పోర్టబుల్ మొగుడు

                                                                                                                               కధా రచన : శర్మ జీ ఎస్

కాలింగ్ బెల్ మ్రోగగానే డోర్ ఓపెన్ చేసి " హలో శైలజ గారూ వెల్ కం . ఇప్పుడేనా రావటం , మీకొఱకే వెయిట్ చేస్తున్నాను , కమిన్ " అంటూ దారి యిచ్చి , శైలజ లోపలకు అడుగిడగానే డోర్ లాక్ చేసి లోపలకు నడిచాడు మధు .
బ్రీఫ్ కేసు టేబుల్  పై వుంచి "   డియర్ ట్రెయిన్ ఆలస్యమవటంతో ప్రయాణం యిబ్బందికరంగా జరిగింది . మొదట కాలకృత్యాలు "   బాత్ రూం కి దారి తీసింది శైలజ .
అర్ధగంట గడిచాక కాఫీ తాగారిరువురూ , మెడలోని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది .
సూత్రం చూసిన మధు సూత్రం తెగిన గాలిపటంలా అటు , యిటు కంగారుగా ఊగిసలాడుతున్నాడు . "   ఏమిటది ? మంగళసూత్రమా ? అదీ నీ మెడలోనా ? "   అడిగాడు .

"   అవును , మంగళసూత్రమే , అలా కంగారు పడతారెందుకు ? "    అన్నది తాపీగా శైలజ .

"   కంగారుపడనవసరం లేదని తెలికగా చెప్పేస్తారు . నెను కట్టవలసిన మంగళసూత్రం నాక్కాబోయే అమ్మాయి మెడలో ఎవరో కట్టినట్లు కళ్ళకు కనపడ్తుంటే కంగారు కాక యింకేముంటుంది ? "

"   ఈ మాత్రం దానికే యిలా అయిపోతే ఎలా ? ఇల్లు వదలి బైటకు వస్తున్నా కదా . ఎవరైనా పోకిరీలు వెంటబడ్తారేమోనని , ఆ సూత్రం వాళ్ళకంట బడాలని నాకు నేనే వేసుకున్నాను . " "

"   మీరే వేసుకున్నారా ? హమ్మయ్య బతికించారు . నా అవకాశాన్ని నాకు వుంచారుగా . "

"   అలా ట్రెయిన్ దిగి వస్తున్నానా , ఓ పోకిరి వెంటబడ్డాడు . ఈ తాళిజాకెట్ లోంచి బైటకు తీసి కళ్ళకద్దుకున్నా , అంతే పరారయి పోయాడు . ఇదే నన్ను సురక్షితంగా నన్ను మీ వద్దకు చేర్చింది "   అన్నది .

"    మంచిపనే జరిగింది . ఇక్కడ పోకిరీలు లేరుగా . ఇంకా మెడలో ఎందుకా సూత్రం , తీసి దాచుకోండి . వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకుందురు . "

"   ఫరవాలేదు డియర్ , వుండనీయండి . "

" ఉహు , ముందు దాన్ని తీసేయండి . "

"   తీయను . "

"   దేనికని ? "

" మీరు చెప్పినట్లు తీసేశాననుకోండి . మిమ్మల్ని , నన్ను యిలా ఒకే రూం లో సడెన్ గా పోలీసులు చూశారనుకోండి , అనుమానించి , యిదేదో ఆ బాపతు అని ముద్దర వేసి , మనిరువురిని చెరొక గదిలో పడవేస్తే , మనం సరదాగా గడపాలన్నది ఏమౌతుందో ఆలోచించారా ? మన సరదాలకి ఈ తాళి అడ్డమేమీ కాదు . ఓ వేళ యిపుడు పోలీసులొచ్చినా , మనం భార్యాభర్తలమనుకొని మన జోలికి రారు . ఈ తాళిని అలాగే వుండనీయండి . "

"   మీరు చెప్పినది బాగానే వున్నది . కని అది మీ మెడలో వుండటం వలన , మీరు పెళ్ళైనవారు , పరాయి స్త్రీ అన్న భావన నన్ను మీ విషయంలో ఫ్రీగా మూవ్ కానీయటం లేదు . "

"   అదా సంగతి . అయినా అందులో ఏమున్నది ? మన(సు)లో వుండాలి . మీరంతగా చెప్తుంటే కాదంటానా " 
మంగళసూత్రాల్ని తీసి తలగడ క్రింద దాచింది .

"   శైలజా యిప్పుడు నిన్ను చూస్తుంటే నూటికి నూరుపాళ్ళు కుమారివి , నాదానివే నన్న భావన బలపడింది . కమాన్ గివ్ ఏ క్లోజప్ . చాలా విషయాలు మాట్లాడుకోవాలి "   అంటూ ముందుకు మూవ్ అయి ఎన్నో కొత్త విషయాలకి మూమెంట్ యిచ్చి అతని అకౌంటులో పేమెంట్ చేశాడు . అతని చొరవకి , ఆమె ఉరవడి జత కాగా , వారిరువురి అవయవాలకు అలజడి కల్గింది .

ప్రయాణపు అలసట తీరాలంటే మజిలీ ( విరామం ) చాలా అవసరం . ఆ విరామంలో ఎన్నో విషయాలు , ఆ పిమ్మట మరల పయనం . ఇదే అనాదిగా వస్తున్న వైనం .

"   తొందరపడకు డియర్ . మొదట మా ఇంటిలోవాళ్ళని ఒప్పించాలి . ఆ తర్వాతే మ్యారేజ్ . అందాకా యిలా మ్యానేజ్ చేసుకుందాం "   అన్నది .

మరల పయనం ప్రారంభం , తనువుల చాలనంలో మధు కాళ్ళు గీసుకున్నాయి . శైలజకు యింతకుమునుపే మ్యారేజ్ అయిందన్న నిర్ణయానికొచ్చి ఏమీ తెలియనివానిలా " నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ? " అడిగాడు .

"   ఇంకా అనుమానమా . నీ కొరకు నా మానాన్ని ఎంతో అభిమానంగా యిచ్చుకున్నాను , పుచ్చుకున్నావు . నాలుగైదు మార్లు కాళ్ళు తారుమారైనాయి . ఇప్పుడు అడుగుతున్నావేమిటిలా ? " అన్నది .

"   అహ పెళ్ళైనవాళ్ళు ప్రేమిస్తారా ? "   అమాయకంగా అడిగాడు .

"   ప్రేమించటానికి అందరూ అర్హులే "   అన్నది .

పొజిషన్ మార్చి "   నీకు పెళ్ళైంది కదూ "   అని అడిగాడు .

"   అయినందువలన నీకొచ్చిన తంటా ఏమిటంటా ? ఏ విషయంలో నైనా అభ్యంతరం చెప్పానా ? ఆనందానికి కొరవ చేశానా ? పెళ్ళీ చేసుకునేది ఈ ఆనందం కొరకేగా . నేనెప్పుడూ రెడీయే . ఇంకా అనుమానమెందుకు ? ప్రొసీడ్ , నాలో టెన్షన్ రేపక అటెన్షణ్లో వుండి ఆ టెన్షన్‌ని బైటకు నెట్టేసెయ్ "   అన్నది .

తటాలున లేచి "   నా బెట్టర్ హాఫ్ ని నేనే ముచ్చటగా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా . నాకు కన్య కావాలి , శ్రీమతి కాదు "   అన్నాడు .

"   ఇంతదాకా కన్యగా అనుభవించావు , ఆనందం పొందావు . ఇప్పుడు శ్రీమతి అని తెలియగానే ఆ ఆనందం కొరవయిందా ? ఇంతలో అంత మార్పు కనపడిందా ? డియర్ ఇంతవరకు వచ్చాక దాచవలసిన అవసరం లేదు . నెను శ్రీమతి శైలజా  మనోహర్  ని . నా భర్తకి దుబాయ్ లో ఉద్యోగం . ఏ సంవత్సరానికో , సంవత్సరన్నరకో ఇండియా వచ్చి , తను ఇన్నాళ్ళూ సంపాదించి , దాచినదంతా నాకిచ్చి వెళ్తుంటారు . మా పెళ్ళై 3 సంవత్సరాలలో , ఆయన నన్ను భార్యగా వాడుకున్నది మొత్తం మీద ఓ 4 సార్లు . వాళ్ళ నాన్న మాట ఆయనకు వేదమట . వయసులో వున్నప్పుడు బాగా సంపాదించి , వయసు అయిం తర్వాత  కాలు   మీద కాలు వేసుకొని సుఖపడాలట . సంపాదనే ముఖ్యమని , ఇంకా ఎవరైనా ఎక్కువ జీతనంటే , ఇంకా పైకి కూడా వెళ్ళాలనుకుంటున్నానని ఈ మధ్యనే తెలియచేశారు . అసలు వయసు అయింతర్వాత  కాలు  మీద కాలు వేసుకుని సుఖపడటానికి ఓపికా వుండదు , ఉత్సాహమూ వుండదు అని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా అక్కడే కంటిన్యూ అవుతున్నారు . ఆ ఎడారులలోకి నే వెళ్ళలేను . నాకూ ప్రేమించబడాలని వుంటుంది . అందుకే ఈ కలం స్నేహాన్ని ఎన్నుకున్నా . పదిమందితో పరిచయం  ,పరవశానికి దోహదం . నౌ ఐ యాం వెరీ హ్యాపీ & వెరీ బిజీ . ఇదిగో బ్రీఫ్ కెస్ , వలసినంత పుచ్చుకో , అలసినంతవరకూ యిచ్చుకో "   అన్నది .

అంత తేలికగా వదిలే కేసు కాదని గ్రహించి , మరోమారు ఆనందపరచి "   వసతి కుదిరినప్పుడు లెటర్స్ వ్రాస్తుంటా , వచ్చి కలుసుకో , వుంటా "   అంటూ ఆ గండం నుంచి బయటపడ్డాడు .

                                                                                                 ******

ఈ మారు గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని , కలం స్నేహితురాలుగా కన్యను వధువుగా ఎంచుకుని కన్య రాక కొరకు హోటల్ అనుపమలో నిరీక్షిస్తున్నాడు మధు . కాలింగ్ బెల్ మోగగానే డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నున్న 
ఆమెని చూసి "   ఓ మీరా రండి . కన్య రాలేదేం , ఎపుడొస్తుంది ? "

ఆమె లోపలకి వస్తూ "  మధు గారు మీరేనా ? " అన్నది .

"    నేనే మధుని , ఆ కుర్చీలో కూర్చోండి , మిమ్మల్ని చూస్తుంటే అర్ధమైపోతున్నది . అచ్చం కన్య పోలికలే మీవి . సారీ కన్యకు అచ్చం మీ పోలికలే . ఇన్ని లెటర్లు వ్రాసింది . కాని తను మీ పోలికల్లో వుంటుందని ఏ నాడూ వ్రాయలేదు . రేపు కన్య కూడా పెద్దదైతే అచ్చం మీలాగే వుంటుందని  స్పష్టంగా తెలుస్తోంది . సరే అన్ని విషయాలు కన్య సమక్షంలోనే మాట్లాడాలనుకొన్నా . షార్ప్ 9 కి రమ్మన్నా కన్యను . కోంచెం సమయం యిరువురం జంటగా కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని . అన్నింటిలో ఒక్కటి కావాలని , మ్యారేజ్ విషయం మీతొ మాట్లాడాలని ఎంతగా చెప్పానో ఆంటీ , యింతవరకు రాలేదు , చూశారా ? "   అన్నాడు .

ఆమె అతనిని చూసి నవ్వుతుండటం గమనించాడు .

"    అంటే మీ కాలానిక్ మా కాలానికి ఎంతో మార్పు వచ్చిందాంటీ . ఇదే లేటెస్ట్ మోడల్ . 10 గంటలవుతున్నది . ఎపుడొస్తుందో ? ఏమో ? ఎక్కడికెళ్ళిందో ? ముందు మీరొచ్చేశారే . అవునులెండి మీకున్న ఇంట్రస్టు మీ అమ్మాయికెలా వుంటుంది ? అమ్మాయి భవిష్యత్తు మీకు చాలా ముఖ్యం . మీ అమ్మాయికాలోచన ఎక్కడుంటుంది ? అందినవాడెక్కడకీ పోలేడులే అన్న ధీమా తప్ప తొందర ఎందుకు వుంటుంది ? మాటలలో మరచే పోయాను , కాఫీ తెస్తాను "   లోపలకి వెళ్ళాడు .

ఇంత తొందరపాటు మనిషితో సంభాషణ ఎలా ప్రారంభించాలా ? అని ఆలోచిస్తున్నది ఆమె .

కాఫీ అందించి "   మీరు తీసుకోండి ,కన్య గురించి ఆలోచించకండి , మళ్ళీ ఆర్డరిస్తాగా "   అంటూ అటూ , యిటూ పచార్లు చేస్తున్నాడు .

"  మిస్టర్ మధూ "   ఆమె పిలుపు విని హడావుడిగా వచ్చిన మధు 

"    ఏమిటి ఆంటీ కన్యనెక్కడికైనా పంపించారా ? చూడండి టైం , రూం ఎలా వృధా అయిపొతున్నాయో , అనుకున్న ప్రకారం 9 గంటలకే వచ్చి వుంటే , ఈ సరికి చాలా పనులు పూర్తయ్యేవి . ఇంతకీ కన్య ఎపుడొస్తుందంటారు ? లేక అసలు రాదంటారా ? "   తన సందేహాన్ని వెలిబుచ్చాడు మధు .

