని యిలా విహారయాత్రలకు వెళ్తుంటారు . ఈ వెళ్ళటంలో కొంతమంది స్వంత కార్లలో , యింకొంతమంది రెంటల్ కార్లలో , మరి కొంతమంది తమ స్వంత  కార్ హౌస్ ఎటాచ్ మెంటుని  ( అంటే దీనిలోనే బెడ్ , కిచెన్ , బాత్ రూం ఉంటాయి  , ఇవి అద్దెకు కూడా దొరుకుతుంటాయి , కాకుంటే వీటిని ఎక్కడంటే అక్కడ కార్లలా పార్క్ చేయ వీలు కాదు . )ని తమ కారుతో , తీసుకుని ఇలా వెళ్తుంటారు . ఇటువంటివన్నీ ఆ రహదారిని అపుడపుడు కొంత సమయం పాటు స్తంభిపచేస్తుంటాయి .

ఆ రహదారి అన్ని రకాల వాహనాలతో  .  క్రిక్కిరిసి పోయి , అక్కడక్కడ 10 , 15 నిముషాల చొప్పున ఆగుతూ 3.25 కి చేరాము ఓల్డ్ ఎస్ ఎఫ్ ఓ మీదుగా గోల్డెన్ బ్రిడ్జి దాటాము . 

నిజంగా చూడ కనువిందుగా ఉన్నది . ఈ బ్రిడ్జి సముద్రం మీద క్రింద సపోర్టులు లేకుండా స్ప్రింగ్ మీద నిర్మిం
చబడ్డది . వాళ్ళ నిర్మాణ  నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ .వాళ్ళు ఏది తయారు చేసినా ఆ నాణ్యత కనపడుతుంది . 
అక్కడ ఆ సుందర దృశ్యాలను కళ్ళారా చూసి , కెమేరాలో బంధించటం జరిగింది . మధ్యలో షిప్ లో సైట్ సీయింగ్ ఆ 
ప్రక్కన డౌన్ టౌన్ ( కొత్తగా కట్టబడిన ఎత్తైన కట్టడాలు ,ఇదే కొత్త ఎస్ ఎఫ్ ఓ ) , నడుమ ఆల్క్రాట్జ్ దీవి ( పాత కాలంలో షిప్ మీదగా అమెరికా వచ్చేవాళ్ళకి పోర్ట్ ఆఫ్ అథారిటీగా పని చేసింది , యిప్పుడు ఖైదీలనుంచే జైల్ గా ఉపయోగిస్తున్నారు . 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది 1866 నుంచి .) ఉన్నది .

గోల్డెన్ గేట్ బ్రిడ్జి నుంచి ఆ వైపు ఉన్న కొండల నుంచి సైట్ సీయింగ్ ప్లేసులకి కారులో వెళ్ళాము . ఈ మధ్యలో బైసైకిల్ష్ట్ 
లు ఆడా మగా తేడా లేకుండా వేగంగా వెళ్తున్నారు ఆ కొండ పైకి . నిజంగా సుందర దృశ్యమే , ఎడమ వైపు డౌన్ టౌన్ , గోల్డెన్ గేట్, ఇంకొక వైపు సముద్రం , మరొక వైపు లోతైన లోయలు . కెమేరాలో కొన్ని సుందర దృశ్యాలను క్లిక్ చేశాము .

అక్కడ నుంచి రిటర్న్ యింటికి .  


                                                                      ********
ఓ సాఫ్ట్ వేర్ గాల్ వీకెండ్


                                                 
 "   వీకెండ్  వస్తుందంటే  , వీకెన్ అయిపోతానే "   అన్నది ప్రక్క సిష్టం ముందు కూర్చున్న నీహారికతో ప్రవల్లిక  .

"   ఎందుకే ? హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుగా !  నేనైతే ఎపుడెపుడొస్తుందా ! అని ఎదురు చూస్తుంటా "   అన్నది నీహారిక .

"   విశ్రాంతెక్కడ లభిస్తుంది ? "   ఆన్నది ప్రవల్లిక .

"   అదెక్కడా అమ్మరమ్మాకొనుక్కోవటానికి  .  మనకు మనం తీసుకోవాలే . "

"   ఎలా  కుదురుతుందే ? "   ఫ్రవల్లిక .

"   ఎందుకు కుదరదే ? "   ఎదురు ప్రశ్న వేసింది నీహారిక .

"   మనవి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కావటం వల్ల ఏ మిడ్నైట్ కో గాని చేరుకోలేము . చేరుకున్న వెంటనే నిద్రపోలేం గదా ! "

"   నిజమేననుకో , కనీసం సాటర్డే , సండే మార్నింగ్స్ అయినా లేట్ గా నిద్ర లేవవచ్చుగా ! "   ఆన్నది నీహారిక .

"   వినటానికి చాలా బాగుంది . సాటర్డే , సండే మార్నింగ్స్ లేట్ గా లేవటమా ! నెవర్ , ఇట్స్ ఇంపాజిబుల్ "   అన్నది ప్రవల్లిక . 

"  వై ? "   ఆన్నది నీహారిక .

"   వీక్ డేసే నయం . సాటర్డే , సండే మార్నింగ్స్ వచ్చాయంటే చాలు , వీక్‌డేస్ కంటే ముందే లేపుతాడే  నా మొగుడు  మోహన వంశీ . అదేమిటండీ అంటే , పక్కనుండి లేపకపోతే నువ్వూరుకొంటావా బెల్లమా అంటాడు , అది ఆయన నాకు ( పెళ్ళానికి ) ముద్దుగా  పెట్టిన పేరు ."

"   అంతటి రసికుడిని పక్కనే పెట్టుకొని నిద్రపోవటం తప్పేనే "   అన్నది నీహారిక .

"   రసికుడా ఆ కాసేపేనే , ఆ తర్వాత   రక్కసుడే ? మన్డే నుంచి ఫ్రైడే వరకు లోపల అణచి పెట్టుకున్న అక్కసే అది ." 

"   అలా ఎందుకనుకుంటావ్ ? మగవాళ్ళు ఏదో వంకతో అలా లేపుతుంటారు , నువ్వపార్ధం చేసుకుంటున్నావేమో ?  పైగా ఆ టైం   బ్రహ్మముహుర్తమంటారు ,  చాలా చాలా  చాలా మంచిదే . ప్రశాంతంగా వుంటుంది . అంతం వరకు శాంతంగా వెళ్ళవచ్చు . అమృతం అందుకోవచ్చు . "

"   ఊరుకోవే , ఆయన లేపేది  ఆ ( ఒంటి ) పనికి కాదు , యింటి పనికి "   అన్నది ప్రవల్లిక .

"   ఇంటి పనికి అంత ఎర్లీగా ఎందుకే ? "

"   మా పనమ్మాయి ఉదయాన్నే 7 గంటలకు వచ్చి పని అంతా పూర్తి చేసుకొని వెళ్ళి , మళ్ళీ రాదే . వీక్ డెస్ అవసరం కొద్దీ మనం యిలా టైం ఫిక్స్ చేస్తే , ఆ పనమ్మాయి పర్మనెంట్ గా  అలానే ఫిక్స్ అయిపోయింది . " 

"   పోనీ ఓ రోజు నువ్వు , ఓ రోజు మీ ఆయన వంతులేసుకోకపోయారా ? ఆన్నది నీహారిక . "

"   పొరపాటున కూడా పని మనుషులని మన మొగాళ్ళకు అప్పజెప్పకూడదు . అప్పజెప్పావో , అంతదాకా నిన్నంటి పెట్టుకున్న నిద్ర మత్తు కాస్తా ఈ చర్యకు వదిలి పోతుంది , ఆ తర్వాత నిద్రపోదామన్నా నిద్రపట్టదే అన్నది ప్రవల్లిక ."

"   మీ ఆయన అటువంటి వారా ? "  అన్నది నీహారిక .

"   కాదే , కానీ   ఎంతైనా మొగవాడే కదా ! అంతటి ప్రవరాఖ్యుడే  , వరూధినికి వశమయ్యాడా లేదా .   అంతటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కూడా మేనక వలలో పడ్డాడా ?  లేదా ? 

"   కళ్ళు కళ్ళు కలిశాక కాపురం కూడా చేసి తీరాల్సిందే మఱి   "   అన్నది నీహారిక .

"   ఆంతెందుకు మా యింటి ప్రక్కనే ఓ తాతగారున్నారు . ఇన్ని అవస్థలు పడ్తూ  జీవనం సాగించే బదులు , ఎవరినైనా  చూసి పెళ్ళి చేసుకోక పోయారా అంటే చాలు , నాకెవరిస్తారు పిల్లని అంటాడే గాని  , పిల్లనిస్తే నేనే చేయగలను ఆ పిల్లకి అని ఆలోచించనే ఆలోచించడు . తనేమీ ఆ పిల్లకు చేయలేకపోగా , ఆ పిల్లనే తనకు చేయమంటాడు  , యిదేనే స్వార్ధమంటే "   అన్నది ప్రవల్లిక .

"  స్వార్ధం మనలో ఎంటర్  కాకూడదే , అయిందా  మన ఆలోచనలనే తారుమారు చేస్తుంది "   అన్నది నీహారిక .

"   మగవాడెపుడూ అవకాశం కొఱకు ఎదురుచూస్తుంటాడు గోతి కింద నక్కలాగా . అందుకే శనివారమైన , ఆదివారమైన ,మంచివారమైన మన ఆడవాళ్ళే పనిమనుషులను మానేజ్ చేసుకోవటం మంచిదే ."

"   అయితే నువ్వు ఎర్లీగా లేవక తప్పదంటావ్ ."

"   లేవటమే కాదు ,యింటెడు చాకిరీ చేయాలి , అత్తగారికి , మామగారికి కాఫీలందించాలి "   అన్నది ప్రవల్లిక .

"   మీ అత్తగారు , మామగారు చాలా మంచివారన్నావుగా . అన్నీ అత్తగారే చేస్తుందన్నావ్ . నువ్వింట్లో పని చేయాల్సిన పనే లేదన్నావుగా మళ్ళీ యిదేంటే ? "   అర్ధం కాలేదన్నట్లు అడిగింది  నీహారిక  .
  
"   మా అత్త మామగార్లు మంచివాళ్ళే "   అన్నది ప్రవల్లిక .

"   మళ్ళీ ఈ ఫిటింగ్ ఏమిటే ? "   అన్నది నీహారిక .

"   మొగుడు అంటే ఎవరనుకుంటున్నావ్ ? ఫిటింగ్ మాష్టరే . ఆ మొగుడు అనే వాడి వల్లనే యిదంతా . ఆయనే వాళ్ళ మమ్మీ , డాడీ ల మనసుల్లో  మంచివాడనిపించుకోవాలని యిలా డిసైడ్ చేసి , పైకి మాత్రం నేనేమైనా అనుకొంటానని "   వాళ్ళు పెద్దవాళ్ళు కదా ! వాళ్ళకు రెష్ట్ ఈ 2 డేస్ యిస్తే కదా , ఆ 5 డేస్ మనం చేయించుకోవటానికి వీలు పడ్తుంది "   అని సర్ది చెప్పాడు .

