బామ్మ మాట - బంగారు బాట


                                                                  బామ్మ మాట - బంగారు బాట
                                                                                                                            కధా రచన : శర్మ జీ ఎస్
రాహుల్ అందరిలాంటి వాడు కాదు  ,  వీడి టేస్టే డిఫరెంటు అని చెప్పుకొని తీరాల్సిందే  .  ఫస్ట్ నైట్ అందరూ
అత్తగారింట్లో అందంగా అలంకరించబడిన బెడ్ రూం లో జరుపుకుంటుంటారు . కానీ మన రాహుల్ మాత్రం అలా కాదు , అత్తగారింట్లోనే వున్న బెడ్ ని అందంగా అలంకరింపజేసి ,దానిని ఆరుబైట టోటల్ గా ఓపెన్ ప్లేసు లో వేయించుకొని వెన్నెల సొగసులలో జరపాలని  నిశ్చయ తాంబూలాలనాడే ఈ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పేసి అలా ఫిక్స్ అయిపోయాడు .

అల్లుడి ఈ డిఫరెంట్ టేస్ట్ ని అర్ధం చేసుకొన్న మామగారు స్పెషల్ గా ఊరికి దూరంగా వున్న గెస్ట్హౌస్ బుక్ చేసి అందంగా అలంకరించబడిన ఆ బెడ్ ని అక్కడకి తరలించి రేంజిలో  అరేంజ్ చేశాడు అన్నమాట . అదీ అల్లుడు కోరినట్లు ఆరుబయట .

అన్ని అరేంజ్ మెంట్స్ ముందే చేయటం వల్ల వీళ్ళిద్దరే ఆ ప్లేస్ కి హనీమూన్ కి వెళ్ళినట్లుగా తరలి వచ్చారు రాహుల్ , రంజితలు  జంటగా . 

అందరి పెళ్ళికూతుళ్ళలా కుడిచేతిలో పాలగ్లాసు , నేల చూపులు కలసి వెరసి రంజిత ఆ పందిరి మంచం వద్దకు తల
వంచుకుని వస్తూ గది తలుపు గడియ పెట్టి వచ్చింది . పాల గ్లాసుతో వచ్చిన రంజిత భుజం మీద చేయి వేసి దగ్గకు
తీసుకొని తల పైకెత్తాడు , ఇంకా నేలచూపులు చూస్తూనే వున్నది . చేతిలోని గ్లాసు అందుకుని ఆ ప్రక్కనే వున్న బల్లమీద ఉంచి , తనను తనతో మంచం వద్దకు  తీసుకువెళ్ళి కూర్చున్నాడు .

వెంటనే తను లేచి రాహుల్ పాదాలకు పాదాభివందనం చేసి , పుస్తెలను కళ్ళకద్దుకొన్నది రంజిత .

"   ఏయ్ ఏమిటి అలా పుస్తెలను కళ్ళకద్దుకొంటున్నావ్ ? "  అడిగాడు .

" మా అమ్మమ్మ చెప్పింది , ఈ పుస్తెలు ఆడదాని ఐదవతనానికి నిదర్శనమని అని బదులిచ్చింది  ."

"  ఇంకా ఏం చెప్పింది ? "

"   పతియే ప్రత్యక్షదైవం అని కూడా చెప్పింది  . "

"   అంటే ? "

"   అదేనండి , మా ఆడవాళ్ళకు , కళ్ళకు కనపడే దేవుడు ఈ మొగుడేనని  . "
                     
"   అలాగా ! ఇంకాఏమైనా చెప్పిందా ? "

"   ఆయన అడిగినట్లు అనువుగ వుండమందండి ."

"   అనువుగ అంటే ?  "

"   నాకు తెలియదండి . మీకు తెలుసనుకున్నాను . అందుకే అడగలేదండి . మీకూ తెలియదా !అయితే ఓ మారు మా అమ్మమ్మకు ఫోన్ చేసి అడిగి చెపుతానండి "   అని మొబైల్ తీసుకున్నది .

"   ఆగు , అక్కడే ఆగు . అంత తొందరెందుకు , నేనేమైనా తెలియదని నీకు చెప్పానా ? " 

"   లేదండి  "   అన్నది భయపడ్తూ .
"    భయపడకు . ఇపుడు కావలసింది అణకువ , మెలకువ , ఆ పై రాత్రంతా కువ కువ .అర్ధమైందా ? "   అన్నాడు .

"   ఆ ఇపుడే అర్ధమవుతూ వుందండి "  అన్నది .

