స్వీట్ వార్

                                                                        స్వీట్ వార్ 
                                                                                                                            కధా రచన : శర్మ జీ ఎస్                                                    

                        ( ఈ కధ 16/06/1995 న మయూరి వారపత్రికలో ఈ వారం కధ గా ప్రచురించబడినది )                                                                                                   

పుట్టింటినుంచి బుట్టెడు సంపదనైనా తీసుకు రాకుండా , పుట్టెడు దారిద్ర్యాన్ని మోసుకొచ్చిందని , కట్నం తేలేదని
కట్టుకున్న భార్యని బలి తీసుకొంటున్న ధనాంధులు నానాటికీ అధికమవుతున్న ఈ (అ )నాగరిక కాలంలో భార్య కష్టపడుతుంటే చూడలేని భర్త వున్నాడంటే నమ్మశక్యం గాని విషయమే గదా !

అయినా నూటికి నూరుపాళ్ళు కల్తీలేని నిఖార్సైన నిజం రమణ విషయంలో . అతనిని చూసిన వాళ్ళు ఆలస్యంగా పుట్టాడు కాబోలు అని పాతకాలపు ఆడవాళ్ళు , బహు జాగ్రత్తగా చూసుకొనే యిలాంటి భర్త తమకు దొరికితే ఎంత బాగుంటుందోనని అనుకుంటుండేవారు .

ఉద్యోగరీత్యా వున్న ఊరు వదలి , ఊరు కాని ఊరు వచ్చి కొత్త కాపురానికి నాంది పలికి , భార్యకు ఇంటి పనులతో సాయపడుతుండేవాడు . సంవత్సరం తిరగకుండానే సంతానవతిని చేసినందుకు సంబరపడింది అమృత .

బి . ఏ . చదువుకొని బియ్యానికే కేటాయించక , తక్కువ జీతమైనా కాన్వెంట్ టీచర్ గా యిష్టపడే చేరింది . చిన్న పిల్లలకు చదువు చెప్పడమంటే కష్టమైన విషయమే . అర్ధమయ్యేలాగా అర్ధమయ్యేదాకా అరిచి చెప్పి తీరాలి . శ్రమ ఎక్కువే కాని ఫలితం తక్కువ . కొన్ని కొన్ని సందర్భాలలో అన్యాయం కళ్ళముందు కనిపిస్తున్నా , కళ్ళకు గంతలు కట్టబడినట్లు , ఏమీ కనపడనట్లే ప్రవర్తిస్తుంటాము . ఈ టీచర్ ఉద్యోగాలు ఈ కోవకి చెందినవే .

కాన్వెంట్ కి వెళ్ళబోయే ముందు పసివాడికి పాలిచ్చి , ఉయ్యాల తొట్టెలో నిద్రపుచ్చి , లేవగానే నీళ్ళు పోయమని ఆయాకు చెప్పి వెళ్ళేది . 

పసివాడు మేల్కొనేటంతవరకు ఖాళీగా కూర్చోవటం యిష్టపడక అందుబాటులో వున్న వీక్లీస్ ని చదువుతూ కాలం గడిపేది ఆ ఆయా . పసివాడి కేరింతలకి పాలు పట్టి వేడినీళ్ళతో స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసేది . ఆవలింతలతో నిద్రపోయేవాడు .

అమృత ఇంటికి చేరుకొనే సమయానికి "   ఇప్పటిదాకా ఆడి ఆడి , యింత క్రితమేనమ్మా నిద్రపోయిందిఇపుడు లేపమంటారా ? "   అనేది ఆయా .

"   నిద్రపోయేవాడిని లేపకు . ఏడుపు మొదలుపెడితే వదలిపెట్టడు . వీలున్నంతవరకు ఈ సమయంలో నిద్రపుచ్చ కుండా చూడు . రాత్రుళ్ళు నిద్రపోకుండా ఏడిపిస్తున్నాడు "   అనేది అమృత .

