అవ్వా బువ్వ


                                                                          అవ్వా బువ్వ
                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్  

             (  మాలిక వేగవంతమైన బ్లాగుల సంకలిని లోని 12/06/2013 పెండెం గారి చిత్రానికి నా చిన్న కవిత  )

                                                          
అవ్వా , 
ఓ గువ్వా ,
ఈ కొంచెం కూరలలో ,
ఎంత లాభం పొందుతావు ?
కట్టుకున్నవాడు కాటికే చేరిపోయాడా ?
నువ్వు కన్నవారు కాదన్నారా ? 
అయినవారు దరిచేరనీయలేదా ?
వయసు మీరిపోయిందని ,
నువ్వు కన్నవారి మనసు మారిపోయిందా ? 
పది బజార్లు తిరిగి యాచించక ,
నడిబజార్లో యిలా కూరలమ్ముకొంటున్నావా ?
యాచన కంటే ఈ యోచన మంచిదేలే ,
నిన్ను చూసైనా బధ్ధకస్తులు , 
బుధ్ధి తెచ్చుకొంటే బాగుండు ,
అవ్వా , ఓ గువ్వా ,
ఇవి నీకు తప్పక ,
బువ్వ పెడ్తాయిలే ,
వారికి బుధ్ధి వస్తుందిలే ,
యికనైనా  .

   **********

7 comments:

 1. Replies
  1. మీ అభినందనలకు కృతఙ్నతలు .

   Delete
 2. యాచన కంటే ఈ యోచన మంచిదేలే

  బాగుంది !!

  ReplyDelete
 3. Pic itself expressing everything.
  మీ కవితతో దానికి వన్నెతెచ్చారు.

  ReplyDelete
  Replies
  1. This comment has been removed by the author.

   Delete
 4. కృతఙ్నతలు .
  అటువంటి మంచి చిత్రాన్ని అందించిన పెండెం గారికి ఈ నా బ్లాగు తరఫున మనఃస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను .

  ReplyDelete