ఊహలు బుస బుసలాడె


                                                             "  ఊహలు బుస బుసలాడె  "

                                  ( ఈ కధ "   అన్వేషణ "   వారపత్రిక 20/09/1995 న ప్రచురింపబడినది ) 

                                                                                                                         కధా రచన : శర్మ జీ ఎస్

"   అయ్యో ఏడు గంటలయిపోయింది . ఇంకా ఈయనగారు క్యాంపునుంచి రాలేదే  .  మరో అర్ధగంటలో ఆఫీసరు గారు వచ్చేస్తారు  .  మా పెళ్ళిరోజు అని వాళ్ళ ఆఫీసరును ఆహ్వానించారు . త్వరగా వంట పని ముగించాలి " అనుకుంటూ వంట పనిలో మునిగింది శైలజ .

కాలింగ్ బెల్ మోగగానే "   వస్తున్నా "   అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది . ఎదురుగా ఆఫీసరు గారిని చూసి హడావుడిగా చీరకొంగు సర్దుకుని "   స్వాగతం , సుస్వాగతం , రండి , విచ్చేయండి "   అంటూ సాదరంగా ఆహ్వానించింది శైలజ .

లోపలకు అడుగు వేస్తున్న ఆజయ్ కుమార్ ని సుగంధ ద్రవ్యాల సువాసనలు పలుకరించగా , ఆ పరిమళాలను ఆఘ్రాణిస్తూ , హాలంతా కలియజూశాడు . ఏదో నూతన శోభ గోచరిస్తున్నది . గతంలో తను ఏనాడు ఈ అలంకరణలు చూడలేదు . ఈ అలంకరణంతా మీరే చేశారా ? " వెరీ నైస్ టేష్ట్ , ఫైన్ " అంటూ అభినందించి సోఫాలో కూర్చున్నాడు .

"   అవునండి . మీరొస్తున్నారని నేనే స్వయంగా చేశాను . థాంక్యూ సర్ "   అని ఫ్యాన్ ఆన్ చేసి "   జష్ట్ ఏ మినిట్ "   అని లోపలకు వెళ్ళి కూల్ డ్రింక్స్ ట్రేతో ప్రత్యక్షమైన శైలజని చూసి "   శాంతారాం గారు రాలేదాండి "   అని అడిగాడు ఆఫీసరు అజయ్ కుమార్ .

"   ఇంకా రాలేదండి . వీలున్నంత త్వరగా వస్తానన్నారు , వచ్చేస్తారు . ఈ లోగా టీ వి చూస్తుండండి , యిపుడే వస్తాను "   అంటూ కిచెన్ రూం లోపలకు వెళ్ళింది .

అర్ధగంటలో వంట ముగించుకుని హాల్లోకి వచ్చి "   రండి వడ్డించాను "   అన్నది .

"   తొందరేం లేదులెండి . శాంతారాం గారు వచ్చిన తర్వాత కలసే భోజనం చేస్తా "   అన్నాడు .

"   ఇప్పటికే చాలా టైం అయింది . ఆయన వెళ్ళీంది పల్లెటూరు కదా ! ఒకవేళ బస్సు మిస్సు అయిందేమో ? ఆలస్యమైతే చేసిన పదార్ధాలు చల్లబడిపోతాయి . వేడిమీదనే ఆరగించాలి . అప్పుడే ఆనంద , ఆలస్యం చేయకండి . "

"   మీ పెళ్ళిరోజు నాడు మీ వారు లేకుండా భోజనం చేయటం బాగా లేదు . ఆయన వచ్చింతర్వాత కలిసే చేస్తా " అన్నాడు .

"   నిజమేననుకోండి . ఆయన ఎపుడొస్తారో ? ఏమో ? అయినా పెళ్ళిరోజు మాది కదా ! మేమిరువురం కలసి చేస్తాం . మీరు చేసేయండి , అభ్యంతరం చెప్పక ఆరగించండి "   అన్నది .

"   సరే పదండి "   అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు .

వద్దంటున్నా వినకుండా "   తినండి , తినండి . మీ కొరకే చేశాను . ఎలా వుందండి ? బాగుందా " అంటూ వెంటబడి వడ్డించింది . వద్దంటూనే అతిగా ఆరగించటంతో భుక్తాయాసం , పిలవని పేరంటాలులా వచ్చి ముందు కూర్చున్నట్ల
యింది . అతని అవస్థ చూసి " ఈ తంబూలం వేసుకోండి "   అంటూ చిలకల నందించింది .

"   అలవాటు లేదండి "   అన్నాడు .

"   ఎందుకని "   అని అడిగింది .

"   ఇంకా పెళ్ళి కాలేదుగా "   అన్నాడు .

"   ఆ విషయం తెలుస్తూనే వుంది . అయినట్లైతే మీరొక్కరే రారుగా . పైగా పెళ్ళి కాకుంటే తాంబూలం వేసుకోకూడదని ఏ శాస్త్రంలో చెప్పలేదు , ఫరవాలేదు , వేసుకోండి . మీ ఆయాసం సునాయాసంగా పోతుంది " అంటూ తాంబూలం అందించి "   మీరక్కడ విశ్రాంతి తీసుకోండి . బెడ్ రూం అదే "   అంటూ బెడ్రూం వైపుగా దారి తీసి "   ఈ బెడ్ మీరు మా ఆయనకు శాంక్షన్ చేసిన లోన్ తో కొన్నాం . చూసి చెప్పండి ఎలా వున్నదో "   అన్నది .

అజయ్ కుమార్ బెడ్ దగ్గరగా వెళ్ళి కుడిచేత్తో నొక్కి "   చాలా బాగుందండి "   అన్నాడు .

"   పైపైన చూసి చెప్పటం కాదండి , నడుం వాల్చి ఆ తర్వాత చెప్పండి . ఆ... చెప్పటం మరిచాను , మీకు మరీ బోర్ గా వుంటే అక్కడే మేగజైన్స్ వున్నాయి , వాటితో కాలక్షేపం చేయండి . ఈ లోగా ఆయన వస్తారు "   అన్నది .

"   పిల్లలు ఎక్కడా కనపడరేమండి "? "   అడిగాడు .

"   వంటి పనికి , ఐ మీన్ వంట పనికి అడ్డంగా వుంటారని మా అన్నయ్యగారింటికి పంపా , రేపుదయం వస్తారు " అని బదులిచ్చింది .

"   మంచి పని చేశారు "   అన్నాడు .

"    హమ్మయ్య యిప్పటికి నన్నర్ధం చేసుకున్నారు . ఆయన వచ్చేలోగా స్నానం ముగిస్తా "   అంటూ బాత్ రూం వైపుగా వెళ్ళీంది .

కొంత సమయం బెడ్ మీద విశ్రమించి మ్యాగజైన్స్ కొరకు చుట్టూరా చూశాడు అజయ్ కుమార్ . కనబడలేదు . బెడ్ క్రింద చూశాడు . డెబనీర్ , ఫ్యాంటసీ మొదలైనవి వరుసగా దర్శనమిచ్చాయి . ఎందరో సుందరీమణులు నిధి కొరకు , తమ నిక్షేపాల్ని సైతం , పదుగురి కాలక్షేపం కొఱకు , ఏ ఆక్షేపణలు తెలుపకుండా యధేఛ్ఛగా , రకరకాల భంగిమ
లలో పోజులిచ్చి తమ రోజులు వెళ్ళబుచ్చుకుంటున్నారు .
శైలజ తనను ఈ బుక్స్ చూడమనటంలో గల అంతరార్ధం , తనను తను కోరుకుంటున్నదని అప్పటికి గ్రహించగలి
గాడు .
స్నానంతో పాటు భోజనం ముగించుకుని , కిచెన్ సర్ది , మెయిన్ డోర్ ఓపెన్ చేసి రోడ్డుపై దృష్టి నిలిపి , భర్త యిప్పటికీ రావటం లేదని గ్రహించి , మెయిన్ డోర్ లాక్ చేసి , నైటీతో ఆ బెడ్ రూంలోకి అడుగు వేస్తూ "   ఎలా వున్నదండి ? " అని అడిగింది .

చూస్తున్న ఆ మ్యాగజైన్ ని హడావుడిగా బెడ్ క్రింద వుంచి , అంతగా బెడ్ గురించి అడుగుతుంటే  , యిప్పుడు కూడా చెప్పకపోవటం సమంజసం కాదనుకున్నవాడై "   సో నైస్ , సో స్మూత్ "    అంటూ డోర్ వైపు టర్న్ అయ్యాడు .ఒక్కసారిగా అతని కళ్ళు జిగేల్ మన్నాయి .
నైటీ లోని ఆమె అందాలు దర్శనమిస్తూ కనువిందు చేస్తూ అతని మతిని పోగొడ్తున్నాయి . అప్సరసలు సైతం ఆమె సరసన చాలరన్నట్లు , ఆ అవయవ సౌష్టవం . ఏమా సంపద , పద పద మంటూ మనసుని పదే పదే తొందర చేస్తున్నాయి . పరాయి స్త్రీ అని గాని , అందునా తన సబార్డినేట్ భార్య అని గాని ఆలోచన లేకుండా అలా చూస్తుండిపోయాడు .

