నిజం తెలుసుకో - అలా మసులుకో


                                   
                                                                 

మనం పైకి కనపడుతున్న రెండు కళ్ళున్న గుడ్డివాళ్ళం . అందులో ఏ మాత్రం సందేహం లేదు .
మనకేం కావాలో  మనకు పూర్తిగా తెలియదు . ఎందుకంటే ఇది పరిశీలిస్తే మనకే అవగతమవుతుంది .

మనమేమిటో, మన ఆలోచనలేమిటో. పసితనం నుంచి పరిశీలించి చూడండి . 
   
పసితనంలో తల్లి తండ్రులే సర్వస్వం .
ఊహ తెలుస్తున్నకొద్దీ అన్నా , తమ్ముడు , అక్క, చెల్లెలు ,అత్త ,మామయ్య , బావ , బావ మఱది , బాబాయి , పెద్దనాన్న , ఆమ్మ , పిన్ని ఇలా బంధు వర్గం ఇష్టంగా భావిస్తాము .

చదువుకునే రోజుల్లో , స్నేహితులు , గురువులు చాలా ఇష్టం .
   
యుక్త వయసు వచ్చిన తర్వాత , బాయ్ ఫ్రెండ్ గాని , గర్ల్ ఫ్రెండ్ గాని ఎంతో ఇష్టం .
   
ఇంకొంచెం పెద్దయిన తర్వాత ,  ఉద్యోగం ఇష్టం .
   
పెళ్ళి అయిన తర్వాత , పెళ్ళాం / మొగుడు ఇష్టం .
   
ఆ తర్వాత పిల్లలు ఇష్టం .
   
ఆ తర్వాత మనపిల్లలకు పెళ్ళయిన తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు ( మనుమళ్ళు , మనుమరాండ్రు ) ఇష్టం .
   
ఇక అహర విషయంలో పరిశీలిస్తే ,
  
ఒకనాడు , 
    
దుంప కూరలంటే ఇష్టం .
అలాగే ఆకుకూరలన్నా ఇష్టమే .
కారపు పిండివంటలిష్టం .
తీపి పిండివంటలన్నా ఇష్టమే .
చల్లని పానీయాలంటేను ఇష్టమే .
టీ ,కాఫీ లు ఇష్టమే .

కొంతకాలానికి ,
    
ఆ దుంపకూరలు ,
ఆ ఆకు కూరలు , 
ఆ కారపు పిండివంటలు ,
ఆ తీపి పిండివంటలు ,
ఆ చల్లని పానీయాలు ,
ఆ టీ , కాఫీ లు
ఇష్టపడటం లేదు  
       
అంటే , మన శరీర నడవడికకు సరిపోవటం లేదు అన్నమాట .
    
ఒకనాడు మనం అమితంగా ఎంతో ఇష్టమైనవిగా భావించినవి , మరో మారు మనం  ఇష్టపడటం లేదు .  
అవి  మనం  ఆ సుప్రీం పవర్ ని  ఎంతగానో ప్రార్ధించి  గతంలో  కోరుకున్నవే . ఓ వేళ మనం కోరుకోకపోయినా  ,
మన ఇష్టాలు , అభీష్టాలు స్థిరం కాదని ఇందుమూలముగా అర్ధం చేసుకోగలం .
    
కనుక మనం నిజంగా రెండు కళ్ళున్న అంధులమే  .

మనం చేయవలసిందల్లా ఒక్కటే . సుప్రీం పవర్ ని మనస్ఫూర్తిగా "   నా జీవనానికేది సరిపోతుందో , ఏది నాకానందాన్ని కల్గిస్తుందో దానిని నీవే ప్రసాదించు అని  కోరుకోవటంలో అర్ధమున్నది.


                                                              ***********

1 comment:

  1. చాలా బాగా వ్రాశారు...నిజం కూడా అదే ....

    ReplyDelete