ఇండియన్ డాడ్ - అమెరికన్ సన్ (1)


                                                                         ఇండియన్  డాడ్  -   అమెరికన్ సన్ (1)

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్  

"  అయితే ? "        

"   చిన్న పిల్లల ముందే వాళ్ళపెద్దవాళ్ళు వాళ్ళ ఆనందాల్ని వాళ్ళు  అనుభవిస్తుంటారు .అలా అనుభవించటాన్ని వాళ్ళ సంస్కృతి నేర్పుతున్నట్లుగా భావిస్తారు . లేకుంటే బయట ప్రపంచంలోకి వెళ్ళినపుడు అదేదో తప్పుడుపని అన్న భావన ఆ చిన్నపిల్లల లో ఉండకూడదని . వాళ్ళ బెడ్ రూములకి లాక్స్ ఉండవు . అయినా వాళ్ళు ఆ సంగ
మాన్ని యధేఛ్ఛగా జరుపు కొంటారు ఎంతమంది ఇంటిలో ఉన్నా , చిన్న పిల్లలు వున్నా ఆ బెడ్ రూం డోర్ లాక్ చేయకుండానే . ఆ చిన్న పిల్లకు చిన్నతనం నుంచి బెడ్ లు సపరేట్ రూం లో వుంటాయి . ఎవరైనా బెడ్ రూం లోని వాళ్ళతో మాట్లాడాలన్నా , డోర్ తట్టి అనుమతి తీసుకొని రావాలే తప్ప డైరెక్ట్ గా యకాయకీ లోనకు వెళ్ళకూడదు . యివన్నీ చిన్నతనం నుంచి ఆ చిన్నపిల్లలకు నేర్పే సంస్కృతి , సభ్య లక్షణాలు . 5 ఏళ్ళ వరకు వాళ్ళను స్కూల్లో చేర్పించరు , ఓ వేళ చేర్చినా  ప్లే స్కూల్స్ కి మాత్రం పంపుతారు . ఎవరూ ఎట్టి పరిస్థితులలోను చిన్నపిల్లల మీద చేయి చేసుకోకూడదు .  వాళ్ళకు మొదటగా వాళ్ళు నేర్పేది ఏమిటంటే , యిది ఫోన్ , మిమ్మల్ని ఎవరైనా కొడితే , మీరు వెంటనే 911 కి కాల్ చేయండి అని , ఎలా కాల్ చేయాలో వాళ్ళు నేర్పుతారు . , ఆటలు ఆడుకోవలసిందే తప్ప చదువు నేర్చుకొనే పని వుండదు  . అలా ఆ ప్లే , కిండర్ గార్డెన్ స్కూల్స్ వాళ్ళు చూస్తున్నారో లేదోనని వీళ్ళు , cctv కెమేరాల ద్వారా లైవ్ లో చెక్ చేసుకుంటుంటారు  . పిల్లల స్వేఛ్ఛకు అడ్డు రారు వాళ్ళూ మేజర్లయ్యేంతవరకు . వాళ్ళను కావాలని వాళ్ళు కనలేదు , మేమానందాన్ని అనుభవించేటప్పుడు , ఆ ఒరవడిలో పొరపడి వచ్చారని , అంతమాత్రాన వాళ్ళ జీవితాల్ని మన పరం చేసుకొని నాశనం చేయకూడదన్నది వాళ్ళ సంస్కృతి .

ఇలా పిల్లలకు ఇంత స్వేఛ్ఛ ఎందుకివ్వటం జరిగిందంటే , వాళ్ళను కన్న తల్లితండ్రులు వాళ్ళు పెద్దయ్యేటంతవరకు కలసి ఉంటారన్న గ్యారంటీ వుండదు . మరలా వాళ్ళ తల్లితండ్రులు మరొక లైఫ్ పార్ట్నర్స్ని ఛూజ్ చేసుకొంటారు . వాళ్ళకు  అంతకుముందే వున్న ఈ చిన్నపిల్లలను చక్కగా చూస్తారన్న నమ్మకం లేక ఈ చట్టాన్ని ఏర్పరిచారు .

