సెకండ్ షో
( ఈ "   సెకండ్ షో "   సరసమైన కథ స్వాతి సపరివార పత్రిక 20.10.1995 న ప్రచురించబడినది )  
                  
అందమైన భార్య , అనువైన ఉద్యోగం వున్నాయంటే ఈ రోజుల్లో గొప్ప అదృష్టంగా భావించాల్సిందే . అందునా వయసొచ్చిన పిల్లలున్నారంటే త్వరగా చేతికందివస్తారనే అనుకోవాలి . నారాయణ వయసు నలభై పైనే . నారాయణ అందరిలా అనుకోవటం లేదు .

ఆ ఆనందం కొరవైందనే బాధ అతనిని అనునిత్యం బాధిస్తోంది . నవరసాలలో సరసం అతి ముఖ్యమైనదని , భార్యనటే మొగ్గమంటాడు .

"   ఏమోయ్ వరాలు ! నరాలు లాగేస్తున్నాయే . అలవాటు కాకముందు ఏదైనా బాధ కలిగించదు . అలవాటైన తర్వాత అది లేకుండా క్షణం కూడా బతకలేమనిపిస్తుంది . వయసొచ్చిన పిల్లలున్నారని మన కోరికలు చంపుకుంటామా ? నా వల్ల కాదు ."  మనసు అదోలా అయిపోతుంది . ఈ మధ్య డాక్టర్లు మరీ మరీ సెలవిస్తున్నారు ఆయిల్ పుల్లింగ్ లా , ఛేంజింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని . నువ్వేమంటావోయ్ "   అన్నాడు నారాయణ .

"   ఎవరెన్ని చెప్పినా మనం , మన పరిసరాలు గమనించుకోవాలి . వయసొచ్చిన పిల్లలముందు మనం బహు జాగ్రత్త్గగా  మసులుకోవాలి సుమండి . వాళ్ళలో యిపుడిపుడే కోరికలు మొగ్గలేస్తాయి . అవి కోరికలని , తీరే మార్గాలివి అని తెలియని వయసు . తెలుసుకోవాలనే తపన కునుకుని దరిచేరనీయక మెలకువగా వుంచుతుంది . ఈ సమయంలో మనం మన కోరికలను తీర్చుకొంటూ పొరపాటున అయినా కనపడ్డామంటే , వాళ్ళను తప్పుడుమార్గంలో నడిపించినవాళ్ళమవుతాం . కనుక మన కోరికలను చంపుకోవలసిందే "   అని గట్టిగా చెప్పడంతో నారాయణ మనసు గిజగిజలాడింది . రాత్రుళ్ళు కునుకు దరిజేరక , పగలు ఆఫీసు పనిలో మనసు నిలవక నరకయాతన అనుభవిస్తున్నాడు .

ఆఫీసులో డల్ గా వున్న నారాయణను చూసి కొలీగ్స్ నిలదీశారు . దాంతో తను పడ్తున్న అవస్థను విన్నవించుకోక తప్పిందికాదు .

"   ఓస్ ఇంతేనా ! ఇంకా ఏం కొంప మునిగిందో అనుకున్నా . వడ్లగింజలో బియ్యపుగింజ . ఈ రాత్రికే ఛేంజ్ " అన్నాడు సాంబశివం .

"   ఎలా ? "   అని అడిగాడు ఆశ్ఛర్యంగా .

"   రాత్రి 10 గంటలకు నాతోపాటు ఫాతిమా కంపెనీకి రా "   చెప్పాడు సాంబశివం .

"   కంపెనీ అంటున్నావు . అదేమైనా బ్రోతల్ కంపెనీయా "   అడిగాడు నారాయణ .

"   కాకుంటే ఛేంజ్ ఎలా కుదురుతుంది ? "

"   అమ్మో నాకు చచ్చేటంత భయం . పట్టుకుంటే పరువు పోతుంది . అంటుకుంటే అదే పోతుంది రేపనేది లేకుండా , నేను రాలేనురా సాంబా "   అన్నాడు .

"   అయితే ఓ పని చెయ్ . మా అసోసియేషన్ లో మెంబర్ గా చేరు "   అన్నాడు రాజశేఖరం . 

"   ఏమిటా అసోసియేషను ? "   అని అడిగాడు .

"   అదేరా నీ సమస్యకు సంబంధించినదే . ఈ సమస్య నీ ఒక్కడిది కాదు . నడివయసు  వచ్చిన మనలాంటి వారందరిది . అందుకే మేమంతా కలిసి ఒక అసోసియేషను స్ధాపించాం "   అన్నాడు రాజశేఖరం .

