లాక్స్ లో లేని రిలాక్స్

                                                                       
                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్

పెళ్ళై 6 నెలలు నిండకుండానే ఉద్యోగం పుణ్యమా అని వేరుకాపురం పెట్టే అవకాశం  వచ్చినందుకు అందరిలాగే పరిమళ కూడా సంతోషపడ్డది . ఆడదానికి గాని , మగవాడికి గాని నాదంటూ ఒకటి ఏర్పడటానికి మూలమైన కార్య
క్రమమే  ఈ పెళ్ళి .

పెళ్ళి కాగానే మగవాడు బరువు నెత్తి మీద వేసుకొంటాడు , ఆడవారు బాధ్యత నెత్తి మీద వేసుకొంటారు . 
మగవాడు బరువు నెత్తిన వేసుకోవటం వలన వాడికి తనదన్నది తెలిసి వస్తుంది .
ఆడవారికి ఆ బాధ్యత నెత్తి మీద వేసుకోవటం వలన ఆ ఇల్లంతా తనది , ఇంటికి వచ్చేవాళ్ళందరకు తను మర్యాదలు చేయాలి , మంచిగ చూడాలి , ఆ మగవాడు నెత్తిన పెట్టుకున్న బరువు , తను నెత్తిన పట్టుకున్న బాధ్యత కలిసి మొత్తం తనమీదనే ఇల్లు సరిదిద్దవలసిన ముఖ్యమైన బాధ్యత అంతా తనమీదనే వుంటుందన్న భావనతో , మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఆలోచనలతో , తన సామ్రాజ్యాన్ని మెలమెల్లగా ఏర్పాటు చేసుకొంటున్నది .

మగడు పెండ్లాము బరువు బాధ్యతలు లాంటివాళ్ళు . ఇంకా చెప్పాలంటే  బ్యాలెన్స్ స్కేల్ లాంటి వాళ్ళు . రాళ్ళ వైపు మగవాడుంటే , ఆ (వస్తువుల) వైపు ఆడవాళ్ళుంటారు . మగవాడు ( రాళ్ళు ) ఎప్పుడూ కరెక్టుగా కుదరకుంటే కొంచెం తగ్గినా ఫరవాలేదు అనుకొని సర్దుకోమంటుంటాడు  . ఆడవాళ్ళు మాత్రం అదేం కుదరదు , కరెక్ట్ ఒక్కటే చాలదు , ఇంకా మొగ్గు కూడా వేసి తీరాల్సిందేనంటూ ఆ వైపే మొగ్గు చూపుతుంటారు . అదేమిటంటే మా కొరకు కాదు , మన కుటుంబం కొరకంటారు .

ఇది నా యిల్లు అనుకున్నపుడే మనింటికి వచ్చిన వాళ్ళకి , మర్యాదలు గాని , మంచి చెడులు గాని చక్కగా చూడ
గలం . లేకుంటే మీ పరువు పోతుంది , అందుకే మాకీ తాపత్రయం అంటారు .
అందరిలాగే మన హీరోయిన్ పరిమళ కూడా , మనిల్లు , మన వాకిలి అంటూ , కుటుంబాన్ని ఒక పధ్ధతిలో నడపాల
నే విధానంలో తను చెప్పినట్లు వినాలని నియమాలను అమలు జరుపుతోంది . ప్రసాదుకి కూడా యిబ్బందేమనిపిం
చకపోయేసరికి అలా కొనసాగుతూనే వున్నది .

ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకి ఆఫీస్ అయిపోగానే అలా ప్యారడైజ్ సెంటర్ కి వెళ్ళి కొంత సమయం కాలక్షేపం చేసి సరిగ్గా 7 గంటలకు ఇల్లు చేరుకొనేవాడు . ఆ సరికి తన పనులన్నీ పూర్తి చేసుకొని పసివాడికి కావలసినవన్నీ అందిం
చి , 8 గంటలకల్లా నిద్ర పుచ్చేపనిలో వుంటుంది . ఈ లోగా ప్రసాదు ఫ్రెష్ అయి వచ్చేస్తాడు . రాగానే యిరువురూ       కలసి కాఫీ తాగుతూ ముచ్చటలాడుకొనేవారు . ఆ తర్వాత కొంత సమయం టీ వీ తో కాలక్షేపం చేసేవారు . ఆ తర్వాత డిన్నర్ చేసేవారు . 10 గంటలకి పడక చేరుకొంటారు . ఎపుడైనా మూవీకి వెళ్ళానుకున్నప్పుడు మాత్రం సెంటర్లో కాలక్షేపం చేయకుండా డైరెక్టుగా ఇంటికి వచ్చేవాడు .

