ఉఱకలు వేసే మనసు


                                                   
                                                                                         

కోర్టులో ఏదైనా కేసు న్యాయవిచారణ జరిగే సమయంలో చాలామంది జనసందోహంతో నిండి వుండటం అనాదిగా వస్తున్న ఆచారం .కానీ ఈ రోజు జరిగే కేసు విచారణ అందుకు  పూర్తి భిన్నంగా వున్నది.

ఈ కేసు మామూలు కేసు కాకపోవటం , రేప్ కేసుగా నమోదు చేసుకోవటమే అసలు కారణం . అందువలననే ఈ రోజు కోర్టులో జడ్జ్ , పబ్లిక్ ప్రాసిక్యూటర్ , డిఫెన్స్ లాయర్ , ముద్దాయి , రేప్ చేయబడిన స్త్రీ , సాక్షులు మాత్రమే ఉన్నారు .

ఈ సందర్భాన్ని ఇన్ కెమేరా అంటారు. విచారణ ప్రారంభమైనది .

"   దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను , అబధ్ధం అసలు చెప్పను "   అనిడఫేదారు కోర్ట్ లో జడ్జ్ ఎదుట ప్రమాణం చేయించాడు రంగనాధం చేత .

పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన సీటు నుంచి లేచి బోను వద్దకు వెళ్ళి , "   మీ పేరు ? "

"   కొనకంచి రంగనాధం ."

"   మీరు మంగి అనే పని అమ్మాయిని బలాత్కరించారని కేసు నమోదు అయింది . అందుకు మీ సంజాయిషీ " అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్  .

"   లేదు . ఆ అమ్మాయిని ఈ రోజే చూస్తున్నాను ."

"   మఱి ఆ అమ్మాయి మీరే రేప్ చేశారని ఆరోపణ చేస్తున్నది ."

"   ఆరోపణలు చేయటానికి నా స్టేటస్ , నా ఆస్తే మూలకారణం . "

"   మీకు ఏ వయసులో వివాహమైంది ? "

"    ముఫ్ఫయ్యవ ఏట ."

"    మీ భాగస్వామి యిపుడున్నారా ? "

"   లేరు. ఈ లోకాన్ని, నన్ను , నా వాళ్ళందరిని వదలి వెళ్ళి ఆరు సంవత్సరాలవుతున్నది . "

"    మీ ఆవిడగారు మీ దాంపత్యజీవితంలో మీకు సహకరించేదా ? "

"   సందేహం లేకుండా సహకరించేది అన్ని విధాలా . ఏనాడూ ఎదురు చెప్పేది కాదు ."

"   మీకెంతమంది సంతానం ? "

"   ఇరువురు మగపిల్లలు , ఇరువురు ఆడపిల్లలు ."

"   ఇపుడు వాళ్ళకు పెళ్ళిళ్ళయి వుండాలి ? "

"   అయి వుండటమేమిటి ? వాళ్ళకు ఒక్కొకళ్ళకి ముగ్గురు చొప్పున పిల్లలున్నారు ."

"   అంటే మీరు తాతగారన్నమాట ? "

"   ఉన్నమాటే . "

"   నిన్న మీ ఇంటిలో ఫంక్షన్ జరిగింది కదూ ? "

"   అవును ."

"   ఎవరెవరు వచ్చారు ? "

"   పిలచిన వారందరూ వచ్చారు.  అమితంగా ఆనందపడ్డాను . "

"   దట్సాల్ యువరానర్ ."

"   దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబధ్ధం అసలు చెప్పను "  ని డఫేదారు కోర్ట్ లో జడ్జ్ ఎదుట ప్రమాణం చేయించాడు  ఆ అమ్మాయి చేత .

పబ్లిక్ ప్రాసిక్యూటర్ బోను వద్దకు వచ్చి "   నీ పెరు  "   అడిగాడు.

"   మంగి అండి . "

"   నువ్వేం చేస్తుంటావ్ ? "

"   పనిమనిసినండి . "

ఈ అమ్మాయి కెదురు బోనులో నిలబడ్డ ముద్దాయిని చూపిస్తూ, "   ఆయన నీకు తెలుసా ? " అడిగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ .

"   తెలుసండి. ఆయనేనండి  నన్ను బలాత్కరించింది ."

"   నువ్వు వాళ్ళింట్లొ పనిమనిషివా ? "

"   నేదండి. మా మామ వాళ్ళీంట్లొ పని సేత్తాడు ."

