సగటు మనిషి

మనసారా నవ్వుదామని
నవ్వబోతే ,
నవ్వనీయక ,
నీతులు వల్లిస్తూ ,
గోతులు త్రవ్వుతూ ,
అమాయకుణ్ణి చేసి,
నవ్వమన్నది ఈ లోకం ,

నవ్వాను , 
నవ్వకుండా ఉండలేకపోయా ,
ఈ పిచ్చిలోకాన్ని చూసి .గుండెలోని ఆర్తిని ,
ఆపుకోలేక, 
ఆవిరిగా మార్చి ,
విలపించాలనుకొంటే ,
పొత్తి కడుపుని గుచ్చే ,
ఎత్తిపొడుపు మాటల తూటాలను ,
నా ముఖాన వదిలేసి ,
విలపించమన్నది ఈ లోకం ,

విలపించాను ,
విలపించకుండా ఉండలేకపోయా ,
ఈ లోకమింతగా పాడైపోయిందేమిటా ! అని .నీతిగా ,
నిజాయితీగా ,
మనిషిగా ,
బ్రతుకుదామని ,
బ్రతుకుతుంటే ,
బ్రతుకనీయక ,
వింత వింత చేష్టలతో ,
ఆ నీతికి , నిజాయితీకి ,
నిప్పంటించి ,

బ్రతకమన్నది ఈ లోకం ,
బ్రతకలేక చచ్చిపోతున్నా .


                *********

1 comment:

  1. అదే లోకంతీరు,భయపడితే భయపెడుతుంది

    ReplyDelete