ప్రసాదు సెకండ్ షోకెళ్దామంటే , ఈ కాలాన్ని బట్టి బయట సెకండ్ షోకి నేను రాను , ఇంట్లోనే అని బదులిచ్చేది .
ఆ సెకండ్ షో రోజూ ఉండేదే కదా అనేవాడు . ఇరువురూ ఆనందంగా నవ్వుకునేవారు .
అపుడపుడు చదరంగంతో ప్రసాదు , పదరంగంతో పరిమళ ఎంజాయ్ చేస్తుంటారు . చదరంగం పరిమళకు రాదు .
పదరంగం ప్రసాదుకి రుచించదు . అంతమాత్రాన ఇరువురి మ్నడుమ కదనరంగం కానే కాదు . ఇరువురూ ఎవరికి వచ్చిన , నచ్చిన దానితో హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు .

ఆటల విషయంలోనే కాదు , ఆహార విషయంలో కూడా ఇరువురి అభిరుచులు కలవవు . ఒకరికి బెండ యిష్టమైతే , మరొకరికి దొండ యిష్టం . ఒకరికి బీర యిష్టమైతే మరొకరికి సొర యిష్టం , ఒకరికి క్యాబేజి యిష్టమైతే , మరొకరికి క్యాలీఫ్లవర్ యిష్టం , ఒకరికి ఆలు ఫ్రై యిష్టమైతే , మరొకరికి అల్లం పచ్చిమిరప ఆలు వుడకబెట్టిన కూర యిష్టం . నాకు పెండలం యిష్టమని పరిమళ అంటే , నాకు పెండలం యిష్టం లేదు , పెండ్లాము యిష్టమని బదులిచ్చేవాడు ప్రసాదు .

ఒక తల్లి తండ్రులకు పుట్టిన పిల్లల అభిరుచులలోనే తేడాలుంటున్నాయి , ఒకరికి ఒకరం సంబంధం లేని మన యిరువురి కాపురంలో అభిప్రాయాలన్నీ కలవాలనుకోవటం తప్పు అని ఒకరి నొకరు అర్ధం చేసుకొని , కామన్ గా యిష్టమైన వాటితో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు .

ఎపుడైనా ఖాళీ దొరికినప్పుడు , ఇరువురూ పేకతో రెమ్మీ  ఆడుకొనేవారు .
ఈ ఆటలో కాదు ఏ ఆటలోనైనా ఓడే కొద్దీ గెలవాలనే తపన పెరుగుతుంటుంది . అందులో పేకలో ఇంక ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు . పేక అంటేనేపేదవారిని , కలవారిని ఒక్క చోట చేర్చేదని .
"
   పందెం కాద్దామా ? "   అని ప్రసాదంటే ,
"   మా బాబాయ్ అంటుండేవాడు , ఈ పేక పేదవాళ్ళను కలవాళ్ళగా , కలవాళ్ళను పేదవాళ్ళుగా  మార్చేస్తుందట . కనుక  డబ్బులతో పందెం వద్దండీ . మనం డబ్బులు పందెం పెట్టుకొంటే , ఎవరు గెల్చినా ఆ డబ్బులు మీవేగా . అందుకని మనం వెరైటీగా పందెం పెట్టుకుందాం , లేకుంటే హుషారుగా , పట్టుదలగా ఆడలేకపోతున్నాం "   అన్నది . "   అయితే చెప్పు , ఏం పందెం కాద్దాం ? "   అన్నాడు .
"   సరే వినండి , నేను గెలిస్తే , మీరు ఈ రోజు వంట చెయ్యాలి ."
"   మఱి నేను గెలిస్తే ? "   అన్నాడు .
"   మీరు గెలిస్తే , మీరడిగినది నేను కాదనకుండా వెంటనే ఇచ్చేయాలి , అదీ మన పరిధిలోనిదయి వుండాలి సుమా ! "   అన్నది .

