తప్ప లేదు


                                                                          తప్ప లేదు

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్                                                                                                                                  

ఇల్లంతా వ్యాక్యూం పెట్టు కొనటం తప్ప ,
చిమ్మి తుడుచుకొనే పనే లేదు .

కళ్ళార్పకుండా వాకిట్లోకి  చూడటం తప్ప .
కళ్ళాపు చల్లి ముగ్గెయ్యాల్సిన పనే లేదు .

రెంట్ పెరుగుతుందన్న కాషన్స్ తప్ప ,
కరెంటు పోతుందన్న టెన్షన్ లేనే లేదు .

గోడకు అంటించుకోవటం తప్ప ,
మేకులు కొట్టే పనే లేదు .

కొత్తదనం చూపించేవాడు తప్ప ,
చెత్త ఆరుబయట వేసేవాడు లేడు .

మనమనిషి కొరకు తప్ప , 
పనిమనిషి కొరకు చూసే పనే లేదు .

వేడినీళ్ళకు కుళాయిలని ఎడమ వైపు తిప్పుకోవటం తప్ప ,
గీజర్లు ఆన్ చేయాల్సిన పనే లేదు .

షాప్ నుంచి పాలు తెచ్చుకోవటం తప్ప ,
పెరుగు కొరకు తోడు వేయాల్సిన  పనే లేదు .

మజ్జిగ కొనుక్కోవటం తప్ప ,
చిలుక్కోవటం లేదు .

పండుకొని తినే వాళ్ళు తప్ప ,
వండుకొని తినే వాళ్ళు లేరు . 

కుక్కలకు ముక్కలు వేసి పెంచుకోవటం తప్ప ,
మొక్కలకు నీళ్ళు పోయాల్సిన పనే లేదు .

సంపాదనంతా ఆనందాలకు ఖర్చు చేసే వాళ్ళు తప్ప ,
దాచుకుందామని  ఆలోచించేవాళ్ళు లేరు  .

సాగర విన్యాసాలు చూపేవారే తప్ప ,
వేదాంత ఉపన్యాసాలు దంచేవారు లేరు .

శృంగారాన్ని అమితంగా ఆనందించటం తప్ప ,
బంగారాన్ని అమితంగా కొనుక్కోవటం లేదు .

తేడాలొస్తే విడాకులు తీసుకోవటం తప్ప ,
ఆత్మవంచనతో  కాపురం కొనసాగించాల్సిన పనే లేదు .


                               **********

6 comments:

 1. మరల్లా బతకడం తప్ప మనుషుల్లా బతికే ఆలోచనేలేదు :)

  ReplyDelete
  Replies
  1. తప్ప లేదు అంటే తప్పటం లేదు అని , తప్పు లేదని గ్రహించుకోవచ్చు .

   Delete
 2. పాత-కొత్తల మేలు కలయికలా ..హాస్యరసపూరితంగా నిత్యసత్యాలని బాగా వర్ణించారు ...

  ReplyDelete