"   అలాగేనమ్మా "   అనేదే గాని తనను ఏడిపించకుండా చూసుకొనేది ఆయా . 

వేకువఝాము సమయానికి పసివాడితో సమానంగా గాఢనిద్ర పట్టేది అమృతకి . ఉదయం 7 గంటలు దాటితేనే లేవగలిగేది పక్క మీద నుంచి . కాలకృత్యాలు ముగించుకోనిదే ఏ పనీ చేసేది కాదు . ఆ సరికే కార్పొరేషన్ వాటర్ రేషన్ ఐటంలా మారి బిందువుల రూపంలో దర్శనమిస్తుంటుంది . అయినా బాధపడేది కాదు .

రమణ మాత్రం అమృతకిబ్బంది కలిగించటం యిష్టంలేక , వేకువఝామున లేచి తలగడ అమృత పక్కనే వుంచి , బెడ్షీట్ తో కవర్ చేసి , కార్పొరేషన్ వాటర్ అన్నింటికీ నింపి , పాల ప్యాకెట్ కొరకు బైటకు వెళ్ళి , అపుడే దినపత్రిక తెచ్చుకొని , పెరట్లో లైట్ వేసుకొని , దోమలు దొరల్లా వచ్చి దొంగల్లా ( రక్తాన్ని ) దోచుకొంటున్నా అక్కడె కూర్చొని చదువుకునేవాడు . లోపల లైట్ వేస్తే తనకెక్కడ నిద్రాభంగం కలుగుతుందోనని .

ఆ రోజు బాత్ రూంలోని నీళ్ళ శబ్దానికి మెలకువ రావడంతో ప్రక్కన తలగడని చూసి " దేనికండి మీకీ అవస్థ ? రాండి  నేను తర్వాత తెచ్చుకొంటాలే " అన్నది అమృత .

"  అవస్థ కాదే అవసరం . తెల్లవారితే నీళ్ళు రావుగా ."

"  రాకపోతే పోనీయండి . బావి నీళ్ళు తెచ్చుకుంటా , బాగానే వున్నాయిగా ."

"   అందుబాటులో వున్నాయి కదా అని అతిగా వాడకూడదు . మనీ మనవద్ద లేనప్పుడు మరొకరిని ఆశ్రయిస్తాము కదా ! అలాగే కార్పొరేషన్ వాటర్ రానపుడు వెల్ వాటర్ తీసుకోవాలి ."

"   నేనొస్తున్నానుండండి . మీరొక్కరే అలా ఎలా అవస్థ పడతారు ? "

"  నువ్వు రావలసినంత అవసరం ఏమీ లేదు . పైగా రాత్రంతా పసివాడితో నిద్రకు దూరమౌతున్నావు . మరలా 
ఉదయాన్నే లంచ్ బాక్సులు సర్ది ఉద్యోగానికి వెళ్ళవలసినదానివి . నువ్వు నిద్రంటూ ప్రశాంతంగా పోగలిగితే యిదే  సమయం . ఈ సమయంలో నిద్రకు దూరమైనావంటే బాగా అలసిపోతావు . హాయిగా రిలాక్సుకా "   అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు .

"   అర్ధమైంది లెండి , ఈ తలగడలను నా ప్రక్కన ఉంచకండి ."

"   ఫరవాలేదే , ఉంచితే నేనొచ్చేలోపు అవసరమైతే వాడుకొంటావని ."

"   మీలోటు  అది తీరుస్తుందటండి . అంతా మీ పిచ్చి గాని , అబ్బ త్వరగా రండి ,పసివాడు ప్రశాంతంగా పడు
కొన్నదిపుడే ."

సరసాల సమయందేనని దీర్ఘకాల సంసారసుఖం పొందగల శక్తి మగవాడు కోరకుండా లభించే సమయం వేకువ
ఝామేనని స్వానుభవంలో తెలుసుకొన్న ఆ దంపతులు , ఆ అలసటలో నిద్రాదేవి ఒడిలో సోలిపోయారు .