"   మఱి నిన్నెలా బలాత్కరించారు ? "

"   ఆ రోజు ఆ అయ్యగారింట్లో పేద్ద ఫంక్షన్ జరుగుతుండాదని , పని శానా ఉంటాదని , మా మామ ఒంటిగ సేయనేడని , మా మామకి తోడుగుంటానని  , నన్నెటూ మా మామకిచ్చే జోడు కట్టించాలని మా అయ్య నన్ను ఆ అయ్యగారింటికి అంపాడు . "

ఆ తర్వాత....

నాను డ్రింక్స్ ట్రే లో పెట్టి యిత్తా ఉంటే , మా మామ అందరికి ఆ డ్రింక్స్ యిత్తుండాడు . ఇంతలొ ఈ అయ్యగోరు మా మామని పిల్చి ఓ ఖాళీ సీసానిచ్చి , ఇల్లాటిదే మందు సీసా బేగి పట్టుకు రారా అంటూ డబ్బులిచ్చి  బైటకు అంపాడు .

"   మంగా అన్నీ ప్లేట్లలో పెట్టేయ్ , నానిపుడే వత్తా , ఇద్దరం కల్సి ఇచ్చేద్దాం, తొరగా అయిపొతాయ్ " బైటకెల్లాడు మా మామ . 

నాను అన్నీ సర్దుతూ ఉండా. పదొ , పదిహేను క్షణాలు గడిచాయనుకుంటా , ఈయనగోరు నన్ను ఆయన గదికి పిల్చి,ఇంకా నీ మామ మందు పట్టుకు రాలేదేమే , మందు నేకుంటే  మనలేకపోతుండా .కొంచెం   ఆ డ్రింకైనా నోట్టో పొయ్యవే అన్నారు. ఎంటనే లగెత్తుకెల్లి డ్రింక్ సీసా తెచ్చి గళాసు కోసంసూత్తున్నా.ఆడ నేదే , ఆ మంచం కాడ ఉండాదే అన్నారు.గళాసు కొసం మంచం వైపు వెల్లి వంగానో ,లేదో , ఎనకమాలగా వచ్చి సటుక్కున నా నడుము సుట్టేసి, ఆమంచం మీదనే పండేశారు. అయ్యగోరు  , ఏంటిది ? నేను మంగిని , మీ  గవర్రాజుకి  కాబోయే పెల్లాన్ని. తప్పు అయ్యగోరు , వదలండి , వదలండి అంటూ ఎంతగానో బతిమలాడాను. అయినా వదల్లేదు. మీ పరువు బజారున ఏత్తానన్న వదల్లెదు  . ఆయనకి కళ్ళు మాత్రమే పని సేత్తున్నట్టున్నాయి కాబోలు , నా అందాలు , నా వయసు మాత్రమే ఆయన కంటికి కనపడుతున్నట్టున్నాయి. మా మామ మిమ్మల్ని సంపేత్తాడన్నా వదలలేదు .ఈయనగోరికి నా మాటలు సెవిన పడ్డట్టు నేదు. అంతదాకా ఓపికలేనట్టు పడక్కుర్చీలో కూర్చున్న ఈయనగోరికి 
అంత ఏనుగు బలం ఏదనుంచి వచ్చినాదో అర్దమవలా ! ఎంత గింజుకుంటున్నా, నంజుకుందామని తన ప్రయత్నం తను  సేత్తూనే ఉన్నారు. నా ప్రయత్నం నేను సేత్తూనే ఉండా.చివరికి యిడిపించుకునేసరికి జరుగకూడనిది  జరిగిపోనాది . 
అపుడే ఆయనగోరిని వదిలించుకోగలిగానని అర్ధమైనాది . నా జీయితానికి రేపు అనేది నేకుండా రేపు సేసేసినారు ఏడుస్తూ విన్నవించింది మంగి .

"  చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా ? "   పబ్లిక్ ప్రాసిక్యూటర్ .

అంత బాధలో కూడా నవ్వాపుకోలేకపోయింది మంగి . "   ఇటువంటి పనులు ఎవరైనా సూసేలా సేత్తారా బాబూ ". 

"  ఆ రోజు ఇంట్లో చాలామంది ఉన్నారు గదా ! ఏ ఒక్కరూ చూడలేదా ? "   పబ్లిక్ ప్రాసిక్యూటర్ . 

"  విడి రోజుల్లో అయితే , ఎవల్లో ఒకల్లు ఇంట్లో తిరుగుతుంటారని , ఈ ఫంక్షన్లో లగ్గమెట్టుకున్నట్టున్నారు . అందరూ 
ఫంక్షన్ సందడిలో బిజీగా ఉన్నారు . మా మామను మందు వంకతో బైటకు అంపి, ఇంత కాని పనిని పూర్తి 
సేసేసుకున్నారు ."