ఆమె అతని అవస్థ చూసి కళ్ళు తుడుచుకుంటూ "   ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు . కంగారు పడకండి " ఓదార్పుగా మాట్లాడబోయింది .

అది విన్న మధులో అనేక అనుమానాలు చోటు చేసుకోగా "    కన్యకేమైంది ఆంటీ ? ఎన్ని ఆశలు పెట్టుకున్నానో ? ఎన్ని కలలు కన్నానో ? నేను కోరుకున్న లక్షణాలన్ని మూర్తీభవించిన కన్నెపిల్ల నా కన్య . పెళ్ళి చేసుకోవాలనుకున్నాను . అయ్యో భగవంతుడా ! ఎంతపని జరిగింది ? "   అంటూ రోదిస్తున్నాడు .

"   నిజంగాపెళ్ళి  చేసుకుంటారా ? "   అనుమానంగా అడిగింది .

"   నన్ననుమానిస్తున్నారా ఆంటీ , అమ్మా , నాన్నలు చూసిన సంబంధాలు కాదని , కన్యనే సెలెక్ట్ చేసుకున్నవాణ్ణి , అనుమానించకండి . "

"   అన్నమాట మీద నిలబడగలరా ? "

"   ఇప్పుడు కాళ్ళ మీద నిలబడ్డాను , కన్యను కలుసుకొన్నాక మాట మీద నిలబడ్తాను . "

" సరే నిన్ను నమ్ముతున్నాను , నట్టేట ముంచకూడదు సుమా ! "

"   నట్టేట ముంచటం మా యింట్లో , ఒంట్లో లేదు . మునగటమే మా వంశాచారమట . మా ముత్తాత అమ్మాయి అందంగా వుందని కట్నం ఎదురిచ్చి మరీ చేసుకున్నాడట . తీరా కట్టుకున్నాక తెలిసింది గుణం మంచిది కాదని . మా తాత ఈ అనుభవంతో అందగత్తెలను కాదని అందవికారిని చేసుకొన్నాడుట . ఎంత పిలిచినా పలికేది కాదట . మూగదనుకున్నాడుట . ఆ తర్వాత తెలిసింది , మామూలు చెముడు కాదు బ్రహ్మచెముడని . ఇప్పటికైనా నమ్ముతారా ? మేము ముంచే వాళ్ళమా ? మునిగే వాళ్ళమా ? "

"   మీ గురించి , మీ వంశం గురించి బాగా అర్ధమైంది . మంచిఅదృష్టవంతురాలిని నేను . నేనే నీ కన్యని డియర్ " అనటంతో అంతవరకు నిలబడ్డ మధు కూలబడ్డాడు . జఘ్ లోని నీళ్ళు ముఖం మీద చిలకరించింది . తెప్పరిల్లుకొని కళ్ళూ తెరుస్తూ " హా ! నీవా నా కన్యవు ? నా బెటర్ హాఫ్వి నువ్వా ? "   అంటూ మరలా స్పృహ కోల్పోయాడు .

మెల్లగా భుజం పట్టుకుని బెడ్ మీదకి చేర్చింది . ఉపశమనంగా మరల నీళ్ళు చల్లింది . కొంత సమయానికి తేరుకుని చూస్తుంటే "   డియర్ మధూ , నేను మొదటే చెప్పాను . ఇంకా నీకు నమ్మకం కుదరకుంటే , యివిగో నీవు నాకు వ్రాసిన ప్రేమలేఖలు "   అంటూ బ్రీఫ్ కేస్ లోంచి నేలమీద కుమ్మరించింది .

బెడ్ మీద నుంచి మెల్లగా లెచి కూర్చొని "   ఇంకా నమ్మకం కుదరకపోవటమేమిటి ? నా రోగమే కుదిరింది . అవును మరి సంవత్సరం క్రితం వచ్చిన  మ్యాగజైన్స్ లో పెన్ ఫ్రెండ్ షిప్ కాలంలో ఆ ఫొటో ..... "   అనుమానంగా అడిగాడు .

"   అదా నాకు పది మందితో స్నేహం చేయాలని చిన్ననాటి నుంచి ఉబలాటంగా వుండేది . ఆర్ధిక పరిస్థితులు అనుమతించలేదు . ఇంత కాలానికి నా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించి ఆ వలయం నుంచి బయటపడ్డాను . ఇప్పటి ఫొటొ ప్రచురిస్తే నాతో ఎవరు స్నేహం చేస్తారు . అందుకే ఆ ఫొటొ ప్రచురించాను . "

"   మరి వయసు 20 సంవత్సరాలు అని వ్రాశావుగా . "

" అవును , ఆ ఫొటో టైముకి నాకు 20 సంవత్సరాలే . నేనూహించినట్లుగ నాతో స్నేహం చేయటానికెవరూ ముందుకు రాలేదు . అలా నిరుత్సాహపడ్తున్న తరుణంలో , మీ లెటర్ వచ్చి ఆనందాన్ని నింపింది . మీరూ చొరవ తీసుకుని నాలో అడుగంటిన ఆశల్ని వెలికి తీసుకొచ్చారు . ఇంత కాలానికి నా జీవితానికో తోడు దొరికినందుకు ఎంతగానో  మురిసిపోయా . పెళ్ళి చేసుకుందామని వ్రాస్తే , పెళ్ళి అయినంతగా ఆనందించా . రూం కి రమ్మంటే ఫస్ట్ నైట్ గా భావించా . ఇక ఏం చేసుకుంటావో చేసుకో డియర్ . ఈ కన్య మీ స్వంతం , నీట ముంచినా , పాల ముంచినా మీదే భారం . "

"   భారం కాదు ఆంటీ ఘోరం . నన్ను వదలి వేరెవరినైనా చూసుకో . "

"   ఇన్నాళ్ళూ మీ ప్రేమలో పాలు పంచుకొని , యిప్పుడు మరొకర్ని పంచుకోమంతే ఎలా డియర్ ? బాగా ఆలోచించంది . "

"   నా బొంద . నా మిఖానికి ఆలోచించటం కూడానా ? ఏది మంచో ? ఏది చెడో ? ఎవరు కన్నెపిల్లో ? ఎవరు ముసలివాళ్ళో తెలుసుకోలేని వాణ్ణి . ఇలాంటి నన్ను చేసుకొని నువ్వేం సుఖపడ్తావ్ ? పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకొని మనసును కష్టపెట్టుకోకు . నష్టాల పాల్జేయకు . వెంటనే వెళ్ళి హాయిగ నీ శేష జీవితాన్ని అనాధల సేవలో గడిపేటందుకు కృషి చేయి . పెళ్ళి గురించి లేనిపోని ఆశలు పెంచుకోకు . అది నీలాంటి , నాలాంటి వాళ్ళకి అచ్చి వచ్చేది కాదులే . "

"   మిమ్మల్ని చూడగానే నాకు పోర్టబుల్ మొగుడనిపించారు . సూటబుల్ కానంటె అంతా ట్రబులేగా . నేను మీకంటే పెద్ద అని సంకోచిస్తున్నట్లున్నారు . శ్రీరాముడికంటే సీత పెద్దది కాదా ? పెళ్ళి చేసుకోలేదా ? చేసుకొని జగద్విఖ్యాతి కాలేదా ? ఆలోచించండి . "

"   వాళ్ళకీ మనకు పోలికలేంటి ? వాళ్ళు కారణజన్ములు , మనం మానవజన్ములం . అనవసరంగా మనసు పాడు చేసుకోక వెళ్ళిపోండి ఆంటీ . "

"   సరే , చేసుకోకపోతే పోయారు , కనీసం ఉత్తరాలైనా వ్రాస్తుండండి . ఆ ఆనందంతోనైనా ఈ శేషజీవితాన్ని గడిపేస్తాను  "   అన్నది .

"   ఎందుకు వ్రాయను ? అలవాటు పడ్డ చేయి కదా ! అంత తేలికగా బుధ్ధి వస్తే ఎలా ? "

"   నన్ను మర్చిపోరు కదూ మధూ డియర్ . "

"   మర్చిపోవటమా ? అసంభవం , కన్నవారినైనా మర్చిపొవచ్చేమో గాని , ఈ కన్యనెలా మర్చిపోతాను , కలం స్నెహాన్నెలా మర్చిపోగలను ? "

అమిత ఆనందంతో , తన సరంజామాతో కన్య అనబడే ఆంటీ బయటకు నడిచింది .

' బ్రతుకు జీవుడా ' అనుకుంటూ  రూం వెకేట్ చేసి యింటికి తిరుగుముఖం పట్టాడు మధు . ' పెద్దలమాట చద్ది మూట ' అనుకొంటూ .

                                                                                ** స ** మా ** ప్తం **    

                                   ( ఈ "   పోర్టబుల్ మొగుడు "   కధ 12/12/1995  అన్వేషణలో ప్రచురించబడినది )

అంతరమా ? అంతర్యామా ?


                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్

దేవుడు ,
దేవుడు ,
ఇదే మాట ,
ఏ నోట విన్నా ,
భక్తో , భయమో , 
సరిగా తెలియకున్నా ,
దేవుడున్నాడంటుంటారు ,
సర్వాంతర్యామి అంటుంటారు ,
లేనిచోటు లేనే లేదంటారు ,

విగ్రహాలకు రక రకాల అభిషేకాలు ,
ఫొటోలకు  పూజలు చేస్తుంటారు ,
తీర్ధ ప్రసాదాలు పంచేస్తుంటారు ,
కాశీ ,  ప్రయాగ లంటుంటారు ,
పూరీ , శృంగేరీ లంటుంటారు  ,
కంచి , కాళహస్తి లంటుంటారు ,
బదరీనాథ్ , కేదారనాథులంటుంటారు ,
కన్యాకుమారి , రామేశ్వరాలు అంటుంటారు ,
శబరి మల అయ్యప్పంటుంటారు ,
తిరుత్తణి కుమారస్వామి అంటుంటారు ,
హిమాలయాలు ఈశ్వరుడంటుంటారు ,
సాగరాలు శ్రీ మహావిష్ణువంటుంటారు ,
తిరుమల తిరుపతి వెంకన్న అంటుంటారు ,
తీర్ధయాత్రలంటూ తిరుగుతూనే ఉంటారు
ఇంకా ఇంకా తిరగాలంటూనే ఉంటుంటారు ,

దేవుణ్ణి చూశారా అని అడిగితే ,

అంత తేలికగా కనపడ్తాడా అంటారు ,

మరి తీర్ధయాత్రలెందుకంటే ,

పుణ్యాన్ని సంపాదించుకోవటానికంటుంటారు ,

పుణ్యం దేనికంటే ,

మౌనాన్ని ప్రదర్శిస్తారు ,
అంతర్లీనంగా అంతవరకు చేసిన  ,
పాపాల ప్రక్షాళనకే  . 

ఆ దేవుడి కోసం ,
ఎక్కడెక్కడికో వెళ్తుంటారు ,
వెతకటం మాన (లే )రు ,
వెతుకుతూనే వుంటారు ,

నమ్మినట్లే వుంటారు , కాని నమ్మరు ,
ఆ వంచన పంచన 
తమ ఆత్మనే వంచించుకుంటుంటారు , 

ఉన్నాడో , లేడో మాట అటుంచండి ,
ఉన్నాడని నమ్ముతున్నట్లు కనపడుతూ ,
నమ్మకుండా జీవితమంతా జీవిస్తుంటారు ,
ఎవరికోసమో  ? ఎందుకోసమో  ?
ఈ ఆత్మవంచన ,

సర్వాంతర్యామే కదా ! 
మరి ,
ఇంటిలోని పూజా మందిరంలో లేడా ?
సందేహంతోనే కావచ్చు ఈ దేహాన్ని , 
ఎక్కడెక్కడికో అప్పులు చేసి  తిప్పేస్తుంటారు  

అందుకే ,
ఉన్నదానితో తృప్తి చెందాలంట ,

ఉంటున్నచోటనే చూసుకోవాలంటా .

 ******

వాషింగ్టన్ DC

                                                                               
                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

మా మేనకోడలు మమ్మల్ని అనుసరించింది . ఉదయం 8.45 కి ఎడిసన్ టైం ప్రకారం బయలుదేరాము మా మేన       కోడలు చేసిన కొబ్బరి అన్నంతొ , ఇంకా యితర ఆహార సామగ్రితో  వాషింగ్టన్ కి . ఉదయం 11 గంటలకి మధ్యలో బ్రేక్ తీసుకొని 35 నిముషాల తర్వాత మళ్ళీ ప్రయాణం చేశాము .

మధ్యాహ్నం 3 గంటలకు వాషింగ్టన్ కి చేరుకున్నాము . కారు పార్కింగ్ కొరకు వెతుక్కోవలసి వచ్చింది . ఉంటానికి చాలా ఉన్నాయి , కానీ గంటకి , 2 గంటలకి పే చేయాలిట . మేము చూడాలనుకున్నది వైట్ హౌస్ , దానికి దగ్గర పార్కింగులు ఉన్నాయి గాని , అవకాశం లేక కొంచెం దూరంగా పార్కింగ్ చేసి , అందరం అలా ఫుట్ పాత్ మీద నడ చుకొంటూ 17 త్ స్ట్రీట్ లో ఉన్న వైట్ హౌస్ కి బయలుదేరాము .

