అమెరికా అమరిక అమెరికా అమరిక  

                                                                                                                         కవితా రచన : శర్మ జీ ఎస్                    

సప్త సముద్రాల కావల అమెరికా ,

ఇష్ట కామ్యాల అమరిక ఈ అమెరికా .

ఆవాసం ప్రక్కనే అడవులు ,

సాగర తీరాన పడవలు .

అమెరికా మహా నగరంలో ,
కానరాదు యిచట గరం .

అందం ఆనందం అమెరికా స్వంతం ,
ఆ కళాభిరుచి మెచ్చుకొందాం ఆసాంతం 

అపార్ట్మెంట్ల అందాలు అమోఘం ,
కలప పలకలే కదా వాటికాధారం

అమెరికాకు అండగ  కొండలు వుండగ ,
అక్కడి ప్రజలకి పండగే పండగ .

పూలమ్ముకొనే వాళ్ళు లేరు ,
కట్టెలమ్ముకొనే వాళ్ళు లేరు .

తాటిచెట్టును తలదన్నేవాళ్ళు లేరు
పొలాల్ని నాగలితో దున్నేవాళ్ళు లేరు .

మూణ్ణాళ్ళ ముచ్చటే ఈ జీవితం 
అయిదు రోజుల సంపాదనే వాళ్ళ జీతం .

బంధాలుంటాయి భాగస్వాముల్లా ,
అపుడపుడు కరచాలనానికే .

15 , 16 ప్రాయంలో ఔటింగు ,
కన్నవారి కళ్ళ ముందే డేటింగు . 

సందు దొరికితే చాటింగు ,
మందు దొరికితే మీటింగు .

అయిదు రోజుల సంపాదన ,
6 , 7 వ రోజుల్లో ఆనందాలకే .

ఇక్కడ కానరారు అడుగడుగునా  బెగ్గర్లు ,
కనబడ్తుంటాయి ఛాట్ హౌస్ లో బగ్గర్లు .

ఏ బస్సు చూసినా పైకి ఏ సి లుక్కే ,
ఆ బస్సులలో హీటర్లే పేద్ద లక్  .

నిబంధనలతో భయాన్ని కల్గిస్తారు ,
అమలుతో అభయాన్ని అందిస్తారు ,

అడుగడుగునా తప్పులకు ఫైన్లతో  ,
అమెరికా ఎటు చూసినా ఫైన్ .

 *****

4 comments:

 1. అడుగడుగునా తప్పులకు ఫైన్లతో ,
  అమెరికా ఎటు చూసినా ఫైన్ .
  అదే భూతల స్వర్గం :)

  ReplyDelete
 2. ఏది ఏమైనా.....:-)
  నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము
  మనము మన బ్లాగ్ లోకమే నాకు ఇష్టము

  ReplyDelete
 3. మెరికల్లాంటి మేధావులను,మేధావివర్గంలోని మీగడను అధిక వేతనాలతో సూదంటురాయిలా ఆకర్షించి రప్పించుకొంటున్నది అమెరికా!పేదసాద దేశాల ఆర్థిక శక్తి పుంజుకుంటే జీతనాతాలు వారితో సమానంగా పెరిగితే అమెరికా వెళ్ళేవాడుండదు!కలప పలకల ఇళ్ళు మన ఇళ్ళకంటే ఖరీదు నిన్ననే మా అబ్బాయి కట్టించుకున్న గృహంలోకి ప్రవేశించాము మనకు మన india ఇళ్లే బాగాఅనిపిస్తాయి!అలా అలవాటు అయ్యాయి కదా!మీ కవిత బాగుంది!

  ReplyDelete