"   మీ ఆయన నిన్ను సుఖపెట్టటానికి భలే ప్లాన్ చేశారు "   అన్నది నీహారిక .

"   ఆ 5 రోజుల కొరకు ఈ 2 రోజులు చేయాలంటే , నరకం కనపడ్తుందే . అందుకనే అసలు సాటర్డే , సండే లేకుండా వీక్  వుంటే బాగుండు అనుకొంటున్నా"   అన్నది ప్రవల్లిక .

"   అలా ఎలా కుదురుతుందే , వీక్ అంటే 7 డేస్ కదా అన్నది "   నీహారిక .

"   వీక్ అంటే 7 డేస్ , ఆ సాటర్డే , సండే లు కూడా వర్కింగ్ డేస్ అయితే , హాయిగా ఎంచక్కా ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి , సిష్టం ముందుతిష్ఠ వేసుక్కూర్చోవచ్చు , ఛాటింగ్ చేయచ్చు , ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడి వాళ్ళతో ( పబ్లిక్ ) రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు ( ముఖా ముఖి కాకున్నా ) ముఖం చాటయినా , చక్కగా , సరదాగా ఎంజాయ్ చేయచ్చు . నెట్ వర్క్ ల ద్వారా ఎంతోమందితో స్నేహ సంబంధాలు పెంచుకోవచ్చు , అయినా యివన్నీ నీకు తెలియనివేమీ కాదుగా "   అన్నది ప్రవల్లిక .

"   నువ్వన్నది నిజమేనే , నీ ఒక్కదాని కొరకు ఆ 2 డేస్ ఎలా పెడ్తారు ? మన  సాఫ్ట్వేర్ అంతా ఫారెన్ కంట్రీస్ మీదే బేస్ కదా ! వాళ్ళకు వీకెండ్ చాలా ఎసెన్షియల్ , ఇఫ్ దే ఆర్ నాట్ హావింగ్ వీకెండ్ , దెయిర్ బాడీస్ బికేం వీకెన్ డ్ " అన్నది నీహారిక . 

"   నువ్వు వీకెన్ డ్ కాదే , నేను వీకెండ్ "   అన్నది నీహారిక .

"   నువ్వెలా ? "   అడిగింది ప్రవల్లిక.

"   నీకు చేసిపెట్టటానికి అత్తా మామలున్నారు , నాకైతే ఎవ్వరూ లేరు . పెళ్లి అయి ఆరేళ్ళయినా మేమింతవఱకు పిల్లల్ని ధైర్యంగా కనలేకపోతున్నాం . కన్న తర్వాత వాళ్ళని చూసేవాళ్ళెవరు ? ప్రశ్నగా మిగిలిపోయింది యిప్పటికీ ."  

"  పిల్లల్ని కనకపోయినా చక్కగా వయసుని ఎంజాయ్ చేస్తున్నారు గదే , పిల్లలదేముందే ఏ వయసులోనైనా కనవచ్చు . ఈ వయసు పోతే మళ్ళీ రాదు " .

"   వయసులో కనకుంటే , ఆ పై మా బతుకులకు మెతుకులు పెట్టేవాళ్ళెవరు అన్నది ప్రశ్నగానేమిగిలిపోయింది . పిల్లలు లేని జీవనగమనం , అడవిన కాచిన వెన్నెల గమనంతో సమానమే . మనం సంపాదిస్తాం డబ్బుని , ఆ డబ్బుతో మనుషుల్ని తెచ్చుకోగలం గాని " మన " అన్న వారిని మనం తెచ్చుకోలేం . డబ్బుతో మనకు దగ్గఱయ్యే వాళ్ళు  ఎప్పుడూ ఆ డబ్బునే చూస్తారు, మనల్ని , మన మనసుల్నీ వాళ్ళు చూడలేరు . ఇప్పుడు నన్నే చూడు , అందరినీ కాదని , అందర్నీ వదులుకొని మేమిద్దరం పెళ్ళీ చేసేసుకున్నాం . ఈ రోజుల్లో పిల్లల్ని కనగానే సరికాదు , వాళ్ళ ఆలనా , పాలనా చూడటనికి డబ్బు ఎంత అవసరమో , 'మన' అనే వాళ్ళు అంతకంటే ఎక్కువ అవసరం . ఆ మన అనే వాళ్ళు లేక , మేమా పిల్లల్ని కనే ప్రోగ్రామ్ నే  విరమించుకున్నాం . కనగల శక్తి లేక కాదు , ఆసక్తి 
లేక కాదు , 2 సార్లు అబార్షన్ కూడా చేయించుకున్నానందుకే . మీ అత్తా మామలు  చాలా మంచివాళ్ళే . మన అనుకున్నారు గాబట్టే అలా చేస్తున్నారు , చూస్తున్నారు . వాళ్ళను వదులుకోకే . పిల్లలకి 5 , 6 ఏళ్ళు వచ్చాక హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు. ఆ అండ వదులుకోకు "   అన్నది నీహారిక .

" నువ్వంటున్నది నిజమేననిపిస్తోంది . నీ గాధ విన్న తర్వాత , నా బాధ అంతా పోయిందే . 
నిజ్జంగా మా అత్తా మామలు చాలా చాలా మంచివాళ్ళే . వాళ్ళు చేసినదానికి వంకలు 
పెట్టకుండా , వంకరగా మాట్లాడకుండా , బాగుంది , బాగుంది అంటే చాలే ఇంకా ఇంకా 
అత్యుత్సాహంతో మమ్మల్ని సుఖపెడ్తారే . కొన్నాళ్ళు సర్దుకుపోతే ఆ తర్వాత అంతా సుఖమేలేవే 
నువ్వన్నట్లు . థాంక్సే మంచి సలహా యిచ్చినందుకు  "  అన్నది ప్రవల్లిక .

  
                                                        ** స ** మా ** ప్తం **

తరాలు , అంతరాలు , జీవితం లో


                    మనిషికి తరాలు
                   మనసుకి అంతరాలు
                   
                   తరాలు 
                   ఙ్నాపకాల గురుతులు
                   
                   అంతరాలు 
                   వ్యాపకాల పుట్టాలు
                   
                   తరాలు తలుచుకొంటూ
                   మనుగడ గడపాలి
                  
                   అంతరాలు తెలుసుకొంటూ
                   మనసుని నడపాలి

                            *****


ఈ జీవితం లో  మినీ కవిత " తెలుగువారమండి " వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది .
హ్యాట్స్ ఆఫ్ టు ద గ్రేట్ గాడ్

                                       ( ఈ వారం కధ మయూరి వీక్లీ  8-10-1993 లో ప్రచురించబదినది  )

విజయవాడ వెళ్ళే నాన్ స్టాప్ బస్సు తనదైన 5 వ నంబరు ప్లాట్ ఫారం మీద వచ్చి నిలబడింది . టికెట్ తీసుకున్నమదన్ ఇంకా టైం ఉంది కదా అని అలా రిఫ్రెష్ మెంట్ వైపుగా నడిచాడు .

"ఏం కావాలి సార్ "   అడిగాడు రిఫ్రెష్ మెంట్ బాయ్ .
               
"   గోల్డ్ స్పాట్ '' అంటూ 20 రూపాయల నోట్ యిచ్చాడు . మదన్ దృష్టి నాన్ స్టాప్ బస్సు వైపు మళ్ళింది .ఓ 20 ఏళ్ళ అందమైన పడుచు నాజూకుగా నడుస్తూ నాన్ స్టాప్ బస్సు వైపుగా వెళ్తోంది. ఆ పడుచు ప్రక్కనే 60 ఏళ్ళ ముసలావిడ నడుస్తూ "   అమ్మాయి నేను వెళ్ళి సీట్లో కూర్చుంటాను, టికెట్లు పట్టుకురా "   అన్నది .
                
ఒక్క మనీనే కాదు , మాటలను కూడా బ్యాంక్ చేయవచ్చన్నట్లు బదులుగా తల ఆడించి నాన్ స్టాప్ క్యూలో నిల్చుంది .ఇదంతా మదన్ తన కూలింగ్ గ్లాసెస్ లోంచి గమనిస్తున్నాడు .   
                
 "  సార్ గోల్డ్ స్పాట్ "   అన్న మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు మదన్  .
                
ఇది పేరుకే గోల్డ్ స్పాట్ , అసలైన గోల్డ్ స్పాట్ అక్కడ ఉంది . ఆ అమ్మాయి మిస్స్ అయితే బాగుండు , నేను మాత్రం మిస్ కాకూడదు . ఈ ఛాన్స్ ని అని మనసులోనే అనుకుంటూ అక్కడనుంచి చకచకా బయలుదేరాడు .
                
"   సార్ ఛేంజ్ " .     
       
"   స్యూర్ , థేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఛేంజ్ , ఆ  ఛేంజ్ నువ్వే ఉంచేసుకో " ఒక్క పరుగుతో బస్ ఎక్కి ఆ అమ్మాయికి పక్కనే పక్క సీట్లో కూర్చున్నాడు మదన్ .
                
బస్ బయలుదేరింది . కోలాహలంగావున్నది . ఎన్నికల సమయం కావటం వలన కొంతమంది ఫలానా పార్టీ గెలుస్తుందంటే , ఇంకొంతమంది ఎవరొచ్చి ఎవర్ని ఉధ్ధరిస్తున్నారు ?  ఎవరో వస్తారని ఏదో చేస్తారని ,ఈ భూమ్యాకాశాలు ఏకమవటం ఎంత నిజమో , రాజకీయ నాయకుడు మనకు అంత చేస్తాడనుకోవడం అంతే నిజం అంటుంటే , మఱికొంతమంది కిటికీలో గుండా లోపలికి దూసుకు వస్తున్న పైరగాలికి హాయిగా నిద్రపోతున్నారు .              మదన్ మాత్రం ఆ అమ్మాయిని తదేక దృష్టితో అదేపనిగ చూస్తున్నాడు కూలింగ్ గ్లాసెస్ లోనుంచి . 
పేరుకి కూలింగ్ గ్లాసెసే కాని నిజానికవి మల్టీ పర్పజ్ గ్లాసెస్ . ఒకవైపు ప్రకృతి నుంచి చల్లదనాన్నిస్తూ , మరొకవైపు అందమైన ఆకృతి నుంచి వెచ్చదనాన్ని ఇస్తాయి , అదీ రెండో వాడికి తెలియకుండా .
పత్రిక చదువుకొంటోంది ఆ అమ్మాయి .తనకు మరే పనీ లేనట్లు ఆ అమ్మాయినే చూస్తుండిపోయాడు మదన్ . కిటికీలోంచి వీస్తున్న గాలికి ఆ అమ్మాయి పైటకొంగు పక్కనే కూర్చున్న మదన్ ని తాకుతోంది . హాయిగా , ఆనందంగా నిట్టూర్పు విడుస్తున్నాడు .