ఇరువురూ పంతంగా , పట్టుదలగా ఎవరికి వారే గెలవాలని ఆడేవారు . ప్రసాదు అన్న ప్రకారమ్ తను వంటచేసేవాడు . కొన్నిసార్లు తను గెలిచేది , ఇంకొన్నిసార్లు ప్రసాదు గెలిచేవాడు . పరిమళ పందెం ప్రకారం  ప్రసాదు అడిగిన భంగి
మలలో ఆ ఆనందాలను అందిస్తూ తనూ అందుకునేది .

ఇందులో  చదువరులకు కొత్త ఏమీ కనిపించలేదు కదూ . అక్కడేనండి  కాలే పప్పులో కాలేశారన్నమాట . ఏ భార్యా
భర్త లైనా ఆ ఆనందాలను ఎపుడూ అందుకొంటూనే వుంటుంటారుగా అని .

అందుకోవటానికి , అనుకున్నట్లు పొందటానికి గల తేడాను ఇక్కడ మనం క్లుప్తంగా చెప్పుకొందాం . సహజంగా మగ
వాడు వెరైటీ కోరుకుంటుంటాడు . అది ఒప్పుకోనప్పుడు ఎడ్జస్ట్ అవుతుంటాడు . ఆ కోరికని మాత్రం వదలిపెట్టడు , మదిలోనే ఉంచుకొని సమయం కొరకు వేచి చూస్తుంటుంటాడు . ఇది సగటు మానవుడి నైజం .ఇక అసలు కధలోకి వద్దాం .

ఒక్కోమారు పరిమళ గెలిస్తే , ప్రసాదు అంట్లు తోమేవాడు , బట్టలుతికేవాడు ఆ ఒక్క రోజుకి మాత్రమే . ప్రసాదు గెలిస్తే తను రమ్మన్న చోటికి పరిమళ వెళ్ళేది .

అలా అలా రోజుకో కొత్త కొత్త పందెం కాసుకొంటూ , హాయిగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని 3 పువ్వులూ 30 కాయలుగా ఎంజాయ్ చేస్తున్నారు .

అలా 3 సంవత్సరాలు గడిచాయి . ఆ యిరువురూ మాట మాత్రం తప్పలేదు . పరిమళ మళ్ళీ నెల తప్పేలా చేశాడు ప్రసాదు .

"  బాగా ఆలోచించిన మీదట , మనమిద్దరం , మనకిద్దరు పిల్లలు చాలండి . పనిలో పని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్
చేయించేసుకుంటే సరిపోతుంది "  అన్నది పరిమళ .

"  మనం అనుకున్నట్లు ఆడపిల్ల పుట్టకపోతే ? "   అన్నాడు

"   అయినా ఫరవాలేదండి . మనం కంటున్న యిరువురినిఆరోగ్యకరంగా పోషించి , ప్రయోజకులను చేస్తే చాలు అక్క
డికి మనం ఎవరెస్ట్ శిఖరమెక్కిన వాళ్ళమవుతాం . "

"   సరే , అలాగే . నువ్వంతగా చెప్తుంటే , నేను మాత్రం కాదంటానా . "

"  మరి ఈ రోజు పందెం ఏమిటి ? "   అడిగింది పరిమళ .

"  నువ్వే చెప్పు "   అన్నాడు ప్రసాదు .

"  మీరే చెప్పండి ."

" నువ్వే చెప్పు . అందులోను వట్టి మనిషివి కావు . కడుపుతో వున్నవాళ్ళకు కొత్త కొత్త కోరికలుంటాయటగా ? కోరుకో  . "

"  ఇది అలా కోరుకునే సమయం కాదుగా . అది వేరు , ఇది ఆటలో పందెం కదా ! మీరే చెప్పండి . "

"  సరే నేను గెలిస్తే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నువ్వు చేయించుకోవాలి , నువ్వు గెలిస్తే నేను చేయించుకుంటాను ."