                                                                               ***                          

"   మా ఆయనకి వంట చేసుకోవటం చేతకాదు మామ్మగారు . హోటలు తిండి అస్సలు సరిపడదు . రెండు , మూడు 
మంచి ఉద్యోగాలు వచ్చినా పరాయి ఊళ్ళలో భోజనానికి యిబ్బంది అని ఆ ఉద్యోగాలు వదిలేశారు . వెంటనే పెళ్ళి 
సంబంధాలు చూసి నన్ను పెళ్ళి చేసుకొని ఆ తర్వాతే ఉద్యోగాన్ని చూసుకొన్నారు  "అని ఆ యింటి ఓనర్ అయిన మామ్మగారితో చెప్పింది అమృత . 

"   అబ్బాయికి భోజనం ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటావ్ . ఒకే కంపౌండ్ లో ఉంటున్నాం . ఆ మాత్రం సాయం 
చేసుకోకుంటే ఎలా ? ఇంతకీ ఏమిటో విశేషం ? "

"  మా నాన్నగారికి అనారోగ్యంగా వున్నదట . ఈయన్ను వదలి వెళ్ళాలంటే జంకుగా వుంది . ఆయనకు బిడియమెక్కువ మామ్మగారు . "

"  నువ్వేమీ కంగారు పడకు . ప్రశాంతంగా వెళ్ళిరా . అబ్బాయికే లోటూ రానీయకుండా , నా కన్న బిడ్డలా చూసు కొంటానుగా . " 

"   హమ్మయ్య , మీరామాత్రం సపోర్ట్ యిచ్చారు గనుక , హాయిగా వెళ్ళొస్తాను "   అంటూ వాకిట్లోకి నడచి "   ఏమండీ మీ గురించి అంతా చెప్పేశాను . ఇంక మీరు సిగ్గు పడకుండా భోజనం చేసేయండి "   అన్నది .

"   కొంప ముంచావు కదా ! ఏమీ చెప్పకుంటే వాళ్ళకేమీ నా గురించి తెలియదనుకొని ధైర్యంగా వుండేవాడిని . ఇపుడు ఆ అవకాశం లేకుండా పోయింది . సరేలే ఏదో నా బాధలు నే పడతాలే . నువ్వు బయలుదేరు , బస్సుకి టైం అయిపోతున్నది "   అంటూ ఆటో ఎక్కించాడు .

                                                                           ***
                             
"   మామ్మగారు హాల్లో మంచం మీద కూర్చొని తమలపాకులు వేసుకొంటున్నది . అపుడే లోపలకి వస్తున్న రమణని చూసి  "  పంకజం , అమృతా వాళ్ళాయన వచ్చాడు , భోజనం వడ్డించు "   అన్నది .

"   అలాగే అత్తయ్యగారు , రమ్మనండి "   అని బదులిచ్చింది మామ్మగారి కోడలు పంకజం .

"   రమణ కాళ్ళు కడుక్కొని వంట యింట్లోకి వెళ్ళి వడ్డించిన విస్తరి ముందున్న ఎత్తు పీటను చూశాడు . తనకు పీట మీద కూర్చొనే అలవాటే లేదు . కానీ  పరాయి వాళ్ళ ఇంట్లో క్రింద కూర్చొంటే మర్యాదగ వుండదని ఆ ఎత్తు పీట మీదనే కూర్చొన్నాడు . తల వంచుకొని భోజనం చేస్తున్నాడు .  

"   ఎంత ఆకలిగా వుంటే మాత్రం విస్తరినే చూస్తూ భోజనం చేస్తారా ? "   అన్నది పక్కనే వడ్డించే పంకజం .

