లైఫా ? లైవా ?

                                                                                                                          కవితా రచన : శర్మ జీ ఎస్

(మాలికలో ప్రచురితమైన పెండెం గారి ఈ చిత్రానికి నా స్పందన కవితా రూపంలో  )


చేయూతనిమ్మన్న ఆ ఒక్క చేయి ,
పత్రికా విలేఖర్ల దృష్టి తాకింది ,
బుల్లితెర బడా ఛానళ్ళను చేరింది ,
దూరాన్నుంచి చూస్తున్న , 
ఓ పసి మనసు కుదుటపడ్డది ,
గబగబా అందరూ ముందుకు వెళ్ళారు ,
జేబుల్లోంచి మొబైళ్ళు బైటకు తీశారు ,
హడావుడిగా వెనువెంటనే ,
నెట్టుకుంటూ ఫొటోలు పలు కోణాల్లో ,
క్లిక్కుల మీద క్లిక్కులు కొట్టారు 
ఏ ఒక్కరూ చటుక్కున దూకరాయె ,
కాపాడేందుకు ముందుకు వెళ్ళరాయె ,
లైవ్ చూపించాలన్న తపన  తప్ప ,
లైఫ్ సేవ్ చేయాలన్న ధ్యాసే లేదాయె ,
ఆక్రందన అలల రూపంలో ఒడ్దుకు వస్తున్నా ,
అందుకొని చేయూతనిచ్చే వాడే లేడాయె ,
ఎవరికి వారే ఈ దృశ్యాన్ని ,
తామే ముందుగా చూపించాలన్న తపనాయె ,
సాయం అందక ఆ మనిషి మరుగాయె ,
మరణ శయ్యకే మరుక్షణం చేరిపోయె ,
అనుక్షణం బుల్లితెరపై ఫ్లాష్ న్యూస్ యిదే  ,
మరునాడు పత్రికలలోప్రముఖ విషయమిదే .
  
                            *****

8 comments:

 1. అంతా లైవే...లైఫ్ లేదు. ఛానళ్ళది ఇదే విపరీత ధోరణి, అత్యవసర కేసుల్లో టి.వి కవరేజ్ కోసం చూస్తున్నారు తప్పించి సహాయం గురించి చూడటం లేదు, ఇది పైశాచికత్వం.

  ReplyDelete
 2. బావుందండీ .పిల్లికి చెలగాటం చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం .

  ReplyDelete
 3. మీ కవిత్వం చివరి పంక్తుల అల్లికలో పొందిక కుదిరినట్లు లేదు!ఆయే ఆయేలు తొలగించి ఎడిట్ చేసుకుంటే అది కత్తిలా తళతళ మెరుస్తుంది!!!

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా సలహాని స్వీకరిస్తాను .కృతజ్ఞతలు .

   Delete