"   వివరంగా చెప్పండిరా . నా సమస్య తీరేటట్లయితే నేను కూడా ఆనందాగా చేర్తాను  . " 

"   రిక్రియేషన్ క్లబ్ అని స్ధాపించాం . అందులో పగలు , సాయంత్రం పేకాట , కేరంస్ , చెస్ , చైనీస్ చెక్కరు లాంటి లైసెన్స్ ఆటలు ఆడుకొంటుంటాము . రాత్రిళ్ళు పది గంటల తర్వాత ఆ ఆట ఆడుకొంటుంటాము రోజుకొకళ్ళు చొప్పున . మేమిపుడు పధ్నాలుగుమందిమి మెంబర్లమయినాము . నెలకు తలకు రెండుమార్లు ఆ అవకాశం లభిస్తుంది . అందులో ఓ రోజు ఖాళీ వుంది . ఆ రోజు ఈ రోజు కనుక నీ అదృష్టం పండింది . చేరిపో . ఆరోగ్యం మెరుగు పెట్టుకోవచ్చు . ఆనందంగా ఆఫీస్ పనికి అటెండ్ కావచ్చు "   అన్నాడు రాజశేఖరం . "   వినడానికి చాలా బాగుంది . ఇంతకీ ఆ రిక్రియేషన్ క్లబ్ ఎక్కడా ? నాలుగిళ్ళ చావడి లోనా ? అక్కడెవరో మనల్ని చూడరా ? తలుపులు తియ్యాలంటే వాళ్ళే వచ్చి తీస్తారా ? అలాగైతే అసభ్యంగా వుండదూ "  అని తన సందేహాలని వెలిబుచ్చాడు నారాయణ .

"  ఇవన్నీ ముందే ఆలోచించే , మెయిన్ రోడ్ మీదకే , మెయిన్ డోర్ వుండేటట్టు చూసి తీసుకున్నాం . మన తలుపులు మనమే తీసుకొంటాం . ఎవ్వరికీ తెలియదు . ఆనందంగా ప్రొసీడ్ అయి వెరైటి , వెరైటీగా ఆ ఆనందాల్ని అనుభవించవచ్చు "    అన్నాడు రాజశేఖరం .

"   అయితే యిదిగో నా మెంబర్ షిప్ ఫీజు " అంటూ వెంటనే వంద రూపాయల నోటు తీసి యిచ్చాడు  నారాయణ .

"   ఇదిగో యాభై రూపాయలు తీసుకో . ఇదిగో డూప్లికేట్ కీ . ఫష్ట్ షో కుదరదు , సెకండ్ షో మాత్రమే "   అని కీ చేతికందించారు . కీ అందిన మరుక్షణం ఎపుడెపుడు టైం అవుతుందా ? తను ఎపుడు సెకండ్ షో మొదలుపెడతానా అనే తపన అతనిని అడుగడుగుకి రిష్టువాచి చూసుకొనేలా చేసి , ఆఫీసులో పర్మిషన్ తీసుకొని ఇంటికి చేరుకొనేలా చేసేసింది .

ఎర్లీగా ఇంటికి చేరుకున్న నారాయణను చూసి " ఏమిటండి విసేషం ? "   అని అడిగింది అర్ధాంగి వరలక్ష్మి . 

కంగారులో "   సెకండ్ షో "   అంటూ తటాకున నాలిక్కరుచుకొన్నాడు .

"   సెకండ్ షోకి వెళ్ళేటట్లయితే యింత ఎర్లీగా రావటం దేనికి ? "   అంది .

"   నిద్దురపోకుండా మేలుకోవాలికదా ! ఆ నిద్దరేదో యిపుడే పోతా . త్వరగా వడ్డించు "   అన్నాడు .

"   చాలా వింతగా వుందే యిది . అయినా నాకెందుకులెండి , రండి "   అంటూ భోజనం వడ్డించింది .
భోజనం ముగించిన నారాయణకు పక్క వేసి "   పడుకోండి , పదింటికి లేపుతా "   అన్నది .

"   నువ్వు లేపేదాకా నేనుంటే కదా ! నీకంటే ముందు నాకే తెలుస్తుందిలే టైం "   అన్నాడు .

బెడ్ మీద నడుం వాల్చాడే గాని ఆ రిక్రియేషన్ క్లబ్ , ఆ సెకండ్ షో ఆలోచనలు అతనిని చుట్టుముట్టాయి .

పది గంటలవుతుండగా టిప్ టాప్ గా తయారై బయటకు నడిచాడు . ఆటో ఎక్కి పోనీ అన్నాడు . మెల్లగా పోతున్నది గమ్యం తెలియని బాటసారిలా . గాంధీ బజార్ అనగానే ఆటోకి కూడా హుషారు వచ్చినట్లు వేగాన్ని అందుకొంది .

ఓ పడుచు పిల్ల నెక్కించుకొని , కావలసిన సరంజామా తీసుకొని , రిక్రియేషన్ క్లబ్ కి చేరుకొని , తన వద్దనున్న డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేసి , లోనికి ప్రవేసించి , వెంటనే తలుపులు బిగించాడు . హమ్మయ్య అనుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు .

బాత్ రూంకెళ్ళొచ్చి ట్రిం గా తయారై , తనని బాథింగ్ చేయమన్నాడు . సరేనని లోపలకి వెళ్ళింది . సరిగంగ స్నానాలు తలమునగంగ పసిబిడ్డలా చేస్తోంది ఆ  పడుచు పిల్ల . 

జుట్టు విరబోసుకుని , టవల్ చుట్టుకొని , అడుగులో అడుగు వేసుకొంటూ వస్తున్న ఆ పడుచు పిల్ల చూడ కన్నుల పండుగగా వుంది .

పదిన్నర గంటలకి వెళ్ళిన తను పదకొండున్నరకి గాని బాతింగ్ పూర్తి చేసుకొని రాలేదు . తీరా వచ్చాక యిపుడు బాత్ రూంలో ఫ్యాన్ లేక స్వెట్టింగ్ విపరీతమైందని ,ఇక్కడ ఫ్యాను గాలికి ఊపిరి పీల్చుకొంటున్నానన్నది .ఆ పడుచు పిల్ల తన తనువుని పొడి చేసి పొడిచేయమన్నట్లుగా అతన్ని అమ్మాతంగా కౌగిలించుకొంది . ఆ పడ్చుదనపు ఆడతనపు పొంగులు అతనిని రంగుల ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళాయి . తన కొలీగ్స్ పుణ్యమా అని తనకీ అవకాశం లభించింది . ఎపుడైనా నలుగురితో మంచిగా వుండడం మనకే మేలు అనుకొన్నాడు .


మెయిన్ రోడ్డులో దుకాణాల మధ్య రూం కావడం వలన , కనుచూపు మేరలో ఎవరూ ఉండరన్న మొండి ధైర్యంతో , యధేఛ్ఛగా తెగ ఆనందించేస్తున్నాడు .

ఈ సమయంలో నైటు బీటు కానిస్టేబుల్సు ఇద్దరు ఆ రోడ్డుల్ ఒ వెళ్రూ , ఆ రిక్రియేషన్ క్లబ్ ముందు మెట్లపై కూర్చొని పిచ్చాపాటీ చేస్తున్నారు . ఇంతలో లోపల నుంచి ఏవేవో గుసగుసలు వీరి చెవున పడుతుండటంతో తలుపు వైపు చూశారు . తాళం వేసి లేదు ,తీసే వుంది . పైన బోర్డ్ చూశారు . ఆ పై తలుపుకున్న నెఱ్ఱిలోంచి తొంగిచూశారు . ఆ భంగిమలను చూసి సందేహం లేదు , యిది ఆ కేసే . ఈ రోజు మాంఛి ఛాన్స్ లభించింది . ఈ దెబ్బతో మనకు ప్రమోషన్ వస్తుందిరా . మనకూ పగటిపూట డ్యూటీ మారుస్తారు . మనమూ మ్యాట్నీలాపి , నలుగురిలా నైట్ షోలు వేసుకోవచ్చు నిర్భయంగా అనుకొంటూ డోర్ మీద లాటీతో  టక్ టక్ మని శబ్దం చేశారు .ఆ శబ్దానికి నారాయణ ఈ లోకంలోకి వచ్చి కంగారుగా షర్ట్ వేసుకొని , ఆ పడుచుని లోనికి పంపి డోర్ ఓపెన్ చేశాడు . ఎదురుగా నిలుచుని వున్న కాకీలను చూసి గాభరాగా 'కీ, కూ ' అన్నాడు .

"   ఏటేటో మాట్లాడితే వదుల్తామనుకొన్నావా ? తుక్కు రేగుతుంది , లోపల ఎవరున్నారు ? అన్నారు ."