15 , 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవలసిందే . అంటే , గాళ్ ఫ్రెండ్స్ , బాయ్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకొని ప్రపంచాన్ని చూస్తూ , డేటింగ్ చేసుకొంటూ , ఒకరినొకరు తెలుసుకొంటూ , ఎవరూ తక్కువ కాదు మన యిరువురిలో అన్నది స్పష్టంగా తెలుసుకొంటూ , ఇదే తీరును డెవలప్ చేసుకొంటూ , ఎవరిష్టమొచ్చి
నట్లు వాళ్ళు నడచుకొంటుంటారు . వయసు హద్దులు ఏనాడూ అడ్డుపడవు ఈ డేటింగ్ సమయంలో .యిక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి . యిలా 4, 5 ఏళ్ళు గడచిన తర్వాత ఆ యిరువురూ కలసి జీవితాన్ని కొనసాగించుకోవా
లంటే , అపుడు ఈ మ్యారేజ్ అనేది ఒక వేదికగా తయారవుతుంది . అలా వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్ అవుతారే తప్ప వైఫ్ & హజ్బెండ్ లు కాలేరు . ఇలా లైఫ్ పార్ట్నర్స్ కాబోయే ముందు లీగల్ గా అగ్రిమెంట్ చేసుకొంటారు . ఎన్నాళ్ళు కలసి ఉండాలనుకుంటున్నారు ? యిరువురికి కలిగే ఆ పిల్లలని , విడిపోయిన పిమ్మట ఎవరు పెంచుకోవాలనుకొం
టున్నారు ? ఈ తరుణంలో సంపాదించినవి ఎవరు ఎంతెంత తీసుకోవాలి అన్న అన్ని విషయాలలో ఒక అగ్రిమెంట్ వ్రాసుకుని కమిట్ అవుతారు . అపుడే వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్ గా ఆథరైజ్డ్ అవుతారు . ఆ కమిట్మెంటుకి వీళ్ళను కన్న ఆ తల్లితండ్రులు రావచ్చు , రాకపోవచ్చు . ఈ లోపల కన్న తల్లితండ్రులే విడిపోయి వుండవచ్చు . ఆ ఫంక్షన్ కి ఫ్రెండ్స్ వచ్చి బొకేలు అందిస్తారు . ఆ లైఫ్ పార్త్నర్ వీళ్ళని కన్న తల్లితండ్రులకు నచ్చవలసిన అవసరం ఏమీ లేదు .   వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ని తీసుకొని , సపరేట్ యింటికి షిఫ్ట్ అయిపోవలసిందే . ఆ కమిట్మెంట్ ప్రకారం జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు . 

ఆ తర్వాత వుండాలనుకొంటే మళ్ళీ అగ్రిమెంట్ వ్రాసుకొంటారు అప్పటి వాళ్ళ స్థితిని బట్టి . లేకుంటే ఎవరికి వారే , యమునా తీరే అన్నట్లు విడిపోయి , మఱలా మరో న్యూ గై కొఱకు అన్వేషిస్తారు . లేదా కొన్నాళ్ళు ఒంటరిగా ఉంటారు , ఆ తర్వాతే మరల లైఫ్ పార్ట్నర్ కొరకు అన్వేషిస్తారు . మరల పధ్ధతులన్నీ అవే లైఫ్ పార్ట్నర్త్ సెలెక్షన్ కి .
ఇలాంటి సంస్కృతి వల్ల వయసు ప్రభావం వల్ల వచ్చే మనస్తత్వ మార్పులో , మనసుని చంపుకొని , ఆత్మవంచన చేసుకొని , పెళ్ళి చేసుకొన్నాం , తాళి కట్టించుకున్నాం / కట్టాం గనుక ఈ జీవితాంతం వాళ్ళతోనే వుండాలి , లేకుంటే మా వాళ్ళేమంటారో , సమాజం ఎలా చూస్తుందో అన్న భయాలతో కూడిన బతుకులు ఇందులో వుండవు . జీవిత           
మంటే వయసు ప్రభావం వల్ల మనసులో వచ్చే మార్పుల కనుగుణంగా జీవించటమే జీవితం . నువ్వు జీవించాల్సిం
ది నీ కొరకే , మరొకరి కొరకు కాదు . ఇండియాలోలా దాచుకొనటానికి సంపాదించరు , తపన చెందరు . జీవితాన్ని ఎంజాయ్ చేయటానికే సంపాదిస్తారు . ఎవరు ఎన్నాళ్ళుంటారో తెలియకపోయినా , ఉన్నన్నాళ్ళు ఆనందించాలను
కొంటారు . దానికి ఒక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత వయసుతో పనిలేదంటారు .
ఎవరివల్ల తాము పుట్టినా , జీవించాల్సింది తామే కాబట్టి , తన కోసమే తను జీవిస్తానంటారు అమెరికన్లు . "

"   ఇది సంస్కృతా ? "   అని అడిగాడు వాళ్ళ నాన్న .

