అందుకేనేమో

నియమ నిబంధనలను పటిష్టంగా తయారుచేస్తారు ,
అమలు జరుపటంలో అలసత్వం ప్రదర్శించరు ,      
ఏ అపేక్ష , ఆపేక్షల ఊసే అడ్డు రాదు ,
తన అనేదానికి అగ్రిమెంట్ ఒక్కటే ,
అదే అసలు సిసలు కమిట్మెంట్ ,
గడువు కాలం దాటితే ,
ఇష్టమైతే పొడిగింపు ,
లేకుంటే అంతటితో ముగింపు ,
నేడు తనది అనుకున్నది ,
రేపు పరాయిది అయిపోతుంది ,
అందుకే అనుబంధాలు ,
అడ్డు రావు , రాబోవు , రాలేవు      
అందుకే అమెరికా అత్యున్నతంగా ఉండగలిగింది ,
ప్రపంచ దేశాలన్నింటిలో ప్రధమమైంది .

     
                         ***


ప్రకృతిలో ,
పగలు , రేయిలలో ,
పర్యావరణంలో ,
అకారాలలో ,
ఆచారాలలో ,
బంధాలలో, 
అనుబంధాలలో ,
ఆలోచనా సరళిలో ,
ఆహార వ్యవహారాల్లో ,
ఆంతరంగిక విషయాలలో ,
సంస్కృతి , సాంప్రదాయాలలో ,
ప్రసాదాల , ప్రాకారాలలో ,
నీతి , నియమాలలో ,
ఆస్థుల అంతస్తులలో ,
అందాల ఆనందాలలో ,
దాచుకోవటంలో , దోచుకోవటంలో ,
ఎవరి స్వేఛ్ఛను వారికీయటంలో ,
ఆడవాళ్ళను గౌరవించటంలో ,
ఏ కోణం నుంచి చూసినా ,
అన్నింటా అంతులేని తేడానే .

                                                                                                                                                   *****

శాశ్వత అనుబంధాలు ,
సత్య ధర్మ పాలనకు
సర్వత్రా అడ్డంకులే ,
అందుకేనేమో , మన 
ఇండియా  అలా మిగిలిపోయింది . 

******

4 comments:

 1. అందుకేనేమో అనే కవిత లో కవిగారు అమెరికాలోని పనిసంస్కృతి శ్లాఘిస్తూ ఇండియా నేర్చుకోవలసిన ఆవశ్యకతను చెప్పక చెప్పారు!మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి!నేనిపుడున్న అమెరికా లో ఉన్నా సరే!అయితే భారతీయులు ఇక్కడ ఒళ్ళువంచి పని చేస్తారు కాని వారే ఇండియాలో అంత కష్టపడి పనిచేయరు!పనిని ప్రేమించరు!easy గా పనిని తీసుకుంటారు!ఆ mindset మారాలంటే మన రాజకీయ వ్యవస్తను క్షాళనమ్ చేయాలి!

  ReplyDelete
  Replies
  1. సూర్య ప్రకాష్ గారూ ,

   నమస్తే ,

   బహు కాలానికి మీ కమెంట్ చూస్తున్నాను . మన భారతీయులు అమెరికాలో కష్టపడి పని చేసినట్లు మన ఇండియాలో చేయరు అన్నారు . దానికి అనేక కారణాలు . మొదటిది అక్కడ యిచ్చినంత ( అదేపనికి ) మన ఇండియాలో యివ్వకపోవటం . రెండవది మన వాతావరణంలో మనమ్ అలవాట్లకు మనం బానిసలమవటం . మూడవది మొత్తం మీద మన ప్రభుత్వ ప్రజా పరిపాలనలోని చిన్నవిగా కనపడ్తూ పెద్దవై వేళ్ళూనుకుపోయిన పనికిమాలిన శిలాశాసనాలు లాంటి బంధశాసనాలు .

   Delete
 2. "భారతదేశం మీద ప్రేమ నాకు వుండాలి ఎందుకంటే నేను భారతీయుడిని కనుక" అన్న నినాదం ప్రతి వోక్కడిలో నాటుకొని వున్నది అంతేకాక మరో ముఖ్య కోణం ఏమిటంటే "నా కులం వాడు కాబట్టి నేను మద్దత్తు ఇవ్వాలి "అనే దరిద్రపు భావం కూడా ఇందులోని బాగమే, ఇలా కాక నిజం/మంచి మీద నాకు ప్రేమ వుండాలి అనే భావం ఉండి వుంటే భారతదేశం ఇంత చెడి పోయేది కాదు.

  నిజాన్ని/మంచిని ప్రేమించేవాళ్ళు చాల తక్కువ అందులోనూ నిర్భయముగా చెప్పేవాళ్ళు బహు తక్కువ ఆచరించే వాళ్ళు మచ్చుక్కి కూడా కష్టమే ..... స్త్రీ ని శక్తీ రూపం అని భావించే భారతదేశం లో జరిగే అరాచాకాలు ఎన్నో ఎన్నెన్నో ...... విచ్చలవిడితనం / దోపిడీతనం/ స్వార్ధం రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఖచ్చితముగా భావితరాల వారికి భారతదేశం మీద కంటే మంచిని ప్రేమించే తత్వాన్ని భొదించగలగడం అభినందనీయం...

  కాకపొతే నేను పైన చెప్పిన విధానాలకి అలవాటు పడ్డ ప్రజలు మధ్యన మనం వున్నాం కనుక ....తస్మాత్ జాగ్రత్త

  ReplyDelete
  Replies
  1. మన భారత దేశంలో పటిష్టమైన శాసనాలను తయారు చేసే ఆసనాలున్నాయే తప్ప వాటిని పటిష్టంగా అమలు జరుపలేకపోతున్నారు . అందుకు బలవత్తరమైన కారణం బంధు ప్రీతి ,బలగ ప్రీతి కూడా మరొకటి . ఆ బలగ ప్రీతి జలగలా పట్టి పీడిస్తున్నంత కాలం మన భారత దేశంలో నిత్యం జరిగే అరాచకాలు ఆగవు . శాసనాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు , మనోబలం తగ్గటం తప్ప .
   అమలులో అలసత్వం ప్రదర్శించని నాడు మనం భారతీయులమని చాటుదాం . అంతవరకు ఎక్కడో చాటు చోటు చూసుకొని బ్రతుకీడ్చవలసిన అగత్యం ఏర్పడుతోంది నేటి భారతీయ పౌరుడికి . ప్రపంచ దేశాల ముంగిట ఈ దుస్థితి ఏ భారతీయుడికి రాకూడదని ఆశిద్దాం .

   Delete