దేవుడా ? దేవతా ?


                                           
                                                                             

యుగాలు మారుతున్నకొద్దీ , మానవుల ఆలోచనా సరళిలో మార్పు రావటం ఆరంభమయ్యేసరికి , అసలు   దేవుడున్నాడా / దేవత ఉన్నదా ? ఉంటే ఎక్కడ ? చూపించండి .
ఈ సమాజంలో చాలామందికి ఈ సందేహం వస్తూనే ఉంటుంది . 

అసలు  దేవుడు /  దేవత నిరాకారుడు అన్నపుడు ఈ ఆకారాలెక్కడనుంచి వచ్చాయ్ అన్న ధర్మ 
సందేహమూ  కలుగక మానదు .

అసలు మానవులను   దేవుడు /  దేవత  సృష్టిస్తే , ఆ మానవులు దేవుడికి /  దేవతకి   ఆకారాలను సృష్టించారు .
మానవులు అసలు దేవుడిని / దేవతని చూశారో లేదో ( వాళ్ళకే తెలియాలి ఆ నిజం ) చూశాం అని , వారికి కళ్ళకు కట్టిన ( తోచిన ) రూపాలను తెల్ల కాగితంపై గీసి రాళ్ళపై చెక్కించి అందంగా రంగులు దిద్ది సమాజంలోకి రిలీజ్ చేశారు .

అలా ఏర్పడ్డ దేవుళ్ళే ఈ నాడు చెలామణి అవుతున్నారు . లేకుంటే దేవుడికి / దేవతకి లింగ భేదాలెక్కడనుంచి పుట్టుకొస్తాయి, చెప్పండి మఱి . మానవులకున్న సంబంధ బాంధవ్యాలను దేవుడికి / దేవతకి అంటగట్టి ఆనందిస్తున్నారు . అయితే ఇలా ఏర్పడ్డ అన్ని దేవుళ్ళకు మానవతా విలువలు జోడించి సమాజంలోకి వదిలారు .

అలా ఆ దేవుళ్ళుగా లెక్కలేనంతగా ఈ మానవుల చేత ఆకారాలేర్పరచుకొన్నారు .

అసలు దేవుడు / దేవత  ఒక్కరే అయినపుడు ఇంతమంది  దేవుళ్ళు  /  దేవతలు  
ఎక్కడనుంచి పుట్టుకొచ్చారు ? ఎలా  వచ్చారు ? అని .  

మన పూర్వీకులు అనుసరించిన ఈ పధ్ధతి సమాజ శ్రేయస్సుకొఱకేనని  స్పష్టమౌతున్నది .
  

ఒకే భారత స్త్రీ  

ఒకపరి కూతురుగా,
ఒకపరి అక్కగారుగా,
ఒకపరి చెల్లెలుగా,
ఒకపరి వదినెగా , 
ఒకపరి మరదలుగా, 
ఒకపరి ధర్మపత్నిగా 
ఒకపరి అమ్మగా,
ఒకపరి ఆడబిడ్డగా,
ఒకపరి కోడలుగా, 
ఒకపరి తోడికోడలుగా, 
ఒకపరి అత్తగారుగా,    
ఒకపరి అమ్మమ్మగా, 
ఒకపరి నాయనమ్మగా ,
ఒకపరి ఆమ్మగారుగా,
ఒకపరి పిన్నిగారుగా 
చెలామణి అవుతున్నది. 

ఒకే భారత పురుషుడు,

ఒకపరి కొడుకుగా,
ఒకపరి అన్నగా, 
ఒకపరి తమ్ముడిగా,
ఒకపరి బావగా,
ఒకపరి మఱదిగా,
ఒకపరి భర్తగా,
ఒకపరి తండ్రిగా,
ఒకపరి అల్లుడుగా
ఒకపరి తోదల్లుడుగా,
ఒకపరి మామగారుగా,
ఒకపరి తాతయ్యగా,
ఒకపరి పెద్దనాన్నగా,
ఒకపరి బాబాయిగా
చెలామణి అవుతున్నాడు. 

నిండా నూరేళ్ళు కూడా ఆయుః  ప్రమాణం లేని మానవుడే ఇన్ని రకాలుగా పిలవబడుతుంటే , కలకాలాధీశుడైన ఆ దేవుడు / దేవత  అనంత కోటి నామాలతో పిలవబడటంలో ఆశ్ఛర్యమేమున్నది .అంతే కాకుండా ఎలా పిలిస్తే అలా పలుకుతాడు ఆ సర్వేశ్వరుడు అన్నపుడు ఇన్ని రకాల రూపాలు ఆ దేవునికి ఉండటంలో ఏ మాత్రం తప్పు లేదు .
   
కనుక  దేవుడు / దేవత  ఉన్నారా  ? ఉంటే ఒక్కరే కదా ? ఇన్ని రూపాలు / ఆకారాలు ఎక్కడ నుంచి , ఎలా వచ్చాయి ? అన్న సందేహాలను శాశ్వతంగా పారద్రోలండి . 

వాస్తవానికి అసలు దేవుడు / దేవత లేనే లేరు ఉన్నది సుప్రీం పవర్ మాత్రమే . 
ఆ సుప్రీం పవర్ నే స్వఛ్ఛంగా ఆహ్వానించండి , ఆవాహన చేసుకోండి అంతే మనం చేయాల్సింది .

                                                                    ******

No comments:

Post a Comment