అలా చూస్తున్న అతనిని చూసిన శైలజ "   తాకకుండానే సో స్మూత్ అని ఎలా చెప్పగలుగుతున్నారు ? మీకు అంతటి నైపుణ్యముందా ? "   అన్నది .

"   అహ అది కాదు "   అంటూ నసుగుతున్నాడు .

అతని వాలకం గమనించిన శైలజ యిదే అలుసుగా తీసుకుని నైటీని తననుండి వేరు చేసింది . నగ్నంగా అతని వైపు అంగలు వేసింది . నగ్నమైన ఆమె అవయవాలపై అతని మనసు లగ్నమై తదుపరి కార్యక్రమానికి నాంది పలికింది .
"   శైలూ యిన్ని మారులు మీ యింటికి వచ్చినా ఎపుడూ చెప్పలేదేం ? "   అన్నాడు .

"   ఎన్నో మారులు ప్రయత్నించా . ఎప్పుడూ మా వారు ప్రక్కనే వుండటంతో అవకాశం రాలేదు . ఈ రోజే ఆయన ఇంకా రాకపోవటంతో ఇంతటి మంచి అవకాశం ఒంటరిగా దొరికింది . "   అంటూ అతని ఛాతీ మీద తల ఆంచి , ఎడమ గోటితో గుండెను రాస్తూ మత్తుగ అన్నది .

"   అలాగా ! "   అన్నాడు ఆశ్ఛర్యంగా .

"   అంతే కాదు డియర్ , ఎన్నాళ్టి నుంచో ఎదురుచూస్తున్న ఈ క్షణం ఎంతో విలువైనది . ఈ రోజు ఆయన క్యాంపుకి వెళ్ళనంటే నేనే పంపాను . ఆయన ఎప్పుడూ మీ గురించే చెప్తుంటారు . మీరు చాలా మంచివారని , వయసులో చిన్నవారైనా ఆయనకంటే ఉన్నతస్థానంలో ఉన్నారని  , అయినా నిగర్వులని , ఆయనంటే అభిమానంగా వుంటా
రని , మీ ఆఫీసులో సోమశేఖరం మంచివాడు కాదని , మీ ఎదుట నవ్వుతూ , మీ చాటున మిమ్మల్నే విమర్శిస్తుం
టాడని , అది చూసి మా వారు బాధపడ్తుండేవారని యిలా మీ గురించిన అన్ని విషయాలు చెప్తుండేవారు .ప్రతి రోజు మీ గురించిన విషయాలు వినటంతో మొదట్లో మిమ్మల్ని చూడాలని , ఆ తర్వాత తర్వాత అభినందించాలని  అనిపిస్తుండేది . మీ రాకతో  ఆ దశ దాటగలిగాను . మా చిరంజీవులు మీతో కలిసిపోవటంతో , మా అవసరాలలో మీరాదుకొంటుంటంతో మరో మెట్టు పైకి ఎదిగి , మొదట్లో మీమీద అభిమానం క్రమేపి అనురాగంగా మార్పు చెందింది . మా ఇంట్లో ఏర్పడిన ఏ వస్తువును చూసినా , లోను శాంక్షన్ చేయటానికి మీరు చూపించ్హిన అభిమానం సాక్షాత్క రించేది . అలా అలా నాలో మీ పై ఎనలేని అనురాగం అధికమై , మీకు చేరువ కావాలని , మీ కౌగిలో బంధింపబడా
లని , ఈ తనువులోని అణువణువును మీ తనువుతో సమాయత్తపరచాలని ఎంతగా తహ తహ చెందానో . ఇన్నాళ్ళకి ఆ అవకాశం యిలా యిప్పుడు లభించింది . నిజంగా ఏ జన్మలోనో నేను చేసుకున్న అదృష్టం . ఇంత మంచి అవకాశం మరల వస్తుందో రాదో ? " అంటూ అమాంతంగా మీదకు లాక్కుంది .
"   ప్లీజ్ ఆలస్యం చేయకండి . నన్ను గెలవండి సంతోషిస్తా . మీకింకా తెలియదు కదూ , ఏ స్త్రీ అయిన తనను ఓడించే మగవాడు మదనకేళిలో లభించినప్పుడు తనకు సరిజోడీ అని , తను ఓడినా గెలిచినంత సంబరపడ్తుంది "   అంటూ అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది .

కాలింగ్ బెల్ వినగానే " ఆయన వచ్చినట్లున్నారు " అనుకుంటూ హడావుడిగా లేచి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా వున్న భర్తను చూసి షాక్ అయి తేరుకుని "   ఇంత లేటైందేమిటండి ? మీ ఆఫీసరు గారు  యింతదాకా మేలుకొని యిపుడే విశ్రమించారు "   అన్నది .