"   అవును డాడ్  ఎందుకంటే , వారేంటో , వారి మనస్తత్వమేంటో తెలుసుకోకుండా , పెద్దలు కుదిర్చిన వాళ్ళని పెళ్ళి చేసుకొని , కొంతకాలం కలిసి జీవించాక  యిరువురి భావాలు కలవకపోవటంతో , ఎప్పటికప్పుడు మనసుకి సర్ది చెప్పుకుంటూ , ఇలా అడుగడుగున మనసుని చంపుకొంటూ , కోరికలను చంపుకొంటూ యిలా ( యిరువురి భావాలలో , పిల్లల భావాలలో ) జీవిస్తూ  , మా సంసారం బాగుంది , ఆదర్శవంతమైనది అని చెప్పుకొనే భార్యాభర్తలే   ఈ ఇండియాలో అధికంగా వున్నారు . ఇదే ఈనాటి ఇండియా సంస్కృతి . "

"  ఇలా సంబంధ బాంధవ్యాలు లేకుంటే , వార్ధక్యంలో వాళ్ళను చూసేదెవరు ? "

"  ఈ జీవనపయనంలో ఎవరికి , ఎవరూ లేరు , ఎవరితో ఎవరూ ఎన్నడు పోరు . ఎవరికి వారే యమునా తీరే అన్న నిత్య సత్యాన్ని తెలుసుకున్నారు గనుకనే  , ఎవరిమీద ఎవరూ ఆధారపడరు . వీళ్ళకు విగ్రహారాధన లేదు , గాడ్ అంటూ లేడు . వున్నది ఒక్కటే . అదే సుప్రీం పవర్ , అదే అనంతమైన శక్తి . ఆ శక్తిని నమ్మటం వలన అది
వారికున్నదనుకుంటారు  . జంతువులను నమ్ముతారు , పక్షులను , కుక్కలను పెంచుకొంటారు . శిక్షణ కుక్కలతో తమ జీవన చరమాంకంలో వాటితో కలసి జీవిస్తారు . వాళ్ళకి అవి అండదండలుగా వుంటాయి  . వాళ్ళు సంపాదన ఆ జంతు సంరక్షణకే రాసేస్తారు  . ఇలాంటి జీవితాలలో స్వార్ధం పెత్తనం చెలాయించదు . కనుక ఎవరికి వారే యమునా తీరే అన్నదే సత్యం , అదే అను నిత్యం అమెరికా జీవితాలలో . అందుకే బ్రతికినంత కాలం హాయిగా , ఆనందంగా జీవిస్తారు .

వేదాంతాల్ని , శాస్త్రాల్ని అడ్డం పెట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతుంటారు . వినేవాళ్ళూ ఎక్కువే , కాని ఆచరించేవాళ్ళే అసలు కనపడరు ఇండియాలో . 
అమెరికాలో అలా కాదు , ఆ సత్యాన్ని తెలుసుకొన్నారు కనుక  నిజ జీవితానికి అప్లై చేసుకొని ఆనందిస్తారు . ఇదే అసలు తేడా . అందుకే ఇండియాకు , అమెరికాకు అన్నిట్లో తేడానే .  

ఈ ఆచారాలు , సాంప్రదాయాలు మనుషుల్ని ఓ క్రమ పధ్ధతిలో నడుచుకొనేటందుకే అన్నది ఒక వయసు వచ్చాక గాని తెలుసుకోలేకపోయాము . ఆ సరికి వాటితో కాపురం చేసి నరనరాల్లో జీర్ణించుకున్నాం . ఇంక మేమెన్నాళ్ళు జీవిస్తామో మాకూ తెలియదు , ఎక్కువ ఏళ్ళు కాదన్నది మాకే కాదు , అందరికీ తెలుసు . ఇక ఈ కొద్దిపాటి జీవితానికి యిప్పుడు మేము మారటం , మారాలనుకోవటం గాని సబబు కాదు . 
ఇక మా వారసులంటావా , వాళ్ళు చెప్పినా వినరు , తెలుసుకోవాలన్న తపన వుండదు . దేనికంటే వాళ్ళు అనుభవం కావాలంటారు . కారణం వాళ్ళవి  మా జీన్సే కదా !.  కనుక  కాకిపిల్ల కాకికి ముద్దురా అన్నాడు .
ఇండియాలో ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా వుంచుకున్న పెద్దరికం తో కాపురం చేయటంతో ఒప్పుకోలేని  జులపాలు డాడ్  .

డాడ్ మాటలు విన్న జులపాలు కి ఇండియన్స్ పరిస్థితి చక్కగా అవగతమైంది . ఓ కే డాడ్ , ఆ కోరల్లో చిక్కుకున్న మీరు వాస్తవాన్ని గ్రహించినా , జీవితాలకు అన్వయించుకోలేని పరిస్థితి మీది . అలాగే   ( ఆత్మవంచనలతో ) జీవితాన్ని కొనసాగించండి . బై డాడ్ అంటూ జులపాల్ బాక్ టు అమెరికా  బయలుదేరి వెళ్ళిపోయాడు .