"   నేను తప్ప ఎవరూ లేరు "   అన్నాడు .

"   అలాగా ! "  అంటూ బెడ్ మీద నలిగిన మల్లెపూలను చేతిలోకి తీసుకొని , అంగిలి తాకి ఎంగిలి చేయబడిన స్వీట్ల ప్యాకెట్లని చూపిస్తూ "  ఎవరూ లేరా ? "   అని మళ్ళీ అడిగాడు .

"   ఆ మూడ్ లో ఉన్నపుడు , ఎవరూ అందుబాటులో లేనప్పుడు , ఇలా అన్నీ తెచ్చుకుని , ఆ భావనతో మురిసిపోతున్నట్లు ఎడ్జష్ట్ అవుతుంటా , అంతే . ఇంద ఈ పాతిక వుంచుకోండి "   అంటూ యివ్వబోయాడు .

"   బ్రదర్ నువ్విక్కడే వుండు . సెంటర్లో తిన్న చపాతీ అదేపనిగ గొడవ చేస్తున్నది , అనుమానం తీర్చుకొస్తా " అంటూ నారాయణని తోసుకొని లోనికి వెళ్ళబోయాడు ఓ కానిస్టేబుల్ .

దాంతో కంగారెక్కువై "   ప్లీజ్ ఈ బాత్రూం బ్లాక్ అయింది , ఇంకెక్కడైనా తీర్చేసుకోండి "   అన్నాడు  .

"   బ్లాక్ అయినా , లాక్ అయినా ఇక్కడే తీర్చుకోవాలి . దగ్గర్లో అన్నీ షాపులే , ఈ సమయంలో ఎవరూ ఓపెన్ చేయరుగా "   అన్నాడు .

ఇక బండారం బయటపడ్తుందని గ్రహించి "   ఐ  మీన్ బ్లాక్ అంటే , మా లేడిస్ వెళ్ళారని "   అన్నాడు .

"   అలాగా ! వాళ్ళు వచ్చిన తర్వాతనే వెళ్తాలే "   అంటూ అక్కడే సతికిలబడ్డారిద్దరూ .

టైం నాలుగయ్యేసరికి తెలవారబోతున్నదని గ్రహించి తప్పనిసరై ఆ అమ్మాయిని పిలిచాడు . బైటకొచ్చిన ఆ అమ్మాయిని చూసిన కాన్స్టేబుల్స్ "   ఈ అమ్మాయేనా మీ లేడీస్ ? మీ వయసెంత ? "   అడిగారు .

"నలభై అయిదు ఈ మధ్యనే వచ్చింది . ఇంకా పదమూడేళ్ళ సర్వీసుంది . నా ముద్దుల మూడో భార్య , అందుకే పడుచుగా ఉంది అంతే "   అన్నాడు నారాయణ .

ఆ అమ్మాయిని ఎగాదిగా చూసి "   ఏయ్ బుకాయించకు , ఈ అమ్మాయి ఫాతిమా కంపెనీకి కొత్తగా వచ్చిన గుంట . ఈ లైనులోకే గుంట వచ్చినా , మా కంటపడకుండా , మా లిష్టులో చేరకుండా , మీకు గెష్ట్ కాలేరు . అబధ్ధాలాడకు , ఒరేయ్ 303 తగిలించరా బేడీలు , మిగతాది అక్కడ తగిలిద్దాం "   అన్నాడు .

పరిస్థితిని గ్రహించిన ఆ పడుచు "   నమస్తే మామా ఆనక కలుసుకొందాం "   అని ఆ యిరువురికి ముద్దులిచ్చి , కన్నుకొట్టి అక్కడ్నించి బయటపడింది . 

నారాయణని లోపలేసేశారు .

సెల్ లో వున్న నారాయణని కొలీగ్స్ పరామర్శించగా ఏడుస్తూ "   మీరు చెప్పినట్లు చేశా . ఆ ఛేంజ్ జరిగిందన్న ఆ ఆనందం కంటే , స్థానమార్పు జరిగిందన్న బాధ నన్ను కృంగదీస్తుంది "   అన్నాడు నారాయణ  .

"   మా మాట వింటే నీకీ కష్టాలుండేవి కావు . మేమందరం సుఖపడడం లేదా ? బజారుదాన్ని తెచ్చుకొన్నావుటగా , అనుభవించు "   అన్నారు కొలీగ్స్ .

"   సెకండ్ షో ,  వెరైటీ అన్నారుగా "  .

