కెవ్వు... కేక మళ్ళీ

ఆ కోడి అందాకా  ఆతడి చంకలో పిల్లాడికి మల్లే ,
గారాలు పోతున్నది , సరాగాలు పలుకుతున్నది ,
కోడిని సమీపించాడు దుకాణాదారుడు , 
కాళ్ళను కట్టేసి పై కొక్కానికి తగిలించాడు  .

ఆతడి ఎడమ చేతి వేళ్ళలో ఆ కోడి కాళ్ళు ,
నేలపై బిత్తర చూపులు చూస్తున్న ఆ కోడి కళ్ళు ,
ఆ నాటు కత్తి , ఎదురుచూస్తున్నది వేట్లకై ,
ఆతని కష్టమర్లు ఆనందిస్తున్నారదో ఆటగా .

ఇన్నాళ్ళూ మీ బ్రతుకులు  నాతోనే తెలవారాయి ,
నేడు నా బ్రతుకే చీకట్లో చిక్కుకుపోతున్నదే ,
రేపు నా కేక మీకు వినిపించలేమోనన్న సందేహం ,
రేపటి వెలుగు నేనిక చూడలేమోనన్న భయం ,
ఈ కిరాతకాన్ని ఆపి , నాకిచ్చేవారెవరూ లేరా  అభయం ,
అదేపనిగ ఆపకుండా కొక్కొరొకో అని అరుస్తున్నది ,
మెడపై కత్తి వేట్లకి ఆ కోడి ఆఖరి కేక ,
కెవ్వుమంటూ చరిత్రలో మిగిలిపోయింది .

                           *******

2 comments:

  1. మీరు ఇలా కోడి కేకని కెవ్వు మనిపిస్తే చికెన్ సెంటర్ల వాళ్ళు మీపై యుధ్ధానికొస్తారేమో :-)

    ReplyDelete
    Replies

    1. ఈ ప్రపంచంలో ఒకరిని గురించి మరొకరు పట్టించుకునే స్థితిలో లేరన్న ధైర్యంతోనే ఈ సాహసం చేశానండి . ఎవరిది వాళ్ళకు అర్ధం కాక సతమతమైపోతుండటమే అసలు కారణం . అయినా మీ సత్సలహాకు కృతఙ్నతలు .

      Delete