"  మఱింకేమైనా  ఆధారాలున్నాయా ? "   పబ్లిక్ ప్రాసిక్యూటర్ . 

"  నాను యిడిపించుకొని తలుపులు తీసుకొని వరండాలోకి వత్తా వుంటే , మా మామ అపుడే లోనకు వత్తుండాడు 
నన్ను , నా సినిగిన రైకని , పడిన గాంట్లను సూసి, ఏటే ఏమైనాదే మంగా అని అదిగితే , జరిగిందంతా ఏడుత్తూనే 
సెప్పేశా.అల్లంత దూరంలో డి ఎస్ పి గారితో ఫంక్షనుకొచ్చిన ఓ  కానిస్టేబుల్ నుల్చొన్నాడు. ఆతను మా ఇంటి 
ప్రక్కనే ఉంటాడు . అతనికి జరిగిందంతా వివరించాడు మా మామ ."

"  సరే మళ్ళీ  పిలుస్తాం నువ్వెళ్ళి అక్కడా కూర్చో "   అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ .     
  
"   గవర్రాజు , గవర్రాజు , గవర్రాజు "  అని పిలవగానే డఫేదారు ఆనవాయితీప్రకారం దేవుని ఎదుట ప్రమాణం చేసి 
అంతా నిజమే చెబుతాను , అబధ్ధం చెప్పను "   అని ప్రమాణం చేయించాడు .

"   ఆ రోజు ఏం చూశావు ? "   పబ్లిక్ ప్రాసిక్యూటర్ .

"   నాను మందు బాటిల్తో వరండాలోకి అడుగెట్టగానే నా మంగి సినిగిన రైకతో, వంటిపై పడిన గాంట్ల రత్తంతో ,
భయంగా లగెత్తుకుంటా వత్తుండాది . ఏటే ? అని అడిగా . 
పెద్దయ్యగోరు తనను బలాత్కరించారని , ఎంత గింజుకున్నా, బామాలినా, బతిమలాడినా , బెదిరించినా వదల్లే
దని సెప్పింది . మామూలుగైతే మా అయ్యగోరు ఈ పని సేశారంటే నమ్మేవాడిని కాదయ్య . కళ్ళముందు సాచ్చాలు 
కనపడుతుంటే , అందునా రేపో ,మాపో కట్టుకోబోతున్నదానిని అలా సేసినట్టు కనపడుతుంటే , నమ్మకుండా 
ఎలా ఉండగలను ? అడుగుదామని ఎల్లా ? ఆయనక్కడ లేరు . జరిగిందంతా కానిస్టేబుల్ కి వివరించి , డి ఎస్ పీ 
గారికీ వివరించా . మంగిని ఆయనగోరు చూసి కేసు నమోదు చేసుకొని ఆసుపత్రిలో జాయిన్ చేశారు వైద్యం కొఱకు . 
ఆ తర్వాత ఈయనగోరిని అరెష్ట్ చేశారు . మా ఇద్దరి పెళ్ళీ ఆయనే జరిపిస్తామన్నారు నమ్మాను . 
ఎకాఎకీ ఏకబిగిన శోభనాన్నే పూర్తి చేశారు .అయ్యా  జడ్జ్ గారూ , మీరు దైవ సరూపులు, బాగా ఆలోచించి ఇటువంటి 
నయవంచకులకు , మేక వన్నె పులులకు సరైన సిచ్చ వేసి , మాలాటి పేదోల్లకు అన్నాయం ఇక ముందైనా 
జరుగకుండా సూడండి ."

" సరే నువ్వెళ్ళచ్చు "   పబ్లిక్ ప్రాసిక్యూటర్  .

డఫేదారు కానిస్టేబుల్ ని పిలిచి "   దేవుని ఎదుట పృఅమాణం చేసి అంతా నిజమే చెబుతాను , అబధ్ధం చెప్పను "
అని ప్రమాణం చేయించాడు . 

""   ఆ రోజు నీవేమి చూశావు ? "

గవర్రాజు , మంగి రంగనాధం గారి గదినుంచి తిరిగి వస్తూ, మంగిని ఆయనగారు రేప్ చేశారని , చినిగిన రైక , 
వంటిమీద గాంట్లు చూపించారు . నేను వెంటనే అచ్చటే వున్న మా డి ఎస్ పీ గారికి రిపోర్ట్ చేశాను . ఆ తర్వాత 
అంతా మీకు తెలిసిందే .

డఫేదారు డి ఎస్ ఫీ గారి చేత "   దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబధ్ధం చెప్పను " 
అని ప్రమాణం చేయించాడు .