ఆ వారపత్రిక తీస్నప్పటినుంచి ఆ అమ్మాయి చుట్టుపక్కల పరిసరాలని మరచిపోయి , పుస్తక పఠనంలో లీనమై పోయింది . పైట కొంగుగాలికి ఎగురుతున్నదని , వెనుకవారిని తాకుతున్నదని , ఆ పైటకొంగు విసురుగా వస్తున్న గాలికి పయ్యద నుంచి సాంతం కిందకు జారితే గాని తెలియలేదు .అప్పుడు "   ఐ  యాం సారీ "   అంది .

"మీరు మంచి యింట్రెష్ట్  తో చదువుతున్నట్లున్నారు  , అందువల్లే నేను మిమ్మల్ని డిష్ట్రబ్ చేయలేదు , నేనే అడ్జష్ట్ అయ్యా "   అన్నాడు . ఈదురుగాలికి పత్రికలలోని పేజీలు రెపెరెపలాడుతుంటే , అంతవరకు సీటుకి ఆనుకొని కూర్చున్న ఆ అమ్మాయి కాస్త ముందుకు వంగింది .
               
"   అనుకొన్నపుడల్లా అవకాశం అందరికి రాదు . వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం  మంచివాళ్ళ లక్షణం "   అన్న పెద్దల మాటలు గుర్తుకు వచ్చి నిజం చేస్తూ ఆనందిస్తున్నాడు మదన్ . ఎంతసేపో లేదు ఆ అవకాశం  , పెద్దగా గాలిదుమారం రేగింది . మదన్ కంటిలో నలుసు పడ్డది . స్పెక్ట్స్ నిండా దుమ్ముకొట్టు
కున్నది . తప్పనిసరై గ్లాసెస్ తీసి క్లీన్ చేస్తున్నాడు , క్లీన్ సర్టిఫికెట్ కొరకన్నట్లు .

రైలుగేటు పడటంతో అందరూ ఈ లోకంలోకి వచ్చారు.చనక్కాయలు,చనక్కాయలు ,బఠాణీలు , బఠాణీలు , ఏ సోడా ,సోడా అన్న మాటలు  చెవిన పడగానే ముసలమ్మ లేచి "   సోడా ఒకటి తీసుకో అమ్మాయి "   అన్నది .
                
సోడా తాగుతున్న మదన్ మరొక సోడా తీసుకుని , ఆ అమ్మాయికి అందించాడు , డబ్బులివ్వ
బోయింది .

"   ఫరవాలేదు "   అన్నాడు మదన్ .
           
రైలుగేటు తీసిన పది నిముషాలకు బస్సు గేటు దాటింది .ఇక తనకే అడ్డూ లేదని , తననెవరూ ఆపలేరని , ఎంతో హుషారుగా , చలాకీగా పదేళ్ళ కుఱ్ఱాడిలా పరుగులు మొదలు పెట్టింది . మళ్ళీ మామూలే . కరెంటు బొమ్మల్లాగ అందరిలో కదలిక మొదలైంది . ఎవరి ఆలోచనలకి వారు వెళ్ళిపోయారు . దూరం తరుగుతోంది , గమ్యం చేరువవు
తోంది .
                
 తనకిక వేరే గమ్యం లేదని , చేరుకున్నానని ఇంక నన్ను వదలిపెట్టండి బాబూ అన్నట్లుగా  బస్‌స్టాండులో ఆగిపోయింది బస్సు .  ఏవో ఆలోచనలలో వున్నవాళ్ళకి "    బాబు రిచ్చా అండి ,  బాబు రిచ్చా అండి , బాబూ ఆటో అండి , మీకండి , ఒరేయ్ ఆ సూట్ కేస్ ఆయన్ని నే చేప్పారా , ఆ తలపాగా ఆయన్ని నే చెప్పారా , ఆ పెద్దాయన్ని నే సెప్పారోయ్ , ఆ బామ్మగార్ని నే పిలిచారోయ్ "   అంటున్న మాటలు పదేపదే చెవులలో మార్మ్రోగుతుంటే  ఒకరి నొకరు నెట్టుకుంటూ దిగుతున్నారు , అందరూ దిగేవరకు ఇంకెక్కడకి వెళ్ళదని తెలిసినా .

 60 పైబడిన ముసలమ్మ ,20 కి చేరువగా వున్న పడుచు దిగారు . వారి వెనుకనే మదన్ దిగాడు . పది నిముషాలకు ముందు అందరూ కలసి ఒక కుటుంబం లోని సభ్యుల్లా ఎక్కడెక్కడి విషయాలు చర్చించారు . ఇపుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు విడిపోతున్నారు . 

ఈ బామ్మగారు కూడ ఆ పడుచుని వదలి వెళ్ళిపోయింది . ఆ పడుచమ్మాయి మాత్రం అక్కడే ఒంటరిగా ఎవఱి కొఱకో ఎదురుచూస్తూ నిల్చుండి పోయింది . 

దూరంగా నుంచొని గమనిస్తున్న మదన్ అందాకా యిరకాటంతో తీసుకొంటున్న ఊపిరిని  స్వేఛ్ఛగా తీసుకోవటం మొదలైంది . అర్ధగంట గడిచింది . ఎవరూ రాలేదు . నిరీక్షణ విలువైనదని తెలుసుకున్న ఆ అమ్మాయి బస్‌స్టాండు లోని వెయిటింగ్ హాలు వైపుగా నడిచింది .నిజంగా నిరీక్షణకి విలువ కట్టవలసింది యిటువంటి చోటే అనుకుని మదన్ కూడా టిక్కెట్ కొని ఆ వయిటింగ్ హాలులోకి ప్రవేశించాడు . "   మిస్ మీరెవరికొఱకో ఎదురు చేస్తునట్లున్నారు "   అన్నాడు .
                
"   నా ఫ్రెండ్ కొఱకు , ఇంకా రాలేదు ".
              
"   ఆ విషయం తెలుస్తూనే ఉన్నది ".  ఆ అమ్మాయి నవ్వింది .ఆ నవ్వుతో ఆ పలువరస స్వఛ్ఛమైన 
పాలలా తెల్లగా మెరుస్తోంది .
          
"   ఎక్స్క్యూజ్ మి మీ ఫ్రెండ్ అడ్రసు యివ్వండి ."
                
 తన హాండ్ బ్యాగ్ లోని యిన్విటేషన్ తీసి యిచ్చింది . ఇన్విటేషన్ కవరు మీద అడ్రసు చూశాడు . శ్రీ ఎం.వి. రావు , 2 వ లైన్ , ఆర్ కె తోట , బరంపురం ."   ఓ మీది బరంపురమా , మీరు విజయవాడ పెళ్ళికి వచ్చారన్నమాట ".
               
" ఔనండి "
               
"    ఈ అడ్రసు మా యింటికి ఫర్లాంగు దూరంలో వుటుంది . మా యిల్లు యిక్కడకి 3 ఫర్లాంగులుంటుంది . పెద్ద దూరమేమీ కాదులెండి .

 "   నేను ఈ ఊరికి కొత్త . తను రెసీవ్ చేసుకుంటానని ప్రామిస్ చేస్తే వచ్చాను . ఒక పక్క చీకటి పడుతోంది ".
                
 "   మీకభ్యంతరం లేకపోతే నాతో రండి , నేను తీసుకువెళ్తాను "   అన్నాడు .
                
"   మీకెందుకులెండి అంత శ్రమ ? "   మాటవరసకన్నదే గాని మనసులో మాత్రం తనకో తోడు దొరికినందుకు సంతోషిస్తున్నది యీ సమయంలో .
               
"   అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవటం నాకు కొత్తేమీ కాదులెండి  . మీరేం కంగారుపడకుండా నాతో వచ్చేయండి , మీ భద్రత పూచీ నాది "    అన్నాడు .
                 
"   ఇంతగా మీరు కేర్ తిసుకుంటానంటే ఎలా కాదనగలను , పదండి "   అక్కడనుండి బయటకు అడుగులు వేసింది . ఇరువురూ రోడ్డు మీద నడుస్తున్నారు . మౌనాన్ని చేదిస్తూ "   మీ పేరు "   అడిగాడు మదన్ .
               
 "   గీత " .

 "   నాకెంతో యిష్టం ."
                
 "   ఏమంటున్నారు "   కంగారుగా .
                
"   అదేనండి భగవద్గీతకు మారుపేరు గీత కదా ! ఆ గీత అంటే నాకెంతో యిష్టం అన్నాను తప్పులేదుగా ". 
                
 "   తప్పులేదులెండి .మీరు చంత్కారంగా మాట్లాడుతారే , మీకు పెళ్ళైందా ? ".
                
 "   తినబోతూ రుచి అడగకూడదంటారు . ఇదిగో యిదే మా యిల్లు ".
                
 మంగుళూరు పెంకుతో కట్టిన పెంకుటిల్లు . ముందు ఖాళీ స్థలం , వరండా , హాలు , కిచెన్ , ఆ వెనక ఓపెన్ స్పేస్ , పెద్దగా వున్నవాళ్ళేమీ కాదనిపించింది గీతకి .
                
"   రండి కూర్చోండి . సరోజా ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిందట . ఈ ఊరికి కొత్తట . తెలియదంటే తీసుకొచ్చాను . ఇదిగో పెళ్ళి శుభలేఖ ".
                
"  నమస్కారం సరోజ గారు ."
                
 ప్రతినమస్కారం చేస్తూ లోనికి వెళ్ళింది సరోజ  . కాఫీ చప్పులతో తిరిగి వచ్చింది ."   ఈ అడ్రస్ నాకు తెలుసు . నీకు తోడుగా నేనూ వస్తాలే "   అన్నది .
                 
  హాయిగా కాఫీ తాగి "   బయలుదేరుదామా "   అన్నది గీత .
                 
 "   మ్యారేజ్ రేపుగా , ఈ రోజు ఇక్కడుండి , రేపు మార్ణింగ్ వెళ్దువుగాని "   అన్నది .
                 
 సరోజ చిన్నదే , తన వయసంత ఉంటుంది.మొదటి కాంపుగా ఒక పసివాడు .ముద్దొస్తున్నాడు , స్నేహితురాలిలా కలివిడిగా ఉంది అనుకొని , ఎదురుచెప్పక ఉండిపోవాలని నిశ్చయించుకొన్నది .
డిన్నర్ పూర్తయింది .రాత్రి 9 గంటలు దాటింది. మంచం మీద నడుం వాల్చటమే ఆలస్యం , హాయిగా నిద్రపోయింది సరోజ పసివాడిని పక్కనే పడుకోపెట్టుకొని .

 గత రెండు రోజుల ప్రయాణబడలిక ముందు ,కొత్తవారు , కొత్త ప్రదేశం అన్న విషయం ప్రభావం గీత మీద పడకపోయే
సరికి వెంటనే నిద్రాదేవి ఒడిలో చేరిపోయింది .
                 
శారీరకంగా నడుం వాల్చాదే గాని, మానసికంగా ఒకటే ఆలోచనలు .ఎంతకీ నిద్రపట్టలేదు మదన్ కి . వరండా వైపు చూశాడు .జీరో వాట్ బల్బ్ వెలుగుతూ కరెంట్ ఉన్నదని తెలియచెప్తున్నది . సరోజ వైపు చూశాడు . ఆదమఱచి నిద్రపోతున్నది . ఆ ప్రక్కనే గీత మంచం . వీధి దీపపు కాంతి గిత మంచం మీద పడుతోంది . ఓరగా పడుకున్న గీత వెల్లకిలా తిరిగింది .ఆమె ఊపిరివైనం ఎవరూ  అడగకనే , అమెనడగకనే .ఆమె ఎన్నిమార్లు ఊపిరి పీల్చి ,వదుల్తుందో సులభంగా చెప్పవచ్చు .అటే చూస్తున్నాడు .అలా చూసేకొద్దీ దగ్గఱగా  వెళ్ళి చూడాలని , ఆ ఊపిరులను లెక్కలోకి తీసుకోవాలన్న చిలిపి ఆలోచనలతో , మెల్లగా తను మంచం మీదనుంచి లేచాడు అడుగులో అడుగు వేస్తూ ,  సరోజ
మంచం వరకు చేరేసరికి పసివాడు కెవ్వు మనటంతో వెనుతిరిగాడు దిగాలుగా .
కళ్ళు తెఱవకుండానే ఎడమచేత్తో పసివాణ్ణి దగ్గరకు లాక్కొని , కుడిచేత్తో బ్లౌజ్ హుక్స్ తీసి పసివాడి నోటికి అందిం
చింది . నుము అయస్కాంతాన్ని చూడగానే అతుక్కుపోయినట్లు , అంతే ,అందాకా ఏడుస్తున్న ఆ పసివాడు ఠక్కున ఏడుపాపేసాడు . నిద్రాదేవి ఒడిలో వాలిపోయింది సరోజ .సరోజను కుదిపాడు మదన్ , కానీ తను లేవలేదు .
ఇంతలో కరెంట్ పోయింది . చిమ్మచీకటి , అందులోనూ అమావాస్య రోజులవి. ఇదంతా తన అదృష్తంగా భావించి , మెల్లగా మంచం మీద నుంచి లేచి గీత మంచం వద్దకు చేరాడు .
                 "
 ష్... ష్... "   మెల్లగా పిలుస్తున్నాడు మదన్ .సమాధానం రాలేదు
                
"   ష్... ష్... "   అంటూ చేత్తో కుదిపాడు.

"   ఉ "   అంటూ లేచింది. ఎదురుగా మసక వెల్తురులో మనిషి ఆకారాన్ని చూసి ఖంగుతిన్నదై "  ఎవరూ ?"  అంది గీత .
               
 "   ష్... నేనే మదన్‌ని. నిద్ర పట్టటం లేదు . నీవే గుర్తుకొస్తున్నావు .  ఎంతసేపటినుంచో నిద్రపోదామని , మిమ్మల్ని మఱచిపోదామని . పాడు కరెంట్ యిపుడే పోయింది .ఇక తప్పక వచ్చాను "   అన్నాడు మెల్లగా తనకు మాత్రం వినిపించేలా .
               
"   నేను గీతనండి , మీరు పొరపాటు పడినట్లున్నారు "   అన్నది .
                
"    పొరపడలేదు , నీవంటే యిష్టమని అపుడే చెప్పానుగా .ఫరవాలేదు , ఎవరికీ తెలియదులే "   అన్నాడు .
               
"   మీరు మంచివారనుకొని మీతో వచ్చాను . ఇలాంటి వారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు " .
               
 "   నువ్వనుకున్నట్లు నేను మంచివాడినే , కనుకనే నా భార్య నిన్ను రేపుదయం వెళ్ళమంది . కాకపోతే నీ అందం పొంగులు చూసిం తర్వాత యిలా  రాక తప్పలేదు ".
                 
"   నేను సభ్యత, సంస్కారం గల కుటుంబంలో పుట్టాను, పైగా పెళ్ళి కావలసిన పిల్లను , మీరు వెళ్ళిపోండి " .
                  
"   ఎటువంటిదానివైనా యిపుడు సరే అన్నంత మాత్రాన నీకు వచ్చే నష్తమేమీ లేదు , ఫరవాలేదు , నీకూ , నాకూ తప్ప మూడో కంటికి   కూడా  తెలియదుగా "  
                 
 గండం నుంచి ఎలా బైటపడాలా అని ఆలోచిస్తున్నది గీత .
                  
 "   నా శ్రీమతి పక్కనే వున్నదని ఆలోచిస్తున్నావా ? ఏం ఫరవాలేదు . పనిమనిషి సెలవపెట్టటం వలన , అలవాటు లేని పని కావటం వలన , పసివాడితో  అలసిపోయి హాయిగా నిద్రపోతుంది . తన ప్రక్కలోని పసివాడి కేకలకే 
లేవదు . మనకే ఆటంకం లేదులే ".
                 
"   మీరెక్కువగా మాట్లాదుతున్నారు , మీరిలాగే ప్రవర్తిస్తే , మీ శ్రీమతిని పిలవవలసి వస్తుంది . అపుడు మీ భండారం బైటపడ్తుంది . మర్యాదగా వెళ్ళిపోండి "   హెచ్చరించింది .
                 
" నీకా శ్రమ యివ్వను , నేనే చెప్తా , నువ్వే నన్ను పిలిచావని , ఈ పెళ్ళి నెపంతో ఎకాఎకీ యింటికే వచ్చావని చెప్తా . నా మాటే నమ్ముతుంది  తన భర్తను నేను కనుక " .
                  
పొరపాటున వచ్చి బోనులో  పడ్డట్లు అయింది . కరెంటు కూడా యిపుడే పోవాలా ? ఈ గండం గట్టెక్కేదెలా ? ఆలోచిస్తున్నది .మెల్లగా దగ్గఱకు వచ్చి భుజం మీద చేయి వేశాడు .అలా తాకగానే నవనాడులు జివ్వుమని లాగాయి . ఇంతవరకు మగస్పర్శ ఎలాంటిదో తెలియక పోవటం వల్ల ఎద ఎన్నో వేల మైళ్ళ వేగంతో కొట్టుకొంటోంది . ఏదో  అనుభూతి , ఇంతదాకా పొందనిది .ఇదే అదను చూసుకొని తన రెండు చేతులను వలయంగా మార్చి , అందులో ఆ పయ్యెదను తన ఎదతో గాఢంగా బిగించాడు .
                  
ఏదో హాయి , మాటలకందనిది . మగవాడి స్పర్శలో యింత హాయి ఉన్నదా ! ఈ క్షణం మరువరానిది .ఈ మధురా
నుభూతి మరువలేనిది  . ఇంకా ఏదో  కావాలి . ఎంత కావాలో తెలియకున్నా , ఏం కావాలో లీలగా అనుభూతమవు
తున్నది .  అప్రయత్నంగా తన రెండు చేతులను అతడి చుట్టు పెనవేసింది . ఆమె పెదాలను తన పెదాల్తో ఓ క్లోజప్ యిచ్చాడు .ఫలితంగా ముద్దులు కురిశాయి.మెల మెల్లగా అక్కడనుంచి  చుబుకం , చుబుకం నుంచి కంఠం , కంఠం నుంచి ఛెస్ట్ , ఆ  మీద పన్ను తాకింది , వీణాతంత్రులు మీటినట్లైంది . ఆమెలో ఏదో నూతన శక్తి ప్రవేశించి అదేపనిగ అతనిని ముద్దాడుతోంది .ఎన్నడూ చూడని కొత్త కొత్త లోకాలకు తీసుకువెళ్తున్నాడు . అందుకేనేమో అంతదాకా వారించిన తను యిక అడ్డుచెప్పలేకపోయింది . చీకటి చిక్కుల్లో వున్నవాళ్ళకు గాని , చీరెలో దాగున్నవాటికి కాదుగా అనుకొని సమకాలీనుల్లా కరవాలనం చేసుకున్నాయి , కౌగిలించుకున్నాయి .
                  
ఊపిరి ఎక్కువైనా ఊపిరి అందనట్లుగా సన్నగా మూల్గింది .అంత మూలుగులో కూడా అతని చుట్టూ వున్న చేతులు మాత్రం అమె వదల్లేదు .
                  
మదన్ కీ అనుభవం కొత్తది కాదు , మాష్టార్లు పాతవాళ్ళే అయినా , పాఠాలు ఎప్పటికప్పుడు కొత్తవేగా . అలాగే ఈ అనుభవం పాతదే అయినా , ఏదో కొత్తదనం అందిస్తోంది .అందిన అవకాశాన్ని జుఱ్ఱుకొందామని  బిఱ్ఱు చేస్తున్నాడు .
                  
ఇంతటి ఆనందం , అనుభూతి తను కోరకుండా తేలికగా లభించినదాన్ని , తనూ తనివితీరా అనుభవించాలని అతనికి అనువుగా తన తనువుని సాంతం సొంతం చేసేసింది .
                  
"   పుఱ్ఱెకో బుధ్ధి - జిహ్వకో రుచి "   అంటారు . నిజమే ఎప్పటి అనుభవం అప్పటిదే అనిజాగరూకతతో నిర్ధారించుకొని జాగరణ చేయాలనుకొంటున్నది అతని వాలకం .
                  
"   ఏంటి బామ్మా ! ఆ దేవుడికి అంత కుళ్ళు , నన్నో రకంగా , మన రామూనో రకంగా పుట్టించాడు అని అడిగితే , ఆ దేవుడి దగ్గఱ అందుకు కావలసిన సరకు స్టాక్ అయిపోయిందిట . అందుకని యిలా తేడాగా పుట్టించాడే అని చెప్పింది .
నిజానికి అలా తేడాగా ఎందుకు పుట్టించాడో యిప్పుడే అర్ధమైంది. ఇందుకే కాబోలు అందరూ పెళ్ళి చేసుకునేది , ఎదురుచూసేది . అబ్బ ఎంత  హాయి ,ఈ హాయి యిలాగే స్థిరంగా వుండిపోవాలనుకున్నది .
                    
మదన్ హడావుడిగా తన నుంచి విడిపోతుండగా, పాడు కరెంట్ ఏదో కొంపలంటుకుపోయినట్లు ,అపుడే వచ్చేసింది అనుకొన్నది. తెలియని బాధతో  నీరసంగా ఆ స్మృతులతో నిద్రాదెవి ఒడిలో జారిపోయింది .
                   

                                                                         **** 

"   హాయ్ గీతా !"   పలకరించింది పెళ్ళి పందిట్లో వున్న పెళ్ళికూతురు మంజుల .
                   
 "   హాయ్ మంజూ ! బస్ స్టాణ్డుకి రాలేదేంటి ? "
                  
 "  సారీనే , వీలుపడలేదు . వీరెవరు ?
                  
 "   నీ పెళ్ళి మూలంగా అనుకోకుండా పరిచయమైన కొత్త స్నేహితురాలు , పేరు సరోజ . నువ్వు పెళ్ళిచేసుకొని
  వెళ్ళినా , ఈ స్నేహితురాలింటికి  రావచ్చు "  అన్నది గీత .
                   
