ఓ సాఫ్ట్ వేర్ గాల్ వీకెండ్


                                                 
 "   వీకెండ్  వస్తుందంటే  , వీకెన్ అయిపోతానే "   అన్నది ప్రక్క సిష్టం ముందు కూర్చున్న నీహారికతో ప్రవల్లిక  .

"   ఎందుకే ? హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చుగా !  నేనైతే ఎపుడెపుడొస్తుందా ! అని ఎదురు చూస్తుంటా "   అన్నది నీహారిక .

"   విశ్రాంతెక్కడ లభిస్తుంది ? "   ఆన్నది ప్రవల్లిక .

"   అదెక్కడా అమ్మరమ్మాకొనుక్కోవటానికి  .  మనకు మనం తీసుకోవాలే . "

"   ఎలా  కుదురుతుందే ? "   ఫ్రవల్లిక .

"   ఎందుకు కుదరదే ? "   ఎదురు ప్రశ్న వేసింది నీహారిక .

"   మనవి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కావటం వల్ల ఏ మిడ్నైట్ కో గాని చేరుకోలేము . చేరుకున్న వెంటనే నిద్రపోలేం గదా ! "

"   నిజమేననుకో , కనీసం సాటర్డే , సండే మార్నింగ్స్ అయినా లేట్ గా నిద్ర లేవవచ్చుగా ! "   ఆన్నది నీహారిక .

"   వినటానికి చాలా బాగుంది . సాటర్డే , సండే మార్నింగ్స్ లేట్ గా లేవటమా ! నెవర్ , ఇట్స్ ఇంపాజిబుల్ "   అన్నది ప్రవల్లిక . 

"  వై ? "   ఆన్నది నీహారిక .

"   వీక్ డేసే నయం . సాటర్డే , సండే మార్నింగ్స్ వచ్చాయంటే చాలు , వీక్డేస్ కంటే ముందే లేపుతాడే  నా మొగుడు  మోహన వంశీ . అదేమిటండీ అంటే , పక్కనుండి లేపకపోతే నువ్వూరుకొంటావా బెల్లమా అంటాడు , అది ఆయన నాకు ( పెళ్ళానికి ) ముద్దుగా  పెట్టిన పేరు ."

"   అంతటి రసికుడిని పక్కనే పెట్టుకొని నిద్రపోవటం తప్పేనే "   అన్నది నీహారిక .

"   రసికుడా ఆ కాసేపేనే , ఆ తర్వాత   రక్కసుడే ? మన్డే నుంచి ఫ్రైడే వరకు లోపల అణచి పెట్టుకున్న అక్కసే అది ." 

"   అలా ఎందుకనుకుంటావ్ ? మగవాళ్ళు ఏదో వంకతో అలా లేపుతుంటారు , నువ్వపార్ధం చేసుకుంటున్నావేమో ?  పైగా ఆ టైం   బ్రహ్మముహుర్తమంటారు ,  చాలా చాలా  చాలా మంచిదే . ప్రశాంతంగా వుంటుంది . అంతం వరకు శాంతంగా వెళ్ళవచ్చు . అమృతం అందుకోవచ్చు . "

"   ఊరుకోవే , ఆయన లేపేది  ఆ ( ఒంటి ) పనికి కాదు , యింటి పనికి "   అన్నది ప్రవల్లిక .

"   ఇంటి పనికి అంత ఎర్లీగా ఎందుకే ? "

"   మా పనమ్మాయి ఉదయాన్నే 7 గంటలకు వచ్చి పని అంతా పూర్తి చేసుకొని వెళ్ళి , మళ్ళీ రాదే . వీక్ డెస్ అవసరం కొద్దీ మనం యిలా టైం ఫిక్స్ చేస్తే , ఆ పనమ్మాయి పర్మనెంట్ గా  అలానే ఫిక్స్ అయిపోయింది . " 

"   పోనీ ఓ రోజు నువ్వు , ఓ రోజు మీ ఆయన వంతులేసుకోకపోయారా ? ఆన్నది నీహారిక . "

"   పొరపాటున కూడా పని మనుషులని మన మొగాళ్ళకు అప్పజెప్పకూడదు . అప్పజెప్పావో , అంతదాకా నిన్నంటి పెట్టుకున్న నిద్ర మత్తు కాస్తా ఈ చర్యకు వదిలి పోతుంది , ఆ తర్వాత నిద్రపోదామన్నా నిద్రపట్టదే అన్నది ప్రవల్లిక ."

"   మీ ఆయన అటువంటి వారా ? "  అన్నది నీహారిక .

"   కాదే , కానీ   ఎంతైనా మొగవాడే కదా ! అంతటి ప్రవరాఖ్యుడే  , వరూధినికి వశమయ్యాడా లేదా .   అంతటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కూడా మేనక వలలో పడ్డాడా ?  లేదా ? 

