నటనా ! నీకిది తగునా ?తను , జీవించటానికి నటించాలనుకున్నది ,
చిత్ర అపజయాలతో ఆలోచనలో పడింది ,
నటించటంలో జీవించాలని గ్రహించింది , 
కృషి , దీక్ష , పట్టుదలలు మమేకమై ,
నటనలోనే జీవించటం ఆరంభించింది ,
వరుసగా అన్ని చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి ,
చిన్న , పెద్ద నిర్మాతలు క్యూ కట్టి నిల్చొన్నారు ,
అహంకారం , అహంభావాలను దరిజేరనీయలేదు ,
నటనలోనే జీవించటం ఆమెకు  అతి సులువుగా మారింది ,
నటించి , సారీ  జీవించి , జీవించి , 
వ్యక్తిగత జీవితం ఙ్నప్తికి వచ్చి ,
నటనకు స్వస్తి వాక్యాలు పలికింది ,
పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితాన్ని స్వాగతించింది ,  
తొలి రేయి , భర్త సరసన చేరగానే ,
తన  "  భార్యా భర్తల బంధం "   లో  హీరో ,
కళ్ళ ముందు నిలిచాడు , 
భర్త కనుమఱుగయ్యాడు ,  

మలి రేయి , మరో చిత్రం లోని మరో హీరోతో ,

ఇలా ప్రతి రేయి ,అలా తన చిత్రాల లోని హీరోలతో ,
ఙ్నప్తికి రాగా , ఆ హాయి ననుభవించలేకపోతోంది ,

అడిగిన భర్తకు ఏమీ చెప్పలేక మౌనాన్ని ఆశ్రయించింది ,
మనోవేదన అధికమై , మరణయాతన అనుభవిస్తోంది  ,

"   జీవించటానికి నటించాలనుకున్నది ,
నటించటంలో జీవించాలని గ్రహించింది , 
నటనలోనే జీవించటం ఆరంభించింది "


ఆ నటనే తన జీవితాన్ని కాలనాగులా కాటేస్తోందిలా  , 


నటనా ! నీకిది తగునా ...... ?   
నటనలో జీవించటమే పొరపాటా ...... ? 

పొరుగింట్లో ఎఫ్ ఎం రేడియో లో  పేద్దగా వినపడ్తోందిలా ,

నటన నటనే కాని , జీవితం కాదు , 
నటన వేరు , జీవితం వేరు ,
రెండూ  సమాంతర రేఖలే ,
అప్పుడప్పుడు కలుసుకొంటున్నట్లు కనపడ్తాయి ,
కానీ ఎన్నటికీ , ఎక్కడా కలువవు , కలువకూడదు .

                           ************

No comments:

Post a Comment