చిత్రం , విచిత్రం , భళారే చిత్ర విచిత్రం


రోజుకి 24 గంటలు  ,

అదే  రోజు , 

కొంతమంది పుట్టిన రోజు ,
ఇంకొంతమంది గిట్టిన రోజు , 
పసివాళ్ళకు నామకరణం చేసిన రోజు,
మరొకరికి బడిలో వేసి బలపం పట్టిస్తున్న రోజు , 
స్కూల్లో అడుగెట్టిన రోజు,
రజస్వల అయిన రోజు,
ఇంకొకరికి ప్రేమ పుట్టిన రోజు,
ఎన్నాళ్ళో ఎదురుచూస్తున్న ప్రేయసి ఎస్ అన్న రోజు,
వేరొకరికి  పెళ్ళి ఖాయమైన రోజు, 
ఇరువురికి ప్రధమ సంగమం రోజు, 
గర్భధారణ నిర్ధారణ అయిన రోజు,
మిసిమి కాంతుల పసివారిని ప్రసవించిన రోజు ,
అత్తగారింటిలో కాలు మెట్టిన రోజు, 
కొత్తగా కాపురం పెట్టిన రోజు,ప్రేమ విఫలమైన రోజు,
చదువుల్లో ఉత్తీర్ణత సాధించిన రోజు ,
ఉద్యోగం పొందిన రోజు , 
ఉద్యోగంలో ప్రమోషన్ లభ్యమైన రోజు,
ఇంటి అజమాయిషీ చేతికొచ్చిన రోజు, 
దోమలు దొంగల్లా వాలి దొరల్లా దోచుకొంటున్న రోజు,
దొంగలు దొరల్లా పట్టపగలే (దాచుకున్నదంతా) దోచుకొంటున్న రోజు, 
జానెడు పొట్ట కొరకు ఎల్లలు దాటుతున్న రోజు,
కడుపు తీపి కొరకు అవయవాలను అమ్ముకుంటున్న రోజు,

ఎన్నాళ్ళగానో పడక మీదనే గడిపిన రోగులకి ,
ఆఖరి ఘడియలుగా నిర్ధారణ చేయబడ్డ రోజు, 

ఇలా ఇలా చాలా చాలా జరుగుతున్నవన్నీ,
ఆ రోజులోనే , ఆ 24 గంటలలోనే .

తూర్పునే అవుతున్నది సూర్యోదయం,
ఆవలి తీరాన , అదే పశ్చిమాన అస్తమయం ,
కాల నిర్దేశానికనుకూలంగా అయింది చంద్రోదయం 

వివేకానందుడు విదేశాల్లో ఙ్నానోదయ బోధలు చేసినా ,
రామకృష్ణ పరమహంస ప్రబోధాలు చేసినా,
మహావతార్ బాబా చిరంజీవిగా చిరస్మరణీయమైనా ,
షిర్డి సాయిబాబా జీవుడి నుంచి దేవుడిగా మిగిలినా ,
యేసు మానవుడిగా పుట్టి , దానవుల బారిన పడినా ,
ఆ రోజులోనే , ఆ 24 గంటలలోనే ,
ఇలా ఇలా చాలా చాలా జరుగుతున్నవెన్నో .


మార్పు కాలంలో లేదని , 
మొత్తం మీద మన భావనల లోనే .


మనం మాత్రం , ఏ పని చేయాలన్నా ,
టైం లేదంటూనే అనుకొంటుంటాం ఎప్పుడూ
చిత్రం , విచిత్రం , భళారే చిత్ర విచిత్రం కదూ ! .


      *********

1 comment: