సంతోషాన్ని కొనగలమా ?


                                                                                                                         
ఆ మధ్య  ఏ  శుభకార్యానికి వెళ్ళినా , ఆ  పెద్దవాళ్ళు  చిన్నపిల్లల్ని వాళ్ళ బంధువులలో పెద్దవాళ్ళ వద్దకు తీసుకువెళ్ళి వంగి కాళ్ళకు దండం పెట్టించే వారు . వాళ్ళు  చెప్పినట్లే  పెట్టేవాళ్ళు 
వెంటనే ఆ దండం పెట్టించుకొంటున్న ఆ పెద్దవాళ్ళు   "   కలకాలం పిల్లా  పాపలతో ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో , సుఖ శాంతులతో హాయిగా జీవించండి "   అని ఆశీర్వదించేవాళ్ళు  . ఈ దీవెన వినగానే మనసు ఎంతో  ఆనందాను
భూతికి లోనయ్యేది . ఆ దీవెన / ఆశీర్వాదంలో అంత ఆనందం ఇమిడి ఉండేది .

మరి ఈ రోజుల్లో   ఆ ఆశీర్వాదాలు ఎక్కడా వినపడటం లేదు . నమస్కారం పెట్టమనేవారు లేరు పెట్టే వారు లేరు,  పెట్టించుకునేవారూ కనపడటం లేదు  . అలా వంగి కాళ్ళకు నమస్కారం చేయటం ఎంతో తప్పుగా భావిస్తున్న రోజులివి . అలా నమస్కరించటం వలన తనని చిన్నచూపు చూస్తున్నారన్న భావన అధికమై, అలా వంగి నమస్కారాలు చెయ్యటమే మానేసేశారు ఈ కాలపు వాళ్ళు , వాళ్ళను కన్నతల్లితండ్రులు కూడా . వాస్తవానికి వాళ్ళను కన్న తల్లితండ్రులు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ పెద్దల మాట విన్నవాళ్ళే  . వంగి నమస్కారాలు చేసినవాళ్ళే . మరి వాళ్ళ చిన్నపిల్లలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ????????

అంటే..... వీళ్ళలో కూడా ఎక్కడో ఏదో మూల అలా వంగి నమస్కారం చేయటం తప్పేమో అన్న ఓ చిన్న సందేహం బీజంగా  బలంగా నాటుకుండటం వలన , పిల్లమీద పడుతున్న మీడియా ప్రభావం , వీళ్ళమీద పడటం వలననూ ,ఇప్పుడు వాళ్ళ చిన్నపిల్లలకు  చెప్పలేక పోతున్నారు . వాళ్ళ చేత ఆలా వంగి నమస్కారం చేయించలేక పోతున్నా రు . అలాగని  పిల్లలమీద ప్రేమాభిమానాలు ఏ మాత్రం  తగ్గుతున్నాయనుకోవటానికి వీలు లేదు . అలా అని వాళ్ళు వాళ్ళ చిన్నపిల్లల కొరకు  రూపాయి ఖర్చు చేయవలసిన స్ధానంలో వంద  రూపాయలైనా ఖర్చు చేయటానికి వెనుకాడటం లేదు .

ఉదాహరణకు :  ఆ నాటి నుంచి మొన్న మొన్నటిదాకా చిన్నపిల్లలను కంటున్నవారేగా అందరు . ఎవరైనా పొత్తిబట్టలు వాడేవారు , అంతే గాని   బేబీ ప్యాడ్స్ , హగ్గీస్ , మఱియు డైపర్స్  వాడేవాళ్ళా ? వాళ్ళు చిన్నపిల్లలకీ , వాళ్ళకు భేదం చూపించేవారు కాదు . వాళ్ళ స్వవిషయాల్లో కూడా అంతే .

ఉదాహరణకు : ఈ నాడు భర్త పుట్టిన రోజునొ / పెళ్ళి రోజునో  భార్యకు అడిగిన గిఫ్ట్ కొని పంపించి  కూడా, చూసి ఆనందించ టానికి వీలుపడదు , ఆఫీసు పనులతోనో , లేక వ్యాపార పనులలొనొ బిజీగా వుండి . బాధపడి ప్రయోజనంలేక అలాగే అలవాటు పడిపోతున్నారు . అదే వాళ్ళ పిల్లల జీవితాలకు అమలు జరుపుతున్నారు . 

ఇటువంటి వారికి తన కన్న చిన్నవారిని దీవించాలన్న ఆలోచన క్రమేపీ అడుగున పడిపోతుండటంతో , అలా పెద్దవాళ్ళకు వంగి నమస్కారం చేయించాలన్న ఆలోచన వారి మనసులలో చొరబడటం లేదు .ఆ దీవెనలోని అంతరార్ధం : "   సుఖ శాంతులతో హాయిగా కలకాలం హాయిగా ఉండండి "   అంటే    

సుఖ       = సుఖం  
శాంతులు    = శాంతితో
కలకాలం    = ఎల్లప్పుడు 
హాయిగా    = ఆనందంగా  
ఉండండి     = ఉండమని.   

చాలామంది తమ పెద్దవాళ్ళను సుఖసంతోషాలతో చూసుకొంటున్నామనుకొంటున్నారు  . సంతోషపెడ్తున్నామని అనుకొంటున్నారు . వాళ్ళకి వాళ్ళు స్వయంగా చూసుకొనే అవకాశం లేక , పలు రకాలుగా వృధ్ధాశ్రమాలలో , 
అనాధాశ్రమాలలొ స్వయంగా విచారించి , వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు  డబ్బు  మాసం మాసం వ్యయం చేస్తూ చాలా 
చాలా  శ్రధ్ధ తీసుకొంటున్నామని అనుకుని మును ముందుకు అలా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు ఆనందంగా  . నిజానికి వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళని సంతోషంగా  చూసుకోలేకపోతున్నారని ఘంటాపధంగా చెప్పవచ్చు . 

ఎందుకంటే సుఖం దేహానికి  సంబంధించింది .ఆ దేహన్ని  ఏర్ కండిషండ్ గదిలో ఉంచితే  చల్లబడుతుంది , సుఖాన్ని పొందకలుగుతుంది . ఇలాంటి  సుఖాన్ని కొనుక్కోగలం , కానీ సంతోషం అలా కొనుక్కునేది కాదు .
మనసుకి  సంబంధించినది . ఆ మనసు ఎక్కడుందో  ఎంత మందికి తెలుసు ?   పైగా సంతోషం ఒకరు ఒనకూర్చగలిగినదే , అదీ ఎదుటివారి మనసుల్ని తెలుసుకున్నపుడు మాత్రమే .

అలా ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోలేనపుడు ఎవరికి వారు ఒనకూర్చుకోవలసినదే గాని కొని అందించ గలిగేది 
కాదు . ఈ నగ్న సత్యం  తెలుసుకుంటే సుఖ సంతోషాలకు కొదవే లేదు . కనుక కొంచెం ఆలోచించి నడతను తదను
గుణంగా  మార్చుకుంటే అందరికి ఆనందం .

చాలామంది ,ఇంత శ్రమ తీసుకోవటం దేనికి ? రేపు మనమూ వృధ్ధుల మవుతామని తెలుస్తూనే ఉన్నది గదా , ముందు జాగ్రత్త చర్యగా డబ్బులు బ్యాంక్ లో జమ చేసి ఆదా చేసుకొంటే మనమేమీ ఇబ్బందులు పడవల్సిన 
అవసరం లేదు అనుకుంటుంటారు . అది పేద్ద తప్పుడు ఆలోచన మాత్రమే . 

డబ్బు మనిషి అవసరాలలో ఉపయోగపడటం విశేషమే , ఆనందించాల్సిన విషయమే . అయితే అందరి జీవితాలకు
అన్వయించబడదు . నూటికి ఏ ఒక్కరికో మాత్రమే అలా ఉపయోగపడ్తుంది . డబ్బు డబ్బుని సంపాదించేటట్లయితే , 
ఈ నాడు ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు దినమూ పెడుతూనే ఉన్నారు . అతి తక్కువ కాలంలో ఆ వ్యాపారాలని 
మూసివేస్తూనే ఉన్నారు . మనమూ నిత్యం చూస్తూనే ఉన్నాము . కనుక డబ్బు మనలని బాగుచేస్తుందనుకోవటం , మనకెంతోఉపయోగపడుతుందను కోవటం నూటికి నూరు శాతం నిజం కాదు . డబ్బు మనిషిచే సృష్టించబడ్డది . పై పై అవసరాలకనుగుణంగా ఉపయోగపడుతుందే తప్ప అంతర్గత విలువలముందు అది బలాదూర్ . 

కనుక మనల్నెవరో సంతోషపెడ్తారనుకోవటం నిజం కాదు , సంతోషం మనసుకి సంబంధించినది కావటం వలన ఎవరికి వారు ప్రయత్నించుకోవటం చాలా చాలా మంచిది . అపుడు ఎవరినీ మనం దూషించవలసిన అవసరం మన దరి చేరదు . 
పైగా యిలా ప్రయత్నించటం వలన మన మనసు ఏ స్థాయిలో వున్నదో మనకు అవగతమవుతుంటుంది . పెడత్రోవ పట్టకుండా మన మనసుని సన్మార్గంలో నడిపించే అవకాశాన్ని మన అదుపులో వుంచుకున్న వాళ్ళమవుతాం .  


సంతోషాన్ని కొనుక్కోలేము , మనంతట మనమే తెచ్చుకోవాలి .


                                                                    **********
  



3 comments:

  1. సుఖమా! అంతా విష్ణుమాయ

    ReplyDelete
  2. బావుందండీ . అందరూ ఆలోచించాల్సిన విషయం

    ReplyDelete
  3. సాష్టాంగ దండాలు పెట్టె రోజులా ఇవి!అయినా వారు కిందికి వంగలేని శరీర ఆకృతులు కలిగి స్థూల కాయులు అవుతున్నారు కదా!ఎవరి ఇబ్బందులు వారివి!మనసులో ప్రేమాభిమానాలు ఉంటే అంతే మాకు చాలు తమ్మలపాకు తొడిమే పదివేలు!తరాల అంతరాలు ఉండనే ఉంటాయి కదా!పొత్తి బట్టలు ఖర్చుతో కూడుకున్నపని కాదు కదా!పిల్లలమీద ఎంత ఖర్చు పెడితే అంతా గొప్ప అనుకుంటున్నారు ఆధునికయుగ నవయువ తల్లితండ్రులు!పెద్దవాళ్లం కలగచేసుకోకపోతేనే మన ఆబోరు దక్కుతుంది!పెద్దవాళ్ళు తమ ఆర్థిక వనరులమీద సంపూర్ణ ఆధిపత్యం కలిగి స్వావలంబన కలిగి ఉండాలి నిన్ననే రెండోసారి అమెరికా వచ్చాను ఇక్కడ చూస్తున్నాను కదా ఇక్కడ ఎవరి జీవితం వారిది!పిల్లల మీద అతిప్రేమ చూపి పెద్దలు అర్థశూన్యులు కాకూడదని నా అభిప్రాయం!

    ReplyDelete