"   అబ్బే అదేమి ఆకలి కాదండి ., సిగ్గండి . "

"   సిగ్గు ఆడదానికి అందం , మగవాడ్నికి మందం అంటారు . మరి ఆలోచించుకోండి సిగ్గు ఎవరికుంటే అందమో . అందునా మీకంటే చిన్నదాన్ని అన్ని విషయాలలో , అలా అండి అని పిలవకండి "   అన్నది .

"   సరే "   అంటూ తల పైకెత్తాడు . ఒక్కసారిగా ఆ కళ్ళు అక్కడే స్తంభించిపోయాయి . పైటకొంగు జారింది గమనించ కుండా వంగి పెరుగు వడ్డిస్తున్నది . పెరుగు అన్నాన్ని కలుపుతూ అలా చూస్తుండిపోయాడు చాలాసేపటివరకు . పరిస్థితిని గ్రహించి   "   ఎంతసేపలా కలుపుతూనే గడుపుతారు , ఆరగించండి "   అన్నది .

"   ఆరగించాలనే అనుకుంటున్నా , కానీ అక్కడినుంచి కదలనిదే "   అన్నాడు సన్నగా .

"   ఇంకాసేపు మీరక్కడే ఉంటే అత్తయ్యగారు ఎంతసేపంటూ దూసుకొచ్చేస్తుంది " .

"   ముందుకు ఎలా పోవటమా ? అని సంకోచిస్తున్నా . "

"   సంకోచిస్తే సంతోషం దొరకదు . కడదాకా తింటేనే కడుపు నిండుతుంది . ఆలోచనలతో మీ బుఱ్ఱ పాడు చేసుకొని నీరు కారకండి . సమయం చూసుకొని ప్రొసీడ్ అవండి . "

                                                                  *****

అపుడే వచ్చిన అమృత నుంచి పసివాడిని అందుకుని "   మీ నాన్నగారికెలా ఉన్నది ? "   అడిగాడు రమణ .

"   పేద్ద గండం తప్పిందనుకోండి . "

"   అపుడే వచ్చేశావెందుకు ? మరి నాలుగు రోజులుండి రాకపోయావా ? "

"   మీరిక్కడ అవస్థపడ్తుంటే అక్కడ నేనెలా వుండగలను . వాళ్ళుండమంటున్నా వీలులేదని వచ్చేశా . మీరెలా ఉన్నారు ? "

"   బాగానే వున్నాను , కాకపోతే పగలంతా ఆఫీసు వ్యాపకాలతో మామ్మగారి నోటి చలవతో ఏ లోటూ లేకుండా గడచిపోతున్నది . చాలా మంచిదే . ఇన్నాళ్ళు కోడల్ని రాచి రంపాన పెడ్తుంటే రాకాసి అనుకొన్నా . ఇపుడే తెలుసుకొన్నా . ఆమె అంత  స్ట్రిక్ట్ గా వుండబట్టే , నాకేలోటూ రాకుండా చూసుకోగలిగింది . "

"   నే చెప్తుంటే ఇన్నాళ్ళు నువ్వు ఒప్పుకోలేదుగా "   అన్నది .

"   ఏదైనా స్వానుభవం లోకి వస్తేనే గాని గ్రహించలేని మానవజాతి మనది . మామ్మగారే కాదు , ఆ ఇంట్లో అందరూ మంచివారేనే . నన్ను పరాయి మనిషిలా చూడకుండా స్వంత మనిషిలా చూసుకొని ఇంతవరకు నాకున్న బిడియాన్ని పోగొట్టారు  . "

"   ఎపుడూ ఏదో వంక పెట్టేవాళ్ళు . ఇప్పటికైనా అర్ధం చేసుకొన్నారు . "

"   ఆఫీసుకి టైం అవుతున్నది . పాలు అరమరలో వున్నాయి , వెళ్ళొస్తా . "

"   త్వరగా రండి , పది రోజులు దాటింది మనం కలుసుకొని . "