అంతరాయాలు ఎలాగైనా వస్తాయన్నది మనం గ్రహించుకోవాలి . మా చిన్న మనుమడు 2 వేళ్ళు పైకెత్తాడు , వెంటనే మేము చేతులు పైకెత్తాల్సి వచ్చింది . ఆ పక్కనే వున్న బేకరీ లాంటి దాంట్లోకి వెళ్ళి ఆ రెస్ట్ రూం కార్యక్రమాలు వరుసవారీగా ముగించుకుని మళ్ళీ బయలుదేరాము . 17 త్ స్ట్రీట్ కి వెళ్ళి క్యాపిటల్ బిల్డింగ్ చూసుకొని , ఆ ప్రక్కనే వున్న వైట్ హౌస్ కి  నడచుకొంటూవెళ్ళాము .


వైట్ హౌస్
                                                                                         
నేను , నా ధర్మపత్ని 
                                                                                 

                                                   
 పేద్ద ఆవరణతో , పచ్చ పచ్చని పర్యావరణంతో , ఆ వైట్ హౌస్ పైన సెక్యూరిటీ గార్డ్స్ పహరా కాస్తుంటారు ఎల్ల వేళలా . ఆ కాంపౌండ్ వెలుపల కాప్స్ ( City Of Police / భద్రతా పోలీస్ బలగాలు ) నలువైపులా వస్తున్న జనాన్నిపరిశీలిస్తుంటారు .సందర్శకులకు యిబ్బంది కలగకుండా చూస్తుంటారు . ఆరు బయట నుంచి ఫొటో తీసుకునే వాళ్ళను అభ్యంతర పెట్టరు . అలా అక్కడ 45 నిముషాలు గడిపిన తర్వాత ఆ వైట్ హౌస్ కెదురుగా ముందున్నగార్డెన్ లోకి వెళ్ళాము . అక్కడ నుంచి వైట్ హౌస్ వ్యూ చాలా చక్కగా కనపడ్తుంది . అక్కడ వుండి కొన్ని ఫొటోలను క్లిక్ చేశాము .అక్కడే వున్నఓ స్టాట్యూ (కి) ముందు ఫొటోలు తీసుకున్నాముఅక్కడ నుండి లాన్ లో నడుచుకొంటూ వస్తుంటే , ఓ ఉడుత కనపడింది . అది ముంగిసంత వున్నది . ఇక్కడ అన్నీ అలాగే ఉంటున్నాయి .

మా చిరంజీవి అంతదూరం మీరు నడవలేరు , మీరిక్కడే వుండండి , నే  కార్ తీసుకొస్తాను అనటంతో మేము మెల్లగా వరల్ద్ బ్యాంక్ ముందు ఆగిపోయాము .

అక్కడ రోడ్ల మీద ఎక్కడా చెత్త కనపడనీయరు , ఎప్పటికప్పుడు ఎవరైనా కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలు లాంటి వగైరాల చెత్తను  చేత్తో కాదు , ఇలాంటి  పరికరంతో .30 నిముషాల తర్వాత మావాడు తచ్చిన కారులో గబ గబా ఎక్కి ( రోడ్ల మీద పార్కింగ్  చేయకూడదు . చేస్తే టికెట్ ఇస్తారు ట్రాఫిక్ కాప్స్ . కాప్స్ అంటే సిటీ ఆఫ్ పోలీస్ అని అర్ధం ) 250 డాలర్స్ పే చేయాల్సివస్తుంది . రిటర్న్ బయలుదేరుతూ , వాషింగ్టన్ వీధులూ చూసుకోంటూ ( కారులో నుంచే ) షుమారుగా 5.30  ప్రాంతాల్లో ఎడిసన్ కి బయలుదేరి 8.45 కి బ్రేక్ తీసుకోకుండా ఇంటికి చేరుకొన్నాము .


                                                                                     ********

కాళరాత్రి

                                                                                                                     కవితా రచన : శర్మ జీ ఎస్ 

గభీర నిశీధంలో
గావుకేక
నా మానసంలో
పొలికేకలా
వినిపించింది
చెవులు నిక్కబొడుచుకున్నాయ్
మనసంతా ప్రశ్నలమయం
ఎక్కడిదా గావుకేక ?
ఎవరిదా గావుకేక ?
గుడ్లగూబల అరుపులతో
కీచురాళ్ళ రవళులతో
ఆ అంద బంధుర ఆకసం
ఉరుములు ఉరుముతుంటే
ఆ వెఱపు మెఱుపుల మెఱుపులతో
దారి వెదకుతూ అరుపు వచ్చినవైపు
అంగలేశాను
కాలికేదో మెత్తగ తగిలింది
మరుక్షణం వెనుకంగ వేశాను
మఱల మరో మెఱపు మెరిసింది
ధృక్కులు సారించా అటువైపు
ఓ నవ యవ్వన సుందరి
శవంగా అగపడింది
తనువేమో యవ్వనపు పొంగుల్లో
పొంగి పొఱలుతుంటే
ఎద ఏమో రక్తం చిందులు త్రొక్కి
చిందర వందర అయి పాఱుతోంది
ఏ కామాంధుని కామదాహానికి
నడుం వంచక అడ్డుకట్ట వేసిందో
ఏ కిరాతకుల అరాచకానికి
తిరస్కరించిందో
అసలు కారణం
ఆ "   కాళరాత్రి "   కే ఎఱుక

          ******

ఒక్కో ఒంటితీరు ( 2 )

                                                                                                                             కధా రచన : శర్మ జీ ఎస్
                                                           ( నిన్నటి తరువాయి టపానే )

"  అమ్మా వెళ్ళొస్తా . ఆరోగ్యం  జాగ్రత్త . "
రామారావు , అపర్ణ ఇంటి నుంచి బయలుదేరారు . సిటీ బస్ ఎక్కాలన్నా , ఆటో అందుకోవాలన్నా ఫర్లాంగు దూరమైనా నడవనిదే లభించవు .అలాగని వీళ్ళ యిల్లు ఎడారిలో లేదు .సెంటర్లోనే వున్నది , కాని సందులో వున్నది .

"   సిటీ బస్ లో మనమెంత మడి కట్టుకు కూర్చున్నా , కండక్టరు కంపు చేసేస్తాడు . కనుక .... "

"   తాకుతూ వెళ్దామంటారా ? సరే నేను రెడీ . "

"   అది కాదు , ఆటోలో అయితే దూరదూరంగా కూర్చొని వెళ్ళవచ్చు "    అన్నాడు .

"   పోనీ ఆటోలో దూరదూరంగా కూర్చొని వెళ్తే ఆటొ అతనే అనుమానిస్తాడు . ఆ పై చూసేవాళ్ళు అనుమానిస్తారు . పోలీసులు అనుమానిస్తారు . ఇది పరమ ప్రమాదకరమైన విషయం . కనుక మనమిద్దరం పక్క పక్కనే కూర్చుందాం  "   అన్నది .

"   నీకేమైనా మతిపోయిందటే . "

"   మీకేమైనా దొరికిందా అండి . "

"   వేళాకోళాలకిది సమయం కాదు . అవతల క్యాంపుకి వేళ అయిపోతోంది . త్వరగా ఒక నిర్ణయానికి రా . "

అపర్ణ అతనికి దగ్గర దగ్గరగా నడుస్తున్నది . రామారావు మాత్రం దూర దూరంగా నడుస్తున్నాడు .

"   దగ్గరగా వున్నపుడు దూర దూరంగా వున్నావు . దూరంగా వున్నపుడు దగ్గరవాలని ప్రయత్నిస్తున్నావు . ఏమిటీ వింత ప్రవర్తన ? "

"   ఎవరకీ అనుమానం రాకుండా , మనకే అవమానం జరగకుండా కలిసి కూర్చొని వెళదాం .మీరెటూ ఇంటివరకూ వస్తారుగా నన్ను డ్రాప్ చేయటానికి . అక్కడ మీరు స్నానం చేసి వెళ్ళండి . "

"   ఛీ ... ఛీ ... నిన్ను తాకటమేమిటి ? "

"   తాకకుండానే తాపం తీరుతుందంటారా ? "

"   ఎంత తాపం తీరకుంటే మాత్రం , నువ్వు దూరంగా వున్నపుడెలా అపర్ణా ? ఆరోగ్యానికి మంచిది కాదు " దూరదూరంగా వెళ్తున్నాడు .

"   అంత శ్రమ మీకీయనులెండి . ఆటోలోనే వెళ్దాం . మీ అవస్థ చూశాక , మీ చిరాకు గమనించాక  నేనే యిలా ప్లాన్ వేశాను , నిజంగా నేను దూరంగా లేనండి . "

"   అలాగా ! ఎంత ( మంచి ) పని చేశావు అపర్ణ . ఆఫీసుకి అర్జంటుగా టెలిగ్రాం యిచ్చి వస్తా 4 రోజులవరకు నేను క్యాంపుకెళ్ళలేనని , బెడ్ మీదే వున్నానని . "

"   ఆ అవసరం లేదు లెండి . మీకొచ్చిన టెలిగ్రాం నేనే పంపించాను పోష్ట్ మెన్ చేత ."

"   ఆ టెలిగ్రాం చూసి ఎంత కంగారు పడ్డానో ? అది సరే , మరి ఎక్కడ ? ఎలా ? ఇంటికి వెళ్ళటానికి వీలులేదుగా . "

"   పెళ్ళైన తర్వాత హాయిగా హనీమూన్ కి ఎటూ వెళ్ళలేకపోయాం . కనీసం ఈ 3 రోజులైనా ఏదైనా లాడ్జింగ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి . "

"    ఇంక ఆలోచించకు , పద , చకచకా నడువు ."

రోడ్డు చేరుకున్నారు . ఆటో ఎక్కారు , "   హోటల్ అన్నపూర్ణ అన్నాడు . "

                                                                                       ********

అన్నపూర్ణ హోటల్ 555 డభుల్ రూం పట్టపగలే రేయిగా మార్పు చెందబడ్డది రామారావు , అపర్ణల సంగమంతో .
పేరుకి , పేమెంటుకి మాత్రమే అది డబుల్ బెడ్ రూం , సింగిల్ బెడ్ రూంగా వాడబడ్తున్నది . కేబుల్ కనెక్షన్ వున్నా కేసెట్ ఆన్ చేశారు . కేసెట్ అయితే మనకిష్టమైనవి మనం పొదగలం , అదే కేబుల్ అయితే ప్రసారమైనవాటినే అందుకోవలసి వస్తుంది .

పల్లవి , అల్లరి ప్రారంభమైంది ఏకబిగిలో .వలువలు నిలవలేమంటూ ఒకటొకటిగ నేలకొరిగిపోతున్నాయి . విలువలు ఇపుడిపుడే నిర్ధారించబడ్తున్నాయి .
అపర్ణ అందాలకు సిగ్గు చెందిన బల్బు కూడా జీరోగా మారింది . 
ఆ అవయవాల సౌష్టవం అతనికి పరిచయమైనదైనా , కొత్తగా అతనిని ఎక్కడికో తీసుకు వెళ్తున్నాయి .
ఆమె చేతులు మెలమెల్లగా , అతి సుతారంగా స్పృశిస్తూ , అనురాగాలు వర్షిస్తూ , కేశాలలోకి జొరబడ్డాయి . అదో హాయి , ఆమె అతనిని వదలక అలాగే గట్టిగా బంధించింది . అతను సంధించాడు . ఇరువురి మధ్య అల్లరి యుధ్ధం ఆరంభమైంది .
ఇరువురు ఒకటైనారు , ఏ మాత్రం ఎడం లేదు వారి మధ్య . గాలి కూడా చొరబడాలన్న కొంచెం సమయం ఆగాలి అన్నచోట అనంగుడు చొరబాడి , ఆ ఇరువురిని చెరబట్టాడు . చరచరా పయనం సాగించాడు . ఆ ఇరువురి కాకతో సంసార పాయసం కాకతాళీయకంగా పొంగించాడు . ఒకరినుంచి మరొకరికి సరఫరా చేశాడా అనంగుడు కాదు అఖండుడే .
శోభనం రాత్రుళ్ళు తర్వాత మరల దాంపత్య రుచి చూసిందిపుడే . నాటి ఆనందాన్ని మించిన ఆనందంతో , ఇన్నాళ్ళ పస్తుకి సరిపడా శిస్తు చెల్లించి , దాంపత్యానందం అనే రసీదు పొందారు . తెరచిన కన్ను వాల్చకుండా ముచ్చటైన 3 రాత్రులూ , 3 పగళ్ళు .
4 వ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం , అల్పాహారం ముగించి "   ఏమండి అత్తయ్యగారు మన సుఖానికి అడ్డంగా నుల్చున్నారెందుకండి "   అడిగింది .

"   అదో పేద్ద రహస్యంలే . ఈమె నా స్వంత తల్లి కాదు , సవతి తల్లి . "

"   ఆమెకు పిల్లలు లేరా ? "

"   లేరు పుట్టరనే మా అమ్మను చేసుకొన్నాడు మా నాన్న . మా అమ్మ నన్ను కని ( తను వచ్చిన పని అయిపోయినట్లుగా ) వెళ్ళిపోయింది . "  

"   అయినా అత్తయ్యగారు మనల్నిలా హింస పెట్టడం ఏమీ బాగా లేదండి . "

"   పోనీలేవే , మనకో ఆసరా దొరికిందిగా , ఇక మన సుఖానికి అడ్డమే లేదు . ఇకనుంచి ప్రతినెలా శోభనం జరుపుకొందాం . "
ఇంటికి చేరుకున్నది అపర్ణ.

                                                                                        *******

రెండు నెలలు గడిచాయి .సరస్వతమ్మ రోగం నుంచి బయటపడలేదు . అపర్ణ సేవలు రోజు రోజుకీ అధికంగా అందుకొంటూనే వున్నది . 
అపర్ణ ప్రతి నెలా రెండుమార్లు దూరంగా వుంటూనే వున్నది . ఒకమారు బంధువులింటికి ( రామారావు క్యాంపులో వుంటే ) , మరో మారు అన్నపూర్న హోటల్ కి వెళ్ళి వస్తూనే వున్నది . రామారావు లోని చిరాకు ఛీదరించుకొని దూరంగా వెళ్ళిపోయింది . 
అమ్మ ముందు మాత్రం కొంచెం చిరాకు ప్రదర్శిస్తూనే వున్నాడు . "   ఏమిటమ్మా ఇది నెలనెలా రెండు మార్లు దూరం అని కూర్చొంటుంది , విసుగ్గా వుందమ్మా "   అన్నాడు .

"   ఒక్క సారి డాక్టరుకి చూపించరా . "

"   అదీ అయిందమ్మా . లేడీస్ స్పెషలిష్టుకే చూపించాను . అలా వచ్చినపుడు దూరంగా కూర్చోవడమో , లేక స్నానం చేసి ఇంట్లోకి రావడమో తప్ప వేరే ఏమీ చేయలేం అన్నారు . "

"   నిజమేరా , ఏం చేస్తాం . మన సంప్రదాయం ప్రకారం దూరంగా కూర్చోవడమే మన చేతిలో వుందిరా . ' ఒక్కో ఒంటితీరు ' రా అంతేరా "   అన్నది సరస్వతమ్మ .
  
                                                                                        *******
( కొసమెరుపు - తుది మెరుగు )

సరస్వతమ్మ ప్రాణాన్ని టైఫాయిడ్ టై చేసేసింది .
రెండు నెలలు గడిచాయి . అత్తగారు బ్రతికుండగా నెలకు 2 సార్లు దూరంగా కూర్చొనే అపర్ణ , అత్తగారు పోయిన 2 నెలల తర్వాత 10 , 12 నెలలవరకు ఒక్కసారి కూడా దూరంగా కూర్చొనే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసేశాడు రామారావు . 
ఆదవారి జీవితానికి పరిపూర్ణత్వం మాతృత్వమేనని సంబరపడింది అపర్ణ .

                                                                                ** స ** మా ** ప్తం 

                            ( ఈ ' ఒక్కో ఒంటితీరు ' కధ 17/10/1995 మయూరి వారపత్రికలో ప్రచురించబడినది )

ఒక్కో ఒంటితీరు

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్


పాల గ్లాసుతో గదిలో అడుగుపెట్టిన అపర్ణని చూశాక , ఆ బ్రహ్మని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు రామారావు .అపర్ణ తల్లితండ్రులని అపర బ్రహ్మలుగా మనసులోనే మెచ్చేసుకున్నాడు . మెల్లగా , సిగ్గుతో అడుగులో అడుగు వేస్తూ పందిరి మంచం చేరుకున్నది అపర్ణ , పూల పరిమళాలు , పరిసర వాతావరణం అటు వైపే ఆకర్షించగా . పాలగ్లాసు ఆ పందిరిమంచం పక్కనే వున్న టీ పాయ్ పై వుంచింది .
మౌనం మహమ్మారిలా  వ్యాపిస్తుందేమోనన్న   అనుమానంతో , రామారావే చొరవ చేసుకొని , "   అన్నింటా మీ లేడీసే ఫష్ట్ అయినా , శోభనం గదిలో జంట్స్ ఫష్ట్ , అదే బెష్ట్ "   అన్నాడు .
అపర్ణ నుంచి సమాధానమేమీ రాకపోయేసరికి "   మీ వూరి వాళ్ళందరికి బుధ్ధి లేకపోయిందోయ్, నిన్ను అప్పలమ్మ అని పిలవటానికి , అపర్ణ అని కూడా కాదు నిన్ను పిలవవలసింది , అప్సరస అని పిలవాలోయ్ . "   

" అప్సరస అని ఊరంతా పిలిచి , నాలోని రసాన్ని వారందరూ ఆస్వాదిస్తే , మీకేమి మిగిలేది కాదండి . అందుకే నేనూ ఆ అందాన్ని యింతకాలం భద్రంగా దాచి వుంచా . మీ కొరకేనండి . మొన్న 3 నిద్రలలోనే యిచ్చేయాలనుకున్నాను . కాని వీలుకుదరలేదు . ఆ తర్వాత తెలిసింది ఆ 3 నిద్రలలో యివ్వగూడదట . ముహూర్తం కావాలని ఆపింది మా నీలూ "   అని జరిగిందంతా వివరించింది .

"   అంత యిది అయిపోయావా అపర్నా , సారీ నిన్ను డిజప్పాయింట్ చేసినందుకు . "

" సారీ దేనికండి . నేనే , సినిమాలు చూసి ఆ పరిజ్ఞానంతో  పెళ్ళి కాగానే ఫష్ట్ నైట్ అనుకున్నా . అది నా పొరపాటు . అందువల్లే పొందలేకపోయాను . " 

" అయితే సారీలు , శారీలు మనిరువురి నడుమ వుండకూడదు . మరిక ఆలస్యం దేనికి ? "

"   ఐతే ఒక్క షరతండి . "

" మొగుడు పెళ్ళాల నడుమ షరతులుండకూడదు , షర్బతులు మాత్రమే వుండాలి ."

 "   మరే , మరే నకు చిరంజీవి అంటే మహ చెడ్డ యిష్టమండి . "

" ఐతే మరీ మంచిది . నాకూ చిరంజీవి అంటే అమిత యిష్టం . అస్సలు చిరంజీవి అంటే సిరంజి అన్నమాట . సిరంజి అంటే యింజక్షణ్ తెలుసుగా . "

"   అబ్బ ఎంత అడ్ర్ష్టమాండి . మన యిరువురిది ఒకే అభిరుచి . మీరు నా మాట కాదనరు , మీ మాట నేను కాదనను . ఇక మన దాంపత్యానికి ఎదురు లేదు . అసలు దంపతులలో కూడా ఒకే హీరో మీద అభిమానం వున్న వాళ్ళే వుంటే , ఏ లోటూ వుండదు కదండి . "

" నిజమే . గడియారం చూడు పెద్ద ముల్లు , చిన్న ముల్లు కలసిపోతున్నాయి . అంటే మనం యిక ఆలస్యం చేయకూడదు . దాంపత్యానికి పధ్యం పెట్టి , సంసారంలోని సారాన్ని జుఱ్ఱుకొందాం . "

"   అలాగే నండి . నాదో చిన్న కోరిక ."

" ఊ .... త్వరగా చెప్పు . "

"   చిరంజీవి పాటలు వింటూ ప్రారంభిస్తే మాంచి స్పీడు అందుకోగలమని .... " 

" అమ్మదొంగా , నీ పేరు వెనుక , అంతకత , నీలో యింత రసికత దాగి వున్నాయన్నమాట . అందరూ అప్పలమ్మ , అప్పలమ్మ అని పిలుస్తుంటే , ఏ తిక్కలమ్మో , తిప్పలమ్మో అనుకున్నానే గాని ఇంత సరసవీణవని అనుకోలేదు . నిజ్జంగా నీవే నాకు సరైన జోడీవి "   అంటూ కేసెట్ ఆన్ చేశాడు .

సంగీత ఝరి ప్రారంభం , సంసార ధుని సంరంభం .అందాన్ని , ఆనందాన్ని మాటలతో చెప్పలేక , చెప్పుకున్న వైనంలో సాగింది వారి పయనం .
టేప్ రికార్డర్ వేడెక్కింది , వీరిరువురి వేడి చల్లారింది . అంతవరకు శ్రమించిన ఆ యిరువురూ కొంతసమయం విశ్రమించారు .
ఆ సమయంలో రికార్డరు చల్లబడింది . మరల వీరిరువురిలో తాపం మొదలైంది . చల్లబడిన రికార్డర్ వేడి పాటలు వినిపిస్తుంటే , వేడెక్కినస్ శరీరాలు చల్లపడాలని తహతహ చెందుతున్నాయి . ఇక్కడే సృష్టి విచిత్రం , అక్కడే దృష్టి తన్మయత్వం .
ఇలా రేయనక , పగలనక శ్రమిస్తూనే వున్నారు , విశ్రమిస్తున్నారు . అలా రామారావు అపర్ణల మూడు రాత్రులు , మూడు పగళ్ళు కూడా సెగలతో గడిచిపోయాయి . నిద్రాదేవి నిరీక్షించి , నిరీక్షించి క్షీణతకు లోనై వారికి దూరంగా వెడలిపోయింది .


                                                                                          ******

రామారావుది  రిప్రజెంటిటివ్ ఉద్యోగం  . అంటే ప్రజంట్ గా యిల్లు వదలి క్యాంపులకు వెళ్ళటమే . అలా క్యాంపుల నుంచి తిరిగి యింటికి చేరుకొనే సమయానికి , అపర్ణని  నియమాలతోనో , నోములతోనో , రామారావుకి దూరంగా వుంచుతున్నది తల్లి సరస్వతమ్మ .
క్యాంపుల నడుమ లంఖణం చేయక తప్పదు . ఇలా తను ఇంటి వద్ద నున్న సమయంలో కూడా లంఖణం చేయవలసి రావటం గురించే కలత చెందుతున్నాడు . 
సిగరెట్ అలవాటు కానంతవరకు రెండు పెదవులు అన్యోన్యంగా ఆలు, మగలులా కలిసే వుంటాయి . తీరా అలవాటు అయిన తర్వాత , ఆ రెండు పెదవులు వెంపర్లాడుతుంటాయి ఆ సిగరెట్ కొరకు . 
ఇలాగే  'ఆ' సుఖం కూడా అసలు పొందనంతవరకు ఏ బాధా వుండదు . ఒక్కసారి 'ఆ' సుఖం పొందితే , రెండవసారి , మూడవసారి , యిలా , యిలా సంఖ్యను పెంచుతూ ముందుకు సాగిపోతుంది . లెక్కించగల అవకాశాలుంటే వెనుకాడవలసిన పని లేదు . ఆ అవకాశాలు లేకుంటే , రాకుంటే ,మనసు మరే పని చేయనివ్వక , మధనపెట్టి చిరాకు కల్గిస్తుంది .
మన రామారావు ఈ కోవలోనివాడే . ఈ కారణాలు మనసుకి రణాలు కల్గిస్తాయి , వయసుకి రుణాలుగా మిగులుతాయి . నూతన దంపతులకు దారుణాలుగా పరిగణించబడ్తాయి .
శోభనం ముగిసిన తర్వాత మరల ఇంతవరకు 'ఆ ' సుఖం పొందలేదు . ఆ శోభనం కలలా మిగిలిపోయింది . అపర్ణకు కూడా అవస్థగానే వున్నది . కాకుంటే సరస్వతమ్మకు చెప్పుకోలేక తన అవయవాలకే సర్ది చెప్పుకొంటోంది .
ఎపుడైనా మామూలు రోజులలో రామారావు క్యాంపు నుండి ఇంటికి వస్తే , ఇంటి చాకిరీ చేసి , అపర్ణ పడకగది చేరబోయే సమయానికి సరస్వతమ్మ "   అబ్బాయి తిరిగి తిరిగి వచ్చి అలసిపోయి విశ్రాంతి తీసుకొంటున్నాడు . ఇంత రాత్రి వేళ వాడిని యిబ్బంది పెట్టకు , ఇటు రా , నా పక్కనే పడుకో " తన పక్కనే పడక చూపించేది . ఇలా ఎప్పుడూ లంఖణం చేయవలసి వస్తుందన్న కోపంతో , మనసులోనే అనుకొన్నదిలా " ఈమె అత్తగారు కాదు లంఖిణి "   అని .
రామారావులో విసుగు విరామం లేకుండా కొనసాగుతూనే వున్నది .
 
                                                                                              ******             

మంచాన్నంటి పెట్టుకొని చాకిరీ చేసి అప్పలమ్మ అప్పసంగా అందుబాటులో వుండటం , మంచాన పడ్డాను అన్న దిగులు కూడా మరచిపోయేది సరస్వతమ్మ . వెనుకకి ఎవరో చెప్పారుట , ' అన్నీ అనువుగా వున్నచోటుకే అందుతుంటే రోగం కూడా మహాభోగమని  . '
రామారావు చిరాకు పడ్తున్నాడు అని తెలుసుకున్న సరస్వతమ్మ "   చిరాకు పడకురా చిట్టి తండ్రి , అమ్మాయి నా దగ్గరే వుండి , నాక్కావలసినవన్నీ చూస్తూనే వున్నదిగా . త్వరగా తగ్గిపోతుందిలేరా 4 / 5 రోజులలో "   అన్నది , ఈ చిరకు అంతా తన ఆరోగ్యం గురించేననుకొని .
వాస్తవానికి ఆ చిరాకంతా , అమ్మ గురించి కాదు , అపర్ణగురించే . ఎందుకంటే , రాక రాక మాంచి అవకాశం వచ్చింది అమ్మ మంచాన పడటం . ఈ అవకాశాన్ని చక్కగా వుపయోగించుకోవలసింది పోయి అమ్మ మంచాన్నే అంటిపెట్టుకొని , తను ఎంతకీ తన మంచం చేరదేమిటా ? అని .
ఈ కస్సు బుస్సులన్నిటికీ కారణం ఆ కసరత్తేనని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అపర్ణకి . తనకూ బాధగా వున్నా , అణచుకుంటూ , రామారావు అవస్థ చూసి నవ్వుకుంటూ వూరుకొంటుంది .

