తప్పమ్మా ?


                                                                                      తప్పమ్మా ? 

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్

              (  మాలిక వేగవంతమైన బ్లాగుల సంకలిని లోని 20/06/2013 పెండెం గారి చిత్రానికి నా చిన్న కవిత  )


ఏయ్ ,
ఏమోయ్ ,
నిన్నేనోయ్ ,
మరిచిపోయావా ?
మన చిరకాల స్నేహాన్ని ,

ఉన్నట్లుండి ,
ఏమిటీ తిక్క వేషాలు  ?
నిన్ను కన్నవాళ్ళెవరో
తెలియకపోయినా ,
దగ్గరకు తీసి ,
పెంచి పెద్దచేసిన ,
వాళ్ళ  పిల్లల్ని చూస్తే ,
కొత్తగా ,  చెత్తగా ,
అరిచేస్తున్నావుట ,
కరిచేస్తున్నావుట ,
తప్పు కదూ ! ,

నమ్మి యిల్లంతా ,
నీకప్పజెప్పి ఊరెళ్తే ,
దొంగల లంచానికి ,
వాళ్ళ పంచన చేరి ,
నిన్ను నమ్మిన వాళ్ళను ,
వంచన చేస్తున్నావుట ,
నమ్మిన వారి గొంతు కోయకు ,
వాళ్ళముందు నీ గొంతు పెగల్చకు ,
తిన్నయింటి వాసాలు లెక్కించకు ,

ఈ మానవజాతి ఎవరనుకొంటున్నావ్ ? ,
కాలాంతరాలలో నా రూపాంతరమే ,
అందుకే  నిన్ను మళ్ళీ నా దరికి  జేర్చుకున్నా ,
విశ్వాసానికి నిన్ను నిదర్శనం చేశా ,
ఇకనైనా బుధ్ధిగా మసులుకో ,
లేకుంటే చెవులు పిండి మెలేస్తా  .....ఆ ! .


            **********

2 comments: