కలిసొచ్చిన అమెరికా

                                                                కలిసొచ్చిన అమెరికా
                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్

ఉదయాన్నే నిద్రలేవాలన్న తలంపు లేదు ,
పొద్దెక్కితే నీళ్ళు పోతాయన్న భయం లేదు ,    
పాల ప్యాకెట్లు అయిపోతాయన్న ఆదుర్దా లేదు ,
పేపరు చదవలేదన్న ఆలోచనా లేదు ,
వాకిళ్ళు చిమ్మి , కడిగే పనే లేదు ,
ముగ్గేయలేదన్న బెంగా లేదు ,
చిమ్మలేదేమని అడిగేవాడు లేడు .
బైటకెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలన్న రిస్ట్రిక్షన్స్ లేవు ,
పనిమనిషి రాలేదన్న ఎదురుచూపు లేదు ,
దేవుడు , దేవతలు ఉన్నారన్న ఊసే వినపడదు ,
పూజ , పునస్కారాల ఛాన్సే లేదు ,
ఔపోసన పట్టలేదన్న ధ్యాసే లేదు ,
అమ్మా నాన్నల మాటలు వినవలసిన పనే లేదు ,
అత్త మామలకు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు .
ఆడబిడ్డల ఆరళ్ళు లేవు , తోడికోడళ్ళ కుళ్ళు లేదు ,
తోడబుట్టిన వాళ్ళ శాపాలు వుండనే వుండవు .
అయినవాళ్ళు వచ్చి తిష్ట వేస్తారన్నభయం లేదు ,
మన వాళ్ళింటికి వెళ్ళలేక పోయామన్నదిగులు లేదు ,
మనలని వేలెత్తి చూపించే  వెధవా లేడు ,
కులాలని , మతాలని ఎత్తి చూపే వెఱ్ఱి బాగులోడూ లేడు ,
ఎక్కడ , ఎంతసేపు తిరిగినా , ప్రశ్నించేవాడే లేడు .
ఎదుటివాడి స్వేఛ్ఛకు ఎదురడ్డు వేసేవాడు లేడు ,
అర్ధరాత్రైనా పడుకోలేదేమిటని అడిగే వాడెవ్వడూ లేడు ,


                               ***********

16 comments:

 1. ఛస్తే పట్టించుకునే నాధుడూ లేడు.

  ReplyDelete
  Replies
  1. శర్మ గారు ,

   నమస్తే .

   చస్తే వచ్చే నాధులు చాలామంది ఉన్నారు . కాని ఆడది చస్తే అసలు నాధుడెవరో అందులో తెలుసుకోవటం మాత్రం కష్టం .

   Delete
 2. viluvalu valuvalu leni america pi antishtmenduko..............

  ReplyDelete
  Replies
  1. విలువలు , వలువలు మన పుస్తకాలకు మాత్రమే పరిమితం చేశారు . ఆచరణలో లేని వాటిని పట్టుకొని బహు గొప్పగ చెప్పేసుకొంటూ , మనమేదో గొప్పవాళ్ళగ ఫీలవుతున్నాము అంతే .

   Delete
 3. neeku america picchi pattindi , nuvvu india vaadiki puttaavaa leka americaa vaadikaa

  ReplyDelete
  Replies
  1. మనం ఎవరికి పుట్టామన్నది , ఎక్కడ పుట్టామన్నది , ఎన్నాళ్ళు బతికామన్నది విషయం కాదు , ఎంత మంచి పద్ధతులతో బతికామన్నదే విషయం . ఎదుటివారిని వంచిస్తూ , కించపరుస్తూ , మనల్ని మనం వంచన చేసుకుంటూ బతికే బతుకు కాదని అర్ధం చేసుకోండి . ఎక్కడ ఎవడికి పుడితేనేం చక్కగ బతికితే చాలు . గతంలో ఎవరు ఎక్కడ పుట్టారో ఎవరు చెప్పగలరు .

   Delete
 4. good one !పంజరాన్ని తప్పించుకోలేని పక్షుల విమర్శలు పట్టించుకోకండి ! స్వేచ్చ్హ ని కూడా అనుభవించటం చేతవ్వాలి !

  ReplyDelete
  Replies
  1. చిత్రాలతో కూడిన పరిచయం బాగుంది .

   Delete
 5. మీరు చెప్పిన వన్నీ నిజాలే .కానీ అవన్నీ అందరికీనచ్చవు కదా!అందుకే కదా! చాలా మంది తిరుగు ముఖం పడుతున్నారు .

