ధ్యానమా ? పరధ్యానమా ?

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్

ధ్యానంలో పరధ్యానంలో 

ఓ దేవర , జంగమదేవరా ,
ఇప్పటికైనా కళ్ళు తెరచి చూడవయ్యా ,
ఎందులకా మౌనం ? ఎంతసేపా ధ్యానం ?
గంగ నీకు చెప్పకుండా భువికి వచ్చిందయ్యా ,
పిలిచి కొంచెమైనా కోప్పడవయ్యా ,
గంగ మా బ్రతుకుకి అవసరమయ్యా ,
మా అవసరాలకి వాడుకొంటామయ్యా ,
ఇలా మాతో ఆడుకోవద్దని గట్టిగా చెప్పెయ్యవయ్యా , 
మా లాంటి పిచ్చుకలపైనా ఈ బ్రహ్మాస్త్రం ,
జాగ్రత్తగా నీ శిరమున మళ్ళీ చేర్చుకొనవయ్యా ,
మమ్మల్ని పవిత్రత చేయకున్నా ఫరవాలేదయ్యా ,
నిన్ను నమ్మి నీదరిజేరిన వారికి యిదటయ్యా ,
నీ ఆసరా చూసుకొని మా నరజాతి పాపాలు చేస్తున్నారయ్యా ,
ప్రక్షాళన చేస్తావని , పవిత్రుల జాబితాలో చేరుస్తావని ,
ఇదేనా పాప ప్రక్షాళన , పవిత్రులను చేసే నీ వైనం ,
వద్దయ్యా , స్వస్తి చెప్పవయ్యా ఈ ఘోర విధానానికి ,
మార్చవయ్యా మా బుధ్ధులను సన్మార్గానికి యిక నైనా ,
పాపాలు చేయకుండా మమ్మల్ని బ్రతికించవయ్యా ,
నిను చూడాలంటే , నీ పేరు తలవాలంటే ,
వర్ణనకందని అదో అయోమయ స్థితి ,
తప్పించి , మరలా నీ వద్దకు రప్పించుకో ,
మా బుధ్ధులను సరిచేయవయ్యా ,
మమ్మల్ని మనుషులుగా కాక , 
మనీషులుగా బతికించవయ్యా ఓ శివయ్యా .

 ******

4 comments:

 1. బాగుంది సర్..ఇంతకీ ,ఈ విలయం, శివుడు ధ్యానంలో వున్నపుడా,పరధ్యానంలో వున్నపుడు వచ్చిందంటారా...

  ReplyDelete
  Replies
  1. ఆయన ధ్యాన నిమగ్నుడైనప్పుడు , మన మానవ ఆలోచనల ప్రకారం పరధ్యానంగా వున్నప్పుడు గంగ భువికి దిగటం వల్లనే ఈ విలయ ప్రళయం . ఎంత ధ్యానంలో వున్నా అల్పాయుష్కులమైన మన మీదనా గంగ దూకాల్సింది . ఆయన తప్ప వేరెవ్వరూ ఆయనని ఆపలేరన్నది .
   దీన్నిబట్టి మనం అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే పరధ్యానం వల్ల ప్రళయమేనని దేవునికైనా , జీవునికైనా .
   జీవునికైనా . ఇది తెలుసుకొని మన జీవనం సాగిస్తే వున్న కొద్ది కాలమైనా ఆనందంగా వుండగలుగుతాము .

   Delete
 2. మనం ఆయనధ్యానంలో ఉన్నంతసేపూ ఏభయం లేదు. పరులపై లేక మనదికాని పరాయివిషయాలపై ధ్యాసపెరిగి ఇలా దూరమవుతున్నామేమో??
  చాలాచక్కగా విన్నవించారండి
  జైశ్రీరాం

  ReplyDelete