 "   నమస్కారమండి "
                   
 "   నమస్కారం మంజుల . అండి అని పిలవనఖ్ఖర్లేదు . సరోజ అని పిలిస్తే చాలు ".డ్రింక్స్ తెచ్చివ్వగా తీసుకు                                             
 న్నారు .
   
"   వెళ్ళోస్తాను "   అన్నది సరోజ .
                  
 " అప్పుడేనా ! "   అన్నది మంజుల .
                   
"   పసివాడిని నిద్రపుచ్చి వచ్చాను , లేస్తాడేమో ? " 
                  
 "   రాత్రికి తప్పకుండా పెళ్ళికి రావాలి ".
               
 "   ఆయన క్యాంపుకెళ్ళకుంటే యిద్దరం వస్తాం "  వెళ్ళిపోయింది సరోజ.
                 
 "   రావే గీతా! మీ అమ్మా , నాన్నగారు కులాసాయేనా ? "
                  
"   ఆ అంతా కులాసే. ఈ ప్రయాణం నా జీవితంలో మరువలేని మధుర స్మృతి " .
                  
"   అప్పుడేనా ! ఇంకా నా ఆతిధ్యం ఏమీ తీసుకోకుండానే , అంతా అయింతర్వాత వెళ్ళేటప్పుడు చెప్దువుగాని . అందాకా ఆగు " .
                  
" పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు ? " 
                  
"  వ్యాపారం ".
                   
" కట్నం ? "
                   
" లక్ష ".
                  
"   సొమ్ములేం పెడ్తున్నారు ? ".
                  
"   పది సవర్లు ".
                   
" శోభనం ఎప్పుడు ? " .
                  
"   పదహారు రోజుల పండుగకి " .
                   
"  ఐతే పెళ్ళైన వెంటనే కాదన్నమాట " .
                   
" కాదు . బిజినెస్ పనిమీద రేపే పూనా వెళ్ళాలట ".
   
నవ్వింది గీత.                 
                  
"   దేనికే అలా నవ్వుతున్నావ్ ?"
                  
"  లేకపోతే ఏమిటే ? పక్కనున్న లక్షలు తెస్తున్న లక్షణమైన పెళ్ళాన్ని దగ్గరుంటే వదులుకొని , ఎక్కడో వున్న పూనా కెల్తాడుట,పూనాకి .ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి పెళ్ళికొడుకుని కొనుక్కుంటూ వెంటనే శొభనం చేసుకోలేక
పోతున్నావంటే బాధగా వుందే ".
                   
"   నన్నేం చేయమంటావే. ఆయన అర్జంటుగా వెళ్ళాలట ".
                   
" అలాగైతే ఆ తర్వాతే పెళ్ళి చేసుకోమనకపోయావా ? "
                   
 "   మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ముహూర్తాలు లేవట . ఇదే ఆఖరి ముహూర్తమట ".
                   
"   పాపం నిన్ను చూస్తే జాలేస్తోంది.ఎంతో ఉబలాటపడి పెళ్ళీ చేసుకుంటున్నావు.నూతన జీవితం యిక్కడినుంచే ఆరంభం . నీ పెళ్ళి సందర్భంగా  ' పెళ్ళి నీకు - శోభనం నాకు ' అన్నది .
                   
 "  అదెలానే ? "
                     
 జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పింది గీత .
                     
 "   భలే ఛాన్స్ కొట్టేశావే . ఇటువంటి అవకాశాం అందరికీ రాదు . భగవంతుడు ఆ అదృష్టగీత నీకు గీశాడే ".
                      
"   మంజూ ఎవరి శక్తి వారికి తెలియదంటారు .నిజమేనే , మనలో శక్తి వున్నట్లు మనకు తెలియదు . మనలోని ఆ శక్తిని వెలికి తీసుకురాగలిగింది ఒక్క మగవాడి వల్లే . మరెవరివల్లా సాధ్యం కాదు అని నిన్ననే తెలుసుకున్నాను . అటువంటి మగవాడిని , మనతో పాటు సృష్టించిన ఆ భగవంతుడికి సర్వదా కృతఙ్నులం కావాలి మన  ఆడ జాతి అంతా. ' హాట్స్ ఆఫ్ టు ద గ్రేట్ గాడ్ ' అంది గీత . పెళ్ళి పీటలమీద బ్రహ్మగారు మంత్రాలు చదువుతున్నా , గీత మాటలే మంజుల చెవుల్లో మారుమ్రోగుతున్నాయి .

                                                            * స * మా * ప్తం *

                                   

మిష్టరీ స్పాట్ - హిష్టరీ స్పాట్


శాంతా క్రూజ్ బీచ్


ఈ రోజు శనివారం , తేది 19/05/2013 . భోజనాల తర్వాత మిష్టరీ స్పాట్ కి , ఎస్ ఎఫ్ ఓ బీచ్ కి బయలుదేరాము. మధ్యాహ్నం 12.30 కి కారులో .  బీచ్ లో పిల్లలు యిసుకతో ఆడుకొనే సామగ్రిని దారిలో షాపింగ్ చేశారు . 1.36 కి చూపించే  షో కి టికెట్లు తీసుకున్నాడు . నగరం లోంచి కొండ పైకి వెళ్ళ్తుంటే , అంతా అడవులు , ఆ అడవులల్లో , ఆ కొండలలోనే అక్కడక్కడా కొన్ని యిళ్ళు , వంకర కంకర దారులు , పక్కనే ఎత్తైన వృక్షరాజాలు , ఇంకో వైపు పాతాళాన్ని ఙ్నప్తికి తెస్తున్న లోతైన లోయలు .

ఈ మధ్యలో కామెడీగా నా చిన్న మనుమడు  చిటికెన వేలు చూపిస్తూ హడావుడి చేశాడు .దిగిన వంటనే అప్పటికే 1.40 దాటింది , అయినా రెస్ట్ రూం ఎక్కడా అని ఆ ప్రయత్నం అప్రయత్నంగా జరిగిపోయింది .
 చిటికెన వేలు కున్న స్పెషల్ గుణం , ఒకడు మొదలెడితే వరుస అందరికీ అంటుకుంటుంది అంటువ్యాధిలా . వ్యాధి అన్నానే కాని ఆ పని పూర్తి అయింతర్వాత హాయిగా  ఫీలయ్యం అందరం . అప్పుడే అనిపించింది వదిలించు
కోవటంలో ఇంత ఆనందం వుంటుందని .

మిష్టరీ స్పాట్ షోకి రెడీ అయ్యాము . ఏపుగా పెరిగిన వృక్షరాజాలు ఏటవాలుగా కనపడ్తున్నా అవి క్రింద పడవు ,
పడేటట్టుగా ఉంటాయి . ఆ తర్వాత పైకి వెళ్ళాము అనటం కన్నా , ఎక్కామంటేనే బాగుంటుంది . అక్కడ ఒక బల్ల ఒకవైపు ఎత్తు , ఇంకోవైపు పల్లం బాగా కనపడ్తుంటుంది .

దాని మీద ఎత్తైన ప్రదేశంలో ఒక బంతి పెడితే అది పల్లం వైపు జారకుండా అక్కడే ఉండిపోయింది . ఆ తర్వాత అదే బంతిని పల్లం వైపు నెట్టింది . అది అక్కడ ఉండకుండా ఎత్తుగా వున్న వైపు పరుగున వచ్చి అక్కడే నిలిచింది .
ఆ తర్వాత నా పాకెట్ లోని కలం తీసుకొని ఎత్తు వైపు ఉంచింది . అది నిశ్చలంగా అక్కడే వుండిపోయింది . మఱల పల్లం వైపు అదే కలాన్ని క్యాప్ లేకుండా పల్లం వైపు క్రింద వైపు పెట్ట్టింది .ఆ కలం పల్లం వైపు ఉండకుండా ఎత్తు వైపు వచ్చి అక్కడ నిలిచింది . చివరగా నీళ్ళు పల్లం వైపు పోస్తే అవి పల్లం వైపు పోకుండా మెఱక వైపుగా పైకి వచ్చాయి . ఇదేమి మంత్రం కాదు , తంత్రం కాదు . అదే మిష్టరీ స్పాట్ . భూమ్యాకర్షణ శక్తి ఆ పల్లం వైపు తక్కువ , మెఱక వైపు సరిగ్గా వుంది .

ఆ తర్వాత అక్కడ ఓ చక్కల గదిలోనికి అడుగుపెట్టటంలోనే యిబ్బందితో కూడిన విషయమే .ఆ గది ఏటవాలుగా ఉంటుంది . అడుగులు వేయటమే కష్టం . అక్కడ వంగినా పడిపోము . ఫొటోలు కూడా తీసుకున్నాము . నిజమే అందులో అబధ్ధమేమీ లేదు అన్న నిర్ధారణకు వచ్చాము .

ఈ మొత్తానికి 45 నిముషాల నుంచి 60 నిముషాల వరకు సమయం పడ్తుంది .

అటుపిమ్మట వెంట తీసుకొచ్చుకున్న ( మన ) పులిహోర అందరం లాగించాము . లోడింగ్ అయింతర్వాత అన్ లోడింగు సర్వ సహజమే కదా ! ఆ దిశగా అడుగులు వేశారు కొందరు . . అర్ధగంట అయింతర్వాత బయలుదేరాం ఎస్ ఎఫ్ ఓ బీచ్ కి . 20 నిముషాలలో చేరుకున్నాము . కారు పార్కింగ్ చేసి , ఎక్స్పోజ్ అయ్యే శరీరాన్ని సన్ స్క్రీన్ లోషన్ స్ప్రే పూసుకొని యిక బీచ్ ఒడ్డుకి చేరుకున్నాము .

మనమేమో మన శరీరం ఎక్కడ నల్లబడిపోతుందోనని సన్ స్క్రీన్ లోషన్ పూసుకొని బీచ్ వద్దకు వెళ్తుంటే , ఇక్కడ అమెరికన్లు ఒంటిమీద గుడ్దపీలిక లాంటివి అడ్డం పెట్టుకుని సన్ బాత్ చేస్తున్నారు బోర్లా పడుకుని . అలా అందాలారబోస్తున్నారు చాలామంది . వాళ్ళను చూసేమో సముద్రం కూడా నురగలు కక్కుతూ , ఉరుకుల పరుగులు తీస్తూ , పలకరించి పోతున్నది . ఆ దృశ్యాలను కెమేరాతో చిత్రీకరించాము .

ఎంత వైవిధ్యం ఇండియా వాళ్ళకి - అమెరికా వాళ్ళకి . ఇండియాకి , అమెరికాకి అన్ని విషయాలలో తేడానే .

7 గంటలకు రిటర్న్ బయలుదేరి , గ్రాసరీస్ తీసుకొని 8.30 కి ఇంటికి చేరుకొన్నాము .

