నేస్తం , ఓ నేస్తం                                                

నేస్తం  
ఓ నేస్తం 
నాటినుండి , నేటివరకు 
వ్రాస్తూనే ఉన్నావ్ ?
ఎపుడూ చూపించావుకాదే
ఏదీ , ఒక్కమారు చూడనీ
మరల మరల 
నిన్ను కదిలించనుగా

ఏమిటీ ?
మద్యలో వద్దంటావా !
నీవు చెప్పబోయేది వినమంటావా !
సరే చెప్పు నేస్తం

"  నా భార్య చూలాలని 
ఐదునెలలు గడచాయని
పసికందుని ప్రసవిస్తుందని
మనసు ఉవ్విళ్ళూరుతూ,
పసివానిని చూడాలనే 
తహ తహలో
నా భార్య పొట్ట కోసి చూస్తే
ఓ నరాల కండరాల ముద్ద  
చూడగలనా ? చూసి ఆనందం చెందగలనా ?
ఆ నరాల కండరాల ముద్దని 
మళ్ళీ పసికందుగా మార్చగలనా ?
ఇదీ అంతే నేస్తం 

పరిపక్వత రానిదే 
దేనినీ చూడకూడదు
స్వీకరించకూడదు
అర్థం చేసుకో "                     

    *******    

2 comments:

  1. కవితా వస్తువు అమోఘం...అద్వితీయం..నమోవాకములు..

    ReplyDelete