"   అలాగేలే . బాబుని పగలు నిద్రపోనీయకు , మనల్ని యిబ్బంది పెట్టకుండా రాత్రికి హాయిగా పడుకొంటాడు . "

"   ఆ ప్రాబ్లం ఏమీ లేదులెండి . గత పది రోజులుగా అక్కడ అందరి పిల్లలతో హాయిగా ఆడుకోవటం అలవాటై , పగలు నిద్రపోవటం లేదు . "

"   మీ నాన్నగారి అనారోగ్య పుణ్యాన మనకో సమస్య తీరిందన్నమాట , వస్తా . "

                                                                           *****

మామ్మగారికి మెలకువ వచ్చేసరికి పక్కన పంకజం లేకపోయేసరికి పంచలో నుంచి మధ్య హాల్లోకి వచ్చింది . బెడ్ రూం సవ్వడితో సందడి చేస్తున్నది . అబ్బాయి డ్యూటీ నుంచి వచ్చినట్లున్నాడు , నాకు తెలియలేదే , మంచి నిద్ర పట్టినట్లున్నది . ఇంతదాకా తన ప్రక్కనే పడుకొన్న పంకజం కూడా ఎపుడు వెళ్ళీందో ? ఏమో ? . ఇంటెడు చాకిరీ నెత్తి మీద వేసినా , ఎదురు చెప్పకుండా చేస్తోంది . ఆ కాసేపయినా వదలకుంటే ఎలా ? అసలు ఈ కొంచెం సుఖం కొరకే గదా ఎంత చాకిరైనా చేసేది . ఒక రకంగా తన కోడలు చాలా మంచిదే . 
గతంలోకి వెళ్ళిపోవటంతో , తనైతే ఓ సారి ఆయన పదిహేను రోజుల తర్వాత క్యాంపు నుంచి వస్తే , ఆ రోజు తనను అంటిపెట్టుకొని ఉన్న తన అత్తగారి నాసికకు , క్లాసిక్ గా మత్తుమందు చేత ఆకర్షింప చేసి , భర్త పక్కకు చేరిన వైనం తలుచుకొంటే తనకిప్పటికీ నవ్వాపుకోలేని స్థితి . తన కోడలు ఆ కోవలొది కాదుగా . బాగా చేసుకోండమ్మా సంసారం . ఇలాగే కంటిన్యూ చేస్టుండండి , నాకు తెలియకుండా అనుకొంటూ పంచలో మంచం మీద నడుం వాల్చింది .