"  డి ఎస్ పీ గారు , మీరు ఆ రోజు ఆ సమయంలో అచ్చటే వున్నారు గదా ! ఏం జరిగింది ? "   పబ్లిక్ ప్రాసిక్యూటర్ .

"   ఏం జరిగిందో నేను స్వయంగా చూడలేదు  . కానిస్టేబుల్ చెప్పగా , వెంటనే వెళ్ళి పరిశీలించి , వెంటనే అవసర
మైన చర్య తీసుకున్నాను ."

"  మిలార్డ్ ,ఈ సాక్షులందరినీ విచారించిన మీదట , నేరం ఋజువైనందున  ముద్దాయికి తగిన శిక్షను వేయవలసిందిగా కోరుచున్నాను "  అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ .

"  మిష్టర్ రంగనాధం గారు  , మీరు మంగి అనే పదారేళ్ళ అమ్మాయిని బలాత్కారంగా అత్యాచారం జరిపినట్లుగా 
సాక్ష్యాధారాలతొ ఋజువైనందున , మీ సంజాయిషీ ఏమైనా ఉంటే తెలపండి . "


డఫేదారు బోను వద్దకు వచ్చి "   దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను , అబధ్ధం చెప్పనే చెప్పను " ప్రమాణం చేయించాడు .

"   మిలార్డ్ , నేను చెప్పబోయేదినాకేదో శిక్ష తగ్గటానికి కాదు .రేప్ కి సంబంధించిన ముఖ్య విషయాలను వెల్లడి
చేయదలచుకొన్నాను. అందులకు కోర్టు వారిని అనుమతి కోరుచున్నాను .
మన సమాజంలో ఎపుడైనా ఇటువంటి పొరపాట్లు జరిగినపుడు , ఆ ముద్దాయిని బంధించి , మన హిందూ ధర్మ 
శాస్త్రాల చట్ట ప్రకారంగా శిక్షను వేసి అమలు జరపటం జరుగుతున్నది .  ఆ శిక్ష పూర్తయిన తరువాత ,శిక్షణ పూర్తయినవానిలా మామూలు ప్రపంచంలోకి వచ్చి , మఱల మఱలా కొన్ని కొత్త , పాత నేరాలను ఉద్దెశపూర్వకంగా చెసి పట్టుబడటం , శిక్ష పడినపుడు అమలు జరపటం జరుగుతున్నది .అసలు ఈ పొరపాట్లు ఎందువలన జరుగు తున్నాయి అన్న విషయం ఆలోచించి దానికి ఒక చక్కటి సొల్యూషన్ చూసినట్లయితే , ఆ పొరపాట్లు మఱల మఱల  ఏ మనిషీ చేయటానికి ఉపక్రమించడు అని ఎపుడూ అనుకొంటుండేవాడిని . 

మన సామాజిక వ్యవస్థలో మానవ జీవన మనుగడకి భార్యాభర్తల సంబంధం ఓ పవిత్రమైనది , మూలమైనది . 
ఆ బంధాన్ని అటు భార్య కాని , ఇటు భర్త కాని కలకాలం కొనసాగించాలి . అలా సాగించటంకొఱకు , జీవితంలో 
నిలదొక్కుకున్న తర్వాతనే పెళ్ళిచేసుకోవటం జరుగుతున్నది మగవాడు . కారణం ఆ నిలదొక్కుకోవటానికి 
ఇంతకాలం అని ఎవరూ చెప్పలేరు.అది 25 సంవత్సరాల నుంచి 30సంవత్సరాలు కావచ్చు , ఇంకా పెరగవచ్చు కూడా .అలా నిలదొక్కుకున్న ఆ మగవాడు 3 నుంచి 6 ఏళ్ళ వయసు తేడా కల అమ్మాయి  ఈడు , జోడుగుంటుం దని పెళ్ళి చేసుకోవటం జరుగుతున్నది. నా వరకు నేను 30 వ ఏట వివాహం చేసుకొన్నాను. నాకు 25ఏళ్ళ వయసు గల అందమైన , అణకువ గలిగిన భార్య లభించింది .ఏనాడూ ఏ విషయంలో ఎదురు చెప్పి ఎరుగదు . ఎలా అంటే అలా ఆనందాలని అందించేది .తాను సంసార సుఖంయిలా ఉంటుందని తెలుసుకున్నది నాతోనే . అయినా నాలో ఎపుడూ ఏదో వెలితి ఆ శృంగార విషయంలో , ఇంకా ఏదో కావాలని ఎదురు చూసేవాణ్ణి .
మన శాస్త్రాల్లో , పురాణాల్లో , కావ్యాల్లో, పదారేళ్ళ వయసులోని యౌవనపు సొగసులోని అందాల ఆనందాలు మఱే వయసు లోనూ లభించవనే మఱీ మఱీ ఘోషిస్తున్నాయి . మఱి అటువంటి అందాలను ఆనందించటం నా వఱకు నాకు లభ్యం కాలేదు .నా భార్య అనుకూలవతి , ఏ విషయంలోను ఎదురు చెప్పకుండా ఆ సుఖాల్ని అందించినా , ఆ పదారేళ్ళ వయసు యౌవనపు సొగసుల్ని  చూడలేకపోయానే అన్న ఆ వెలితి వెలితిగానే మిగిలిపోయింది .
ఆ వెలితిని భర్తీ చేయాలని ఎన్నో మారులు ప్రయత్నించాను , కానీ నా స్టేటస్ , మన చట్టం  నన్ను అడుగు ముందుకు వేయకుండా ఆపేశాయి .ఈ వయసులో ఈ కోరిక ఏమిటని ఆశ్ఛర్యపోతున్నారు కదూ ! వయసు పెరుగుతున్న కొద్దీ ,నా కోరిక కూడా వృధ్ధి అవుతూ సాగింది . 