"    అపర్ణా నా డ్రెస్ సూట్‌కేస్ లో సర్దటానికి సమయమేమైనా చిక్కుతుందా "    కోపంతో కూడిన అవహేళనగా అడిగాడు .

"   అబ్బాయ్ నిన్ననే కదరా క్యాంపు నుంచి వచ్చింది . 4 రోజులదాకా మళ్ళీ క్యాంపు లేదన్నావు . మళ్ళీ అపుడే క్యాంపా "   అన్నది సరస్వతమ్మ .

" అర్జంటుగా టెలిగ్రాం వచ్చింది , వెళ్ళాలి . అయినా ఈ 4 రోజులు యిక్కడుండి ఏం చేయాలి ? ఈ అవస్థ కన్నా ఆ క్యాంపుకెళ్ళటమే మిన్న "   చిరాకుగా బదులిచ్చాడు .

"    అమ్మాయ్ అబ్బాయి సూట్ కేస్ సర్ది తీసుకురా . నా కాళ్ళన్ని లాగేస్తున్నాయి , కాస్త కాళ్ళు పడ్దువు గాని ."

"   అలాగేనండి అత్తయ్యగారు "   లోపలకి వెళ్ళింది .

"   అమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో ."

" నువ్వేమీ దిగులుపడకురా , కోడలుపిల్ల చక్కగా చూసుకొంటుందిగా . ఇంక ఆరోగ్యం అదే చేకూరుతుందిలే . "
అపర్ణ హాల్లోనే పచార్లు చేస్తున్నది .

"   సర్దటం పూర్తయినదా అమ్మాయిగారు , బయట పచార్లు చేస్తున్నారు పనిలేని వాళ్ళలా . "

"   నేను దూరంగా వున్నానండి , సగం సర్దాను , మిగతావి మీరే సర్దుకోండి . "

"   దూరంగా వున్నవా ? దగ్గరుండి మాత్రం ఏం ఉధ్ధ్రించావు ? అయినా ఈ మధ్య నేనన్నా , నా పని అన్నా లెక్క లేకుండా పోయింది , గమనిస్తూనే వున్నాను . "

"   నువ్వుండరా , అమ్మాయి నెలేనా ? "   అడిగింది సరస్వతమ్మ .

"   లేదండీ అత్తయ్యగారు , నీళ్ళు పోసుకొని 15 రోజులే అయింది . అపుడే వచ్చి పడిందండి , ఏదో కొంప మునిగిపోయినట్లు . "

"   నిజమేనే కోడలు పిల్లా , ఏదైనా అర్జంటు పని వున్నపుడు , నాకు కూడా యిలాగే ముందు వచ్చి పడేవి . పెళ్ళీళ్ళకెళ్తే అక్కడా యిదే వరస , నా పరువు తీసేవనుకో . అయినా ఏం చేస్తాం , మన చేతిలో లేవుగా . "

"   అమ్మా అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం కదా . నేనా క్యాంపుకెళ్ళాలి అర్జంటుగా . మరి నిన్నెవరు చూస్తారే " అన్నాడు దిగులుగా .

మనసులో మాత్రం ఆనందపడిపోతున్నాడు రామారావు . మా యిద్దరినీ విడదీసి ఆనందపడి పోతావుటే లంఖిణి , బాగా కుదిరించాడులే ఆ భగవంతుడు నీ రోగం అని .

" అత్తయ్యగారు , మీకభ్యంతరం లేకపోతే , తలనిండా స్నానం చేసి లోపలకి వచ్చి , మీకు సేవ చేసుకొంటాను " మాట జవదాటని జవరాలులా .

' పిచ్చిదానా ఈ 3 రోజులైనా చాకిరీ లేకుండా సుఖపడక , మళ్ళీ లోపలకి వస్తానంటావేమిటే ' అని మనసులోనే అనుకున్నాడు రామారావు .

" అల్లాంటివి వద్దమ్మాయి , మనకు నిఖరంగా తెలిసినప్పుడు , దూరంగా వుండటమే మంచిది , మన సంప్రదాయం కూడాను . "

' నీ ముఖానికి సంప్రదాయం కూడానా ? ' ఎకసక్కెంగా మనసులోనే అనుకున్నాడు రామారావు .

"   అమ్మా మరి నే వెళ్ళాలి , నీ పరిస్థితి ఏమిటి ? "

" ఏమున్నదిరా , పడ్తూ , లేస్తూ అలాగే చేసుకుంటాను , తప్పదుగా మరి . "

' అలాగా ! తప్పనిసరైతే లేచి చేసుకొంటావన్నమాట . అవకాశం వుంటే అడ్డంగా పడుకొంటావన్నమాట . ఇక తెలిసిందిగా . నన్ను క్యాంపు నుంచి రాని నీ పని పడ్తాను ' అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు . "   అమ్మా మరి దానికి కూడా చేసిపెడ్తావా ? "

"   ఫరవాలేదమ్మాయ్ , నేను అలాగే చేసుకుంటా గాని , నువ్వు మీ బాబాయి గారింటికి వెళ్ళు . 4 వ రోజున నీళ్ళు పోసుకున్న వెంటనే వచ్చేయ్ . బాగా అలవాటు అయినావు , నే ఒంటరిగా వుండలేను . "

' యిన్నాళ్ళు ఒక్కమారు కూడా వాళ్ళ బాబాయింటికి వెళ్ళనీయకుండా , యిపుడు వెళ్ళమంటావా ఢాకిని .
 నన్ను , దాన్ని పిచ్చివాళ్ళుగా జమకట్టి ఏడ్పిస్తున్నావా మహాతల్లి . నీకలవాటైనదా . పెళ్ళి చేసుకున్నది నా కొఱకా ? నీ కొఱకా ? పైగా ఒంటరిగా వుండలేక పోతున్నావా ? ఒంటరిగా వుండలేక పోతుంది మేమిద్దరమే , మమ్మల్ని ఏదిపిస్తున్నావు గదుటె , అనుభవిస్తావు , ఇంతకింతకీ అనుభవిస్తావు ' అని లోలోపల తిట్టుకొంటూ కోపాన్ని అణగదొక్కుకొన్నాడు రామారావు .

"   అబ్బాయ్ దాన్ని వాళ్ళ బాబాయి వాళ్ళీంటి వద్ద దించి వెళ్ళరా . "

"   ఇప్పటికే ఆలస్యమైంది , ఇంకా యిది కూడానా . "

"   అవునురా , దానిని ఒక్కదానిని ఎలా పంపుతాము . అందునా కొత్త పెళ్ళికూతురాయె , పెళ్ళై నాలుగు నెలలు కూడా నిండలేదు . "

' ఓహో ఇప్పుడు పెళ్ళికూతురిలా కనపడ్తుందా లంఖిణీ . ఇన్నాళ్ళూ నీ మనస్సు , కళ్ళు ఎక్కడికి పోయాయే ' అని ఎగసిపడ్తున్న మనసుని లోలోనే నొక్కి పట్టుకున్నాడు .

"   సరే  నే వెళ్ళి సూట్ కేస్ సర్దుకుంటా "   లోపలకి వెళ్ళబోయాడు .

"    ఏమండీ ఆ చేత్తోనే , ఆ సూట్ కేస్ లోనే నా శారీస్ ,మ్యాచింగ్ జాకెట్లు , ఆ జాకెట్లకి అందాలు తెచ్చే బ్రా లు సర్ది తీసుకురాండి . "

' చివరకి వీటితో నన్ను సరిపెట్టుకోమంటావా చిత్రాంగి ' కొర కొరా చూశాడు అపర్ణని .

"   నాతో పాటు ఇంటివరకు వస్తారుగా , అక్కడ యిచ్చేద్దురు . "

"   ఆ పని చేయరా , ఇంకా ఏమిటి ఆలస్యం ? త్వరగా బయలుదేరు , అరగంట క్రితమే అర్జంటుగా వెళ్ళాలన్నావుగా . "

' లా(గి)పాయింట్లు నీ అవసరానికి భలే తీస్తావు ' అని మనసులోనే కసిని కసిగా నిఒక్కేసుకొన్నాడు .

"   అమ్మాయ్ , బస్సు ఎక్కేటప్పుడు , దిగేటప్పుడు తాకకుండా దూరంగా వుండు ."

" అలాగేనండి అత్తయ్యగారు , ఆ వంటింటి గూట్లో కారప్పొడి వున్నది చూసి వేసుకోండి . "

"   సరేనమ్మాయి వెళ్ళీరా . 4 వ రోజు త్వరగా నీళ్ళు పొసుకుని వచ్చేయ్ . "

                                                                                                      ( తరువాయి రేపటి టపాలో చూడగలరు  )

ఆన్ సైట్

                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్
                              
                                                          ( మాలికలోని పెండెం గారి చిత్రానికి నా చిరు కవితా స్పందన )ఓ సాఫ్ట్ వేర్ గాళ్  బాడీ కాలిపోతోంది 
ఆఫీసు నుంచి ఆసుపత్రికి వెళ్ళింది 
వైద్యురాలిని సంప్రదించింది
టెస్టులకి ల్యాబరేటరీలు తిరిగింది ,
రిపోర్టులలో అనారోగ్య దాఖలాలు లేనే లేవు
అయినా , పేషంట్ పల్స్ రేటు డౌన్ అవుతోంది 
చూసిన వైద్యురాలు ఆశ్చర్యానికి లోనయింది .
ప్రత్యేక వైద్య బృందాన్ని పిలిపించింది , పరిశీలిస్తోంది

ఇంతలో ఆన్ సైట్ కాల్ వచ్చింది 
ఆ సాఫ్ట్ వేర్ గాళ్ సదరు పేషంట్ 
చక చకా ల్యాప్ టాప్ ఆన్ చేసింది 
నీరసంగా వున్నా హుషారుగా పని చేస్తోంది
ఆన్ సైట్ అఫ్ సైట్ అవగానే షట్ డౌన్ చేసింది
మఱల మునుపటిలాగే పల్స్ డౌన్ అయిపోయింది
యాంటీ బయోటిక్ మందులకు యాక్షన్ / రియాక్షన్ లేదు
అయినా హుషారు లేదు , చలనం లేదు .

మఱల ఆన్ సైట్ కాల్ , ల్యాప్ టాప్ ఆన్ చేసింది  
 హుషారే ధ్యేయంగా  పనిచేసింది
ఆన్ సైట్ కాల్ పూర్తవగానే ల్యాప్ టాప్ షట్ డౌన్ 
సాఫ్ట్ వేర్ గాళ్ పల్స్  బెడ్ మీద కౌంట్ డౌన్
చలనం లేక సంచలనం కలిగిస్తున్నది 

అంతదాకా రోగనిర్ధారణ చేయ(లే)ని 
ఆ ప్రత్యేక బృందం ఓ నిర్ధారణకొచ్చింది
వాళ్ళ ల్యాప్ టాప్ ఓపెన్ చేసింది
ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఫ్లిక్కర్లలో లాగ్ ఆన్ అయింది
ఇయర్ ఫోన్ ఆ పేషంటు నరాలకి తగిలించింది 
మెల్లగా కదలికలు ఆరంభమైనాయి
పడిపోయిన పల్సు రేటు పైపైకి వురుకుతోంది
పడుకున్న పేషంట్ లేచి కూర్చుంది 
పేషంట్ ఫుల్ గా రీఛార్జ్ అయింది 

ఫేస్ బుక్ , ట్విట్టర్ , యూ ట్యూబ్ , ఫ్లిక్కర్లను 
వీక్షిస్తూ విహారలోకాల్లో పయనిస్తోంది
వేరే ఏ మందులూ  పనిచేయ(లే)వని ఫైనల్ చేసేసింది .
ఈ(విడ) రోగానికిదే ట్రీట్ మెంట్ అన్నది 
ఇది లేటెస్ట్ కొత్త రోగం అదే ఆన్ సైట్ ఫీవర్ .

 *****

ఫస్ట్ & లాస్ట్


                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్విజయ & కో లో త్రీ యిన్ వన్ పర్చేజ్ చేసి , అంబాసడర్ కారు ఎక్కింది ప్రియంవద .కారు జిన్నాటవర్ మీదుగా గాంధీ పార్క్ క్రాస్ చేస్తుండగా డ్రైవర్ని కారు ఆపమన్నది .ఆ సరికే హిందూ కాలేజి చేరుకోవటం వలన సడన్ బ్రేక్ తో అక్కడే ఆపాడు .

" ఆ బస్ స్టాప్ లో బ్లూ ప్యాంటు , గ్రీన్ షర్ట్ వేసుకున్న అతనిని పిలుచుకురా "   ప్రియంవద అనటంతో , డ్రైవర్ అటు వైపుగా నడిచాడు . ఐదు నిముషాల తర్వాత అతనిని తీసుకువచ్చి , ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశాడు .

"   నో "   అంటూ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి "   రండి , కూర్చోండి "   అన్నది ప్రియంవద .
అలా తన ప్రక్కన సీటు ఆఫర్ చేయటం డ్రైవర్‌తో పాటు , ఆ వ్యక్తికీ ఆశ్ఛర్యం కలిగించినా , అడక్కుండా యిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటున్న వానిలా ఎక్కి కూర్చొన్నాడు .కారు బయలుదేరింది . ముందుగా ప్రియంవద అతనినిలా పలకరించింది "   రమేష్ గారు బాగున్నారా ? "   అని .

