మా నవ అస్త్రం


 కవితా రచన : శర్మ జీ ఎస్


తను చేసే అరాచకాలను  ,
చూడకూడదని కాబోలు  ,
తనని కనపడకుండా   ,
ఓ వైపు కాపాడుతూ  ,
మరోవైపు భయపెడ్తున్న ,
ఆ దేవుళ్ళనే   ,
నాలుగు గోడలు కట్టి ,
ఆ దేవుళ్ళనే  ,
ఆ లోపల  ,
శిలలుగా మలచి  ,
తనకు అందుబాటులోనే  ,
ఉంచుకొన్నాడు  ,

అవసరమైనపుడు  ,
తలుపులు తీసి  ,
కొలుపులు చేసి  ,
ఆదుకొమ్మంటాడు  ,
ఆదుకోకుంటే  ,
లంచంగా  ,
ముడుపులు చెల్లించి  ,
ఇడుములు బాపమంటాడు  ,
ఇలా అడగటం పాపమనుకోడు  ,

ఎందుకంటే  ,
ఆ దేవుడు  ,
అతని అవసరానికి  ,
వాడుకొనే మూకుడుగా  ,
భావించాడు కనుక  ,
ఏ శాస్త్రాలలో ,
ఎన్నడూ , ఎవరిచేత  ,
లిఖించబడని మానవాస్త్రం  ,
మౌనంగా సంధించబడిన  ,
మా నవ అస్త్రం .

               *********

2 comments:

  1. ఏ శాస్త్రాలలో ఎన్నడూ, ఎవరిచేత లిఖించబడని మానవాస్త్రం,
    మౌనంగా సంధించబడిన, మా నవ అస్త్రం....very good lines

    ReplyDelete