  ReplyDelete
  Replies
  1. తిరుగు ముఖం పట్టేవాళ్ళని ఎవరూ ఆపలేరు . మనిషి ఒక చట్రంలో పెరుగుతాడు . ఆ చట్రంలోంచి బయటకు రాలేడు . అది ఎవరి తప్పూ కాదు . కాకుంటె తన విచక్షణా ఙ్నానంతో తన కేది మంచి తోస్తే దాని వైపు మరలగలుగుతాడు . అంతే అందరూ అమెరికాలో ఉండాలని ఎవరూ అనరే . ఈ దేశంలో జనాభా తక్కువ . వీళ్ళకు జనాభా అవసరం . ఎంతైనా దబ్బులు వెదజల్లగల్రు . వాళ్ళ అవసరాలు అటువంటివి . వాళ్ళ పధ్ధతులలో మనల్ని జీవించమని వాళ్ళు కోరటం లేదు . మన స్వేఛ్ఛ మనకే యిచ్చారు ఒక్క పిల్లల్ని కొట్టే విషయంలో తప్ప .

   Delete
 6. ఎవరి పని వారే చేసుకోవాలి...ఎవరి మరుగుదొడ్డి వారే కడుక్కోవాలి...పనిమనుషులుండరు...పక్క ఫ్లాట్ వాడూ పలకరించడు... liftలో తారసపడినప్పుడు hi అని పళ్లికిలిస్తాడు...ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేవు...ఎవరికి వారే యమునా తీరే...జీతనాతాలు దండిగా ముడతాయి... కానీ ఖర్చులూ అలాగే ఏడుస్తాయి... ఎవరి కారు వారే తోలుకోవాలి... బీమా లేకుండా ఆసుపత్రి గడప తొక్కలేము... చూసి పోదామని వచ్చినవారికి రోగం రొష్టు వస్తే అంతే సంగతులు.... ఇది వృద్ధులు వచ్చి ఉండే దేశం కాదు... వీరి ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులు... ప్రతి వారం ప్రతి రోజూ తమ సమర్థత నిరూపించుకోవాలి...చాలా కష్టపడి పని చేయాలి.... కాలం వెనుక పరిగెత్తాలి... నీ గడ్డం నీవే చేసుకోవాలి... హెయిర్ కట్ కు కూడా చాలా డబ్బు వెచ్చించాలి... ఉట్టి house వైఫ్ లకు ఇది దేశం కాదు... అందరూ ఉద్యోగాలు చేయాలి... యువకులకు వెలయాళ్ళుంటారు...విద్యార్థులు డేటింగ్ చేస్తారు... వృద్ధులకు ఆశ్రమాలుంటాయి... మనిషి పని విలువ ఎక్కువ... మానవ విలువలు తక్కువ... ఎవడి సుఖం వాడిది... ఎవడి సంతోషం వాడిది... పిల్లలకు హక్కులు ఎక్కువ... కూరగాయలు కొనుక్కున్నట్లు పిస్తోళ్ళు కొనుక్కుంటారు... నేరాలకు శిక్షలు ఎక్కువ... అయినా కోపాలు ఎక్కువ... ఆపుకోలేరు... వేగం పెంచి కార్లు తోలకూడదు...నిబంధనలు అతిక్రమించకూడదు... చట్టాలను కట్టుదిట్టంగా పాటించాలి... వారాంతాలు సుఖాంతాలు కావాలంటే హద్దుకు మించి ఖర్చించవద్దు...కారు డ్రైవింగ్ రాకుండా బతక లేరు...అయినా నాకు అమెరికా గురించి ఎక్కువ తెలియదు...2008లో 6 నెలలున్నాను... ఇప్పుడు 6నెలలుంటాను...అంతే !!!అంత మాత్రానికే ఏమి తెలుస్తుంది...నాకంటే మా ఆవిడకు ఎక్కువ తెలుస్తుంది...ఎందుకంటే ఆవిడ రావడం ఇది మూడోసారి!!!

  ReplyDelete
  Replies
  1. మీరన్నవన్నీ నిజాలే . అయితే మనలను మనం వంచన చేసుకొంటూ బ్రతకటం సబబు కాదన్న భావన . మంచి పధ్ధతులు , విధానలు ఎక్కడ వుంటే అక్కడ మెచ్చుకొనటం మన నడవడిలోని విధానాలని తెలియచేస్తాయి .
   మనాదే ప్రపంచమ్నే కంటే , అవకాశమున్నపుడు చూడటం వల్ల మనం మిగిలిన దేశాల నడవడిని తెలియచేసుకొనే అవకాశం కలుగుతుంది . ఈ అమెరికా రాక ముందు నేను చెప్పాను చాలామందికి , ఇల్లాళ్ళకి , చిన్నపిల్లలకి & వృధ్ధులకు ఓ జైల్ లాంటిదని . ఆంగ్ల భాష వచ్చినవారికి కొంచెమైన తెలుసుకొనే వీలున్నదని .
   మీకు నా ధన్యవాదములు .