ఇంకా సవ్వడి వినపడ్తూనే వున్నది . ఆ పందిరి మంచం నేటిది , నిన్నటిదీ కాదు . ఐదు తరాలు వెనక్కి వెళ్ళాల్సిందే . 
ఎంతమంది ఆలు మగల చేత సంసారం చేయించిందో , ఎంతమందికి పుత్ర , పౌత్రికా భాగ్యం కలిగించిందో  తలచు కొంటే ఆశ్ఛర్యం , ఆనందం రెండూ కవలల్లా కలిసే వస్తాయి . అయినా నేటికీ ఆ మంచం పటుత్వం ఎంతమాత్రమూ తగ్గలేదు . ఆ స్వీట్ ముమెంట్సుకి భార్య ఆనందంతో బదులు యివ్వకున్నా , పందిరి మంచం మాత్రం పలకరించి భర్తను రెచ్చగొడ్తూనే వున్నది .
మామ్మగారు ఆ స్వీట్ ముమెంట్సుని నెమరు వేసుకొంటూ అలా అలా స్వప్నావస్థలోకి చేరుకొంటుంటే అమృతకి , అదే ముమెంట్సుకి మెలకువ వచ్చి పసివాడి ఆకలి తిరిందని తెలుసుకొని  , అటునుంచి యిటు భర్త వైపుగా చేయి వేసింది . 
మెత్తగా తగులుతున్నా, తేడా తెలిసి బెడ్ షీట్ లాగింది . తలగడ దర్శనమిచ్చింది . టైం చూసింది , అర్ధరాత్రి 12-15 
అయింది . నీళ్ళకు వెళ్ళి వుండరు . ఎక్కడకు వెళ్ళీ వుంటారు అనుకొంటూ బయటకు వచ్చి చూస్తే ,  లేవట్రీలో లైట్ 
వెలుగుతుండటంతో ,వెళ్ళరనుకొని , తనూ బాత్ రూం కెళ్ళి వచ్చి అక్కడే కూర్చొన్నది . పది నిముషాలు గడచినా 
రమణ రాలేదు . దగ్గరగా వెళ్ళి చూస్తే గడియ బైటనే వేసి వున్నది . తీసి చూస్తే లోపల ఎవరూ లేరు . లైట్ ఆపుచేసి 
ఈ సమయంలో ఎక్కడకు వెళ్ళి వుంటారబ్బా అనుకొంటూ పడక చేరుకున్నది .
ఆలోచనలు అదే పనిగ చుట్టుముట్టాయి . ఊరుకి వెళ్ళక మునుపు మూడు రోజుల దూరం , ఆ వెంట నాన్నగారి అనారోగ్య కారణంగా ఊరు ప్రయాణం , పది రోజుల దూరం వెరసి పదమూడు రోజులుగా లంఖణం కావటంతో , తొందర చేస్తుంటే , పంకజం వాళ్ళ పడకగది కామ చేష్టల మూలుగులు ములుకులై పరాకాష్టకు తీసుకువెళ్తున్నాయి . కామానికి వున్న గుణం కాక పుట్టించి , అందరినీ సమానులు కమ్మంటుంది . చేస్తున్నా , చూస్తున్నా , వింటున్నా కోరిక కల్గిస్తాయి .అందుకే కాబోలు బాపూజీ ఇదే విషయాన్ని మూడు కోతుల ద్వారా సైగలతో తెలియచేశాడు . 
తపనని తమాయించుకోలేక తలగడనే ఆశ్రయించింది . ఆ పక్కింటి సవ్వడి అధికమై మెల్లగా ఆగిపోయింది .
పది నిముషాలు గడిచాయి . మెల్లగ తలుపు తోసుకొని లోపలకి వచ్చాడు రమణ . అమృత పక్కకు చేరి తలగడకు స్థాన చలనం కలిగించే ప్రయత్నంలో అమృత మేల్కొని వున్నదని తెలిసి ఖంగు తిన్నాడు . ముఖం పక్కకు తిప్పి పదుకొన్నాడు . 

"   ఏమండీ ఎక్కడకు వెళ్ళారు ? ఎన్నాళ్ళైందో , మీకు తెలియదా ఎంతసేపటినుంచి ఎదురుచూస్తున్నానో , ఉదయమే చెప్పాను గదా !  సుమారు పక్షం రోజుల లంఖణంతో విరహం తహతహమంటుంటే , అగ్నికి ఆజ్యం తోడైనట్లు పంకజం వాళ్ళ పందిరి మంచం పడక సుఖం అదేపనిగ ఆరున్నొక్క రాగంతో వినిపించి విపరీతంగా నను వివశురాలిని చేస్తున్నది .అందుబాటులో లేకపోతిరి , వుంటే అంతకు అయిదింతల సుఖాన్ని అనుభవించేవాళ్ళం . ఏం చేస్తాను మరి ? ఈ తలగడలతో తలక్రిందులవుతున్నా . నా అదృష్టం బాగుండబట్టి ఆ సవ్వడి సద్దుమణిగింది , లేకుంటే నా పరిస్థితి ఏమయ్యేదో ?సరేలెండి . జరిగిపోయిందేదో జరిగిపోయింది . ఇకనైనా రంగంలోకి దిగండి , మరలా బాబు లేస్తే వాడికందించానంటే మీకు వీలుపడదు . ఊ....రండి "  అంటూ తన బిగి కౌగిలో బంధించ బోయింది . 