అమాంతంగా కౌగిలించుకొని , "  నీకు ఇంతకు ముందేమైనా అనుభవం ఉందా ? "  అడిగాడు .

"   ఈ అనుభవమా ! అహ లేదండి . ఇపుడే కదా లైసెన్స్ యిచ్చింది . "  

"   పెళ్ళికాక ముందు . "

ఎవరిస్తారండి   లైసెన్స్ , అపుడది న్యూసెన్స్ కదా ? "

"   లైసెన్స్ యివ్వకపోతే కోరికలు ఆగవు కదా ? "

"   ఆగనంత మాత్రాన , అలాంటి ప్రయత్నాలు చేసి ఆగమయిపోవటం కరెక్ట్ కాదని తెలిసినదాన్నికాబట్టి ఇంతదాకా వెయిట్ చేశాను . " 

"   సరే  , ఇలా రా , ఇక కధ మొదలెడదాం . "

"   నాకేమి కధలు రావు బాబు , మీరే మొదలుపెట్టండి , నే మీ పక్కనే ఉంటాను ."

"   ఉంటేనే మన కధ నడుస్తుంది , లేకుంటే  మనకు  వ్యధే మిగులుతుంది . "

"   మా అమ్మమ్మ కూడా ఇదే చెప్పింది , మీరెలా అంటే , అలాగేసహకరించి ప్రోత్సహించమని . "  

"   అందుకే సహకరించి ప్రోత్సహిస్తానంటున్నావా ? "             

"   అవునండి , లేకపోతే నాకెలా తెలుస్తుంది ఇక్కడి మీ కధ ? "

" నిజమే ,మీ అమ్మమ్మ చెప్పకపోయుంటే నా గతి ఏం కాను . పోనీలే యిది నా అదృష్టం .  నీకన్నీ మీఅమ్మమ్మే చెప్పేదా ? "

" చెప్పటమేమిటి ? నన్ను పెంచింది ఆమే . "

"  మరి మీ అమ్మా , నాన్నలు నిన్ను కని పడేశారా ? " 

"    కని పారేశారా అన్నట్లు అడిగారే , నన్నెక్కడా పడేయలా , మా అమ్మమ్మ దగ్గరే వదిలేశారు , అదీ తప్పని సరై . అపుడు మానాన్నగారికి  నా చిన్నతనంలో ఫారెస్ట్ కి బదిలీ చేశారుట .అక్కడ నన్ను మా అమ్మ ఒక్కతె చూడలేదని మా అమ్మమ్మవద్ద వదిలేశారు . ఆ తర్వాత నాకు 6 వ ఏట మరల మా నాన్నను జనసంచారంలోనకి బదిలీ చేశారు
ట . మా అమ్మ వచ్చి నన్ను రమ్మనమంది . నేనే వెళ్ళటానికి యిష్టపడక అమ్మమ్మ వద్దనే వుండిపోయా ."

"   మరి నీ చదువులు ? "   

"   అన్నీ మా అమ్మమ్మే . "

"   మీరుండేది పల్లెటూరు కదా ! "

"   అందుకనే హైదరాబాదులో నన్ను చదువుకోవటానికి , మా బామ్మని వండిపెట్టటానికి  పంపించేశారు ." 

"  నువ్వు ఇంత ఉన్నత చదువులు చదువుకున్నా , పల్లెటూరుదానివి లాగనే ప్రవర్తిస్తున్నావు . "

"   చదువుకుంటే ఎలా ఉంటారేంటి ? "

చదువుకున్న వాళ్ళకి పెద్దల సంప్రదాయాలు నచ్చవు కదా !  "

"   అలా నచ్చకపోవటానికి , నేనేమి ఒంటరిగా లేను కదా , మా అమ్మమ్మ్మ నా పక్కనేవుండటంతో  ఆ                      సంప్రదాయాలన్నీ నూరిపోసింది అడుగడుగునా . "

"   అందుకేనా నువ్వేది మాట్లాడినా మా అమ్మ అనకుండా మా అమ్మమ్మ అంటుంటావు ."

"   నాకు మా అమ్మమ్మే సర్వస్వం . "

"   మరి నేను ? "

"  పెళ్ళి చేసుకునే దాకా మీరెవరో ?   ఇక ముందు మీరు కూడా . "

"   అంటే అప్పుడు కూడా , మీ అమ్మమ్మ కూడానా .... ".