                                                                        *********

కొంచెం ఎఱ్ఱన, యింకొచెం నల్లన, మఱింత తెల్లన

                                                    

                                                                                                                           కవితా రచన : శర్మ జీ ఎస్


భూభాగం అధికమే
భూతల స్వర్గసీమే       

వాతావరణం చల్ల చల్లన
పర్యావరణం పచ్చ పచ్చన

భవనాచట అందమైన  ఆకృతులు
అచట ప్రకృతి ఒలుకు అందాలు 

భవనాల అమరికకు అమెరికా
ఇళ్ళ ముంగిట అందాలకు అమెరికా

పగలు పొద్దు ఎక్కువే
సెగల పద్దులు తక్కువే

ప్రతాపాన్ని చూపడు సూర్యుడు
ప్రకాశాన్ని అందంగా అందిస్తాడు

జనాభా మాత్రం అల్పం
వనరులు మాత్రం అధికం

చూడబోతే ఒళ్ళు కొంచెం  నల్లన , 
యింకొచెం ఎఱ్ఱన , మఱెంతో తెల్లన

ఎవరిని చూసినా భారీ కాయాలే
ఏ ఫలం చూసినా భారీ విత్తనాలే

చూడటానికి హైబ్రీడ్
నిజానికదే  అసలు సీడ్

పక్షుల జీవితాలే వాళ్ళ సంస్కృతికి  పునాది
చక్షువులకందని భవనాలకు ఇక్కడే నాంది

రెక్కలొచ్చేంత వరకే సృష్టించిన వారాధారం
ఆ పై కాకూడదు వారెవ్వరికీ భారం

భార్యాభర్తల బంధాలు కావు వాళ్ళవి
భాగస్వాముల సంబంధాలే వాళ్ళవి

ఈ మానవ జన్మ జీవనం పయనమే

ఎక్కి , దిగే ప్రయాణీకుల  వైనమే

కలిసి చెయ్యబోరు కడదాకా ప్రయాణం

తెలిసినా చేసుకోరు ఆత్మవంచన

పువ్వులు కొమ్మకే అందం
నిజమేనని ఒప్పుకొందాం

అందాలని ఆనందంగా ఆరాధిస్తారు
అందమైన పూలచెట్లను పెంచేస్తారు

దుమ్ము , ధూళి ఎలా వుంటుందో 
తెలుసుకొనాలంటే ఇండియాలోనే

ఎక్కడా కనపడదు అణువంత పొల్యూషన్
రహదారులే దానికి  అసలైన సొల్యూషన్

ఏ దారులు చూసినా రహదారులే కదా
బారులు తీరిన కారులే కనువిందే కదా !

అధిరోహిస్తారు పర్వత శిఖరాలని
అవరోధిస్తారు విగ్రహారాధనని

అందినదానితో ఆనందిస్తారు

అందనిదానికి అఱ్ఱులు చాచరు

వాడనే వాడరు గీజర్లు
వాడి తీరుతారు హీటర్లు 

ఉద్యోగాలు వైట్ కాలర్సే
సంపాదించేవి మోర్ డాలర్స్

ఏ పని చేయటానికైనా ఫీలవరు అవమానం
అదే జీవన పురోగమనానికి అసలు కొలమానం

కానరాదు ఎక్కడా ఒక్క చిన్నదోమైనా 
తెల్లదొరలు కనపడతారెక్కడైనా 

లంచం యిచ్చినా  పుచ్చుకున్నా నేరమే  
పట్టుకుంటే  జీవితం ఘోరాతి ఘోరమే

వాళ్ళ కొఱకే వాళ్ళు బ్రతుకుతారు 
ఎవరి మీద ఆధారపడనే పడరు 

పడుచుతనం అండగ ఉండగ
వృధ్ధాప్యానికి దసరా పండగే

వాళ్ళకు కడదాకా తోడు డాగ్ 
వాళ్ళకు లేనే లేడు గాడ్

లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్
రైట్ సైడ్ డ్రైవింగ్

ప్రాణానికి విలువెక్కువ
పర నాణానికి విలువ తక్కువ

నిర్మాణంలో వారికి వారే సాటి
వారికి లేనే లేరు ఎవరూ పోటీ 

బహుళ అంతస్థుల భవనాలకు అమెరికా
బహుళ జాతి జీవనానికి ఆలవాలం అమెరికా

********

మల్లెలు


          
                                                        
మల్లెల తెల్లదనం
మనసులోన కమ్మదనం
వలపులోన గొప్పదనం
కుఱ్ఱకారుకి ఇంధనం
సువాసనల సుగంధం
నూతన జంటకు 
వలపుజల్లులు 
కురిపిస్తాయి
మురిపిస్తాయి
మత్తెక్కిస్తాయి
మరిపిస్తాయి
మైమరిపిస్తాయి.

    *****

చిత్రం , విచిత్రం , భళారే చిత్ర విచిత్రం


రోజుకి 24 గంటలు  ,

అదే  రోజు , 

కొంతమంది పుట్టిన రోజు ,
ఇంకొంతమంది గిట్టిన రోజు , 
పసివాళ్ళకు నామకరణం చేసిన రోజు,
మరొకరికి బడిలో వేసి బలపం పట్టిస్తున్న రోజు , 
స్కూల్లో అడుగెట్టిన రోజు,
రజస్వల అయిన రోజు,
ఇంకొకరికి ప్రేమ పుట్టిన రోజు,
ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న ప్రేయసి ఎస్ అన్న రోజు,
వేరొకరికి  పెళ్ళి ఖాయమైన రోజు, 
ఇరువురికి ప్రధమ సంగమం రోజు, 
గర్భధారణ నిర్ధారణ అయిన రోజు,
మిసిమి కాంతుల పసివారిని ప్రసవించిన రోజు ,
అత్తగారింటిలో కాలు మెట్టిన రోజు, 
కొత్తగా కాపురం పెట్టిన రోజు,ప్రేమ విఫలమైన రోజు,
చదువుల్లో ఉత్తీర్ణత సాధించిన రోజు ,
ఉద్యోగం పొందిన రోజు , 
ఉద్యోగంలో ప్రమోషన్ లభ్యమైన రోజు,
ఇంటి అజమాయిషీ చేతికొచ్చిన రోజు, 
దోమలు దొంగల్లా వాలి దొరల్లా దోచుకొంటున్న రోజు,
దొంగలు దొరల్లా పట్టపగలే (దాచుకున్నదంతా) దోచుకొంటున్న రోజు, 
జానెడు పొట్ట కొరకు ఎల్లలు దాటుతున్న రోజు,
కడుపు తీపి కొరకు అవయవాలను అమ్ముకుంటున్న రోజు,

ఎన్నాళ్ళగానో పడక మీదనే గడిపిన రోగులకి ,
ఆఖరి ఘడియలుగా నిర్ధారణ చేయబడ్డ రోజు, 

ఇలా ఇలా చాలా చాలా జరుగుతున్నవన్నీ,
ఆ రోజులోనే , ఆ 24 గంటలలోనే .

తూర్పునే అవుతున్నది సూర్యోదయం,
ఆవలి తీరాన , అదే పశ్చిమాన అస్తమయం ,
కాల నిర్దేశానికనుకూలంగా అయింది చంద్రోదయం 

వివేకానందుడు విదేశాల్లో ఙ్నానోదయ బోధలు చేసినా ,
రామకృష్ణ పరమహంస ప్రబోధాలు చేసినా,
మహావతార్ బాబా చిరంజీవిగా చిరస్మరణీయమైనా ,
షిర్డి సాయిబాబా జీవుడి నుంచి దేవుడిగా మిగిలినా ,
యేసు మానవుడిగా పుట్టి , దానవుల బారిన పడినా ,
ఆ రోజులోనే , ఆ 24 గంటలలోనే ,
ఇలా ఇలా చాలా చాలా జరుగుతున్నవెన్నో .


మార్పు కాలంలో లేదని , 
మొత్తం మీద మన భావనల లోనే .


మనం మాత్రం , ఏ పని చేయాలన్నా ,
టైం లేదంటూనే అనుకొంటుంటాం ఎప్పుడూ
చిత్రం , విచిత్రం , భళారే చిత్ర విచిత్రం కదూ ! .


      *********

కెవ్వు... కేక మళ్ళీ

ఆ కోడి అందాకా  ఆతడి చంకలో పిల్లాడికి మల్లే ,
గారాలు పోతున్నది , సరాగాలు పలుకుతున్నది ,
కోడిని సమీపించాడు దుకాణాదారుడు , 
కాళ్ళను కట్టేసి పై కొక్కానికి తగిలించాడు  .

ఆతడి ఎడమ చేతి వేళ్ళలో ఆ కోడి కాళ్ళు ,
నేలపై బిత్తర చూపులు చూస్తున్న ఆ కోడి కళ్ళు ,
ఆ నాటు కత్తి , ఎదురుచూస్తున్నది వేట్లకై ,
ఆతని కష్టమర్లు ఆనందిస్తున్నారదో ఆటగా .

ఇన్నాళ్ళూ మీ బ్రతుకులు  నాతోనే తెలవారాయి ,
నేడు నా బ్రతుకే చీకట్లో చిక్కుకుపోతున్నదే ,
రేపు నా కేక మీకు వినిపించలేమోనన్న సందేహం ,
రేపటి వెలుగు నేనిక చూడలేమోనన్న భయం ,
ఈ కిరాతకాన్ని ఆపి , నాకిచ్చేవారెవరూ లేరా  అభయం ,
అదేపనిగ ఆపకుండా కొక్కొరొకో అని అరుస్తున్నది ,
మెడపై కత్తి వేట్లకి ఆ కోడి ఆఖరి కేక ,
కెవ్వుమంటూ చరిత్రలో మిగిలిపోయింది .

                           *******

శృంగారం బంగారమా ? అంగారమా ?


                                                                                         
                                                                                                                             కధా చన : శర్మ జీ ఎస్                                
ఆ బజారులో  క్షణం క్రితం కనపడిన వారు , మరుక్షణంలో మాయమవుతున్నారు . ప్రతి ఇంటి  గేటు ముందు ఆడా,
మగా కాని మాడా జాతి వారు నుల్చొని కనపడిన ప్రతి మగవారిని ( వయసుతో నిమిత్తం లేకుండా )  "
"   రండి బావగారూ , రండి అక్క మీ కొరకే ఎదురు చూస్తున్నది "   సాదరంగా ఆహ్వానిస్తున్నారు .
కొంతమంది లోపలకి వెళ్తుంటే , మరి కొంతమంది బయటకు వస్తున్నారు.అలా ఆ బజారులో వెళ్తున్నవారిని 
ఎవరూ గుర్తుపట్టలేరన్నట్లు , అచటి వీధి దీపాలు మసకవెల్తురుని అందిస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి .
పేరు పొందిన ఫేమస్ కంపనీ ఓనరుగా చలామణీ అవుతూన్న ఓ నలభై అయిదేళ్ళ నడివయసు నాంచారమ్మ  నోట్లో కారా కిళ్ళీని బాగా కుక్కుని, కస కస నములుతూ , పుసుక్కున ఆ పక్కనే వున్నడస్ట్ బిన్ లో ఉమ్ముతూ, లోనకు వస్తున్న వారిని తనదైన బాణీలో "   రండి అల్లుడు గారూ , రండి "   సొంత అత్తలా ఆ హ్వానిస్తున్నది .