   Delete
 7. అమెరికా బతకనేర్చిన దేశం... వాడెయి వాడి పారెయి అనే తత్వం ఇక్కడ సర్వ సాధారణం... ఇక్క్దడ అమ్మే బొమ్మలు వస్తువులలో made in china వే ఎక్కువ!వీరి english accent కొద్దో గొప్పో ఆంగ్లం వచ్చిన వారిని కూడా మొదట్లో తికమక పెడుతుంది ....ఇక్కడి గ్రంధాలయాలు బాగుంటాయి ...పుస్తకాలు సినిమా కాసేట్ట్శ్ ఇంటికి తెచ్చుకోవచ్చు ...ఒకేసారి 30 తెచ్చుకోవచ్చు... ఉచితమే కానీ నిర్ణీత గడువు లోగా return చేయకపోతే ఒక్కొక్కడానికి ఒక్కొక్కరోజుకు ఒక్కొక్క డాలర్ fine వసూలు చేస్తారు ...non veg pickles తెచ్చుకుంటే మినియాపోలిస్ విమానాశ్రయం లో 300 డాలర్స్ fine వేసి ముక్కుపిండి వసూలు చేస్తారు !!!ఏదయినా కొని 3 నెలలు వాడుకొని నచ్చలేదని వాపస్ ఇచ్చేస్తే మనం చెల్లించిన డబ్బు ఏమీ ప్రశ్నించకుండా తిరిగి ఇచ్చేస్తారు ... పుస్తకాల షాప్ సోఫాల మీద కూర్చొని అక్కడే టీ కొనుక్కుని తాగుతూ రోజంతా చదువుకొని ఏమీ కొనకుండా ఎంచక్కా చేతులూపుకుంటూ ఇంటికి రావచ్చు...విశాలంగా 6 roads ఉంటాయి కానీ పౌరుల హృదయాలు కూడా అంత విశాలంగా ఉంటే ఎంత బాగుండును!!! శర్మ గారన్నట్లు వివిధ దేశాలు తిరిగితే ప్రపంచజ్నానమ్ common sense ఖచ్చితముగా పెరిగితీరుతాయి!!!

  ReplyDelete
  Replies
  1. ఇవన్నీ బాగున్నాయి . కాకుంటే ఒక్కటే , అమెరికా వాళ్ళ ప్రకారం ఇక్కడి డబ్బులతో ఇక్కడ చక్కగా , హాయిగా జీవితం కొనసాగించవచ్చు . వీళ్ళ ప్రకారం మన రూపాయనే పాపాయికి విలువ తక్కువ . అదే మన డబ్బుతో డాలర్ కొనాలంటే ఇపుడు ఈ క్షణం మన 56.25 రూపాయలు పెడితే గాని 1 డాలర్ మనకు లభ్యం కాదు . ఇక్కడ అందరికి దాదాపుగా కార్లు ఉండితీర్తాయి . మనకున్నట్లుగా ఇక్కడ పనివాళ్ళు ఉండరు . అయినా ఎంత అందంగా వుంటాయి వీళ్ళ యిళ్ళు , పరిసరాలు . పనికి చొంట్రాక్ట్ మాత్రమే వుంటుంది . చెబితే చానా వుందండి . మరొక కవితలో ఇంకొన్ని తెలియచేస్తున్నాను . మీరు అమెరికాలో ఏ ఏరియాలో వుంటున్నారు . నా ఈ మెయిల్కి తెలియజేయండి , బ్లాగులో మాత్రం వద్దు . sharmags52@gmail.com
   కృతఙ్నతలు .

   Delete
 8. వాకిళ్ళు చిమ్మి , కడిగే పనే లేదు ,
  ముగ్గేయలేదన్న బెంగా లేదు ,
  చిమ్మలేదేమని అడిగేవాడు లేడు .
  బైటకెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలన్న రిస్ట్రిక్షన్స్ లేవు ,
  దేవుడు , దేవతలు ఉన్నారన్న ఊసే వినపడదు ,
  పూజ , పునస్కారాల ఛాన్సే లేదు ,
  ఔపోసన పట్టలేదన్న ధ్యాసే లేదు ,
  ఎక్కడ , ఎంతసేపు తిరిగినా , ప్రశ్నించేవాడే లేడు .
  అర్ధరాత్రైనా పడుకోలేదేమిటని అడిగే వాడెవ్వడూ లేడు

  పెద్దలు. ఇవన్నీ మీకు మంచిగా కనిపించాయా?

  ReplyDelete
  Replies
  1. మనకేది అలవాటు అయితే అది మనకు మంచిగ అనిపిస్తుంటుంది . దాన్ని బట్టే మన జీవనం సాగుతుంటుంది . అంతే . ఇది మీలాంటి పెద్దలకు నచ్చిందా అంటే ?
   మీరుదహరించినవి కాకుండా , నాకు ఇంకా చాలా చాలా నచ్చాయి . ఇక్కడ మనం ఒక విషయం ఙ్నప్తికి తెచ్చుకోవటం చాలా అవసరం ఉంది .
   మనకు ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకు మంకు నచ్చే విషయాలు ఎన్నో మారాయి అన్నది మనం ధైర్యంగా ఒప్పుకొనటం చాలా చాలా అవసరం .
   కనుక ఇలా మనకు నచ్చటం అనేది నిశ్చలం కాదు అన్నది అర్ధం చేసుకొందాం .

   Delete