"   కళ్ళు కళ్ళు కలిశాక కాపురం కూడా చేసి తీరాల్సిందే మఱి   "   అన్నది నీహారిక .

"   ఆంతెందుకు మా యింటి ప్రక్కనే ఓ తాతగారున్నారు . ఇన్ని అవస్థలు పడ్తూ  జీవనం సాగించే బదులు , ఎవరినైనా  చూసి పెళ్ళి చేసుకోక పోయారా అంటే చాలు , నాకెవరిస్తారు పిల్లని అంటాడే గాని  , పిల్లనిస్తే నేనే చేయగలను ఆ పిల్లకి అని ఆలోచించనే ఆలోచించడు . తనేమీ ఆ పిల్లకు చేయలేకపోగా , ఆ పిల్లనే తనకు చేయమంటాడు  , యిదేనే స్వార్ధమంటే "   అన్నది ప్రవల్లిక .

"  స్వార్ధం మనలో ఎంటర్  కాకూడదే , అయిందా  మన ఆలోచనలనే తారుమారు చేస్తుంది "   అన్నది నీహారిక .

"   మగవాడెపుడూ అవకాశం కొఱకు ఎదురుచూస్తుంటాడు గోతి కింద నక్కలాగా . అందుకే శనివారమైన , ఆదివారమైన ,మంచివారమైన మన ఆడవాళ్ళే పనిమనుషులను మానేజ్ చేసుకోవటం మంచిదే ."

"   అయితే నువ్వు ఎర్లీగా లేవక తప్పదంటావ్ ."

"   లేవటమే కాదు ,యింటెడు చాకిరీ చేయాలి , అత్తగారికి , మామగారికి కాఫీలందించాలి "   అన్నది ప్రవల్లిక .

"   మీ అత్తగారు , మామగారు చాలా మంచివారన్నావుగా . అన్నీ అత్తగారే చేస్తుందన్నావ్ . నువ్వింట్లో పని చేయాల్సిన పనే లేదన్నావుగా మళ్ళీ యిదేంటే ? "   అర్ధం కాలేదన్నట్లు అడిగింది  నీహారిక  .
  
"   మా అత్త మామగార్లు మంచివాళ్ళే "   అన్నది ప్రవల్లిక .

"   మళ్ళీ ఈ ఫిటింగ్ ఏమిటే ? "   అన్నది నీహారిక .

"   మొగుడు అంటే ఎవరనుకుంటున్నావ్ ? ఫిటింగ్ మాష్టరే . ఆ మొగుడు అనే వాడి వల్లనే యిదంతా . ఆయనే వాళ్ళ మమ్మీ , డాడీ ల మనసుల్లో  మంచివాడనిపించుకోవాలని యిలా డిసైడ్ చేసి , పైకి మాత్రం నేనేమైనా అనుకొంటానని "   వాళ్ళు పెద్దవాళ్ళు కదా ! వాళ్ళకు రెష్ట్ ఈ 2 డేస్ యిస్తే కదా , ఆ 5 డేస్ మనం చేయించుకోవటానికి వీలు పడ్తుంది "   అని సర్ది చెప్పాడు .

"   మీ ఆయన నిన్ను సుఖపెట్టటానికి భలే ప్లాన్ చేశారు "   అన్నది నీహారిక .

"   ఆ 5 రోజుల కొరకు ఈ 2 రోజులు చేయాలంటే , నరకం కనపడ్తుందే . అందుకనే అసలు సాటర్డే , సండే లేకుండా వీక్  వుంటే బాగుండు అనుకొంటున్నా"   అన్నది ప్రవల్లిక .

"   అలా ఎలా కుదురుతుందే , వీక్ అంటే 7 డేస్ కదా అన్నది "   నీహారిక .

"   వీక్ అంటే 7 డేస్ , ఆ సాటర్డే , సండే లు కూడా వర్కింగ్ డేస్ అయితే , హాయిగా ఎంచక్కా ఉదయాన్నే ఆఫీసుకు వచ్చి , సిష్టం ముందుతిష్ఠ వేసుక్కూర్చోవచ్చు , ఛాటింగ్ చేయచ్చు , ఫేస్ బుక్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడి వాళ్ళతో ( పబ్లిక్ ) రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు ( ముఖా ముఖి కాకున్నా ) ముఖం చాటయినా , చక్కగా , సరదాగా ఎంజాయ్ చేయచ్చు . నెట్ వర్క్ ల ద్వారా ఎంతోమందితో స్నేహ సంబంధాలు పెంచుకోవచ్చు , అయినా యివన్నీ నీకు తెలియనివేమీ కాదుగా "   అన్నది ప్రవల్లిక .