ఆకాశానికెగిరిన ఆ ఫ్లైట్ ని అలాగే చూస్తూ బై చెప్తూనే వున్నాడు . 
రువురి మధ్యా కనుచూపు మేరల కందనంతగా దూరం పెరిగిపోయింది .  వాడు అందనంత ఎత్తుకు  వెళ్ళి పోయాడు  అనుకుంటూ వెను తిరిగాడు .

                                                                          ** స ** మా ** ప్తం

6 comments:

 1. జంతువులను నమ్ముతారు కాని మనుషులను నమ్మలేరు. గొప్ప సంస్కృతి కదా :) బుర్రపూర్తిగా చెడిపోయింది నాకు.

  ReplyDelete
  Replies
  1. జంతువులను వాళ్ళకిష్టం వచ్చినట్లుగ శిక్షణ యిస్తారు . అవి బుధ్ధిగ సిక్షణ పొందుతాయి . మనుషులు అలా కడు కదా! . వీళ్ళ ఆలోచనలను ఎదురు చెప్తారుగదా ! .
   మనుషుల్లాగ నయవంచన జంతువులకు తెలియదు కదా! . ఇందుకేనేమో వాళ్ళు మనుషులని కన్న జంతువులను నమ్ముతున్నది .

   Delete
 2. నిజం చెప్పాలంటె మన బారతదేశం లొ వున్న చాలామంది బార్యా బర్తలు పరువు ప్రతిస్ట కొసం ఒకరంటె ఒకరికి ఏమాత్రం ఇస్టం లేకుండానే నిత్యం కలహించుకుంటూ అటు విడి పొలేకా అటు కలసి వుండలేక నరకం అనుభవిస్తున్నారు. ఇస్టం వున్నన్నిరొజులు కలిసుండటం లేకుంటే విడిపొవడం చాలాఉత్తమైన పద్దతి ఈ విషయంలొ అమెరికన్స్ అదౄస్టవంతులు.

  ReplyDelete
  Replies
  1. నిజాన్ని ధైర్యంగా చెప్పినందులకు కృతజ్నతలు .

   Delete
 3. US lo systems definite gaa chala baavuntaayi. But marriage ane samskruthi daaniki kattubadi undatam ( ante undevaaallaku) india lo baavuntundani nenu anukuntunnanu..pillalu oka healthy atmosphere lo peragataaniki healthy family life punaadi vesthundanedi naa strong feeling.family relations,wife and husband relations Chuttalu, social relations anevi unte asalu Us lo vanka petataniki emi undedi kaadu.......

  ReplyDelete
  Replies
  1. మనం శాశ్వతం కాదని , మనందరికీ తెలుసు , పదే పదే చర్చించుకొంటాం , గొప్పగా ఫీలైపోతుంటాం . అటువంటి మనం శాశ్వత బంధాలను ఏర్పరచుకొంటాం . ఆ శాశ్వత బంధాల కొరకు ఒకరి నొకరం పలుమార్లు తిట్టుకొంటూ , ఛీదరించుకొంటూ జీవితకాలం వృధా చేసుకొంటుంటాం . ఒక్కసారి కాదు ఎక్కువ సార్లు ఆలోచిస్తూ , మన నడవడి మనకు కావలసినట్లుగా మార్చుకొని ఆ శాశ్వత బంధాలను ఆనందంగా కొనశాగించుకోవచ్చు . పిల్లల పెంపకం విషయానికొస్తే , మనం సరిగ్గా ( పైన చెప్పినట్లుగా ) ఉండగలిగితే ఇండియాలో బాగుంటుంది . ఎవరికి వారు తమ స్వేఛ్ఛ కొరకు ఎప్పుడూ ఫైట్ చేస్తుంటుంటారు , పొందకున్నా అలాగే కంటిన్యూ అవుతుంటారు . పిల్లల స్వేఛ్ఛని తమ కక్శ లోకి తీసుకొని వాళ్ళ జీవితాలను తమకిష్టమైన రీతిలో తిప్పాలని విశ్వ ప్రయయత్నం చేస్తూనే ఉంటారు . వీటినే ఆత్మ వంచన బ్రతుకులు అంటారు .
   మిమ్మల్నేవరినీ మారమనను గానీ , వాస్తవాలని తెలుసుకొనమంటాను . మనిశి ఉన్నతికి ఈ దృక్పధం చాలా మంచిది , అంతే .

   Delete