కొంచెం ఎఱ్ఱన, యింకొచెం నల్లన, మఱింత తెల్లన

                                                    

                                                                                                                           కవితా రచన : శర్మ జీ ఎస్


భూభాగం అధికమే
భూతల స్వర్గసీమే       

వాతావరణం చల్ల చల్లన
పర్యావరణం పచ్చ పచ్చన

భవనాచట అందమైన  ఆకృతులు
అచట ప్రకృతి ఒలుకు అందాలు 

భవనాల అమరికకు అమెరికా
ఇళ్ళ ముంగిట అందాలకు అమెరికా

పగలు పొద్దు ఎక్కువే
సెగల పద్దులు తక్కువే

ప్రతాపాన్ని చూపడు సూర్యుడు
ప్రకాశాన్ని అందంగా అందిస్తాడు

జనాభా మాత్రం అల్పం
వనరులు మాత్రం అధికం

చూడబోతే ఒళ్ళు కొంచెం  నల్లన , 
యింకొచెం ఎఱ్ఱన , మఱెంతో తెల్లన

ఎవరిని చూసినా భారీ కాయాలే
ఏ ఫలం చూసినా భారీ విత్తనాలే

చూడటానికి హైబ్రీడ్
నిజానికదే  అసలు సీడ్

పక్షుల జీవితాలే వాళ్ళ సంస్కృతికి  పునాది
చక్షువులకందని భవనాలకు ఇక్కడే నాంది

రెక్కలొచ్చేంత వరకే సృష్టించిన వారాధారం
ఆ పై కాకూడదు వారెవ్వరికీ భారం

భార్యాభర్తల బంధాలు కావు వాళ్ళవి
భాగస్వాముల సంబంధాలే వాళ్ళవి

ఈ మానవ జన్మ జీవనం పయనమే

ఎక్కి , దిగే ప్రయాణీకుల  వైనమే

కలిసి చెయ్యబోరు కడదాకా ప్రయాణం

తెలిసినా చేసుకోరు ఆత్మవంచన

పువ్వులు కొమ్మకే అందం
నిజమేనని ఒప్పుకొందాం

అందాలని ఆనందంగా ఆరాధిస్తారు
అందమైన పూలచెట్లను పెంచేస్తారు

దుమ్ము , ధూళి ఎలా వుంటుందో 
తెలుసుకొనాలంటే ఇండియాలోనే

ఎక్కడా కనపడదు అణువంత పొల్యూషన్
రహదారులే దానికి  అసలైన సొల్యూషన్

ఏ దారులు చూసినా రహదారులే కదా
బారులు తీరిన కారులే కనువిందే కదా !

అధిరోహిస్తారు పర్వత శిఖరాలని
అవరోధిస్తారు విగ్రహారాధనని

అందినదానితో ఆనందిస్తారు

అందనిదానికి అఱ్ఱులు చాచరు

వాడనే వాడరు గీజర్లు
వాడి తీరుతారు హీటర్లు 

ఉద్యోగాలు వైట్ కాలర్సే
సంపాదించేవి మోర్ డాలర్స్

ఏ పని చేయటానికైనా ఫీలవరు అవమానం
అదే జీవన పురోగమనానికి అసలు కొలమానం

కానరాదు ఎక్కడా ఒక్క చిన్నదోమైనా 
తెల్లదొరలు కనపడతారెక్కడైనా 

లంచం యిచ్చినా  పుచ్చుకున్నా నేరమే  
పట్టుకుంటే  జీవితం ఘోరాతి ఘోరమే

వాళ్ళ కొఱకే వాళ్ళు బ్రతుకుతారు 
ఎవరి మీద ఆధారపడనే పడరు 

పడుచుతనం అండగ ఉండగ
వృధ్ధాప్యానికి దసరా పండగే

వాళ్ళకు కడదాకా తోడు డాగ్ 
వాళ్ళకు లేనే లేడు గాడ్

లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్
రైట్ సైడ్ డ్రైవింగ్

ప్రాణానికి విలువెక్కువ
పర నాణానికి విలువ తక్కువ

నిర్మాణంలో వారికి వారే సాటి
వారికి లేనే లేరు ఎవరూ పోటీ 

బహుళ అంతస్థుల భవనాలకు అమెరికా
బహుళ జాతి జీవనానికి ఆలవాలం అమెరికా

********

1 comment:

  1. ఏంటో.....ఇలా రోజుకో సమాచారాన్ని అందంగా అందిచేస్తున్నారు :-)

    ReplyDelete