కాదు సుమా ! కానే కాదు సుమా !

                                                                                                                              కవితా రచన : శర్మ జీ ఎస్

ఆలయాలలో  కనపడే  ,
ఆ దేవుడి విగ్రహాలకి  ,
 జలాభిషేకాలు ,
క్షీరాభిషేకాలు ,
చక్కెర పొంగలులు ,
చిత్రాన్న , క్షీరాన్నాలు ,
లడ్డూ , వడలు ,
అప్పాలు , బూరెలూ ,
ఇలా రకరకాల పిండివంటలు ,
సమర్పించుతుంటారు ,

ఆ  లయం ముంగిటే ,
ఆకలితో అలమటిస్తూ ,
ఆఖరి ఆయువుతో ,
పోరాడుతున్న యాచకులకు , 
అణువంత కూడా ,
అందించలేని , అహ ,
విదిలించలేని ఆ చేతులు ,
ఆ భజన జీవులు ,

ఊరేగింపులో పాలుపంచుకొని ,
వాళ్ళకు కావలసిన వారికి ,
అందజేస్తుంటారు ,
తెగ ఆనందించేస్తుంటారు ,

తోటి మానవుడిని , 
సాటి మానవుడిగా , 
చూడ చేతకాని ,
అయోమయపు వింత  మానవులు  .

వీళ్ళే ఆ పూజానంతరం ,
"   సర్వేజనా సుఖినో భవంతు "
వల్లిస్తుంటారు , 
బిగ్గఱగా మైకుల్లో  ,
అరిచేస్తుంటారు  ,
వింటానికి బాగుంటుందే  గాని ,
అంతరార్ధం మాత్రం యిది ,
కాదు సుమా !
కానే కాదు సుమా !

*******

8 comments:

 1. నిజమే అంతరార్థం ఇదికాదని చక్కగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. అర్ధం చేసుకున్నందులకు కృతజ్నతలు .

   Delete
 2. చలా బాగా చెప్పారు. బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. మీ కమెంటు చూసి చాలా కాలమైంది . థాంక్యూ .

   Delete
 3. ఆత్మ వంచన చేసుకుంటున్నారిటువంటివారు.

  ReplyDelete
 4. పాపం, ఆ దేముడు కూడా అదే చెప్పాడు కదా ,.మానవసేవే మాధవసేవని,అది ఎంతమంది అర్దం చేసుకుంటారు... మీరు బాగా చెప్పారు..

  ReplyDelete
  Replies
  1. వాస్తవమే కదా !

   Delete