చలి , చెలి , చినుకులు


     చలి - చెలి   
    
చలి అంటే చల్లదనం
చెలి అంటే వెచ్చదనం
చలికి వెచ్చదనమే 
అసలైన ఔషధం 
చెలికి చెలికాడే 
సిసలైన మూలధనం


         *****                     
     

         చినుకులు 

చిఱుత ప్రాయపువారికి
ఆగడాల అల్లిబిల్లి ఆటలు 

వయసు లోనివారికి
వలపు తీపి బిగికౌగిలి పాటలు

వయసు మళ్ళినవారికి
మధుర స్మృతుల బావుటాలు   

          *****

No comments:

Post a Comment