"   లేటెక్కడే . ఇపుడు టైం 8.30 . మీ అన్నయ్య గారింటికి వెళ్ళి పిల్లలను తీసుకుని , మ ఆఫీసరు గార్ని పిక్ అప్ చేసుకొచ్చాను . ఆయన వస్తారన్నాగా , కలగన్నావేమో "   అంటూ లోపలకి నడిచాడు . ఆ వెనకే అడుగులు వేస్తూ వస్తున్న అజయ్ కుమార్ ని చూసి , తనను ఒక్కసారిగా చూసుకుంది . తను నైటీలో లేదు . అచ్చమైన ఏడు గజాల చీరతో సాదాసీదాగా వుంది . అయితే తనింతవరకు అందిన అనుభవం కలన్నమాట . బ్రతికిపోయా అని మనసులోనే అనుకుని గబగబా లోపలకు వెళ్ళిపోవటంలో పావుగంటలో పీటలు వేసి వడ్డన చేసింది . అందరూ కలిసి భోజనం చేశారు .

"   శైలజా సాంతారాం గారు వుంటా "   అంటూ వెళ్ళీపోయాడు .

చిరంజీవులు నిద్రపోయారు . శాంతారాం తను తెచ్చిన ప్యాక్ ని శైలజకిచ్చి "   మన పెళ్ళిరోజు చిరు కానుక  " అన్నాడు .

శైలజ ఆ ప్యాక్ ని ఓపెన్ చేసి చూసి ఆశ్ఛర్యపడింది . గద్వాల్ పట్టుచీర , తనకేంతగానో యిష్టమైనది . మొన్న తను ఓ ఐటం కొంటానంటే ససేమిరా కాదన్నారు . తనెంతగానో కోపగించుకుంది . ఈ రోజు తన కొరకీ గద్వాల్ పట్టుచీర పట్టుకురావటం అమిత ఆనందాన్నందించింది . "   ఏమండీ పెళ్ళిరోజు మనిరువురది కదా ! మీకేం తెచ్చుకున్నారు "   అడిగింది .

"   మగవాడెలా వున్నా కాలం గడిచిపోతుందే . ఆడవారికి ఏం లేకున్నా యిబ్బందే . పెళ్ళై పదేళ్ళైనా పట్టు చీర కొన
లేకపోయాను . అందుకే ఆ రోజు ఆ ఐటం వద్దన్నది . చిన్న చిన్న వస్తువులు ఎపుడైనా కొనుక్కోవచ్చు . పెద్ద పెద్ద వస్తువులే లోన్లు తీసుకున్నప్పుడు , పెద్ద మొత్తాలు వచ్చినప్పుడు కొనుక్కోవాలి "   అన్నాడు .మరోమారు షాక్ కి లోనయింది . తనమీద తన భర్తకు ఎంత ప్రేమ ? తను యిన్నాళ్ళూ తెలుసుకోలేకపోయింది . భర్త తన సాధక బాధ
కాలు తనతో విడమఱచి  చెప్పుకొంటుంటే , అది అతని అసమర్ధతగా భావిఉంచి తను ప్రక్కదోవలు పట్టింది . ఆలోచ
నాశక్తిని కోల్పోయింది . తన భర్తకి తీరని ద్రోహం చేసింది . ఊహల్లో కూడా యిటువంటి పొరపాటు ఎన్నడూ ఏ భార్య చేయకూడదు అన్న స్థిరనిర్ణయానికి వచ్చి "   ఇకనుంచి  దయవుంచి మన సంసారంలో మరొకరి వ్యక్తిగత విషయా
లు చోటు చేసుకోకుండా వుండేలా చూడండి "   అని తను చేసిన పొరపాటుని తెలియచేసింది .

"   చూడు శైలూ భర్త సాధక బాధకాలు దాచకుండా భార్యకు చెప్పుకునేది , అందుకు తగ్గట్లు నడచుకొంటుందని , మనసు తేలికపడ్తుందని మాత్రమే . అలా మనసు తేలికపడినప్పుడు , అందుకు తగినట్లు నడచుకున్నప్పుడు కొండంత బలాన్ని పుంజుకొన్న వారమవుతాం "   అంటూ పైకి లేచి నాలుగడుగులు ముందుకు వేసి అక్కడే ఓ మూల వున్న పాత సిరిచాపని పరిచి రమ్మని సైగ చేశాడు .

నిద్రపోతున్న పిల్లలని ఓ సారి చూసుకుని ఒక్కసారిగా శాంతారాం ని తన బిగి కౌగిలిలో బంధించి , ఈ ఆనందం కలకాలం వుండాలని ఆ అతీతశక్తిని ప్రార్ధించింది మనసులోనే .

                                                  
                                                               ** స ** మా ** ప్తం No comments:

Post a Comment