"   అలాగేనండి . ఆట మొదలెడదామా ? "

అనుకొన్న 20 ఆటలు పూర్తయ్యాయి . ఫైనల్ గా ప్రసాదే గెలిచాడు . పందెం ప్రకారం పరిమళ ఆపరేషన్ చేయించు
కొంటానన్నది .

ప్రసవ సమయం వచ్చింది . అమ్తదాకా సిజేరియన్ డెలివరీ కాస్తా , నార్మల్ డెలివరీగా మారి , పాప పుట్టి అంతులేని ఆనందానికి దోహదమిచ్చింది . 

2 రోజులు గడిచాయి . 

"   ఏమండీ ఆ ఆపరేషన్ చేయించుకుంటా "  నన్నది పరిమళ .

"  నువ్వు వద్దు , నేను చేయించుకుంటాను "   అన్నాడు .

"  పందెంలో ఓడింది నేను , గెలిచింది మీరు . నేను చేయించుకోవాలి ."

"  ఆ మాట నిజమేననుకో . డెలివరీ నార్మల్ అయింది కదా ! ఇపుడు ఈ ఆపరేషన్ కొరకు నిన్ను కష్టపెట్టడం , నీ ఆరోగ్యాన్ని పాడు చేయడం నాకిష్టం లేదు . " 

"  ఆరోగ్యం పాడయ్యేదేముంది , ఎంతమంది చేయించుకోవడం లేదు . బయట తిరిగే మీలాంటి మగవాళ్ళకి మంచిది కాదంటారు . "

"  ఎవరూ ? "

"  పక్కింటి పిన్నిగారు , ఎదురింటి వెంకాయమ్మ గారు , ముందింటి మునసబుగారి భార్య . "

"  వాళ్ళకేం తెలుసు , డాక్టరు కోర్సు ఏమి చదవలేదు , నర్సుగానైనా పని చేశారా ? లేదుగా . " 

"  మీ మాట వాస్తవమే , కాని వాళ్ళ అనుభవమున్నది చూశారు , అది నేర్పిన పాఠాల సారాంశమటండి ."

"  అంటే ? "

"  వాళ్ళ అల్లుళ్ళకి అలాగే చేయించారట . పిల్లలు కూడా హాయిగా , ఏ అడ్డంకులు లేకుండా , నాన్ స్టాప్ గా వయసుని ఎంజాయ్ చేస్తారులే అనుకున్నారట ."

"  మంచి ఆలోచనేగా మరి ."

"  మంచి అనుకొనే వాళ్ళు చేయించుకొన్నది . తీరా 2 ,3 నెలలు గడిచే వరకు దాంపత్యానికి లంఖణాలు చేయిస్తు
న్నారట . మరీ వెంటబడ్తుంటే వాళ్ళ అమ్మాయిలు , మనం కలిస్తే , మీకేదైనా అయితే జీవితాంతం బాధపడాల్సింది ముఖ్యంగా నేను , మీరు ఆ బాధతో ఎడ్జస్ట్ కావచ్చు కాని , నేను కాలేను కదా ! మరో 3 నెలలు ఓపిక పట్టండి అంటూ ఇలా ఆపుతుంటే , ఎంతకీ పధ్యం పెట్టే ఆనవాళ్ళు కానరాక పోయేసరికి , మెలమెల్లగా ఆ దారులు వెతు
క్కొంటూ పక్కదారులు పట్టారుట . అందుకనే మనకా పరిస్థితి రాకూడదు అంటున్నా . ఒకసారి రుచి చూసిన
తర్వాత అది అలవాటుగా మారటం అతి సులువైపోతుంది . ఆ తర్వాత మానుకోవటమే కష్టమైపోతుంది "   అన్నది పరిమళ .

"   మనకా పరిస్థితి ఎందుకొస్తుంది ? నువ్వు వాళ్ళలా సహకరించకుండా వుండవు కదా ! "   అన్నాడు ప్రసాదు .

