ఉషోదయం
నిశీధి కాంత నిదురోతున్నవేళ,
అందమైన జగమంతా అంధమయమాయె,
ఆ నిశీధి కాంత గాఢనిద్రలో మునిగిన వేళ,
ఎంతకీ ఆ నిశీధి కన్నియకు మెలకువ రాలేదాయె,
అంత ,
కోడి పుంజులు రంజుగ రాగాలాపన చేస్తుంటే,
పక్షుల కిలకిలారావాలు ఒక ప్రక్క ,
కోకిలల కుహూ కుహూ కిల కిలలు యింకో ప్రక్క ,
అల శ్రీ వేంకటేశుని సుప్రభాత సేవ ,
మేలుకొలుపుల పిలుపులు మరో ప్రక్క ,
మంగళ వాయిద్యాల , మధుర గీతాలో వైపు,
ముద్దు గొలిపే మువ్వన్నెల ముగ్గులు యింకో వైపు ,
ముగ్ధ మనోహర ముద్దుగుమ్మల మోములు మరో వైపు ,
వేకువ ఝాము  వేళ నిశీధి కన్నియను ఆహ్వానించుచుండ ,

ఈ సుందర దృశ్యం తిలకించ ,
మబ్బుల మాటున సూరీడు తొంగి తొంగి తిలకించుచుండ , 
అంత మసక మసక చీకట్లు సమసిపోతుండ ,
ఆ నిశీధి కన్నియ నిదుర కనుమరుగాయె ,
జగతిన సూరీడి వెలుగు అలరించె .
  
             **********

1 comment:

  1. కోడి పుంజులు రంజుగ రాగాలాపన చేస్తుంటే....ఇదేదో విభిన్నంగా బాగుందండి :-)

    ReplyDelete