"   ఇంతదాకా మీకు నాకు పరిచయం లేదుగా . ఇపుడేగా ఈ పెళ్ళి తతంగంతో మనం కలుసుకున్నాం . "

"   ఇంకా కల్సుకోలేదు కదా , ఆ విషయం అలాగే వుంచి మనమిరువురం మాట్లాడుకుంటున్నాం . "

"   అందువలననే కదా మెలమెల్లగా దగ్గరవుతున్నాం "   అంటూ మళ్ళీ ఆ రెండు పుస్తెలను కళ్ళకద్దుకున్నది .

"   నన్నెదురుగాపెట్టుకొని  కూడా , మాటి మాటికి ఆ పుస్తెలను కళ్ళకద్దుకోవటమే సరిపోతుంది నీకు  . ఏదీ ఆ పుస్తెలు యిటివ్వు ఓ సారి . "

"   ఇవి మీరు కట్టినవేగా , చాలా చాలా బాగున్నాయి . "

"   ఆ పుస్తెలు బాగుండాల్సింది నాకు , నీకు కాదు ." 

"   అదేమిటి మా అమ్మమ్మ అలా చెప్పలేదే . ఈ పుస్తెలుబాగుంటేనే నీ సంసారం బాగుంటుందన్నదే .  మరి ఈ ఫిట్టింగ్ ఏమిటి మళ్ళీ . "

"   అది సరే గాని ఒకటి మేం తెచ్చినది ఎంత బాగుందో చూడు ,మరొకటి మీ వాళ్ళు పెట్టింది , ఎంత పలచగా ఉందో చూడు . "

"   అవునండి . ఆ రెండు పుస్తెలు మీరే తీసుకు రావచ్చుగా . " 

"   అలా రెండూ మేం తీసుకు రాకూడదు . ఇలా తీసుకు రావటంలో అంతరార్ధందాగుందట  ."

"   అలాగా !అదేమిటండి ? "

"    సహజంగా పుట్టింటి వాళ్ళు పెట్టే పుస్తెలు పలచగా వుంటుంటాయి . వాటి చేతాళం మీద శ్రధ్ధచూపరు . పెళ్ళి ఖర్చు ఎంతైనా పెడతారు . "

"   అదేమిటి అలా అనేశారు . ఇంత ఖర్చు పెట్టినవాళ్ళు ఆ మాత్రం పెట్టలేరా ? "

"    మీ వాళ్ళే కాదు , ఎవరైనా అంతే . ఆ పుస్తెలలో వున్న అంతరార్ధం వాళ్ళకు తెలియకనే ." 

"  మా అమ్మమ్మకు కూడా తెలియదంటారా ? "

"    మీ అమ్మమ్మకే కాదు , మీ జేజెమ్మకు కూడా తెలియదు .తెలిస్తే అలా ఎందుకు చెప్తుంది ? "

"   ఎవళ్ళకీ తెలియనిది మీకు ఒక్కళ్ళకే తెలుసా ? " 

"   నాకు కూడా తెలియదు నిజానికి . మాబామ్మే ఆ పుస్తెల చరిత్ర మొత్తం చెప్పింది . "

"  ఈ పుస్తెలకు అంత చరిత్ర ఉన్నదా ? "

"   అసలు ఆడదాని జీవితమే కాదు , సుఖ సంతోషాలు అన్నీ దాని మీదే ఆధారపడ్డాయట . ఆ మాట నిజమేనని
నేనూ నమ్ముతున్నాను . " '

"  అయితే మా అమ్మమ్మ చెప్పింది కరెక్ట్ కాదా ."

"   కరెక్టే కాని మీ అమ్మమ్మకు ఆ పైన తెలియదనుకో అంతే , ఎందుకంటే చాలామంది జాతకాలు చూసిచెప్తుంటారు . ఒకళ్ళకి , ఇంకొకళ్ళకి పోలిక వుండదు , కొన్ని కలుస్తాయి , మిగిలిన విషయాలుతేడాగా ఉంటాయి . అది వాళ్ళ తప్పు కాదు . వాళ్ళు కొంతవరకు జ్యోతిశ్శాస్త్రాన్ని కొంతవరకే చదివారు , ఆ పైన చదవక పోవటం వలన అంతవరకే చెప్తుంటారు . అంతే గాని వాళ్ళు తప్పు చెప్పారని కాదు , అలాగని కరెక్ట్ చెప్పారని కాదు . అది మనం తెలుసుకొని మసులుకోవాలి ."