"   ఉండు , యిపుడే వస్తా "  అంటూ పైకి లేవబోయాడు .

"   మళ్ళీ ఎక్కదకండి ? "

"   సంసారానికి ముందు బాత్ రూమ్ని సందర్శిస్తే ఇరువురం ఎక్కువ సమయం సంతోషం పొందవచ్చు . నువ్వూ వెళ్ళిరా . "

"   అబ్బ నేనిపుడే వెళ్ళి వచ్చా . త్వరగా ముగించుకొని రండి ."

అయిదు నిముషాలు గడచింది . అయినా రమణ రాలేదు .

"   ఏమండీ రండి , ఎంతసేపండి ? "

"   వచ్చేస్తున్నాను " అంటూ వచ్చేశాడు .

గట్టిగా హత్తుకున్నది . అణువణువును రాసుకుంటున్నా , అతను మాత్రం స్థాణువులా ఉండిపోయాడు . ఎట్టకేలకు " నా ఆరోగ్యం బాగా లేదు "   అన్నాడు .

ఇంత క్రితమే గదా తాయిలెట్ కి వెళ్ళి వచ్చి ట్యాలెంటుని చూపుతానన్నారు . ఇపుడు అసలుకే ఎసరు పెడ్తున్నారు . ఇంతలో ఏమైందండి ? "

ఇంతలో మరలా పక్కింటి పందిరి మంచం పదనిసలు ఇరువురి చెవులలొ జొరబడ్తున్నాయి .ఆ పదనిసలు పల్లవిగా , ఆ పల్లవి అనుపల్లవిగా , ఆ అనుపల్లవి చరణాలుగా మారుతూ ముందుకు పోతున్నది . ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అతను ఆశ్ఛర్యానికి లోనవుతున్నాడు . తమకం ఆపుకోలేక అతనిని గాఢంగా కౌగిలించుకొన్నది . వది
లించుకోవాలని ప్రయత్నిస్తూ " చెప్తున్నా వినవేంటి ? ఈ సమయంలో సంగమం సంతోషాన్నివ్వటం కంటే సంకటాన్ని తెచ్చిపెడ్తుంది . అందుకే ఇంతదాకా డాబా మీద పడుకొని వచ్చా ." 

"   సంకటం కలిగించినా నాకు సంతోషమే . సంకటి బాగుంటుందని అపుడపుడు ఆరగిస్తూనే వున్నాంగా . అలాగే ఇది కూడా యిన్నాళ్ళ విరహానికి యిదో కొత్త తరహా ఆనందాన్ని అందిస్తుంది . ఏమైనా యిబ్బందిగా అనిపిస్తే యింజక్షన్ చేయించుకుందాం . "

అతను విముఖత , ఆమె సుముఖత ల మధ్యన మన్మధుడు ముందుకు సాగలేకపోతున్నాడు .

"   చూడండి పంకజాన్ని మామ్మగారు పగలంతా ఎంత ఏడిపించుకు తిన్నా ,రాత్రివేళ్టకి ఆమెకు  ఏమివ్వాలో అది యిస్తూనే వున్నాడు ఆమె భర్త . పంకజం ఎంత అదృష్టవంతురాలో . పావుగంట క్రితం ఆ పందిరిమంచం సందడి చేసింది . మరల మరోమారు సవ్వడి చేస్తోంది .ఎన్నైనా చెప్పండి , ఏమైనా చేయండి , ఆడది ఎంత ఎక్కువగా సంసారం చేస్తే అంత ఎక్కువగా సంబరపడ్తుంది "   అన్నది .

