క్యాసినో , ఫ్యాషనో

                                                                         క్యాసినో , ఫ్యాషనో                         

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్
ఆ కాలంలో  ,
జూదం 
మాంస భక్షణం , 
సురాపానం ( మత్తు మందులు సేవించుట ) ,
వేశ్యా సంగమం , 
వెంటాడి వేటాడటం  ( జీవహింస )  ,
పర స్త్రీ లోలత్వం ,
సప్తవ్యసనాలుగ ,
ఆరోపణలందుకున్నాయి   .

ఈ కాలంలో ,
అంతర్జాల వ్యసనం ,
మెల మెల్లగ ఎగబాకింది మఱ్ఱిమానులా ,
ఆ సప్తవ్యసనాలన్నింటినీ తనలో చేర్చుకున్నది ,
తన అష్ఠమ స్థానాన్ని ప్రధమ స్థానంగా మార్చుకున్నది ,
18 ఏళ్ళ వయసు పై వారికే ప్రవేశం అన్నది ,
ఈడ , ఆడా , మగ తేడాలు లేనే లేవన్నది ,
అంగవికలురకు అండగా బండి అచటే ఉన్నదిలే . 


లోనకు వచ్చేవారు  వ్యసన పిపాసులే ,
అట ఉన్నంతవరకు  వీర దాసులే ,
పద్దులు లేవంటూ హద్దులు ,
ఒకటికి వెయ్యి రెట్లంటూ ఆకర్షణలు ,
వదలకుండా వేటాడుతుంటాయి ,
రాకుంటే  మరో మారంటుంటాయి ,
ఆటాడుతుంటే , ఏ మందు కావాలంటే ,
ఆ మందు , ఆ కామందు ఉచితంగా యిప్పిస్తాడు ,

ఈడ  కాసులే  పే చేయనఖ్ఖర లేదు ,
కార్డులైనా , రికార్డవుతాయంటారు ,
అవసరం లేదంటారు మీ అవార్డులు ,
ఇస్తే చాలంటారు మీ ఖాతా కార్డులు ,
నిజానికవి ఆటలు కాదు ,ఆటల వేటల తూటాలు ,
అందినట్లే అంది మెఱుపుల్లా మాయమవుతాయి ,
ఊడ్చేవరకు తెరచుకొని కాచుకు కూర్చొంటాయి  ,
అదే క్యాసినో , ఇదే ( మి ) ఫ్యాషనో ?

                       ********

1 comment:

  1. క్యాసినో కి బానిసలు కొందరు....ఫ్యాషన్ కి మరికొందరు ఇలా అందరూ దేనికోదానికి బానిసలే!

    ReplyDelete