"   మీరెవరో గుర్తించలేకపోతున్నాను . నన్ను క్షమించండి "   అన్నాడు రమేష్ .

"   నేను ప్రియంవదని "   అంటూ కూళింగ్ గ్లాసుని కళ్ళనుంచి వేరు చేసింది .

"   ఓ ! మీరా ? గుర్తుపట్టలేకపోయాను . అప్పుడెప్పుడో మీ పెళ్ళి కాకముందు చూడటమే కదండీ "   అన్నాడు .

"   మీ అమ్మా , నాన్నగార్లు ఎలా వున్నారు ? మీరేం చేస్తున్నారు ? "

"   మీరింక అడగకండి , అన్నీ సినిమా కష్టాలే . నాన్న పోయిన తర్వాత , నాన్నతో పాటు పోలేక అమ్మ మంచం పట్టింది . నా డిస్కంటిన్యూడ్ చదువుకి ఉద్యోగమెవరిస్తారు ? ఇలా తిరుగుతున్నాను "   తన పరిస్థితిని సూక్ష్మ
రామాయణం ఫక్కీలో వివరించాడు రమేష్ .

"   ఇపుడెక్కడుంటున్నారు ? "

"   డొంకరోడ్డు చివర , అదీ ఓ చిన్న పూరి పాకలో . "

"   హ్యాండ్ బ్యాగ్ లోంచి విజిటింగ్ కార్డు తీసి " ఈ అడ్రస్ లో రేపాదివారం ఉదయం 10 గంటలకి వచ్చి కలుసుకోండి . మీకేదైనా మేలు జరవచ్చు "   అనగానే డ్రైవర్ కారు ఆపాడు .

కారు దిగి "   అలాగేనండి "   దిగి డోర్ క్లోజ్ చేశాడు .
                                       
                                                                                                          *     *      *

ఇరువైపులా అందమైన పూలమొక్కలకి నీళ్ళు పోస్తున్న తోటమాలి , ఒక ప్రక్క షెడ్లో అంబాసడర్ కారు పార్కింగ్ చేసి వుండగా , మరో ప్రక్కన పోర్టికోలో మారుతిని క్లీన్ చేస్యున్న డ్రైవర్ని చూస్తూ , దర్వాన్ వెనుకనే బంగళా లోని హాలులో ప్రవేశించి , సోఫాలో కూర్చున్న ఆ యిరువురిని చూసి "   నమస్తే మేడం , నమస్కారం సార్  "   అన్నాడు రమేష్ .

ప్రతి నమస్కారాలు , అతిధి మర్యాదలు పూర్తయ్యాయి .

"   సార్ నాకేదైనా ఉద్యోగం యిప్పించండి "   అడిగాడు రమేష్ .

"   మేడం నీ గురించి వివరించారు . నా పర్సనల్ సెక్రెటరీగా అపాయింట్ చేసుకొంటున్నాను . రేపు వచ్చి జాయిణ్ కండి . ఇదే ఆఫీస్ అడ్రస్ "   అంటూ తన విజి టింగ్ కార్డు యిచ్చాడు భర్త అశోక్ కుమార్ .

"   థాంక్ యూ సర్ , మేడం గారూ ఉంటానండి "   అంటూ వెళ్ళిపోయాడు అంతులేని ఆనందంతో .
                     
                                                                                                       *       *     *

మంచినీళ్ళు తాగాలంటే మైలుదూరం వెళ్ళి తెచ్చుకోక తప్పదు ఆ పల్లెటూరి ప్రజలకు . ఇది అనాదిగా ఆ ఊరికి తరతరాలుగా ఆనవాయితీగా సంక్రమించిన ఆస్తి .

"   అమ్మాయి ప్రియా , మంచినీళ్ళకు వెళ్తున్నా , వచ్చేసరికి నీ స్నానం ముగించు , వీది తలుపులేసుకోమ్మా " అంటూ మహలక్షమ్మ గారు బయటకు వెళ్ళటం ప్రక్కింటి వాటా లోని రమేష్ చెవిన పడింది .

"   అలాగేనమ్మా "అంటూ  వెళ్ళి వీధి తలుపు గడియ వేసి , స్నానానికి వెళ్ళింది ప్రియంవద .లేవలేని తల్లి మంచంలోనే కునికిపాట్లు తీస్తుండగా రమేష్ మెల్లగా పెరట్లోనికి చేరుకొని , చిన్నగా గోడ ఎక్కి ప్రియంవద వాళ్ళ
స్నానాలగది వైపు చూశాడు . తలుపు గడియ వేసుకోలేదని , దగ్గరగా వేసి వున్న తలుపులు తెలియచేస్తున్నాయి . గోడ దిగి మెల్లగా లోపలకి వెళ్ళి తలుపులు గడియ వేశాడు .
సీకాయ తలకు , సబ్బు ముఖానికి పట్టించి , నీళ్ళ మఘ్ కొరకు అటూ , ఇటూ తడుముకొంటున్న ప్రియంవదను చూసి , ఆ నీళ్ళ మగ్గుని దూరంగా వుంచాడు . అలా చూస్తుండిపోయాడు . అక్కడ మగ్గు అందకపోయేసరికి , కళ్ళు తెరిస్తే మంట పుడ్తుందని అలాగే అటూ , యిటూ వెతుకుతూనే వున్నది . ఇంతలో ఆ మగ్గులోని నీళ్ళను ప్రియంవద ముఖం మీద కుమ్మరించాడు . మండుతున్న కళ్ళను నులుపుకొంటూ , కళ్ళు తెరచి చూసింది .ఎదురుగా నుల్చొని వున్న రమేష్ ని చూసి , సిగ్గుతో శరీరాన్ని ముడుచుకొని , తన చేతులను వక్షోజాలాకు ఆఛ్ఛాదన గావించి , " ఆడవాళ్ళ స్నానాల గదిలోకి యిలా మగవాళ్ళు రావచ్చా ? ముందు మీరు బయటకు వెళ్ళండి "   అన్నది కోపంగా .

"   కోపగించకు ప్రియంవదా ! వన్ మినిట్ , చాలా రోజులనుంచి నీ అందాలు నన్ను కలవరపరుస్తున్నాయి . నగ్నంగా నిన్ను చూడాలని ఎంతగా వుబలాటపడ్తున్నదో నా మనసు . అసలు నీవెప్పుడు స్నానం చేస్తావో ఒక నిర్ణీత సమయమంటూ తెలియదాయె . ఇన్నాళ్ళకి ఈ రోజు మీ అమ్మ పుణ్యమా అని ఈ మహావకాశం వచ్చింది . ఇక మంచీ చెడూ ఆలోచించక , ముందూ , వెనుక చూడక , అంత పెద్ద గోడా దూకి , అన్ని రాళ్ళు గీసుకున్నా , కోసుకున్నా , ఓర్చుకొని వచ్చా . వచ్చినపని కాకుండా వెళ్ళిపోవటానికి కాదు "   అంటూ అక్కడనుంచి కదలకుండా "   చూడు ఈ రక్తం . ఎపుడూ అంటుంటావుగా కష్టానికి తగ్గ ఫలితం వుంటుందని , అన్నమాట నిలబెట్టుకో , ఫలితాన్నిఅందించెయ్ "   అక్కడే నుల్చొన్నాడు .

"   మొదట మీరు బయటకు నడవండి . లేదా పెద్ద గలభా చేయవలసి వస్తుంది "   అన్నది తలవంచుకునే .తప్పని సరై స్నానాల గది నుంచి బయటకు నడిచాడు . వెంటనే ఠపీమని తలుపు గడియ వేసుకున్నది .  బ్రతుకు జీవుడా అనుకున్నది మనసులోనే . చక చకా స్నానం ముగించుకొని , పాత ఓణీ చుట్టుకొని , మధ్య గదిలో ప్రవేశించి , ఆ చుట్టుకొని వున్న పాత చీరని భూమి ఆకర్షణకు నేల వేసింది . ఆ గదిలోనే దాగి వున్న రమేష్ లో ఆ ప్రియంవద సొగసులు రియాక్షన్‌ని కల్గించాయి . అయస్కాంతంలా ఆమెను అమాంతంగా తన ఛాతీకి హత్తుకున్నాడు .ఆ ఆకస్మిక చర్యతో ఆ ప్రియంవదలోని ఆడవయసు , అతను పరాయి మగవాడు అన్న విషయాన్ని ఆమడ దూరానికి తరిమి , అయినవాడుగా ఆతని దరికి చేర్చింది .
అతని ప్రయత్నాలు వియత్నాం వీరుని గుర్తుకు తెస్తున్నాయి .అంతా ప్రత్యక్ష ప్రసారంలా కనుల ముందు కన పడ్తున్నా , ఆపటం తన వల్ల కాదని అర్ధం చేసుకున్నదై , సర్దుకున్నదై , అలా ప్రసారమవుతున్న ఆ రిలే ప్రోగ్రాంలా చూస్తుండిపోయింది . ఆ చేష్టలకనువుగా , ఆమె తనువు ఏ మాత్రం తటపటాయించకుండా తాళం వేస్తున్నది .తప్పని మనసు ఓ ప్రక్క రొదపెడ్తున్నా , తప్పదన్న వయసు బోధతో , మనసు రొద పెకమేడలా కూలిపోయింది . ఆ అవయవాల అల్లరి , అనుభవాల పల్లవిగా మారి , పలు సరాగాలు పలికించింది .నరనరాల కేళి ముగియగానే పరిసరాలు జ్నప్తికి వచ్చి గబగబా చీర కట్టుకొని "  ఛీ.. ఛీ ...! ఎంత పొరపాటు జరిగింది ? మా అమ్మ వచ్చే టైమైంది . త్వరగా వెళ్ళిపోండి "  అన్నది ప్రియంవద .

( ఈ కధ 10 మే 1995 న అన్వేషణ వారపత్రికలో ప్రచురితమైనది . ) 
ఆకలి తీరిన సింహంలా వెనుకకి చూడకుండా వెళ్ళినట్లుగా వెళ్ళాడు .

గబగబా స్నానం చేసి , బట్టలు కట్టుకుని వీధి తలుపు గడియ తీసి , దేవునికి అగరువత్తులు ఆరాధించటం
మహలక్షమ్మ కంటబడి ఆనందించింది .

ఆ తర్వాత మహలక్షమ్మ మంచినీళ్ళకు వెళ్ళటం , ప్రియంవద స్నానానికని వీధి తలుపు గడియవేసుకోవటం లాంటివి తరచు జరుగుతూనే  వచ్చాయి .

రమేష్ భవిష్యత్తులోకి అడుగు వేశాడు .

ప్రియంవద తననింకా అభిమానిస్తూనే వున్నది . తను ఆ అనుభవాన్నింకా మరచిపోలేదు . అందమైన భర్త , అమిత సంపద అన్నీ వున్నా , ఎక్కడో ప్లాట్ఫరం మీద మాసిన బట్టలతో వున్న తనని , ఎపుడో ఊరు వదలి వెళ్ళిన ఆమె పిలిచి మంచి హోదానిచ్చి , జీతమిప్పిస్తున్నదంటే అనుమానం లేదు . తననింకా కోరుకుంటున్నది . సమయం చూసుకొని సరదా తీర్చాలి అని నిశ్చయించుకొన్నాడు .

                                                                                                         *     *      *

ఫైల్ పట్టుకొని వచ్చిన రమేష్‌ని చూసి కూర్చోమని ఆహ్వానించింది ప్రియంవద .

"   నమస్తే మేడం "   అంటూ కూర్చొన్నాడు .

"   ఎలా వున్నది ఉద్యోగం ? అమ్మ ఆరోగ్యం ? "   అడిగింది .

"   ఏరి కోరి యిప్పించిన ఉద్యోగంఎంతో బాగుందండి .  ఇపుడిపుడే  అమ్మ ఆరోగ్యం మెరుగుపడ్తున్నది మీ పర్యవేక్షణలో ."

ప్యూన్  తెచ్చిన కాఫీ సేవించిన తర్వాత "   మేడం మీతో పర్సనల్ గా మాట్లాడాలి . అపాయింట్మెంట్ యివ్వండి "
అన్నాడు .

"   సెక్రెటరీ మాట్లాడటానికి అపాయింట్మెంట్ అవసరం లేదు . ఎపుడైనా మాట్లాడైనా మాట్లాడవచ్చు . మాట్లాడండి ." 

అటూ , యిటూ దిక్కులు చూస్తూ తటపటాయిస్తున్న రమేష్ తో  "   ఫరవాలేదు అడగండి , వీలైతే యివ్వటానికి ప్రయత్నిస్తాను "   అన్నది .

ఆ మాటలతో అతని సంశయం తీరినట్లు భావించి "   మిమ్మల్ని అర్ధం చేసుకోవటంలో కొంచెం జాప్యం జరిగింది . సారీ ప్రియంవద గారూ "   అన్నాడు .

"   అంటే మీ ఉద్దేశ్యం ? "

సదుద్దేశమేనండి  . ఋణాన్ని నా మనసెప్పుడూ వ్యతిరేకిస్తుంది . ఆ ఋణాన్ని తీర్చుకున్నపుడే  నా జన్మకు సార్ధకత . ఆ విషయంలో మీ సహకారం అందించాలి ."