"   నువ్వన్నది నిజమేనే , నీ ఒక్కదాని కొరకు ఆ 2 డేస్ ఎలా పెడ్తారు ? మన  సాఫ్ట్వేర్ అంతా ఫారెన్ కంట్రీస్ మీదే బేస్ కదా ! వాళ్ళకు వీకెండ్ చాలా ఎసెన్షియల్ , ఇఫ్ దే ఆర్ నాట్ హావింగ్ వీకెండ్ , దెయిర్ బాడీస్ బికేం వీకెన్ డ్ " అన్నది నీహారిక . 

"   నువ్వు వీకెన్ డ్ కాదే , నేను వీకెండ్ "   అన్నది నీహారిక .

"   నువ్వెలా ? "   అడిగింది ప్రవల్లిక.

"   నీకు చేసిపెట్టటానికి అత్తా మామలున్నారు , నాకైతే ఎవ్వరూ లేరు . పెళ్లి అయి ఆరేళ్ళయినా మేమింతవఱకు పిల్లల్ని ధైర్యంగా కనలేకపోతున్నాం . కన్న తర్వాత వాళ్ళని చూసేవాళ్ళెవరు ? ప్రశ్నగా మిగిలిపోయింది యిప్పటికీ ."  

"  పిల్లల్ని కనకపోయినా చక్కగా వయసుని ఎంజాయ్ చేస్తున్నారు గదే , పిల్లలదేముందే ఏ వయసులోనైనా కనవచ్చు . ఈ వయసు పోతే మళ్ళీ రాదు " .

"   వయసులో కనకుంటే , ఆ పై మా బతుకులకు మెతుకులు పెట్టేవాళ్ళెవరు అన్నది ప్రశ్నగానేమిగిలిపోయింది . పిల్లలు లేని జీవనగమనం , అడవిన కాచిన వెన్నెల గమనంతో సమానమే . మనం సంపాదిస్తాం డబ్బుని , ఆ డబ్బుతో మనుషుల్ని తెచ్చుకోగలం గాని " మన " అన్న వారిని మనం తెచ్చుకోలేం . డబ్బుతో మనకు దగ్గఱయ్యే వాళ్ళు  ఎప్పుడూ ఆ డబ్బునే చూస్తారు, మనల్ని , మన మనసుల్నీ వాళ్ళు చూడలేరు . ఇప్పుడు నన్నే చూడు , అందరినీ కాదని , అందర్నీ వదులుకొని మేమిద్దరం పెళ్ళీ చేసేసుకున్నాం . ఈ రోజుల్లో పిల్లల్ని కనగానే సరికాదు , వాళ్ళ ఆలనా , పాలనా చూడటనికి డబ్బు ఎంత అవసరమో , 'మన' అనే వాళ్ళు అంతకంటే ఎక్కువ అవసరం . ఆ మన అనే వాళ్ళు లేక , మేమా పిల్లల్ని కనే ప్రోగ్రామ్ నే  విరమించుకున్నాం . కనగల శక్తి లేక కాదు , ఆసక్తి 
లేక కాదు , 2 సార్లు అబార్షన్ కూడా చేయించుకున్నానందుకే . మీ అత్తా మామలు  చాలా మంచివాళ్ళే . మన అనుకున్నారు గాబట్టే అలా చేస్తున్నారు , చూస్తున్నారు . వాళ్ళను వదులుకోకే . పిల్లలకి 5 , 6 ఏళ్ళు వచ్చాక హాయిగా ఎంజాయ్ చెయ్యచ్చు. ఆ అండ వదులుకోకు "   అన్నది నీహారిక .

" నువ్వంటున్నది నిజమేననిపిస్తోంది . నీ గాధ విన్న తర్వాత , నా బాధ అంతా పోయిందే . 
నిజ్జంగా మా అత్తా మామలు చాలా చాలా మంచివాళ్ళే . వాళ్ళు చేసినదానికి వంకలు 
పెట్టకుండా , వంకరగా మాట్లాడకుండా , బాగుంది , బాగుంది అంటే చాలే ఇంకా ఇంకా 
అత్యుత్సాహంతో మమ్మల్ని సుఖపెడ్తారే . కొన్నాళ్ళు సర్దుకుపోతే ఆ తర్వాత అంతా సుఖమేలేవే 
నువ్వన్నట్లు . థాంక్సే మంచి సలహా యిచ్చినందుకు  "  అన్నది ప్రవల్లిక .

  
                                                        ** స ** మా ** ప్తం **

2 comments:

  1. aadapillaki atta, mama yeppatiki amma, nanna kaleru. idi Kadho, vastava sanghatano teliyadu kani, inthala baga chusukune atta, mama eerojullo untarante nenu nammanu. chanti pillavadu gachhu meeda pass postene arichestuntaru ma atta mama.

    ReplyDelete