ఆమె పైకి అసహ్యంగా అగపడ్తున్నా , తన అవసరానికి తగ్గట్లుగా, తన మనిషిగా ఫీలవుతూ తమ పని పూర్తి 
చేసుకొంటున్నారు. మంతనాలు చురుగ్గా సాగుతుండటంతో , అంతదాకా ఒంటరిగా వున్న అమ్మాయిలు జంటలై 
లోపలకి వెళ్తూంటే , ఇంకొంతమంది జంటరానిదే తమ పంట పండదన్నట్లు , కళ్ళల్లో వత్తులు వేసుకుని
అందరికంటా పడ్తూ అచటే తారట్లాడుతున్నారు .

అందరి ఆ బాటలో తను నడుస్తున్నా, తన లక్ష్యమే వేరు . తనని చూసిన నాంచారమ్మ , తనని కొత్త పాసెంజర్ గా గుర్తించి , ఆడా మగా కాని మాడా నుద్దేశించి "  ఒరేయ్ కొత్త అల్లుడుగారువస్తున్నారు , అన్నీ సిధ్ద్ధం చేయండి " అంటూనే "  రండి అల్లుడుగారూ,రండి ", తను లేచి సోఫానుదులుపుతూ , కూర్చోమన్న్నది .

"   నేనూ ఆ అందరిలాగానే ( నా పని నాక్కావాలి ఎలా పిలిస్తే నాకేటి అనుకున్నవాడినై ) ఓ అమ్మాయి
కావాలి "   అన్నాను .

"   ఓ అమ్మాయేంటి అల్లుడుగారూ , వీళ్ళందరూ మీ వాళ్ళే , అంతే కాదు , ఎవరు కావాలంటేవారు ,ఎలా అంటే అలా "   అంటూనే "   ఏ వాసంతీ , చామంతీ , పూబంతీ, ప్రశాంతీ రండే , మీ బావగారట , ఎవరి బావగారో నాకు తెలియదుగా ,  బాగా చూసుకోండి,  తీసుకువెళ్ళి , మరదలుగా మీ మర్యాదలు బాగా చేయండి, ఏ లోటూ రానీయకండి "   నాంచారమ్మ .

ఔట్ పోష్ట్ వద్ద సిగ్నల్ కొరకు నిరీక్షిస్తున్న ట్రెయిన్ సిగ్నల్ చూడగానే  ప్లాట్ ఫారం వైపు నడక సాగించినట్లు
మరుక్షణంలో మరులు గొల్పే మల్లెలతో కొంతమంది , విరజాజులతో మరికొంతమంది వయ్యారపు నడకల్తో
దర్శనమిచ్చారు .
ఇదంతా నాకు కొత్తగా ఉండి అలా చూస్తుండిపోయిన నన్నుచూసి "   అల్లుడుగారు ఫేస్ ఛాయిస్ మీది , రేట్ వాయిస్ నాది .  ఆ పై ఓ ఎస్ అనటం  మీదే "   అన్నది .

చూడటానికి అందరూ బాగున్నా , నా  పర్పజ్ కి వీళ్ళెవ్వరూ కాదని , "   ఇంతేనా నీ సరుకు,  ఇంకా ***** ? "

"   నా సరుకును శంకించకండి అల్లుడుగారు , మీరెంతకైనా రెడీ అయితే , నేను రెడీ "   అన్నది .

గుండె గుభెలుమన్నట్లు, దీనితోనా నేను చివరికి.  తను వచ్చింది అందరిలా తాపం తీర్చుకోవటానికి కాదుగా .స రసమైన శృంగారాన్ని అద్భుతమైన కధగా మలచటానికి . ఛీ ఛీ అని మనసులో అనుకొంటూ , పైకి మాత్రం "   నీకూ , నాకూ ఉజ్జీ కాదుగా, అందుకే  వయసు వాళ్ళనే చూపించు ఉజ్జీ సరిపోతుంది ".

"  అల్లుడుగారు మాంఛి రసికులే. పొంకం , బింకం ఉన్నదానికి వంకలు పెట్టే పని లేనట్లు , నాణ్యతనుబట్టి
సరుకుంటుంది. నలుగురి క్షేమం కోరే నక్సలైటు నలుగురి కంటా పడనట్లే , మా కాన్సెప్ట్ కూడా . నలుగురి
ఆనందాల కొరకు, నలుగురిలోకి రాకుండా , షో కేసు బొమ్మల్లా లోపలే భద్రంగా ఉంచబడతారు .అవసరమైనపుడు
మాత్రమే ఆ బొమ్మలు అడుగులు వేస్తుంటాయి .ఆ మెట్ల గది పక్కన కనక,ఆ ప్రక్కన మేనక,అయిదే అయిదు వంద నోట్లు .అటు పినాకిని , ఇటు మందాకిని మూడే మూడు వంద నోట్లు " అంటుండగానే , పాసెంజర్స్ కొఱకు ఎక్స్ ప్రెస్స్ లా  వచ్చి , సూపర్ ఫాస్ట్ లా వెళ్ళిపోవటం క్షణాల్లొ జరిగిపోయింది .
                         
"   ఆశ్చర్యపోకండి అల్లుడుగారు, అదంతా రిజర్వేషన్ల ప్రభావం "   అన్నది .

"   ఏమిటీ ? ఇక్కడ కూడా , రిజర్వేషన్ల ప్రభావం అంతగా పాకిపోయిందా ! "

"  ఇక్కడే కాదండి అల్లుడుగారు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ చూసినా , ఏం చేసినా రిజర్వేషన్ల ప్రభావంతప్పనిసరి . ఇదంతా కాల పెభావం లెండి   ."   

సాని కూడా సత్యాలు పలుకుతున్నదే అని మనసులోనే అనుకొని , "   తాజా సరుకేమీ లేదా , అంతాఅరిగిపోయిన వాళ్ళని చూపిస్తున్నావ్ ?

"   లేకేం , తాజా తాజా , మజా మజా . నా కాడ తప్ప మరెక్కడా తాజా సరుకు దొరకదు  . కాకుంటే ఇంకాట్రాక్ లో పెట్టలా !"

"   ఏం దూరంగా ఉన్నదా? "
       
"   దూరాలు అంటూ ఏమీ మాకుండవు . మేం దూరంగా ఉంటే మా దగ్గరకే ఎవరూ రారు . 24 x 7 అండ్365 రోజులు అందరికీ దగ్గఱగానే ఉంటుంటాం. మేం పెజా సేవ చేసుకునే వాళ్ళం . మాది ఎమర్జెన్సీ సర్వీస్ కాడర్ కింద వస్తుంది . వాళ్ళకు  అసౌకర్యం కలిగించటం మాకు మనస్కరించదు . మీ ఆనందమే మాఆనందం , సర్దుకుపో. ఇయ్యాల పొద్దుటాలనే వచ్చిందో కొత్త గుంట . రేపు మీ కాతాలో జమ చేత్తగా . ఈయాలకి యీళ్ళతో సదురుకో. వీళ్ళు మాంఛిగ అన్నీ ఉన్నోళ్ళే . నీమీద ఒట్టు ".

తనను రెగ్యులర్ కష్టమర్ని చేసి రెన్యువల్ చేయించాలనుకుంతున్నట్లున్నది. అసలు తనకీ అవసరం  శృంగార
కధ రాయటానికే కాని , శృంగారంలో మునగటానికి కాదుగా .

"   సందేహించకండి , రేపటికీ ఆ గుంట కొత్తగనే ఉంటుంది . చెక్కు చెదరదు , పావడా పాడవదు  . నా మాట
నమ్మండి . ఆ గుంటకి బోణీ మీతోనే . ఈ కంపెనీకి వచ్చిన ఏ కొత్త గుంటలకైనా మొదటి రాత్రి నా పెనిమిటేతో
జరగాల్సిందే . అది మా కంపెనీ రూల్స్ . వాడి వయసు 60 పైనే , ఓణీ తీసి చూస్తడే తప్ప , బోణీ సేయలేడు .
ఈ ఒక్కరోజుకి ఎవరో ఒకరితో సదురుకుపోండి " బతిమలాడుతున్నది .

ఇంతలో బయటనుండి హడావుడిగా "   అత్తమ్మా ,అత్తమ్మా , ఈయాల మామకి నలత గుందట , రేపు వత్తడట .
నానే లగెత్తుకుంటా వచ్చా , ఈ యాల మరెవరినైనా బుక్ చేసుకొంటావని . మరి నాకేదైనా యివ్వవూ "
అన్నాడు ఆ మాడా .

"   ఇదుగో ఇంద వంద తీసుకో " , ముందుకు వంగి ముద్దు కూడా ఇచ్చి , " అల్లుడుగారూ మీ అదురుట్టమే
అదురుట్టం , ఎదురుగొట్టంలా ఎకాఎకీ పైపైకి ఎగబాకుతుండాది . మరింక ఆలస్యం సేయకండి . మదాలసని అదే
ఆ కొత్త గుంటని తీసుకెళ్ళండి . "

"   ఆ పిల్ల వద్దు గానీ , మరో మాంచి పిల్లని చూడు ."

"   భరించేది మీరు , తరించేది ఆ పిల్ల , మధ్య నాకేంటి ?"

"   సరే సరే త్వరగా పంపించు . మళ్ళీ టైం సరిపోదు ."

"   ఏం పరవాలేదు , ఫ్రియంవదా ! మీ బావగారికి ఏ లోటూ కలుగకుండా చూసుకో ."

మరుక్షణంలో షిఫాను శారీతో , పద్దెనిమిదేళ్ళ ప్రాయపు ప్రియంవద ప్రత్యక్షమై , "   రండి బావగారు రండి "
గదిలోకి తీసుకు వెళ్ళింది . రూం అంతా  సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నది . మరుక్షణంలో తలుపులు
ఆలు మగలులా కరుచుకు పోవటంతో గాభరాగా వెనుతిరిగి "   ఆటోమెటిక్ సిష్టమా ? "   అడిగాను .

"  కాదు గాని మాకలవాటైన సిష్టం . పోలీసులొచ్చినా తెలియకుండా వుండేందుకని బయట తాళం వేస్తుందట
మా పెద్దమ్మ భయమెందుకు ? "

"   మీకు ఆ పోలీసులకు వాటాలుంటయటగా ? "

"  వాటాలుంటాయన్న మాట నిజమే , కానిస్టేబుల్స్ కే కాని , ఎస్ ఐ లకు గాని , ఎస్ పి లకు గాని ఉండదు .
వాళ్ళ సర్ప్రైజ్ చెక్స్ డిటైల్స్ మాత్రమే మాకు ముందుగా తెలియజేస్తారు ఆ కానిస్టేబుల్స్"  నా మీద చేయి వేసి
బాత్ రూం అక్కడ "   అన్నది .