 "  సరే గాని చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నది . ఎలా ఈ పుస్తెలు ఆడదాని జీవితంలోని సుఖసంతోషాలకుమూలమవు తున్నాయి .కట్టేది మగవాళ్ళు కదా ! వాళ్ళకేమీ దీనిలో పాత్ర వుండదా ? "

"   ఉండకపోవటమేమిటి ? వున్నదంతా వాళ్ళదే ."

"   మరి ఆడవాళ్ళకి ఎఫెక్టేమిటి ? "

"   అక్కడకే వస్తున్నా . ఈ పుస్తెలున్నాయి చూశావ్ ఒకటి మీరు , ఇంకొకటి మేము తెస్తామని ,అది ఆడవాళ్ళ మెడలో కడ్తామని యింతదాకా చెప్పుకున్నాం కద . ఈ పుస్తెల ఆకారం ఒక మారు పరిశిలించు . ఆడవాళ్ళ వక్షోజాలను పోలి ఉంటాయి . అందుకని వాటిని అడుగడుగున కళ్ళకద్దుకొని ,జాగ్రత్తగా చూసుకోమంటుంటారు . వాటిని మీ ఆడవాళ్ళు బహు జాగ్రత్తగా , అంటే వాటిని  చక్కగా , అందంగా , మందంగా  ఉండేటట్లు అన్నమాట  ,ఆ భర్త అనే మగవాళ్ళు పరస్త్రీల చెంత చేరనే చేరరుట . అందుకనే ఎల్లప్పుడు ఆడవాళ్ళను పుస్తెలను కళ్ళకద్దుకొని జాగ్రత్తగా చూసుకోమనేదట  ."

"   ఏమిటి , భర్త అనే మగవాళ్ళను ఈ పుస్తెలు పరస్త్రీల చెంత చేరనివ్వవా ? ఎంత మంచి విషయంచెప్పారండి . ఇక మిమ్మల్ని ఏ పరస్త్రీ ఆకర్షించకుండా నేను జాగ్రత్త పడి కాపాడుకొంటానండి ."

"  అపుడే ఏమైంది , ఇంకా నువ్వు అంటే మీ ఆడవాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా వున్నాయి .ఆ పుస్తెలు మీ పుట్టింటి వాళ్ళు యిచ్చేది పుట్టబోయే వంశోధ్ధారకుల కొరకు , మేం తెచ్చే పుస్తె వున్నది చూశావ్ అది మా భర్త అనే మొగుళ్ళ కొరకు అన్నమాట . అయితే ఇక్కడొక అనుమానం నీకు రావచ్చు . అది కూడా తీరుస్తాను .వంశోధ్ధారకులు వచ్చే ముందు  , ఆ వంశోధ్ధారకులు పాలు తాగటం మానేయగానే మా భర్త అనే మొగుళ్ళు వాటిని వాడుకోవచ్చట . "
"  భలే మంచి విషయాలు తెలియచేశారండి ."

"   ఇవన్నీ చెప్పింది నేను కాదు , మా బామ్మ . ఎందుకంటే  పచ్చని సంసారాన్ని పాడు చేసుకోవద్దురా అని , ఇలా నాకే కాదు మా వాళ్ళందరికీ ఇది పెళ్ళికి ముందు చెప్తుంటారు . అందుకే మా కుటుంబాలన్నీ అమిత ఆనందంగా వుంటాయి . "

"   పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలని మా అమ్మమ్మ అంటుండేది , కాని మీ బామ్మ గారుపండంటి సంసా
రానికి ఒకే ఒక్క సూత్రం చాలు అని చక్కగా సెలవిచ్చారు . నేను ఇదే ఫాలో అయిపోతా ఈ క్షణం నుంచి . త్వరగా రండి ఇక ఆలస్యం చేయద్దు అన్నది ." 

"    మా ఇంటి ఆచారం ఇలామొదటి రాత్రి ఈ విషయాన్ని చక్కగా జీవిత భాగస్వామికి చెప్పుకోవటం ( ఆడ , మగ వాళ్ళు ) వారసత్వంగా పరిణమించింది . అందుకే మా కుటుంబాలు నిత్య యౌవనంతో ఆనందంగా వుంటాయి . ఇది తెలియచెప్పడం కొరకే ఇంతవరకు ఆగా . ఇక చూస్కో .  ఇదే మా   "     బామ్మ మాట బంగారు బాట . "                                                                 ** స ** మా ** ప్తం **


No comments:

Post a Comment