"   ఓ మంచిపనికి నా సహకారం మీకెపుడూ వుంటుంది . ఏం కావాలో  అడగండి . "

"   మీమీద నాకా నమ్మకం వున్నది . ఎవరికీ తెలియకుండా బహు మెలకువగా మసులుకొంటా , సంతోషపరుస్తా . గత కొన్నాళ్ళుగా ఈ విషయాన్ని విన్నవించాలని , ఎన్నో మారులు ప్రయత్నించినా వీలు కుదరలేదు . ఈ రోజు బాస్ ఊరిలో లేనందున ఈ మాత్రం అవకాశం లభించింది . విషయం మీ చెవిన పడవేస్తే , అవకాశాన్ని అనువుగా తీర్చి అందిస్తారని , ఆనందిస్తారని తెలియచేస్తున్నా"   మనసులోని తపనను తెలియచేశాడు .

ప్రియంవద శరీరం మీద జెఱ్ఱులు పాకుతున్నట్లయింది . తను చేసిందేమిటి ? పొరుగింటి పేద కుటుంబమని సాయం చేస్తే , ఆ సాయం చివరకి యిలాంటి పరిణామాలకు దారి తీస్తుందా ? ఛీ... ఛీ... అని మనసులోనే అనుకొని " చూడండి రమేష్ గారు మీరీ రోజు ఔట్ ఆఫ్ మూడ్ లో వున్నట్లున్నారు . ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి . నాకు తలనొప్పిగా వుంది "   తలను చేత్తో పట్టుకున్నది .

"   అర్ధం చేసుకున్నాను , వ్యర్ధం చేసిన కాలాన్ని , నా తప్పుని గ్రహించి సవరించుకొనచూసే ప్రయత్నంలో భాగమే ఈ నా ప్రార్ధన , మూడో కంటికి తెలియకుండా నే చూసుకొంటాలెండి . నా శక్తి , నా యుక్తులను తక్కువగా అంచనా వేయకండి "   అన్నాడు .

ఇక జాగు చేయటం మంచిది కాదని గ్రహించి , ఇంటర్ కంలో డ్రైవర్ని పంపమని ఆదేశించింది దర్వానుని .

ఆదేశం విన్న రమేష్ "   నన్ను కాదన్న మీరెలా వుంటారో చూస్తాను "   అని ఛాలెంజ్ కాని ఛాలెంజ్ చేశాడు .అతని ప్రవర్తన ఆమెకు అసహ్యం కలిగించింది . వెంటనే తన గది వైపుగా నడిచింది .

రమేష్ ఏదో చెప్పబోయి , డ్రైవర్ని చూసి ఆగిపోయి అతనిని అనుసరించాడు .
       
                                                                                                      *     *      *

"   సార్ పిలిచారుట "   అంటూ అశోక్ కుమార్ ఛాంబర్ లోకి ప్రవేశించాడు రమేష్ .

"   పర్సనల్ లెటర్ ఒకటి పోష్ట్ చేయాలి ."

"   చెప్పండి , టైప్ చేయిస్తాను . "

"   మరొకరి చేత టైపు చేయించటానికి వీలులేదు . పూర్తిగా నాస్వంత విషయం . మీ మీద ఎంతో నమ్మకముండటం వలన మీకు చెప్తున్నాను . "

"   ఎస్, చెప్పండి ."

"   నా వేలు కట్ అయింది . మా అంకుల్ కి లెటర్ వ్రాయాలి ."

"   నేను వ్రాస్తాను , చెప్పండి " అనటంతో లెటర్ డ్రాఫ్ట్ చేశాడు అశోక్ కుమార్ .

కంప్లీట్ చేసి "   మీరొకమారు చూస్తే పోష్ట్ చేస్తాను "   అని రమేష్ అతనికి అందించాడు .

లెటర్ పరిశీలించి "   రమేష్ ఈ లెటర్ చూడు "   అంటూ మరో లెటర్ యిచ్చాడు అశోక్ కుమార్ .

లెటర్ చదివిన రమేష్ "   మీరు నమ్మకండి , మేడం గారు నా దేవత . నా మాట నమ్మండి "   ఎంతో బాధతో .

" నమ్మలేక పోతున్నాను . ఇది నిజమేనేమోనని ఎందుకో అనుమానంగా వున్నది ."

" అనుమానించకండి . మేడం గారు నిజ్జంగా దేవత . ఎవరో దుర్మార్గులు యింత ద్రోహానికి తలపెట్టి వుంటారు " తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు .

"   నాకూ అదే అనుమానం కలుగుతోంది , ఏదీ ఆ ఉత్తరం ఓమాటు యిటివ్వు , మళ్ళీ చదువుతాను "   అంటూ అందుకుని , అంకుల్ కి వ్రాయించిన ఉత్తరం , ఈ ఉత్తరం పక్కపక్కన పెట్టి పరిశీలించి , "   ఈ ఉత్తరం కూడా నీ చేతిరాతకి దీటుగా వున్నది , ఓ మారిటు చూడు "   అంటూ టెబుల్ పై రెండు ఉత్తరాలని వుంచాడు అశోక్ కుమార్ .

చూసిన రమేష్ "   నిజమే సార్ , వీడెవడో నా రాతను కాపీ కొట్టాడు , నిజంగా నాకేమీ తెలియదు , నన్ను నమ్మండి " అంటూ  నమ్మబలక ప్రయత్నించాడు . .

"  మిమ్మల్ని అర్ధం చేసుకున్నాను . మా అంకుల్ కి వ్రాసిన లెటర్  మీ చేతి వ్రాత , ఆ ఆకాశరామన్న లెటర్ మీ తల వ్రాత . మీ గురించి నాకు బాగా తెలుసు . తిన్నయింటి వాసాలు లెక్కపెట్టటంలో రాటు తేలిన వాళ్ళు మీరు . ఈ రోజు మీకీ హోదా వచ్చింది , మీ చదువు వల్ల కాదు , మీ గొప్పదనం వల్ల కాదు , మేడం గారి మంచితనం వల్ల అన్నది మరచిపోయి ఓ శాడిష్ట్ గా  తయారయ్యారు మీరు .
ఈ ప్రపంచంలో ఏ భార్య , భర్తకి చెప్ప(కూడా)ని విషయాన్ని మేడం నాకు వెల్లడించింది . పెళ్ళికి ముందు జీవితం ఆమె వ్యక్తిగతం . పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తిగతం ఆ స్త్రీ జీవితమ్లో స్వగతమవుతుంది . ఆ స్వగతమనే గతాన్ని నా వద్ద నిర్భయంగా వెల్లడించింది . పెళ్ళైన తర్వాత జీవితాలే భార్యాభర్తలకి స్వంతమవుతాయి .ఆమె నిజాయితీని అభినందించకుండా వుండలేకపోయాను . ఆ(మె) నిజాయితీయే మీ కడుపు నింపేలా చూసింది . కడుపు నిండగానే , అన్నీ మరచి రాక్షసుడిలా ప్రవర్తించారు . మీలాంటి వారిని క్షమించరాదు . మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను . ఐ సే గెట్ అవుట్ "   అన్నాడు అశోక్ కుమార్ .

"   ఎక్స్క్యూజ్ మి సర్ , పొరపాటై పోయింది , ఈ రోజు మీరు కాదంటే , నాదంటూ , నాకంటూ ఏమీ వుండదు . నా తప్పు తెలుసుకున్నాను . నన్నా నరకంలో పడేయకండి , మీ కాళ్ళు పట్టుకొంటాను  "   అంటూ కాళ్ళు పట్టుకుని రోదిస్తున్నాడు .

"   సరే ఈ సారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను , మిమ్మల్ని చూసి కాదు , మీ అమ్మగారి అనారోగ్య పరిస్థితి చూసి . సెక్రెటరీ పోష్ట్ నుంచి క్లర్క్ పోష్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను . ఇకనైనా బుధ్ధిగా వుండండి . మీకిదే ' ఫష్ట్ & లాష్ట్ వార్నింగ్ '  "   అంటూ మందలించాడు అశోక్ కుమార్ .   

                                                                                    ** స ** మా ** ప్తం **

ఆధార్ / నిరాధార్

                                                                                                                             కవితా రచన : శర్మ జీ ఎస్
                                                               
                                                                           

ఆత్మకి ఆకారం అత్యవసరం ,
ఆకారం లేనిదే సంచరించలేదు .
జీవికి ఆకారం ఉంది ,
ఆహారం తీసుకోనిదే జీవించలేదు .

ఆకారం ఏదైనా ఓ శరీరమే ,
ఆ శరీరం ఆ అలవాట్లకి బానిసై ,
వే కావాలంటూ మారాం చేస్తుంటుంది ,

ఏ ప్రాణికైనా ,
పంచభూతాల సహకారంతో  ఆకారం ,
ఆ ఆకారం పంచేంద్రియాలతో సావాసం .

ఆ పంచేంద్రియాలు ఏ ఆకారం లేని ,
మనసు స్వాధీనమై పరాధీనం .

 ఆకారం లేని మృత్యువు 
ఆకారం వున్నవాటికి ఆధారం వున్నా ,
అమాంతంగా మింగేస్తుంది .

  *****

లేదా జాడ ఓ గురజాడ ?

                                                                
                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్


ఓ గురజాడ మహాశయా ,
మీకు ,

జయంతులు ,
వర్ధంతులు ,
సభలు పెట్టి ,
మీ వాళ్ళకు ,
సన్మానాలు ,
ముమ్మరంగా ,
చేసేవారే గాని ,
మీ అడుగుజాడలలో ,
నడిచే వారే కనపడరే ,
మీరు కోరుకున్న ,
చాటమన్న ,
మన దేశ ఘనతను ,
చాటే వారే లేరు ,
దాటేసేవారు తప్ప .


ఈ మన దేశంలో ,
వేళ్ళూనుకుపోయిన ,

కుళ్ళుని , కుతంత్రాల్ని ,
అన్యాయాల్ని ,
అరాచకాల్ని ,
అంతం చేసి ,
అంతులేని ఆనందంతో ,
చాటి చెప్పాలని ,
విశ్వ ప్రయత్నం చేసి ,
విఫలమైపోయా పలుమార్లు ,
మీరు కోరుకున్న ,
ఆ రోజు కొఱకు ,
ఎదురుతెన్నులు కాయటం తప్ప ,
మరింకేమీ చేయలేకపోతున్నా .


మీరున్న ఆనాటి పరిస్థితులు ,
ఈనాడు లేనే లేవు ,

అనుమానాలు , అవమానాలు ,
సమ పాళ్ళలో అధికమయ్యాయి ,
అశరీరులుగా ఉండి , కనపడకుండా ,
చూస్తూనే ఉన్నారనుకుంటున్నా  ,

అర్ధం చేసుకొంటున్నారనుకొంటూ ,
మన్నించమంటున్నా ,
ఇక ఆ ప్రయత్నం వాయిదా వేస్తున్నా 

 *******

లైఫా ? లైవా ?

                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్

(మాలికలో ప్రచురితమైన పెండెం గారి ఈ చిత్రానికి నా స్పందన కవితా రూపంలో  )


చేయూతనిమ్మన్న ఆ ఒక్క చేయి ,
పత్రికా విలేఖర్ల దృష్టి తాకింది ,
బుల్లితెర బడా ఛానళ్ళను చేరింది ,
దూరాన్నుంచి చూస్తున్న , 
ఓ పసి మనసు కుదుటపడ్డది ,
గబగబా అందరూ ముందుకు వెళ్ళారు ,
జేబుల్లోంచి మొబైళ్ళు బైటకు తీశారు ,
హడావుడిగా వెనువెంటనే ,
నెట్టుకుంటూ ఫొటోలు పలు కోణాల్లో ,
క్లిక్కుల మీద క్లిక్కులు కొట్టారు 
ఏ ఒక్కరూ చటుక్కున దూకరాయె ,
కాపాడేందుకు ముందుకు వెళ్ళరాయె ,
లైవ్ చూపించాలన్న తపన  తప్ప ,
లైఫ్ సేవ్ చేయాలన్న ధ్యాసే లేదాయె ,
ఆక్రందన అలల రూపంలో ఒడ్దుకు వస్తున్నా ,
అందుకొని చేయూతనిచ్చే వాడే లేడాయె ,
ఎవరికి వారే ఈ దృశ్యాన్ని ,
తామే ముందుగా చూపించాలన్న తపనాయె ,
సాయం అందక ఆ మనిషి మరుగాయె ,
మరణ శయ్యకే మరుక్షణం చేరిపోయె ,
అనుక్షణం బుల్లితెరపై ఫ్లాష్ న్యూస్ యిదే  ,
మరునాడు పత్రికలలోప్రముఖ విషయమిదే .
  
                            *****

నా న్యూనుడులు - 7

                     
                                                                                                                                    రచన : శర్మ జీ ఎస్

1  .   కోపాన్ని కోపంగా ప్రదర్శించటం పేటెంట్ ,
        ఆ కోపాన్ని నవ్వుగా మలచుకోవటం టాలెంట్ .

2   .  అవకాశం (రా) లేదని ఆలోచించకు ,
        అవకాశం వున్నపుడు ఆలసించకు ,
        అలాగని అవకాశం కోసం ఎదురుచూడకు .

3   .  ఆలోచనలతో అడుగులు వేయకు ,
        ఆసుపత్రిలో పడక చేరకు .