నిజానికి ఆ కోరిక మనసుకి సంబంధించినదని , వయసుకి సంబంధించినది కాదని చాలా మందికి తెలియనే 
తెలియదు . 

ఈ రోజు నా కొడుకులు , కోడళ్ళు ,కూతుళ్ళు , అల్లుళ్ళు , మనుమళ్ళు , మనుమరాండ్రు ,సమాజం ముందు దోషిగా 
నిలబడటానికి కూడా సిధ్ధపడ్డాను అంటే , ఒక్కమారు బాగా ఆలోచించండి , ఆ వెలితి ఎంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నదో. అందుకే వీటన్నిటీనీ తెగించి , ఒక అడుగు ముందుకు వేశాను .ముక్కూ , ముఖం తెలియని , ముక్కు పచ్చలారని పదారేళ్ళ ప్రాయంతో యౌవనపు ప్రాంగణంలో అడుగు వేసిన ఈ అమాయకపు పని పిల్లను , నా వెలితిని పూర్తి చేసేదానినిగా ఎన్నుకున్నాను . అంతా ముందుగానే ప్లాను చేశా . బలాత్కరించాను. నాకు తెలుసు ఏ శిక్ష పడుతుందో ? అందుకు కూడా ఆ వెలితి నన్ను వెనకాడానీయలేదు .  ఏ వెలితిని భర్తీ చేయాలనుకొని , సిగ్గు , శరం, మానం ,అభిమానం ,అవమానం లాంటి వన్నింటినీ వదిలి ఇంతకు తెగించానో  ఆ వెలితి ఈ క్షణంలో కూడా వెలితిగానే మిగిలిపోయింది . దేనికైనా సమ ఉజ్జీ కావాలంటుంటారు . అది సర్వత్రా నిజమేనని యిప్పటికి తెలిసింది . ఇపుడు నా వయసు 16 , 17 కాదు  70 . ఇప్పుడే తెలిసింది . 

ఈ రేప్ మొదటనే నేను అంగీకరించినట్లయితే , నేనెందుకు చేశానో  తెలిసేది కాదు , అందుకే మొదట మీతో అబధ్ధం చెప్పాను నేను చేయలేదని . నిజంగా నేనీ నేరం చేశాను . నాకే శిక్ష విధించినా , నుభవించటానికి సిధ్ధంగా ఉన్నాను  . నాకీ అవకాశం ఇచ్చిన మీకు నా కృతఙ్నతలు అన్నాడు రంగనాధం .

అంతవఱకు విన్న జడ్జ్ "  ముద్దాయి తన వ్యక్తిగత భావాలతో ఈ రేప్ చేయటం జరిగిందని అర్ధంచేసుకోవటమైనది . 
ముద్దాయి రంగనాధం తను తప్పు చేసినట్లు అంగీకరించినందున , ఐ పి సి సెక్షన్ 376 ( 2  ) ప్రకారము   7 ఏళ్ళు కారాగార వాసము , భారత స్త్రీ భవిష్యత్తుకి మూలాధారమైన , మూలధనమైన శీలాన్ని తస్కరించినందున , ముద్దాయి యావదాస్తిలో సగ భాగం మంగికి వ్రాతపూర్వకంగా యావత్ హక్కులతో యీయవలెనని తీర్పు చెప్పడమైనది .


                                                                ****   సమాప్తం  ****    


No comments:

Post a Comment