మామ్మగారికి మళ్ళీ మెలకువ వచ్చింది ఆ సరిగమల సవ్వడికి , పక్కన పంకజం లేకపోవటం , టైం చూస్తే అర్ధరాత్రి 12.50 అయింది . ఓస్ యింతేనా ! చాలా సమయం అయినట్లుగా అంపించింది . మాంచి నిద్ర పట్టినట్లుంది . ఈ ముసలి తనంలో వచ్చిన తంటాయే యిది . నిద్ర పట్టిందంటే పరిసరాలు కూడా తెలియకుండా గాఢనిద్ర పడ్తుంది . లేకుంటే ఏవేవో ఆలోచనలతో తెల్లవారిపోతుంది  అనుకొంటూ హాల్లోకి నడచింది . గాజుల సవ్వడి వినిపించగానే , ఓసి నీ చోద్యం పాడుగాను , ఎంత బాగుంటే మాత్రం అంత వెంట వెంటనేనా ? అబ్బాయి నీరసపడిపోతాడే . మగవాళ్ళు మనలా వెంటవెంటనే సిధ్ధ్జం కాలేరే . అంతగా మళ్ళీ కావాలనుకొంటే వేకువఝామున చూసుకో , వెనకటికి నీలాంటిదే కాబోలు , ముహూర్తం మంచిదైతే ముందు వెనుక చూడకుండా రాత్రంతా మూలుగుతానందట , త్వరగా వాడిని వదలి బయటకు రావే " అంటున్నది . "

ఎప్పుడూ ఎవరెడీ కింగ్ లా ఉండే తన భర్త , ఇన్నాళ్ళ విరామం తర్వాత కూడా యిలా తోటకూర కాడలా వేలాడిపోవటంలో గల అంతరార్ధం మామ్మగారి మాటలతో గ్రహించింది అమృత . నిజమే కదా యిలా నేలచూపులు చూసేది ఆ సుఖం పొందిన తర్వాత తప్ప , పొందక ముందు కాదు  అని స్వానుభవం మరో మారు నిర్ధారణ చేసింది . 
పంకజం రెండవసారి రెడీ అయి రెచ్చిపోవటానికి కారణం ఆమె భర్త కాదని , తన భర్తేనని , అందువలననే తనతో వెంటనే సంసార సాగర మధనం చేయలేక , ఓ ప్రక్కన మధనపడ్తున్నారని తెలుసుకున్నది .
ఆవేశం ఆనకట్టలు తెంచుతున్నా నిగ్రహంతో " ఏమండీ నన్ను ఎంతగానో సుఖపెట్టాలని , నాకు ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందోనని , వేకువఝామున కూడా నేను వద్దంటున్నా వినకుండా తలగడలు అమర్చుతూ వచ్చారు . ఆ అలవాటు వేకువఝాము నుంచి అర్ధరాత్రి దాకా పాకింది .మిమ్మల్నే నమ్ముకుని మీరున్నా , లేకున్నా మీకొరకే నిరీక్షించి వుండే మీ జీవిత భాగస్వామికి జీవితకాలపు సుఖాన్నీందించండి . అంతే గాని , నాలుగు కూరలు తరిగి , నాలుగు బిందెలు నీళ్ళు తెచ్చి , నాలుగు గంటలు నిద్రపుచ్చి , ఆ పై మోసపుచ్చకండి . ఈ యింటి పనులు మీరు చేయవద్దు . ఈ యింటిపని అంతా నేను చూసుకొంటాను . నా ఒంటిపని మాత్రమే మీరు చూసుకోండి . ఈ స్వీట్  వార్నింగ్ని హాట్ వార్నింగ్ గా మార్చకండి . ఈ రొజుకి వేకువఝామున మళ్ళీ లేద్దాం , యిపుడు బుధ్ధిగా నిద్రపోండి ."   అని సుతి మెత్తగా హెచ్చరించింది .

                                                                   ** స ** మా ** ప్తం ** 

2 comments:

 1. please visit my blog sir
  http://ahmedchowdary.blogspot.in/

  ReplyDelete
  Replies
  1. చూశాను , బాగుంది .

   Delete