అదిగో - అద్గదిగో
పిల్లలను పీక్కు తినునట ,
వయసులోని పడుచువారిని ,
మొదట వలచునట ,
పిమ్మట ఒలుచుకొని తినునట ,

కనుగుడ్లు క్రికెట్ బంతులట ,
పన్నులు క్రికెట్ వికెట్టులట ,
కరములు అరటి ఊచలట ,
నోరు ఓ పేద్ద రేనట ,
పొట్ట ఓ పేద్ద పెట్టెట ,
కాళ్ళు కావవి చెట్ల మొదళ్ళట ,
గోళ్ళు కావవి వేళ్ళట ,

ఇది అంతా పుకారేనని తేల్చేశారట
పుకారు పుట్టించటమే  హాబీ అట 

అదిగో పులి అంటే ఇదిగిదిగో తోక అన్నచందం .


( అప్పుడప్పుడు మనం వింటుంటాం పుకార్లు . అటువంటి పుకారు రాక్షసి గురించి వ్రాసిన కవిత ఇది.)


1 comment:

 1. మీ పోస్ట్ చాలా బావుంది ,మంచి బ్లాగు , చాలా బావుంది ,

  మీకు వీలుచూసుకొని మా బ్లాగును కూడా చూడండి ,

  మీకు ధన్యవాదాలు ,

  http://techwaves4u.blogspot.in/
  తెలుగు లో టెక్నికల్ బ్లాగు

  ReplyDelete