ఏ మాత్రం పరిచయం లేని ఆ ( డ ) పిల్లకి అంత చేరువ అవటం , ఆ స్పర్శలో మునుపెన్నడు ఎరుగని ఓ అనుభూతి .  కాళ్ళకు నీళ్ళిచ్చింది .

"   పంపులో రావా "   అనగానే ,

"   వస్తాయి కాని నాకు సేవ చేసే అవకాశం రాదుగా ",తువాలిస్తూ అన్నది . లోషను యిచ్చింది .

ఈ మర్యాదలు  చూస్తుంటే సంప్రదాయ కుటుంబం నుంచి పొరపాటున యిచటకు వచ్చిందేమో అనుకున్నా .

ఫ్రెష్ అప్ అయి లోషన్ రాసుకుంటుండగా, డియోడ్రంట్ తో తను నా చెంత చేరి, నా షర్ట్ బటన్స్ తీస్తుంటే, స్ప్రే
కనుకున్నా. సహజంగా డ్రెస్స్ విప్పాలంటేనే , విపరీతమైన బధ్ధకానికి అలవాటు పడిన వాడిని అవటం వలన
వారించలేకపోయాను . కప్ బోర్డ్ తెఱచి , లుంగీ తీసి యిచ్చింది .

 "  లుంగీతో నాకు పనిలేదు ". 

"   డైరెక్ట్ గానా ? ఇరువురకి యిబ్బందే . మార్చుకొంటే మహా బాగుంటుంది ". 

"   నేనా పని మీద రాలేదు . ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను ".

"   డిపార్ట్ మెంట్ నుంచా ? "   భయంగా అడిగింది తను .


" లేదు అపార్ట్ మెంట్ నుంచి ."
 నా మాట మీద నమ్మకం చిక్కినట్లు లేదు తనకు .

భయంగా " మర్డర్ ఎంక్వయిరీనా ? నేనా రోజు లేను . నేను యిక్కడకు వచ్చిందే నిన్ననే .  నన్నందులో
యిరికించకండి , నాకేం తెలియదు ."

"  నిన్నిరికించటమా ? నువ్వు నన్నెందులో యిరికించకుండా వుంటే చాలు . అయితే నేననుకున్నట్లు నువ్వు
ఫ్రెష్ అన్నమాట . కంగారు పడకు . ఎంక్వయిరేకే వచ్చా , కానీ ఆ మర్డరు గురించి కాదు , మదనుడి గురించి .
నీ సహకారం చాలా అవసరం సుమా ! "

"  అయితే శృంగారం లోనా ! బంగారంగా యిస్తాను . మీరెలా అంటే నేనలా . ఈ రాత్రికి నా రేరాజు మీరే .మీ రేరాణిని నేనే ".  అరమోడ్పు గన్నులతో క్రీగంట చూస్తూ , పెదవిని కొరుక్కుంటూ నాకు దగ్గర అవుతుంటే , ఆ చూపులలో అంత మత్తుంటుందని  అపుడే తెలుసుకున్నాను .

"  నీ తనువుని నా కనువుగ అమర్చు "లైట్స్ ఆఫ్ చేయబోయింది ."

"   ఉండనీ "   అన్నాను .

"   ఎంతైనా మీరు మగవారు గదా ! "   ఆన్నది .

"  అందుకే కదా , యిక్కడకు వచ్చింది . సందేహమా ? "

"  మాకు సందేహాలతో పని లేదు . అయినా , కాకున్నా మా పని మేం చెయ్యాల్సిందే ,"   అంటూ లైట్స్ ఆపబోయింది మళ్ళీ .

"  లైట్స్ ఆఫ్ చేస్తే నా కధెలా సాగుతుంది ? "        

"   నా కధ అనకండి , మన కధ నే నడిపిస్తాగా !  అసలు కధ అపుడే మొదలవుతుంది . మసక మసక చీకటి మదనుడికి అదనుగా ఉంటుందట . ఆంత చీకటిలోకూడా శృంగారం బంగారంలా నెంబర్ 1 లా దూసుకు పోతుంది.  కొత్త అంటున్నారు కనుక , మీరు ఏం చేస్తున్నారో మీకూ తెలియాలి గనుక , జీరో ఆన్ చేస్తా . ఆ తదుపరి ఆ జీరోనే
మన కధకు మూలమై అసలు కధనంతా నడిపిస్తుంది. ఆ జీరో లో ఆ జీరో కి హీరో మీరే "   అన్నది.

ఆ సరికే చాలా సమయం ఇంతదాకా వచ్చేటందులకే సరిపోవటం వలన ,"   ఇంక  ఆలస్యం చేయకు "   అన్నాను .

మిగిలిన కధ నేనే పూర్తి చేయాలనుకొని "   బాగా పొద్దుపోయింది , యింక విశ్రమించు "   అంటూ అక్కడ నుంచి
లేవబోయాను .

"   శ్రమ పడకుండా విశ్రమించే అలవాటు మాకు లేదు . మీరు నా నుంచి ఇంతవరకు తీసుకున్నారు . మరి నాకేమీ
యివ్వరా ! మీ తీపి గురుతుగా "   అంటూ మీద వాలింది .

"  యిపుడు కాదులే , మరో మారు యిస్తాలే ".

"  మరో మారా !  నాకు నమ్మకం లేదు . మాకూ బదిలీలు ఉంటాయి . మమ్మల్ని ఒక్క చోటే పర్మనెంట్‌గా వుంచరు  .
అలా వుంచితే , పాసెంజర్స్ తో పాస్ బుక్ లు ఓపెన్ చేస్తామేమోనని , పర్మనెంట్ లావాదేవీలు జరుపుతామేమోనని ,
పోలీసుల దృష్టిలో పడిపోతామన్న సందేహాలతో మారుస్తుంటారు . మా పెద్దమ్మకి ఈ ఇండియా లో చాలా బ్రాంచీలు వున్నాయి . అందుకే యిపుడే యిచ్చేయమంటున్నా".

"  ఇపుడు తెచ్చిందంతా మీ పెద్దమ్మకే యిచ్చా ."

"   ఆమెకిచ్చినది నా కఖ్ఖర్లేదు . ఆమె కీయనిది నాక్కావాలి  ."

"   ఇంక నా వద్ద ఏమీ లేదుగా . ఇంక మిగిలిన కధ పూర్తి చేయాలి .  హాయిగా పడుకో ."

"  నే లెకుండా మిగిలిన కధ ఎలా పూర్తవుతుంది ? ఆ మిగిలిన కధ పూర్తి చేయమనే నేనూ మిమ్మల్ని రిక్వెష్ట్
చేస్తున్నా" . కళ్ళు నులుముకొంటూ , "   అబ్బకళ్ళల్లో నలుసు పడ్డది . ఒకటే యిదిగ తొలుస్తోంది. కొంచెం తీసి
వెళ్ళండి "   అన్నది .

 "   కళ్ళు నులుముకోకు . ఉండు , నేను తీస్తాను ."

బెడ్ మీదకి చేరి , యిరువైపులా చేతులుంచి , కళ్ళల్లోకి తొంగి చూస్తూ , బయటికి తీసే ప్రయత్నం చేశా .

పలు ప్రయత్నాలతో , తన కంటిలోని నలుసు పోగానే " హమ్మయ్య ఇప్పటికైనా పోయింది , హాయిగా ఉంది "
అన్నది .నాకెంతో ఊరట కలిగింది . నాకూ చెప్పలేని ఆనందం కలిగింది .

తెల తెలవారుతుండగా , మెల్లగా నా దుకాణాన్ని సర్దుకొని , నా రూం చేరుకొన్నాను .

                                                                      ****

డబ్బు బాంక్ లో వేయగానే వడ్డి రాదు , తాళి కట్టగానే భార్య గర్భవతి కా(రా)దు  అన్నట్లు, ఏ కధల పోటీ కైనా
వెంటనే ఫలితాలు తెలియవు. కత గురించి ఆపి , నీకొచ్చిన ఈ కలత గురించి బాగా ఆలోచించు అన్న మనసు
హెచ్చరికతో డాక్టర్ని  కలవక తప్పలేదు .
విద్యలో పరీక్షల తర్వాతనే ఫలితాలు చెప్తున్నట్లు , ఈ డాక్టర్లు కూడా పరీక్షలు చేయనిదే ఏమీ చెప్పలేం , అటు
పడుకో , యిటు పడుకో అంటూ పరీక్షలు చేసి ,  "  చూడబ్బాయ్ , శృంగారం నువ్వు అగ్నిసాక్షిగా కట్టుకున్న
భార్య దగ్గరే బంగారం . మఱెవ్వరితో నైనా అయితే ఆ శృంగారం అంగారం  లా మంటలు రేపుతుంది .
వ్యాపారస్తుడు ఎప్పటికప్పుడు ఎంత పొద్దెక్కినా , బేరగాణ్ణి  చూసి మీదే బోణీ అన్నట్లు, సాని కూడా ,పాసెంజర్ని
చూడగానే , నేనింతదాకా కన్యనే , ఆది నమ్మటం మన తప్పు .
అనుభవాన్ని జోడించి కధ వ్రాస్తే టాప్ ప్రైజ్ కొట్టేయొచ్చని భావించటం పొరపాటే . ఆన్ని పత్రికల వాళ్ళు సంవత్సరం
పొడవునా పోటీలు నిర్వహిస్తూనే వుంటుంటారు .
ఆనుభవం జోడిస్తే , కధ రక్తి కడ్తుందని , కధ కధకి కొత్తదనాన్ని అందించవచ్చని , మాటి మాటికీ  వాడభామలను
కలిసొస్తే , ప్లస్ అవుతుందన్న మాట దేవుడెరుగు, అసలుదే లెస్ అయిపోతుంది . కధ రక్తి కట్టకపోగా , రతికే
పనికి రాకుండా పోతావ్ .  పైకి సుఖాన్నందిస్తున్నట్లు కనపడ్తూ , లోపల రోగాన్ని అందించేది కోణంగే కాని
అర్ధాంగి ఎప్పటికీ కానేరదు అని బాగా అర్ధం చేసుకో. ఎప్పుడో వచ్చే బహుమతి మాట అటుంచు, రేపొచ్చే నీ
శ్రీమతిని మరువకు .ఆ ఆనందాల్ని అందించాలి . మరెపుడూ మదనుడిపై యిలాంటి ప్రయోగాలు చేయకు .ఈ మందుల చీటీ తీసుకువెళ్ళి ఆలస్యం చేయకుండా వాడు .

కధ పోష్టు చేసిన నాటి నుంచి , ప్రైజ్ లెటర్ అందుకుందామని ఎదురుచూసిన నాకు డాక్టర్ సర్ ప్రైజ్ న్యూస్ వినగానే ,
బాగా అర్ధమైంది .కధ కల్పితమే గాని , వాస్తవం కాకూడదు . ఈ వాస్తవాన్ని ఎన్నడూ మరచిపోకూడదు , ఓ వేళ
మరచిపోతే , ఆ కధ బాధగా రూపాంతరం చెందుతుందని  తెలుసుకొన్నాను .

         

                                                         **  ** మా ** ప్తం **                                                                                                                               "