కొలను


               కొలను
                                                          కవితా రచన : శర్మ జీ ఎస్

అదో చిన్న ప్రపంచం ,
క్రిమికీటకాదుల కాహారం ,
చూపులకో అందమైన హారం .

కలువలు , తామరలు ,
గడ్డిపఱకల , దర్భ మొక్కలు ,
చుట్టూ రాళ్ళూ , రప్పలూ .

ప్రపంచానికే వెలుగు నీడల నిచ్చు
సూర్యచంద్రులను ,
తనలోనే దాచుకొంటుంది ,

జీవితమంటే వెలుగు నీడలేనని ,
ఆ వెలుగునీడలు అందరికి ,
అవసరమని చాటుతోంది .

తనను చూడ వచ్చినవారికి ,
వారి ప్రతిబింబాల్ని ,
తనలోనే చూచుకోమంటుంది .

కదిలించనంతవఱకు ,
ప్రతిబింబాన్ని చూపుతూ ,
అద్దంలా మెరిసిపోతుంటుంది .

చిన్న కల్లు విసిరినా ,
కలత చెందిన మనసులా ,
కలవరపడ్తుంటుంది .

లోన ఎంత పాచిని పేర్చుకున్నా ,
పైకి అందాల్ని చిందిస్తుంది ,
ఆనందాల్ని అందిస్తుంది .

అదే ఆ కొలను ప్రత్యేకత
అదే అదే ప్రశాంతత ,
పదే పదే గుర్తు చేస్తుంటుంది .

              *******

No comments:

Post a Comment