"   అంటే బజారుదానితో కాదు , కట్టుకున్న భార్యతో  " .

"   అదెలా ? ఫష్ట్ షోకే అవకాశం లేదు , ఇక సెకండ్ షోకా ! ఎపుడూ , ఎక్కడకు తను (పిల్లల్ని వదలి ) రానంటుంది "   అన్నాడు .


నారాయణా ఆడపిల్లలకి తల్లితండ్రులు , పెళ్ళికాకముందు మాట్నీలు , ఫష్ట్ షోలు మాత్రమే చూపిస్తుంటారు  . సెకండ్ షోలు చూపించరు . అంతదాకా చూసిన మ్యాట్నీలకు , ఫష్ట్ షోలకు , 

పెళ్ళి అయిన తర్వాత భర్త 


అర్ధం మార్చి చెప్పి , అవి ఇంటిలోనే చూపించడం అలవాటు చేస్తాడు . 

సంతానానికి  ఊహ తెలిసేసరికి ఆ మ్యాట్నీలు , ఫష్ట్ షోలు వీలుకుదరక ఇంటిలోనే సెకండ్ షోలు అలవాటు చేస్తాడు .
ఆ పిల్లలకి వయసు వచ్చేసరికి , ఆ సెకండ్ షోలు ఇంటిలో వీలుపడక , సెకండ్ షో పేరుతో బయటకు వచ్చి మనలాంటి మధ్యతరగతివాళ్ళు లాడ్జింగులు భరించలేరు కనుక , రిక్రియేషన్ క్లబ్ లాంటిది స్థాపించుకొని అందులో వరుసవారీగా రోజుకొకళ్ళు ఆ సెకండ్ షో పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తారు . మేమూ అలాగే చేస్తున్నాం . ఇదే మేము నీకు చెప్పింది . అర్ధం చేసుకోకుండా యిలా బజారుదానిని తెచ్చుకొంటే మన జీతాలు ఓ మూలకు రావు . ఇకనుంచైనా మా మరదలుకి సెకండ్ షో అలవాటు చెయ్యి , మేము బెయిల్ ఇస్తున్నాంలే , బాధపడకు "   అని వెళ్ళిపోయారు .

నారాయ
ణ 
తలవంపులుగా ఫీలవుతున్నాడు . వరలక్ష్మి యిల్లంతా సర్దుకొని నారాయణను సమీపించి " ఏమండోయ్ లేవండి , పది గంటలు కావస్తున్నది , మీరే లేస్తానన్నారు , సెకండ్ షొ టైం అయిపోతోంది , త్వరగా లేవండి "   అంటూ కుదుపుతోంది .

"   ఆ "   అంటూ హడావుడిగా లేచి , రిష్ట్ వాచి చూసుకొని ఇంకా పది కాలేదా ! "   అయితే సెకండ్ షోకి అవకాశముందన్నమాట . వరాలు త్వరగా రెడీ కా , సెకండ్ షోకి వెల్దాం . పిల్లలూ జాగ్రత్తగా చదువుకొన్నంతసేపు చదువుకొని , నిద్దరొచ్చినప్పుడు నిద్రపోండి . మీ అమ్మా , నేను సెకండ్ షో చూసి చాలా కాలమైంది , ఒక కీ మేము తీసుకెళ్తాం " అంటూ గోడకు తగిలించి వున్న తన పెళ్ళి ఫొటోని గుట్టుగా అందుకొన్నాడు .

వరలక్ష్మి అస్సలు సినిమాకి వెళ్ళే చాలా కాలమైందనుకొని , బయట తాళం వేసి బయలుదేరింది .

రిక్రియేషన్ క్లబ్ లో సెకండ్ షో చూశారిరువురూ . వరలక్ష్మికది పాత షో అయినా కొత్తగా వుండి ఓ రకమైన థ్రిల్ ఫీలయింది . "   అయితే ఇక నుంచి మనం ప్రతి 15 రోజులకొకమారు సెకండ్ షో చూడచ్చన్నమాట "   అన్నది .

ఆడవాళ్ళకు ఆ కోరికలుంటాయని , అవి తీరే మార్గం దొరకక్ చంపుకొన ప్రయత్నిస్తారని , అవి తీరే మార్గం భర్తలు అన్వేషించి చూపిస్తే , వాళ్ళు భర్తలననుసరిస్తారని నారాయణకి అప్పుడే అర్ధమైంది .


                                                            ** స ** మా **ప్తంNo comments:

Post a Comment