4   .  కళ్ళు తెరిస్తే కష్టాలు ఆరంభం ,
        కళ్ళు మూస్తే కలల సంరంభం ,

5  . ఆయన బాగా ఉంటే ఆభరణాలడిగేదాన్ని ,
        బాగా లేడు కాబట్టే ఆ భరణం అడుగుతున్నా .

6   .  భావతరంగాలు అలా అలా పయనిస్తూనే వుంటాయి ,
        అందుకున్నవారికి సందర్భాన్ని బట్టి సందేశాన్నిస్తాయి .

7   .  నీతులెపుడూ వినటానికి బాగానే వుంటాయి ,
        ఆచరణకు అం(దనం)త దూరంలో వుంటాయి ,
        ఆహ్వానిస్తే  అమృతాన్నే అందిస్తాయి ,
        నిరాకరిస్తే అన్యుల ఒడిలో చేర చూస్తాయి .

8   .  నీ జీవితం హ్యాపీగా , సాఫీగా సాగాలంటే ,
        నిన్ను నీవే మార్చుకోవాలి ,
        అంతే గాని ,
        ఎదుటివారు మారాలని కోరుకోకు .

9   .  చీటికి మాటికి పాట పాడమంటే మా ఆవిడ పాడదు ,
        చీటీ పాట పాడమంటే అమాంతంగా పాడేస్తుంది  .

10 .  నీవు అనుకున్నది ఆ క్షణం నీకు ఒప్పు అనిపించవచ్చు ,
        ఎదుటివారికి అదే క్షణం తప్పు అనిపించవచ్చు ,
        ఆ మరు క్షణం అదే నీకూ తప్పు అనిపించవచ్చు .


                                                                                                                       ( మళ్ళీ కలుసుకొందాం )

ఫర్ నేం సేక్ 17 మైల్స్ డ్రైవ్

                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

ఆ రోజు ఈ అమెరికాలో మే 25 , సమయం మధ్యాహ్నం 11.30 కి 17 మైల్స్ డ్రైవ్ కి బయలుదేరాం . ఆ సముద్ర తీర ప్రాంతంలోని 17 మైళ్ళ డ్రైవ్ లో అనేక ఆకర్షణలుంటాయి దర్శించటానికి . ( ఫర్ నేం సేక్ )పేరుకే 17 మైల్స్ డ్రైవ్ చేస్తే చాలా మైళ్ళు న్నాయి ఆ సముద్ర తీర ప్రాంతం కొండల చుట్టూరా .

ఆ  రహదారికి కుడి ఎడమల పండ్ల తోటలుంటుంటాయి . ఆ తోటలు రాబోతుండగా కొన్ని చేతి వ్రాత బోర్డ్‌లు కనప డ్తుంటాయి . ఉచితంగా  ప్రవేశించండి . మా అనుమతి అవసరం లేదు . తిన్నవారికి తిన్నంత , అందుకేమీ మేము వెల కట్టం , మీరు మీ వెంట కోసుకుని తీసుకు వెళ్ళే వాటికే వెల కడ్తాం అని . ఇలాంటి బోర్డ్‌లు ఉన్న తోటలు చెర్రీస్ , బాదం , జీడిపప్పు , కిస్మిస్స్ , ఆ రహదారిలో అధికంగా కనపడ్తుంటాయి .చెర్రీ ఫలాలు
చెర్రీ చెట్లు

అలా వెళ్తూ చెర్రీ తోట ముందు మా వాహనం ఆపి అందరం ఆ తోటలోనికి ప్రవేశించాము . ఇది ఒక నూతనమే కాదు వినూత్న అనుభూతి మనలాంటి భారతీయులకి . ఎందుకంటే మన భార తదేశంలొ తోట గట్టు మీద నుల్చొని ఆ చెట్ల అందాలనో ,లేక ఆ ఫలాలనో వీక్షిం చనే అనుమతినీయకపోగా , ఫోండి ఫోండి అంటూ తరిమేసే అతి భయంకర మైన అధునాతన సంస్కృతి మనది . కారణం ఆ తోటలోని చెట్లకు కాచిన ఆ ఫలాలను చూస్తే ఎక్కడ  వీళ్ళందరి దృష్టి ఆ చెట్లకు తగిలి పంట మంటల్లో పడి మాడిపోతుందేమోనని , లోనికి అనుమతిస్తే ఎక్కడ పంట మొత్తం కోసి నాశనం చేస్తారోనన్న భయంకరమైన భావాలే మూల కారణం .
వీళ్ళు అలా కాదు , అలా చెట్లకు కాసిన పంట వృధాగా నేలపాలు అయ్యే బదులు , తోటి మానవులు తినాలనుకు
న్నం త తృప్తిగా , తాజాగా ఆరగించి మజాతో ఆనందిస్తారని  , ఆ తర్వాత వాళ్ళు తమ వెంట తీసుకు వెళ్ళాలనుకు న్నంత వాళ్ళే కావాలనుకున్నవి కోసుకుంటే , దానికి మాత్రమే వెల కడ్తామని భావించి యిలా ఆనందిస్తారు .చూశారా మనకు , వాళ్ళకు భావాలలో ఎంత తారతమ్యమో .
మేం 6 గురం , అల ఆ తోటలోనికి ప్రవేశించి , ఆ తోటంతా తిరిగి , తినాలనుకున్నంత తిని , కొన్ని కోసుకుని బయట కు వచ్చి ఆరు బయట వున్న కౌంటర్లో పే చేశాం .
ఆ తోటల పెంపకం , ఆ పై ఆ ఫలాల పంపకం , అమ్మకం ఓ వినూత్న తరహాలో అమిత అందాన్నిస్తూ కన్నుల విందు , మన మనసులకు పసందు కల్గిస్తుంటాయి .                                                                                                                                                                                                                                                                                                                           
వెల్లుల్లి తోట

వెల్లుల్లి తోట

ఆ ప్రక్కనే వెల్లుల్లి తోటలు ఉన్నాయి , ఆ పెంపకం చూస్తుంటే ఎంతో అందంగా వున్నది . ఆ తోటలకు వాళ్ళు అందిం చిన నీరు ఎండిపోకుండా వాళ్ళు , నల్లటి ప్లాస్టిక్ పేపర్‌తో ఆ తోటలో నాటిన అన్ని మొక్కలకూ కప్పి ( నేలమీద ఉండే లా ,కొంచెం నేల కనపడేలా ఉంచి ) ఆ తోటకు అన్నివైపులా నీళ్ళ గొట్టాలను అమర్చి , వాటికి ఎప్పుడు నీళ్ళను అందించాలో వివరంగా ఉదయం 7 , మధ్యాహ్నం 1 , మరల సాయంత్రం 7 గంటలకు సూచిస్తారు . ఆయా వేళల్లో ఎవరి సాయం తీసుకోకుండా అవి నీళ్ళను ఆ మొక్కలకు / చెట్లకు అందిస్తాయి .
అలా ఓ 30 నిముషాలు ఆనందించి , మరల ముదుకు బయలుదేరాం .


స్పానిష్ టెన్నిస్ క్లబ్
స్పానిష్ టెన్నిస్ క్లబ్

ఆ దారిలో నున్న స్పానిష్ క్లబ్ కి చేరు కున్నాం . సహజంగా అక్కడ క్లభ్ మెంబర్స్ కి టేబుల్ టెన్నిస్ ఆడుకోవ టానికి 8 కోర్ట్లు వరకు వున్నాయి చాలా విశాలమైన వాతావరణంలో . ఆ టెన్నిస్ కోర్ట్లు ఎంతో అందంగా ఉంటా యి .కొన్ని ఇళ్ళు క్లభ్ మెంబర్స్ కి యిస్తారు . అక్కడే వున్న దుకాణం లోపలనే ఈ ఆటలకు సంబంధించిన దుస్తులు , ఆట వస్తువులు అమ్ముతారు . కావాలనుకున్న మనలాంటి వాళ్ళకు కూడా అమ్ముతారు . దానిలోనే కాఫీ , కూల్‌డ్రింక్స్ , స్నాక్స్ వగైరా అమ్ముతారు . ఇక్కడ సైకిల్స్ ఉచితంగా ఆ చుట్టుపక్కల చూసి రావటానికి యిస్తారు . విలాసవంతమైన జీవనశైలి వీళ్ళది . దానికొరకే సంపాదిస్తారు , జీవిస్తారు .

అక్కడనుంచి అర్ధగంట తర్వాత బీచ్ ఒడ్డుకి బయలుదేరాం . మరో 2 గంటలు ప్రయాణం చేసి అక్కడే వున్న బీచ్ ఒడ్డుకు చేరుకున్నాం . శనివారం కావటం వలన ఆ సరికే వీక్షకు లు చాలామంది ఎంజాయ్ చేయటం , వెళ్ళటం , మరల మాలా కొంతమంది రావటం జరుగుతున్నది . ఆ బీచ్ ఒడ్డు   కు వెళ్ళబోయే ముందే మేం మావెంట తెచ్చుకున్న చిత్రాన్నం అందరం ఆరగించాం .


బీచ్ తీరాన
ఆ తర్వాత అక్కడకి వెళ్ళి ఆ అలల జోరు చూసి ఆనందించాము . అక్కడ నుండి యింకొంచెం ముందుకు వచ్చాం .

బర్డ్ రాక్
ఇక్కడ అనేక దేశాల పక్షులు అన్నీ ఆ ఒక్క కొండమీదనే ( బర్డ్ రాక్ అంటారు ,ఆ సముద్రం మధ్యలో వున్నది ,
ఇటు వంటివి చాలా వున్నా ) వాల్తాయి . అదో ప్రత్యేకత ఆ కొండకి . ఆ దరిదాపులకు వెళ్ళగానే , మన వద్దకు కొన్ని పక్షు లు వస్తుంటాయి .

బర్డ్ రాక్ తీరాన
ఉడుత వచ్చి మనముందు నుల్చ్హొని ఏమైనా పెట్టమని చూస్తుంటుంది . పల్లీలు మన అరచేతిలో పెట్టుకొని చూపిస్తే వచ్చి , చేయి పట్టుకొని ఒకటొకటిగ తింటుంది . ఆ దృశ్యం  చూడ ముచ్చట వేసింది . అలాగే మిగి లిన కొన్ని పక్షులు కూడా మన చెంతకు వస్తుంటాయి వాటి ఆహారం కొరకు .

ఈ అమెరికాలో ఎక్కడికక్కడ రెష్ట్ రూం లు వుంటాయి . ఎవరికీ యిబ్బంది కలుగకుండా వుండాలని , బహిర్ ప్రదే శాన్ని భ్రష్టపరచకూడదన్న వాళ్ళ పటిష్టమైన శాసనాన్ని ఎవరూ ధిక్కరించకుండా అన్ని వసతులూ కల్గిస్తారు .
సింపుల్ గా శాసనాలు తయారుచేయటం లో చూపించే శ్రధ్ధ వాటి అమలుకు కూడా చాలా కృషి చేయాలన్నది వీళ్ళ నుంచి మన ప్రభుత్వాలు నేర్చుకోవాలి .

ఇదంతా కొండల ఘాట్ ఏరియా పైనే సవారి . ఇలా 400 మైళ్ళకు పైనే వుంటుంది . ఇది సముద్ర తీరప్రాంతపు పేద్ద రహదారి క్యాలిఫోర్నియా లో నంబర్ 1 .


ఘోష్ట్ ట్రీ
అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం . అక్కడ ఘోష్ట్ ట్రీ అని వుంటుంది , 5.30  కి చేరుకొన్నాం . సముద్రపు ఒడ్డు ప్రక్కగా , అది కొన్ని వంద ల ఏళ్ళ నుంచి అలానే వున్నది , అదీ లోయలోనే వుంటుంది . ఆ ఘోష్ట్ ట్రీ ని చూసి , ఇంకొంచెం ముందుకు వెళ్ళాం . ఆ సరికి సాయంత్రం 5.30 అయింది . సూర్యుడు వెలుగులు వెదజల్లుతూనే వ్న్నాడు , ఛలి మాత్రం వెన్నులో వణు కు పుట్టిస్తున్నది గాలిని వెంట వుంచుకొని . ఈ సుందర దృశ్యాలను మరల మరల చూడాలనిపించినా , మనకు అన్ని విధాలా వీలు పడదు అన్న భావన మెదలగా , అలాగే వణుకుతూ మరికొంచెం ముందుకు వెళ్ళాం . అక్కడా కొన్ని ఫొటోలు తీసుకున్నాం అలాగే వణుకుతూ , కేశాలు ఆకాశానికెగురుతున్నా , మరల ఈ అవకాశం రాదేమోనని . ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం .


బిగ్ సర్ బ్రిడ్జ్
ఇంకొంచెం ముందుకు వెళ్ళి బిగ్ సర్ బ్రిడ్జిని చూశాం . ఇది 1932 లో నిర్మించబడింది . అక్కడనుంచి ఆ సముద్ర తీరం అతి సుందర దృశ్యం . అక్కడనుంచి మరికొంచెం ముందుకు వెళ్ళాం . వన్ వే లో వెళ్ళాల్సి వచ్చింది . ఈ బ్రిడ్జి ప్రక్కనే ఉన్న కొండను నరికి రోడ్డు విశాల కార్యక్రమం జరుగుతు న్నది . ఈ బ్రిడ్జిమీద అత్యంత ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి . అల వెళ్ళి మరి కొన్ని ఫొటోలు ఆ సుందరమైన సముద్రతీరప్రంతాన తీసుకొని తిరుగు ప్రయాణం చేయటం జరిగింది .

                                                                                     **********