"  అలా ఎలా చెప్తాను ? సందర్భాన్ని బట్టి కనికరించక నిరాకరించనూ వచ్చు . వద్దండి బాబు , మీరు చేయించు
కోవద్దు , నేను చేయించుకొంటాను "   అన్నది .

"  నువ్వు చేయించుకున్నా నా కోరికను 6 నెలలపాటు ఆపుకోవాల్సిందే కదా ! నీకు గుర్తు లేదా ,  మొదటి కాన్పుకి 11 వ రోజునే నేను చూపిన చొరవను కాదనలేక  నువ్వూ అందించావుగా . "

"   ఆ ఆనందాలని ఎలా మర్చిపోతాను , అన్నీ గుర్తున్నాయండి . అప్పుడంటే నార్మల్ డెలివరీ కాబట్టి , మొగ్గాను . ఇపుడంటే , ఆపరేషన్ కదా , అర్ధం చేసుకొంటారుగా . "

"  నిజం చెప్పనా ? అర్ధం చేసుకున్నట్లు కనపడ్తాం . ఆ ఆకళ్ళు ఎలా మానుకోబడ్తాయి . ఆఫీసులో పనుందనో , ఫ్రెండుకి సాయం చేయాలనో , బాస్ నైట్ డ్యూటీ వేశాడనో లాంటి అబధ్ధాలను అందంగా మలచి , ఆ అడ్డదారులను రహదారులుగా మార్చుకొంటూ ఆ అవసరాలు తీర్చుకొంటుంటాం . అసలు ఆడవాళ్ళకి డెలివరీతోటే ఒంట్లోని శక్తి పోతుందంటారు . ఇంకా ఈ ఆపరేషన్స్ తో మరింత బలహీన పడ్తారుట . కనుక నువ్వు చేయించుకోవద్దు . అంతే కాదు భార్యాభర్తలలో ఎవరు ఈ ఆపరేషన్లు చేయించుకున్నా , అవి ఫెయిలైనప్పుడు ఆ పచ్చని సంసారాలలో చిచ్చుపెట్టినట్లు అవుతుంది .  "

"  మరెలాగండి దీనికి సొల్యూషన్ ?  మీకు సంపాదించగలనన్న ధీమా వున్నా , ఇలా కంటూ పోతుంటే నాకు మాత్రం  అంతమంది పిల్లల్ని పెంచే  ఓపిక  లేదండి "   అన్నది .

ఇంతలో సిస్టర్ వచ్చి , "   డాక్టరుగారు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కి ధియెటర్ బుక్ చేశారు . 2 గంటలముందు ఏ ఆహారం తీసుకోకుండా ఈ టాబ్లెట్లు వేసుకోండి .ఈ కాగితం మీద సంతకం పెట్టండి అన్నది ."
అన్నీ విన్న ఆ ఇరువురూ ఏక కంఠంతో "  సారీ మా నిర్ణయం మార్చ్హుకొన్నాం "   అన్నారు .

"  మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ? "   అన్నది సిస్టర్ .

"  మా ఫ్యామిలీ ప్లానింగ్ మేమే చేసుకొంటాం . మీరనుకొంటున్నట్లుఆ ఆపరేషన్ తో కాదు , మా ఇరువురి కో ఆపరేషన్ తో "   అన్నారు .

ఎంతమందో లాక్స్ ఖర్చు పెడ్తున్నారు , అయినా వాళ్ళెవ్వరికీ దొరకని రిలాక్స్ ని అతి సులభంగా  పొందారు  ప్రసాదు , పరిమళలు  తీసుకున్న నిర్ణయంతో  .

సిస్టర్ దిగ్భ్రాంతి చెందినదై మారు మాట మాట్లాడకుండా వెను తిరిగింది .

కొంతసమయం అయిన తర్వాత చార్జ్ చేసుకున్నట్లున్నది , డిస్చార్జ్ షీట్ తో పరిమళ బెడ్ వద్దకు వచ్చింది సిస్టర్ .


                                                                           ** స ** మా ** ప్తం **            

No comments:

Post a Comment